తమన్ పాడుతుంటే తేజూ డాన్స్ చేస్తూ.. | sai dharam tej dance performance with taman music! | Sakshi
Sakshi News home page

తమన్ పాడుతుంటే తేజూ డాన్స్ చేస్తూ..

Published Tue, Jul 5 2016 12:10 AM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

తమన్ పాడుతుంటే తేజూ డాన్స్ చేస్తూ..

తమన్ పాడుతుంటే తేజూ డాన్స్ చేస్తూ..

రయ్.. రయ్‌మంటూ గంటకు వంద కిలోమీటర్ల వేగంతో సూపర్ లగ్జరీ ఎస్‌యువీ కార్లు దూసుకెళ్లే హైదరాబాద్ నగర శివార్లలో ఔటర్ రింగ్ రోడ్ అది. సోమవారం స్పీడుగా వెళ్లే కార్లకు ఆ రోడ్ మీద బ్రేక్ పడింది. అంతకంటే స్పీడుగా, సూపర్‌గా సాయిధరమ్ తేజ్ డాన్స్ చేస్తున్నారు. ‘హాట్ షాట్ హీరో..’ అంటూ మాంచి బీటున్న ఆ పాటకు స్టెప్పులేస్తున్న ఈ మెగా మేనల్లుణ్ణి చూడ్డానికి అక్కడ చాలామంది గుమిగూడారు. ఈ పాటను స్వరపరిచింది యువ సంగీత సంచలనం ఎస్.ఎస్. తమన్. విశేషం ఏంటంటే.. ఈ పాటలో వీరిద్దరూ కనిపించనున్నారు.

తమన్ పాడుతుంటే తేజూ డాన్స్ చేస్తూ సందడి చేయనున్నారు. సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తిక్క’. హ్యాండిల్ విత్ కేర్ అనేది ఉపశీర్షిక. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘సుప్రీమ్’ విజయాల తర్వాత మెగా మేనల్లుడు నటిస్తున్న ఈ చిత్రంలోని కథానాయకుడి పరిచయ గీతంలో ఎస్.ఎస్.తమన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ప్రేమ్క్ష్రిత్ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. ఈ పాటతో చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం. లరిస్సా బోన్సి, మన్నార్ చోప్రా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సి.రోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఫరా కరిమీ ప్రత్యేక గీతంలో కనువిందు చేయనున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement