హ్యాట్రిక్ మీద కన్నేశాడు | Sai Dharam Tej Hatric Hit with Thikka | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్ మీద కన్నేశాడు

Published Wed, Aug 10 2016 10:11 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

హ్యాట్రిక్ మీద కన్నేశాడు

హ్యాట్రిక్ మీద కన్నేశాడు

మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. తన కంటూ కొత్త ఇమేజ్ క్రియేట్ చేసుకోవటం కోసం చాలా కష్టపడుతున్నాడు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. తొలి సినిమా పిల్లా నువ్వు లేని జీవితంతో మంచి సక్సెస్ సాధించిన సాయి తరువాత విడుదలైన రేయ్ సినిమాతో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో తరువాతి సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.

హారిష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో 20 కోట్ల వసూళ్ల మార్క్కు చేరువైన సాయి.. ఆ తరువాత విడుదలైన సుప్రీంతో, ఆ మార్క్ను ఈజీగా దాటేశాడు. తాజాగా తిక్క సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్న మెగా వారసుడు, ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ మీద కన్నేశాడు. అయితే సాయి తిక్కకు ఒక్క రోజు ముందే వెంకటేష్ బాబు బంగారం రిలీజ్ అవుతుండటంతో తిక్క కలెక్షన్ల మీద ప్రభావం పడే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరి సీనియర్ హీరో ఇమేజ్ను దాటి సాయి ధరమ్ తేజ్ రికార్డ్ అందుకుంటాడేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement