Thikka
-
ఆ హీరోయిన్‌తో తేజ్ ప్రేమలో ఉన్నాడా? ట్వీట్ వైరల్
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోయిన్ లారిస్సా బొనేసితో ప్రేమలో ఉన్నాడా? గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. లారిస్సా బొనేసి మరెవరో కాదు.. తేజ్‌తో తిక్క సినిమాలో నటించిన హీరోయిన్. బ్రెజిలియన్ మోడల్ అయిన లారిస్సా తిక్క మూవీతోనే టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఆ సినిమా సమయంలోనే వీరికి మంచి స్నేహం కుదిరింది. ఆపై తేజ్‌పై సోషల్ మీడియాలోనే పలు సందర్భాల్లో తన ప్రేమను వ్యక్తపరిచింది లారిస్సా. తాజాగా శనివారం(అక్టోబర్15)న తేజ్ పుట్టినరోజు సందర్భంగా లారిస్సా చేసిన ట్వీట్‌కు,తేజ్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ‘హ్యాపీ బర్త్‌డే మై తేజు'.. అంటూ లవ్ సింబల్‌తో లారిస్సా ట్వీట్ చేయగా, దీనికి 'టూ మై డిస్ట్రబన్స్' అంటూ తేజ్ ఆమెతో కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేశాడు. దీనికి లారిస్సా కూడా ఫరెవర్ అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్లు చూసిన నెటిజన్లు.. నిజంగానే లవ్‌లో ఉన్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా తేజ్ బర్త్‌డే రోజే.. నేను ప్రేమలో ఉన్నాను అంటూ లారిస్సా ట్వీట్ చేయడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్లయ్యింది. I’m in love . — Larissa Bonesi (@larissabonesi) October 15, 2021 To My disturbance ❤️❤️❤️ pic.twitter.com/Vfc9iTaFEG — Sai Dharam Tej (@IamSaiDharamTej) October 15, 2022 Hahahaha forever and always ! ♥️♥️♥️ https://t.co/136hB5m0TV — Larissa Bonesi (@larissabonesi) October 15, 2022 I just can’t wait to see your smile again .. ♥️🙏🏾 Faith my Teju @IamSaiDharamTej .. Faith !! pic.twitter.com/I7p9j5xj9W — Larissa Bonesi (@larissabonesi) September 22, 2021 -
కోన ఫ్యామిలీ నుంచి మరో రైటర్
నీరజ కోన.. సినీ ఇండస్ట్రీతో పరిచయం ఉన్న వారికి సుపరిచితమైన పేరు. ప్రముఖ రచయిత కోన వెంకట్ సోదరిగానే కాక, టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌కు స్టైలిస్ట్‌గా కూడా నీరజ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించే నీరజ ఇప్పుడు తన లోని మరో టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంది. ఇప్పటి వరకు ఫ్యాషన్ డిజైనర్‌గా మాత్రమే తెలిసిన ఈమె, ఇప్పుడు అన్న బాటలో అడుగులు వేస్తూ కలం పట్టుకుంది. సాయి ధరమ్ తేజ్ హీరో సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తిక్క సినిమా కోసం ఓ పాట రాసింది. ఈ సినిమాకు సంగీతం అందించిన తమన్ తో ఉన్న స్నేహం కారణంగా పాట రాసేందుకు అంగీకరించిన నీరజ, తమన్‌తో పాటు హీరో, దర్శకనిర్మాతలను కూడా ఆశ్చర్యపరిచింది. తిక్క సినిమాలో గేయ రచయితగా ఆకట్టుకున్న నీరజ, త్వరలో ఓ సినిమాకు రచన చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే రైటర్స్ అసోషియేషన్ లో పేరు కూడా రిజిస్టర్ చేయించుకున్న నీరజ, ఓ పెద్ద నిర్మాణ సంస్థతో చర్చలు జరుపుతుందట. త్వరలోనే నీరజ కథ అందించబోయే సినిమా ఎనౌన్స్మెంట్ వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. మరి నీరజ కూడా అన్న కోన వెంకట తరహాలో కమర్షియల్ రైటర్ అనిపించుకుంటుందో లేక తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంటుందో చూడాలి. -
యువతరాన్ని ప్రతిబింబించే కథతో తిక్క తీశా!
సునీల్‌రెడ్డి సినిమా జర్నీ డీవోపీ (కెమేరామ్యాన్)గా మొదలైంది. ‘ఒకరికొకరు’తో ఆయన కెమెరాలో ఎంత బలముందో చూపించాడు. ఆ తర్వాత ఆయన మనసు దర్శకత్వంపైకి మళ్లింది. కళ్యాణ్‌రామ్‌తో ‘ఓం’ త్రీడీ సినిమాని తెరకెక్కించాడు. మరోసారి టెక్నికల్‌గా తానెంత స్ట్రాంగో ఆ సినిమాతో చాటి చెప్పాడు సునీల్‌రెడ్డి. కాస్త గ్యాప్ తర్వాత సాయిధరమ్ తేజ్‌తో తిక్క తెరకెక్కించాడు. శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ పతాకంపై సి.రోహిన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శనివారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా దర్శకుడు సునీల్‌రెడ్డి ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు... అర్బన్ బేస్డ్ కామెడీ కథతో తెరకెక్కించిన చిత్రమే ‘తిక్క’. పేరులో ఉన్న మూడ్ తెరపై కూడా కనిపిస్తుంటుంది. బ్రేకప్ అయిన కుర్రాడి జీవితంలో ఓ రాత్రి ఏం జరిగింది? అనేది ఆసక్తికరం. నేటి యువతరాన్ని ప్రతిబింబించే ఈ కథ అందరికీ నచ్చేలా ఉంటుంది. టైటిల్ కాస్త నెగిటివ్‌గా అనిపించినా కథకు తగ్గట్టుగా ఉందని అదే ఓకే చేశాం. ప్రతి సన్నివేశం కామెడీగా సాగుతుంది. సినిమా చూసినవాళ్లంతా బాగుందని మెచ్చుకొంటున్నారు. ముఖ్యంగా కామెడీ బాగా పండింది అంటున్నారు. పంచులు, ప్రాసలు కాకుండా కేవలం సన్నివేశాలతోనే వినోదాన్ని పండించే ప్రయత్నం చేసాం. అది ఫలించినందుకు ఆనందంగా ఉంది. అలాగే సాయిధరమ్ తేజ్ నటనలో ఓ కొత్త యాంగిల్‌ని చూపించారని చెబుతున్నారు. తమన్ , గుహన్ లాంటి సాంకేతిక బృందం ఈ సినిమాకి పనిచేసింది. రోహిన్ రెడ్డి నిర్మాణం పరంగా ఎక్కడా రాజీపడలేదు. అందుకే ఓ మంచి క్వాలిటీ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలిగాం. నో కన్ఫ్యూజన్ నేనొక డీవోపీగానే ప్రయాణం మొదలు పెట్టినా దర్శకుణ్ణి కావాలనే కోరిక మొదట్నుంచీ ఉంది. అమెరికాలో ఫిల్మ్ మేకింగ్‌లో శిక్షణ తీసుకొన్నా. డెరైక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ పరిధి పరిమితం అనేది నా భావన. ఏం చేయాలన్నా వేరొకరి ఆలోచనలకి తగ్గట్టుగానే చేయాల్సి ఉంటుంది. మనదైన అభిరుచికి తగ్గట్టుగా, మనదైన కోణంలో చేయాలను కొన్నది ఏదీ చేయలేం. అందుకే నా దృష్టి దర్శకత్వంవైపు మళ్లింది. ‘ఓం’ త్రీడీ అనుకొన్న ఫలితాన్నివ్వలేకపోయింది. నా అసలు ప్రతిభ ఏంటన్నది ‘తిక్క’లోనే కనిపిస్తుంది. ఒక డీవోపీగా నాకు టెక్నాలజీ పైన కూడా అవగాహన ఉంటుంది కాబట్టి అది దర్శకుడిగా నాకు చాలా సాయం చేస్తుంటుంది. ఏం చేస్తే ఎలాంటి ఔట్పుట్ వస్తుందో ముందుగానే తెలుస్తుంటుంది. ‘తిక్క’ విషయంలో ఎక్కడా ఎలాంటి కన్ ఫ్యూజన్ లేకుండా పనిచేశాం. రాజీపడను: ఏం చేసినా ఒక ప్లాన్ ప్రకారం చేయడమే నాకు అలవాటు. చిత్రీకరణకి వెళ్లడానికి ఆర్నెల్ల ముందుగానే స్క్రిప్టుని నా టెక్నీషియన్లకి అందజేశాను. దానివల్ల అందరూ ఓ అవగాహనకొస్తుంటారు. అలాగే కొన్ని విషయాల్లో చాలా మొండిగా ఉంటా. అనుకొన్నది వచ్చేవరకు రాజీపడను. ‘తిక్క’లోని ఐదు పాటల కోసం తమన్ తో 50 బాణీలు సిద్ధం చేయించా. కథని క్యారీ చేసేలా బాణీ కుదరాలనే ఆ ప్రయత్నం. టీమంతా అలా పనిచేశాం కాబట్టే ఓ మంచి ఔట్పుట్ బయటికొచ్చింది. -
'తిక్క' రివ్యూ
సినిమా : తిక్క జానర్ : యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టెయినర్ నటీనటులు : సాయి ధరమ్ తేజ్, లారిస్సా బోన్సి, మన్నారా చోప్రా, రాజేంద్రప్రసాద్, అలీ, పోసాని కృష్ణమురళి తదితరులు సంగీతం : ఎస్ ఎస్ థమన్ దర్శకత్వం : సునీల్ రెడ్డి నిర్మాత : రోహిన్ రెడ్డి మెగా బ్రాండ్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనదైన ప్రతిభతో అభిమానులను సంపాదించుకుంటున్న హీరో సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం వేగంగా మాస్ ఇమేజ్ను సొంతం చేసుకుంటున్న యువ హీరోల్లో తేజు ఒకరని చెప్పొచ్చు. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్లతో ఆకట్టుకున్న తేజు.. ఈసారి మాస్‌ని ఆకర్షించే 'తిక్క' టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ 'తిక్క' లెక్కేంటో ఓ సారి చూద్దాం. ఆదిత్య(సాయి ధరమ్ తేజ్) అల్లరిగా తిరిగే కుర్రాడు. మందు, అమ్మాయిలు, పార్టీలు, ఎంజాయ్మెంట్.. ఇవే జీవితం అనుకునే టైప్. ఆదిత్య తండ్రి(రాజేంద్రప్రసాద్) అడ్డగోలు పెంపకమే అందుకు కారణం. తన కారుకి యాక్సిడెంట్ చేసిన అంజలి(లారిస్సా బోన్సి)ని తొలిచూపులోనే ఇష్టపడతాడు ఆదిత్య. వెంటపడి మరీ ఆమె ప్రేమను గెలుచుకుంటాడు. అంజలి.. ఆదిత్య చేత చెడు అలవాట్లు మాన్పించి జీవితాన్ని దారిలో పెడుతుంది. ఆదిత్య తండ్రి చేత కూడా తాగుడు మాన్పించేందుకు రిహాబిలిటేషన్ సెంటర్లో చేరుస్తుంది. అంజలి, ఆదిత్యల ప్రేమ రెండేళ్లు సాఫీగానే సాగుతుంది. ఆ తర్వాత కొన్ని కారణాలతో అంజలి ఆదిత్యకు బ్రేకప్ చెబుతుంది. కోపంలో ఫ్రెండ్స్‌తో కలిసి ఫుల్‌గా తాగేసిన ఆదిత్య.. ఆ హ్యాంగోవర్లో హంగామా సృష్టిస్తాడు. సిటీలో బ్రేకింగ్ న్యూస్ అవుతాడు. ఆ తర్వాత ఏమైంది? తిరిగి అంజలిని కలుస్తాడా లేదా అనేదే మిగిలిన కథ. చెప్పుకోవడానికి బానే ఉందనిపిస్తున్నా.. చూసేటప్పుడు మాత్రం ఏదో తేడా కొట్టింది ఈ తిక్క. దర్శకుడు ప్రజెంటేషన్‌లో తడబడిన విషయం మనకు త్వరగానే తడుతుంది. తాగిన మత్తులో ఓ యువకుడు చేసిన తిక్క పనులు చూపించినప్పటికీ.. హైలైట్ చేయాల్సినవాటిని లైట్ తీసుకున్నారు. దాంతో ప్రేక్షకులకు అందాల్సిన, అందించే అవకాశం ఉన్న మెసేజ్ అందకుండానే ఆగిపోయింది. మొదటి అర్ధ భాగమంతా హ్యాంగోవర్లో చేసే ఛేజ్ అయితే, సెకండ్ హాఫ్ అంతా విలన్ గ్యాంగులతో కన్ఫ్యూజన్ కామెడీ. అటు ఛేజ్, ఇటు కన్ఫ్యూజన్.. రెండూ బాగా సాగాయి. సాయి ధరమ్ తేజ్ సినిమా అంతా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. సినిమాకి అతని ఎనర్జీనే ప్లస్ పాయింట్. ఇక హీరోయిన్ లారిస్సా ఆకట్టుకునేంత అందంగా అయితే లేదు. ఆమెకు చెప్పిన డబ్బింగ్ కూడా పెద్దగా నప్పలేదు. మరో హీరోయిన్ మన్నారా చోప్రాది చాలా చిన్న రోల్. రాజేంద్ర ప్రసాద్, పోసాని, రఘుబాబు, అజయ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. బోలెడంతమంది కమెడియన్లు ఉన్నప్పటికీ అక్కడక్కడా తప్ప పెద్దగా చెప్పుకోదగిన కామెడీ పండకపోవడం మైనస్. థమన్ పాటలు ధియేటర్ బయటకొచ్చాక గుర్తుండవు. నిర్మాత పెట్టిన ఖర్చు కళ్లకు చక్కగా కనిపిస్తుంది. ఓవరాల్‌గా ఈ 'తిక్క' లెక్క తప్పినట్టుగా ఉంది. - గీత, ఇంటర్ నెట్ డెస్క్ -
‘తిక్క’పై మొదట్నుంచీ నమ్మకం ఉంది
ఒకొక్క సినిమాతో తన స్థాయిని పెంచుకొంటున్నాడు సాయిధరమ్ తేజ్. ప్రతి సినిమాతోనూ తన ప్రతిభని పూర్తి స్థాయిలో బయటపెడుతున్నాడు. ఆ ప్రయత్నమే ఆయన్ని సుప్రీమ్ హీరోని చేసింది. యువతరంలో వేగంగా మాస్ ఇమేజ్‌ని సంపాదించుకొన్న కథానాయకుడిగా సాయిధరమ్ తేజ్ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చు కొన్నాడు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘సుప్రీమ్’ చిత్రాలతో విజయాల్ని అందు కొన్న తేజ్ శనివారం ‘తిక్క’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్‌పై సి.రోహిన్ రెడ్డి నిర్మాతగా సునీల్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. సాయిధరమ్ తేజ్ ‘సాక్షి’తో చెప్పిన ప్రత్యేకమైన విషయాలు. ♦ సినిమా ఎంత బాగా వచ్చినా రిలీజ్‌కి ముందు కొంచెం టెన్షన్ ఉంటుంది. ఈ సినిమాకీ అంతే. కానీ నేను చేసిన అన్ని సినిమాలకంటే ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా. ఎందుకో తెలీదు కానీ... మొదట్నుంచీ ఈ కథ నాకు నమ్మకంగా అనిపించేది. నేనే కాదు, నిర్మాత, దర్శకుడు, టీమ్... ఇలా ప్రతి ఒక్కరూ వంద శాతం కాన్ఫిడెన్స్‌తో చేసిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ♦ అమ్మాయితో బ్రేకప్ అయ్యాక ఓ అబ్బాయి తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకొంటాడు. ఆ హ్యాంగోవర్లో జరిగే కథే ఇది. తాగిన మైకంలో కొన్ని తిక్క పనులు చేసేస్తాడు. దానివల్ల ఏం జరిగిందనేది తెరపైనే చూడాలి. కథకు తగ్గట్టుగానే ఈ పేరు కుదిరింది. నెగిటీవ్ టైటిల్ అనే ఫీలింగ్ వచ్చింది.. కానీ, ఈ సినిమాకి ఇదే కరెక్ట్ టైటిల్. కాకపోతే ఇంట్లోవాళ్లు, స్నేహితులు తిక్క హీరో అని ఏడిపిస్తున్నారు. ఈ సినిమా హ్యాంగోవర్లో జరిగే కథే అయినా.. మద్యపానం వల్ల జరిగే అనర్థాల్ని కూడా చూపిస్తున్నాం. ♦ ఒక కథని ఎలా తెరకెక్కించాలనుకొన్నామో అలాగే చేశాం. నిర్మాత, దర్శకుడు, హీరోగా నేను, టెక్నీషియన్ గా మా టీమ్.. ఎవ్వరూ ఏ విషయంలోనూ రాజీపడలేదు. అందుకే ఓ క్వాలిటీ సినిమా బయటికొచ్చింది. ఈ సినిమాకి బడ్జెట్ బాగా ఎక్కువైపోయిందని బయట టాక్. కానీ అదేం లేదు. నా మార్కెట్‌కి ఎంత ఖర్చు పెట్టాలో అంతే పెట్టారు నిర్మాత. దర్శక-నిర్మాతలిద్దరూ నాకు సోదరులతో సమానం. అన్నా... అన్నా అని పిలుస్తుంటా. వాళ్లతో కలిసి పనిచేయడం మంచి ఎక్స్పీరియన్. నేనేం చేయగలనో ఈ సినిమా కోసం అన్నీ చేయించాడు దర్శకుడు. ♦ కెరీర్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. ప్రేక్షకులు నా మీద నమ్మకంతో థియేటర్లకి వస్తున్నారు. అంతకంటే ఏం కావాలి? నిజానికి ప్రేక్షకులు నన్ను ఇంత త్వరగా రిసీవ్ చేసుకొంటారని అనుకోలేదు. ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నా. ప్రేక్షకులు నాపై ఉంచుతున్న నమ్మకాన్ని ఓ బాధ్యతగా భావిస్తున్నా. ఇకపై మరింతగా కష్టపడతా. మావయ్యలు కూడా అదే చెబుతుంటారు. ప్రేక్షకుల నమ్మకాన్ని ఏ దశలోనూ వమ్ము చేయకూడదని, కథల ఎంపికలోగానీ, నటనలోగానీ మన ఎఫర్ట్ వంద శాతం కనిపించాలని చెబుతుంటారు. ఆ మాటల్ని ఎప్పటికీ మరిచిపోను. ♦ నేను కథానాయకుడు అవడానికన్నా ముందు ఓ ప్రేక్షకుడిని అనే విషయాన్ని మరచిపోను. అందుకే కథల ఎంపికలో ఒత్తిడికి గురి కాకుండా ఒక ప్రేక్షకుడిగా నాకు ఎలాంటి కథలు నప్పుతాయో అలాంటి కథల్నే ఎంపిక చేసుకొంటా. ప్రేక్షకులకు కావల్సినవన్నీ కథలో ఉన్నాయి అనుకుంటే తప్పకుండా చేస్తాను. -
తేజు కెరీర్లో గుర్తుండిపోయే మరో చిత్రం... తిక్క!
- రోహిణ్‌రెడ్డి వరుస విజయాలతో దూసుకెళుతున్న సాయిధరమ్ తేజ్ కెరీర్లో మరో గుర్తుండిపోయే చిత్రంగా ‘తిక్క’ నిలుస్తుందన్నారు నిర్మాత సి.రోహిణ్‌రెడ్డి. వృత్తిరీత్యా వైద్యుడైన ఆయనకు రాజకీయ రంగంలోనూ ప్రవేశముంది. తొలి ప్రయత్నంగా శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ పతాకంపై ఆయన ‘తిక్క’ చిత్రాన్ని నిర్మించారు. కామెడీ, రొమాన్ ్స, యాక్షన్, ఎమోషన్ ... ఇలా అన్ని అంశాల మేళవింపుగా తెరకెక్కిన ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందంటున్నారు. సునీల్‌రెడ్డి దర్శకత్వం వహించిన ‘తిక్క’ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత రోహిణ్‌రెడ్డి ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలు.... కథపై నమ్మకంతోనే..: నేను నిర్మించిన మొట్ట మొదటి చిత్రమిది. దర్శకుడు సునీల్‌రెడ్డి, కథానాయకుడు సాయిధరమ్ తేజ్‌లతో ఉన్న పరిచయం వల్ల నేను పరిశ్రమకి కొత్త అనే భావన ఎప్పుడూ కలగలేదు. సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్నీ దగ్గరుండి చూసుకున్నాను. నిర్మాతగా నాకు మాత్రమే కాకుండా, పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఓ మైలురాయిలాంటి చిత్రంగా గుర్తుండిపోవాలని కష్టపడ్డాం. సాయిధరమ్ తేజ్ వరుసగా విజయాల్లో ఉన్నాడు. కథపై నమ్మకంతోనే ఆయన, నేను కలిసి ఈ సినిమా చేశాం. ప్రేక్షకులకు కావల్సినవన్నీ సమకూరుస్తూనే, సునీల్‌రెడ్డి ఓ కొత్త కథని తెరపై చెప్పే ప్రయత్నం చేశాడు. అందుకే సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. తేజూకి కొత్తగా..: సాయిధరమ్ తేజ్ ఇన్నాళ్లూ చేసిన సినిమాలు ఒక ఎత్తయితే, ఈ సినిమా మరో ఎత్తు. ఆయనలోని ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది. నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కుతాడు. ఎవరో ఒక కథానాయకుడితో సినిమా చేసినట్టు కాకుండా, ఓ సొంత సోదరుడితో సినిమా చేసిన అనుభూతి కలిగింది. సునీల్‌రెడ్డి కూడా అంతే. తన అనుభవాన్నంతా ఉపయోగించి షడ్రుచుల సమ్మేళనంగా, ఓ మంచి కమర్షియల్ ప్యాకేజ్లాగా ఈ సినిమా చేశాడు. ఈ సినిమా చూస్తే సునీల్‌రెడ్డి ఎంత మంచి దర్శకుడో అర్థమవుతుంది. గుహన్ సినిమాటోగ్రఫీ, తమన్ మ్యూజిక్ సినిమాకి మరింత వన్నె తీసుకొచ్చాయి. ధనుష్, శింబు మా సినిమా కోసం పాట పాడడం మరో ప్రత్యేకత. వాళ్లు వాళ్ల సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మా కోసం పాడినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. హీరోయిన్లు లారిస్సా బోనేసి, మన్నారాచోప్రా బాగా నటించారు. ముమైత్‌ఖాన్ తో పాటు ఈ సినిమాలో భారీ స్టార్ క్యాస్టింగ్ ఉంది. కథకి ఏం కావాలో అవన్నీ పక్కాగా సమకూర్చాం. ఆ రిజల్ట్ తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రయాణం ఆగదు: తొలి సినిమానే మంచి అనుభవాన్ని చ్చింది. అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలిగాం. ఇకపై కూడా ఇలాగే సినిమాలు నిర్మిస్తా. సాయిధరమ్ తేజ్, సునీల్ రెడ్డిలతోపాటు, ‘తిక్క’ టీమ్‌తో ఏర్పడిన బాండింగ్ దృష్ట్యా వాళ్లతోనే మరో సినిమా కూడా చేయాలని ఉంది. -
హ్యాట్రిక్ మీద కన్నేశాడు
మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. తన కంటూ కొత్త ఇమేజ్ క్రియేట్ చేసుకోవటం కోసం చాలా కష్టపడుతున్నాడు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. తొలి సినిమా పిల్లా నువ్వు లేని జీవితంతో మంచి సక్సెస్ సాధించిన సాయి తరువాత విడుదలైన రేయ్ సినిమాతో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో తరువాతి సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. హారిష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో 20 కోట్ల వసూళ్ల మార్క్‌కు చేరువైన సాయి.. ఆ తరువాత విడుదలైన సుప్రీంతో, ఆ మార్క్‌ను ఈజీగా దాటేశాడు. తాజాగా తిక్క సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్న మెగా వారసుడు, ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ మీద కన్నేశాడు. అయితే సాయి తిక్కకు ఒక్క రోజు ముందే వెంకటేష్ బాబు బంగారం రిలీజ్ అవుతుండటంతో తిక్క కలెక్షన్ల మీద ప్రభావం పడే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరి సీనియర్ హీరో ఇమేజ్ను దాటి సాయి ధరమ్ తేజ్ రికార్డ్ అందుకుంటాడేమో చూడాలి. -
సౌతిండియన్ లుక్ వల్లే ‘తిక్క’లో అవకాశం వచ్చింది!
- లారిస్సా బొనేసి బ్రెజిల్ అమ్మాయి లారిస్సా బొనేసి తెలుగు తెరపై జిగేల్మని మెరిసిపోవాలని కలలుగంటోంది. సాయిధరమ్‌తేజ్ సరసన ‘తిక్క’లో నటించిన ఆమె భవిష్యత్తులో మహేశ్‌బాబు, ప్రభాస్‌లతో కలసి నటించడమే లక్ష్యమంటోంది. తెలుగు చిత్ర పరిశ్రమ చాలా బాగుందనీ, ఇక్కడి ప్రజలు ఆదరిస్తున్న తీరు, చూపుతున్న ప్రేమాభిమానాలు కట్టిపడేశాయని చెబుతోంది. తెరపై తనను తాను చూసుకొన్నప్పుడు అచ్చం తెలుగమ్మాయిల్లాగే కనిపించానని ఆమె సంతృప్తి వ్యక్తం చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర మూవీ క్రియేషన్స పతాకంపై సునీల్‌రెడ్డి దర్శకత్వంలో సి.రోహిన్ కుమార్ రెడ్డి నిర్మించిన ‘తిక్క’ ఈ నెల 13న విడుదలతోంది. ఈ సందర్భంగా ‘తిక్క’ అవకాశం, ఆ సినిమా సెట్లో తనకి ఎదురైన అనుభవాల గురించి, భవిష్యత్తు గురించి లారిస్సా చెప్పిన విశేషాలు... నేను బ్రెజిల్ అమ్మాయినైనా ఒక భారతీయ కథ లోనూ, ఒక పాత్రలోనూ నన్ను నేను చూసుకోవడం నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది. దర్శకుడు సునీల్‌రెడ్డి చెప్పిన ‘తిక్క’ కథనీ, అందులోని అంజలి పాత్రనీ అర్థం చేసుకొన్నాక నా నిజ జీవితానికి దగ్గరగా ఉందనిపించింది. అందుకే ఈ కథతో, పాత్రతో ఈజీగా రిలేట్ అయ్యా. సినిమా విడుదలయ్యాక తెలుగు ప్రేక్షకులు నన్ను అంజలిగానే గుర్తు పెట్టుకొంటారు. సారుుధరమ్ తేజ్‌తో కలిసి నటించడం చక్కటి అనుభవం. అతను ఓ పెద్దింటి కుర్రాడైనప్పటికీ సెట్లో నడుచుకొనే విధానం, నలుగురితో కలసిపోయే విధానం బాగా నచ్చింది. దర్శకుడు సునీల్‌రెడ్డి వల్లే ఈ చిత్రంలో బాగా నటించ గలిగా. సినిమా పూర్తయ్యేలోపు రఘుబాబు, ముమైత్‌ఖాన్ , మన్నారా చోప్రా... ఇలా అందరితోనూ ఓ బాండింగ్ ఏర్పడింది. యాడ్ చూసి చాన్స్ ఇచ్చారు విదేశాలకి చెందిన అమ్మాయినైనా నా ప్రతిభను నమ్మి అవకాశమిచ్చారు దర్శక-నిర్మాతలు. ఆ నమ్మకానికి తగ్గట్టుగా పనిచేయాలనుకొన్నా. అందుకే ఒక టీచర్ని నియమించుకొని మరీ తెలుగు భాషపై పట్టు పెంచుకొనేందుకు ప్రయత్నించా. పధ్నాలుగేళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించా. అంతర్జాతీయ స్థారుులో పేరు తెచ్చుకొన్నా. ఒక యాడ్‌లో నన్ను చూసిన ‘తిక్క’ దర్శక- నిర్మాతలు ఈ అవకాశాన్నిచ్చారు. సౌత్ ఇండియన్ లుక్‌తో కనిపించడం వల్లే నాకు ఈ అవకాశం వచ్చిందని నమ్ముతున్నా. అంతా కొత్తే... మోడలింగ్‌తో పోలిస్తే సినిమా ఓ సరికొత్త అనుభూతి ఇచ్చింది. ఒక కథలోని పాత్రలోకి పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలనే విషయాన్ని సినిమా బాగా నేర్పించింది. తెలియని భాష, తెలియని ప్రాంతం, తెలియని మనుషులు... అంతా కొత్తే. కానీ ‘తిక్క’ బృందం నన్ను వాళ్లలో ఒకరిగా భావించి చేరదీశారు. అందుకే వాళ్లతో జర్నీ ఎంతో ఎమోషనల్‌గా సాగింది. అది తలచుకొంటే ఇప్పుడు కన్నీళ్లొస్తారుు. మా అమ్మానాన్నలకి ఫోన్ చేసి రోజూ ఈ యూనిట్ గురించి చెబుతుండేదాన్ని. నమస్కారం.. బాగున్నారా... ఇదివరకు హిందీలో ‘గో గోవా గాన్’ అనే చిత్రంలో చిన్న పాత్ర చేశా. ఒక భాషకి పరిమితం కావాలనుకోవడం లేదు. తెలుగుతో పాటు కన్నడం, తమిళ పరిశ్రమల్లో అవకాశాలపై కూడా దృష్టి పెట్టా. అయితే తెలుగులో నా అభిమాన కథానాయకులు మహేశ్‌బాబు, ప్రభాస్. వాళ్లిద్దరితో కలసి నటించాలని ఉంది. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. ఇద్దరి సినిమాల్నీ నేను చూశా. ప్రస్తుతం నా ఆలోచనంతా తెలుగు భాషపై పట్టు పెంచుకోవడం గురించే. తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా. నమస్కారం, బాగున్నారాలాంటి మాటల్ని పలుకుతున్నా. రఘుబాబుగారు వామ్మో అనే మాటని నేర్పించారు. -
వామ్మో అంటే అందరూ అదోలా చూశారు!
‘‘మొన్నామధ్య ఇంటికి వెళ్లినప్పుడు.. మాటల మధ్యలో నటుడు రఘుబాబు స్టైల్లో ‘వామ్మో’ అన్నాను. ఒక క్షణం అందరూ నావంక అదోలా చూశారు. బ్రెజిల్లో కూడా తెలుగు మాట్లాడుతున్నానంటే ఈ సినిమా, భాష నాకు ఎంత దగ్గరైందో అర్థం చేసుకోండి’’ అంటున్నారు బ్రెజిలియన్ భామ లారిస్సా బోనెసి. సాయిధరమ్ తేజ్ హీరోగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో రోహిణ్ రెడ్డి నిర్మించిన సినిమా ‘తిక్క’. పలు కమర్షియల్ యాడ్స్, ‘గో గోవా గాన్’ వంటి హిందీ సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించిన లారిస్సా బోనెసి ‘తిక్క’తో హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ఈ నెల 13న విడుదలవుతున్న ఈ సినిమా గురించి లారిస్సా మాట్లాడుతూ - ‘‘ఐపీయల్లో నా యాడ్ చూసిన రోహిణ్ రెడ్డి హీరోయిన్ అంజలి పాత్రలో నటించమని అడిగారు. లవ్లీ, ఎమోషనల్, సెన్సిటివ్ అమ్మాయి. రియల్ లైఫ్‌లో నా క్యారెక్టర్‌కు కాస్త దగ్గరగా ఉంటుంది. సినిమాలో రఘుబాబుతో చిన్న ఫైట్ కూడా చేశాను. షూటింగ్ మొదలవ్వక ముందు తెలుగు ట్యూషన్‌కి వెళ్లాను. మా టీచర్ నన్ను కాఫీ షాపులు, షాపింగ్‌లకు తీసుకు వెళ్లింది. ఈ క్రమంలో తెలుగమ్మాయిలు ఎలా ప్రవర్తిస్తారో? నవ్వుతారో? బాధపడతారో? అర్థమైంది. దాంతో పాత్రలో నటించడం సులభమైంది. షూటింగ్లో డైలాగులు మర్చిపోతే సాయిధరమ్ తేజ్ హెల్ప్ చేసేవాడు. తెలుగు అర్థమవుతుంది కానీ, ఇంకా మాట్లాడడం రాలేదు. ఈ సినిమా నాకు మంచి గుర్తింపు తెస్తుందనే నమ్మకం ఉంది. మహేశ్‌బాబు, ప్రభాస్‌లతో నటించాలనుంది’’ అన్నారు. -
‘తిక్క’ ఆడియో రిలీజ్
-
ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యా
‘‘ఒక భయంతో తేజూ కెరీర్ మొదలుపెట్టాడు. ఇంత సక్సెస్ఫుల్ అయినా ఆ భయం అలాగే ఉంది. దాన్ని ఆలాగే పెట్టుకో తేజ్. ఆ భయం ఉన్నంతకాలం ఎప్పుడూ ఇలా కష్టపడుతూ ఉంటావ్. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. నీ ప్రతిభకి, కష్టపడే తత్వానికి ఇంకా ఎత్తుకు వెళ్తావ్. ఎన్ని తిక్కలకు ఓ లెక్క ఉంటుందో తెలీదు గానీ, ఈ తిక్కకు మాత్రం తప్పకుండా ఓ లెక్క ఉంటుందని అనుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. సాయిధరమ్ తేజ్, లారిస్సా బోనేసి, మన్నార్ చోప్రా నటీనటులుగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో సి.రోహిణ్ కుమార్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘తిక్క’. ఎస్.ఎస్.తమన్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని వంశీ పైడిపల్లి ఆవిష్కరించి, సాయిధరమ్ తేజ్‌కి అందించారు. జానారెడ్డి థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ - ‘‘చిరంజీవి, పవన్‌కల్యాణ్ ఆశీర్వాదాలతోనే మీ అందరి (అభిమానులు) ప్రేమను పొందగలుగుతున్నాను. వాళ్లు లేకుండా నేను లేను. ప్రతి ఒక్కరి జీవితంలో బ్రేకప్ ఉంటుంది. మనకు ఎప్పుడూ ఉండేది బ్రేకప్ (నవ్వుతూ) కాబట్టి ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యాను. ఎక్కడా రాజీ పడకుండా రోహిణ్ చిత్రాన్ని నిర్మించారు. సునీల్ బాగా తీశారు. తమన్ మంచి ఆల్బమ్ ఇచ్చారు’’ అన్నారు. ‘‘ఫ్లాప్ దర్శకుణ్ణి అయినా నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన తేజూ, నిర్మాత రోహిణ్లకు థ్యాంక్స్’’ అని సునీల్ రెడ్డి అన్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘చిన్నప్పట్నుంచి మెగా ఫ్యామిలీ అంటే అభిమానం. తేజూతో ఈ చిత్రం తీస్తుంటే నా బ్రదర్‌తో వర్క్ చేసినట్టు అనిపించింది. మా చిత్రంలో పాటలు పాడిన ధనుష్, శింబులకు థ్యాంక్స్. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆగస్టు 13న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్, మాగంటి గోపీనాథ్, కె.ఎస్.రామారావు, ‘దిల్’ రాజు, నందినీ రెడ్డి, తమన్ తదితరులతో పాటు చిత్ర బృందం పాల్గొన్నారు. -
రచయితగా మారిన స్టైలిస్ట్
నీరజ కోన.. సినీ ఇండస్ట్రీతో పరిచయం ఉన్న వారికి సుపరిచితమైన పేరు. ప్రముఖ రచయిత కోన వెంకట్ సోదరిగానే కాక, టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌కు స్టైలిస్ట్‌గా కూడా నీరజ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించే నీరజ ఇప్పుడు తన లోని మరో టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంది. ఇప్పటి వరకు ఫ్యాషన్ డిజైనర్‌గా మాత్రమే తెలిసిన ఈమె, ఇప్పుడు అన్న బాటలో అడుగులు వేస్తూ కలం పట్టుకుంది. సాయి ధరమ్ తేజ్ హీరో సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తిక్క సినిమా కోసం ఓ పాట రాసింది. ఈ సినిమాకు సంగీతం అందించిన తమన్ తో ఉన్న స్నేహం కారణంగా పాట రాసేందుకు అంగీకరించిన నీరజ, తమన్‌తో పాటు హీరో, దర్శకనిర్మాతలను కూడా ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలో వెళ్లిపోకే అని పాట రాసిన నీరజ ఇక ముందు కూడా గేయ రచయిత్రిగా కొనసాగుతుందేమో చూడాలి. -
మెగా హీరో కోసం ఇద్దరు తమిళ హీరోలు
ప్రస్తుతం ఉన్న యంగ్ జనరేషన్ హీరోలు ఈగోలను పక్కనపెట్టి ఒకరి సినిమాకు మరొకరు కావలసినంత సాయం చేసుకుంటున్నారు. ఎక్కువగా ఆడియో వేడుకలకు హాజరవుతూ సినిమా ప్రమోషన్లో భాగం పంచుకుంటున్నారు. తాజాగా మరో ట్రెండ్ మొదలైంది. ఒకరు హీరోగా నటిస్తున్న సినిమాలో మరో హీరో పాట పాడి ఆ సినిమాకు మరింత క్రేజ్ తీసుకు వస్తున్నారు. గతంలో శింబు లాంటి ఒకరిద్దరు స్టార్లు ఈ ప్రయోగం చేసినా.. ప్రస్తుతం ఎక్కువగా ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు మన యంగ్ హీరోలు. ఇప్పటికే ఓ కన్నడ సినిమా కోసం ఎన్టీఆర్ పాట పాడగా.. తాజాగా ఓ తెలుగు సినిమా కోసం ఏకంగా ఇద్దరు తమిళ స్టార్ హీరోలు పాటలు పాడారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తిక్క సినిమా కోసం ధనుష్, శింబులు పాటలు పాడారు. ఓం 3డి ఫేం సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో 'తిక్క... తిక్క..' అంటూ సాగే టైటిల్ సాంగ్‌ను ధనుష్ ఆలపించగా, 'హీ ఈజ్ హాట్ షాట్ హీరో' అనే హుషారైన పాటను శింబు పాడాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియోను ఈ నెల 30న సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేయనున్నారు. -
‘నీకోసం.. టెర్రరిస్టు కూడా అవుతా’!
-
‘నీకోసం.. టెర్రరిస్టు కూడా అవుతా’!
వరుస విజయాలతో ఊపుమీదున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా తన ‘తిక్క’ చూపేందుకు సిద్ధమవుతున్నాడు. సునీల్‌రెడ్డి దర్శకత్వంలో సాయి హీరోగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ గురువారం విడుదలైంది. ఈ సినిమాలో సాయి సరసన లారిస్సా బొన్సి, మన్నారా చోప్రా కథానాయికలుగా నటించారు. ‘జగమే మాయ.. బ్రతుకే మాయ’ అనే పాటతో ప్రారంభమైన ఈ టీజర్.. తాగుబోతు రమేష్ డైలాగులు క్యాచీగా ఉన్నాయి. ఇక సాయి ‘ఒక్క మాట అడిగి చూడు.. నీకోసం హీరో ఏంటి? నిజంగా టెర్రరిస్టు కూడా అయిపోతా’ అంటూ పంచ్ డైలాగులు పేల్చాడు. శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ పతాకంపై డాక్టర్ సి.రోహణ్రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. అన్నట్టు ‘తిక్క’ టైటిల్ సాంగ్‌ను తమిళ నటుడు ధనుష్ పాడిన సంగతి తెలిసిందే. -
తెలుగు పాట పాడిన తమిళ హీరో
గతంలో కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో పాట పాడించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్, మరోసారి అలాంటి కాంబినేషన్ నే సెట్ చేశాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ తిక్క. ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం తమిళ స్టార్ హీరో ధనుష్ పాట పాడాడు. ఇప్పటి వరకు తమిళ పాటలు మాత్రమే పాడిన ధనుష్ తొలిసారిగా తిక్క సినిమా కోసం తమన్ సంగీత సారధ్యంలో తెలుగు పాట పాడాడు. ఇప్పటికే కోలీవుడ్ లో కొలవర్రీ పాటతో సెన్సేషన్ సృష్టించిన ధనుష్, ఇప్పుడు తిక్క బేబి అంటూ సాగే పాటతో తెలుగు నాట కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. @dhanushkraja sings for #Thikka title song @IamSaiDharamTej pic.twitter.com/n9pKnfJZjJ — THAMAN SHIVAKUMAR (@MusicThaman) 19 July 2016 -
వరుసగా రిలీజ్ డేట్స్ చెప్పేస్తున్నారు
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న కబాలి సినిమా రిలీజ్‌పై ఎలాంటి క్లారిటీ లేకపోవటంతో చాలా రోజులుగా తెలుగు తమిళ ఇండస్ట్రీలలో సినిమా రిలీజ్‌ల విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయితే ఫైనల్‌గా ఈ నెల 22న కబాలి రిలీజ్ అవుతున్నట్టుగా తేలిపోవటంతో మిగతా సినిమాల నిర్మాతలు రిలీజ్ డేట్లు కన్ఫామ్ చేసేసుకుంటున్నారు. ముఖ్యంగా కబాలి దెబ్బకు ఎప్పుడు రిలీజ్ చేయాలో అర్థం కాక తికమక పడ్డ బాబు బంగారం, జనతా గ్యారేజ్ పోస్ట్ పోన్ కావటంతో ఆగస్ట్ 12న ఆడియన్స్ ముందుకు రావాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని సరైన డేట్ కోసం ఎదురుచూస్తున్న సునీల్ కూడా తన నెక్ట్స్ సినిమా జక్కన్నకు డేట్ ప్రకటించేశాడు. ముందుగా 22న రిలీజ్ చేయాలని భావించిన అదే రోజు కబాలి రిలీజ్ అవుతుండటంతో ఒక వారం ఆలస్యంగా 29న ఇడియన్స్ ముందుకు వస్తున్నాడు. మరో యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ కూడా డేట్ ఇచ్చేశాడు. సుప్రీమ్ సినిమా సక్సెస్‌తో సూపర్ ఫాంలో ఉన్న సాయి తిక్క సినిమాను ఆగస్టు 13న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. కబాలి హవా తెలుగు నాట వారానికి మించి ఉండదన్న నమ్మకంతో కొంతమంది చిన్న సినిమాల నిర్మాతలు కూడా ఆగస్టు తొలి వారంలో రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్నారు. -
తమన్ పాడుతుంటే తేజూ డాన్స్ చేస్తూ..
రయ్.. రయ్‌మంటూ గంటకు వంద కిలోమీటర్ల వేగంతో సూపర్ లగ్జరీ ఎస్యువీ కార్లు దూసుకెళ్లే హైదరాబాద్ నగర శివార్లలో ఔటర్ రింగ్ రోడ్ అది. సోమవారం స్పీడుగా వెళ్లే కార్లకు ఆ రోడ్ మీద బ్రేక్ పడింది. అంతకంటే స్పీడుగా, సూపర్‌గా సాయిధరమ్ తేజ్ డాన్స్ చేస్తున్నారు. ‘హాట్ షాట్ హీరో..’ అంటూ మాంచి బీటున్న ఆ పాటకు స్టెప్పులేస్తున్న ఈ మెగా మేనల్లుణ్ణి చూడ్డానికి అక్కడ చాలామంది గుమిగూడారు. ఈ పాటను స్వరపరిచింది యువ సంగీత సంచలనం ఎస్.ఎస్. తమన్. విశేషం ఏంటంటే.. ఈ పాటలో వీరిద్దరూ కనిపించనున్నారు. తమన్ పాడుతుంటే తేజూ డాన్స్ చేస్తూ సందడి చేయనున్నారు. సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తిక్క’. హ్యాండిల్ విత్ కేర్ అనేది ఉపశీర్షిక. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘సుప్రీమ్’ విజయాల తర్వాత మెగా మేనల్లుడు నటిస్తున్న ఈ చిత్రంలోని కథానాయకుడి పరిచయ గీతంలో ఎస్.ఎస్.తమన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ప్రేమ్క్ష్రిత్ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. ఈ పాటతో చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం. లరిస్సా బోన్సి, మన్నార్ చోప్రా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సి.రోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఫరా కరిమీ ప్రత్యేక గీతంలో కనువిందు చేయనున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారట. -
మెగా హీరో తిక్క చూపిస్తున్నాడు
రేయ్ సినిమా నుంచి సుప్రీమ్ వరకు తన ఇమేజ్ను మార్కెట్ రేంజ్‌ను అంచలంచెలుగా పెంచుకుంటూ వస్తున్న యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చినా, తన మార్క్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తిక్క సినిమాలో నటిస్తున్నాడు సాయి. ఈ సినిమాలో ఫుల్ మాస్ అవతార్‌లో కనిపిస్తున్న సాయి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. కలర్ ఫుల్‌గా కనిపిస్తున్న ఈ పోస్టర్లో గుర్రమీద కూర్చున్న సాయి, ఒక చేత్తో బేబి ట్రంపెట్‌ను వాయిస్తూ మరో చేత్తో బీర్ బాటిల్‌ను పట్టుకున్నాడు. టైటిల్‌కు తగ్గట్టుగానే పోస్టర్లో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశారు చిత్రయూనిట్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు రోహిణ్ కుమార్ రెడ్డి నిర్మాత. -
ఇష్టం ఉంటే తిక్క ఉన్నట్లే!
‘‘సినిమా మీద ప్యాషన్ ఉన్న ప్రతి ఒక్కరికీ తిక్క ఉన్నట్లే. ఈ సినిమాలో ఎంత యాక్ష న్ ఉంటుందో అంత కామెడీ ఉంటుంది. ఇందులో నా క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. నా కోసం యువ దర్శకులు మంచి మంచి పాత్రలు రాస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. సాయిధరమ్ తేజ్, లారిస్సా బొనేసి జంటగా సునీల్‌రెడ్డి దర్శకత్వంలో రోహిన్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘తిక్క’. ఈ చిత్రం మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో సాయి ధరమ్‌తేజ్ మాట్లాడుతూ - ‘‘తిక్క సినిమాలో నా క్యారెక్టర్ టిపికల్‌గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సినిమా చేసినట్లుంది. తమన్ మంచి సంగీతాన్నిచ్చారు. నా కెరీర్లో మంచి సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు ‘‘సినిమా ఔట్పుట్ బాగా వచ్చింది. సాయి ధరమ్‌తేజ్ వల్లే సినిమా నిర్మాణ రంగంలోకి వచ్చాను. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాత రోహిన్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమానికి వంశీ పైడిపల్లి అతిథిగా హాజరయ్యారు. -
'జవాన్'గా మెగా హీరో
యంగ్ జనరేషన్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా ఆ ప్రభావం తన మీద పడకుండా, మీడియం రేంజ్ సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు. వరుసగా పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలతో మంచి సక్సెస్‌లు సాధించిన సాయి, తన నెక్ట్స్ సినిమాల టైటిల్స్‌తోనే సినిమాల మీద అంచనాలు పెంచేస్తున్నాడు. ప్రస్తుతం సునీల్ రెడ్డి దర్శకత్వంలో తిక్క సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తను చేయబోయే నెక్ట్స్ సినిమాను కూడా లైన్లో పెట్టాడు. ప్రముఖ రచయిత బివియస్ రవి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు సాయి. ఈ సినిమాకు జవాన్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. దర్శకుడు హరీష్ శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
సోల్జర్‌గా సాయిధరమ్ తేజ్
యంగ్ జనరేషన్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా ఆ ప్రభావం తన మీద పడకుండా, మీడియం రేంజ్ సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు. వరుసగా పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలతో మంచి సక్సెస్‌లు సాధించిన సాయి, తన నెక్ట్స్ సినిమాల టైటిల్స్‌తోనే సినిమాల మీద అంచనాలు పెంచేస్తున్నాడు. ప్రస్తుతం సునీల్ రెడ్డి దర్శకత్వంలో తిక్క సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తను చేయబోయే నెక్ట్స్ సినిమాను కూడా లైన్లో పెట్టాడు. ప్రముఖ రచయిత బివియస్ రవి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు సాయి. ఈ సినిమాకు సోల్జర్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. దర్శకుడు హరీష్ శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
'నా సినిమా ఆగిపోలేదు'
పండగ చేస్కో సినిమా తరువాత ఒక్క సినిమాకూడా అంగకీరించని గోపిచంద్ మలినేని, ఇటీవల మెగా హీరో సాయిధరమ్ తేజ్‌తో ఓ సినిమాను ప్రారంభించాడు. అయితే సాయి ప్రస్తుతం సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తిక్క సినిమా షూటింగ్లో బిజీగా ఉండటంతో గోపిచంద్ సినిమా ఇంకా సెట్స్ మీదకు రాలేదు. అయితే అదే సమయంలో సాయిధరమ్ తేజ్ ఇతర దర్శకులతో సినిమాలు అంగీకరించాడన్న వార్తలు వినిపించాయి. దీంతో తిక్క తరువాత సాయిధరమ్ తేజ్ చేయబోయే సినిమాపై అనుమానాలు ఏర్పాడ్డాయి. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ప్రారంభమైన సినిమాను పక్కన పెట్టి, సాయి మరో దర్శకుడితో సినిమా ప్రారంభిస్తున్నాడన్న టాక్ వినిపించింది. ఇలాంటి రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పెడుతూ త్వరలోనే తమ సినిమా స్టార్ అవుతుందన్న సంకేతాలిచ్చాడు దర్శకుడు గోపిచంద్. తన సినిమా స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్‌లో ఉందని, పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్తో అలరిస్తానని ట్విట్టర్లో కామెంట్ చేశాడు. Don't trust any false news abt my film..script is in final stage ...it's a pakka commercial entertainer — Gopichand Malineni (@megopichand) 2 June 2016 -
మనసు మార్చుకున్న మెగా వారసుడు
వారసుడిగా ఎంట్రీ ఇచ్చి మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకుంటున్న యువ నటుడు సాయిధరమ్ తేజ్. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి ఈజీగానే ఎంట్రీ ఇచ్చినా.., తన టాలెంట్‌తో మంచి సక్సెస్‌లు సాధిస్తున్నాడు. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీం సినిమాల సక్సెస్‌తో మంచి ఫాంలో ఉన్నాడు. అయితే ఈ సినిమాలతో ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో అదే స్థాయిలో విమర్శలను కూడా ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా తన ప్రతీ సినిమాలో చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను ఇమిటేట్ చేయటంతో పాటు చిరు పాటలను రీమిక్స్ చేయటం ఇప్పుడు సాయికి ఇబ్బందిగా మారింది. కెరీర్ స్టార్టింగ్‌లో గుర్తింపు కోసం ఫర్వాలేదు కానీ, ప్రతీ సినిమాలో ఇలా ఇమిటేట్ చేస్తే, సొంత ఐడెంటిటీ రాదంటున్నారు విశ్లేషకులు. దీంతో ఇక ఈ ఇమిటేషన్ సెంటిమెంట్‌కు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాడు తేజు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తిక్క సినిమాలో కూడా చిరంజీవి పాటను రీమిక్స్ చేయాలని ప్లాన్ చేశారు చిత్రయూనిట్. అయితే సాయి మాత్రం వద్దని ఖచ్చితంగా చెప్పేశాడట. కథకు అవసరమైతే తప్ప ఇప్పట్లో రీమిక్స్ పాటలను చేసే ఆలోచనే లేదంటున్నాడు. మరి సొంత ఐడెంటిటీ కోసం ప్రయత్నిస్తున్న సాయి ప్లాన్స్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.