మనసు మార్చుకున్న మెగా వారసుడు | sai dharam tej refuse to remix song in his next films | Sakshi
Sakshi News home page

మనసు మార్చుకున్న మెగా వారసుడు

Published Wed, May 11 2016 11:48 AM | Last Updated on Sun, Sep 3 2017 11:53 PM

మనసు మార్చుకున్న మెగా వారసుడు

మనసు మార్చుకున్న మెగా వారసుడు

వారసుడిగా ఎంట్రీ ఇచ్చి మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకుంటున్న యువ నటుడు సాయిధరమ్ తేజ్. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి ఈజీగానే ఎంట్రీ ఇచ్చినా.., తన టాలెంట్తో మంచి సక్సెస్లు సాధిస్తున్నాడు. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీం సినిమాల సక్సెస్తో మంచి ఫాంలో ఉన్నాడు. అయితే ఈ సినిమాలతో ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో అదే స్థాయిలో విమర్శలను కూడా ఎదుర్కొంటున్నాడు.

ముఖ్యంగా తన ప్రతీ సినిమాలో చిరంజీవి, పవన్ కళ్యాణ్లను ఇమిటేట్ చేయటంతో పాటు చిరు పాటలను రీమిక్స్ చేయటం ఇప్పుడు సాయికి ఇబ్బందిగా మారింది. కెరీర్ స్టార్టింగ్లో గుర్తింపు కోసం ఫర్వాలేదు కానీ, ప్రతీ సినిమాలో ఇలా ఇమిటేట్ చేస్తే, సొంత ఐడెంటిటీ రాదంటున్నారు విశ్లేషకులు. దీంతో ఇక ఈ ఇమిటేషన్ సెంటిమెంట్కు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాడు తేజు.

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తిక్క సినిమాలో కూడా చిరంజీవి పాటను రీమిక్స్ చేయాలని ప్లాన్ చేశారు చిత్రయూనిట్. అయితే సాయి మాత్రం వద్దని ఖచ్చితంగా చెప్పేశాడట. కథకు అవసరమైతే తప్ప ఇప్పట్లో రీమిక్స్ పాటలను చేసే ఆలోచనే లేదంటున్నాడు. మరి సొంత ఐడెంటిటీ కోసం ప్రయత్నిస్తున్న సాయి ప్లాన్స్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement