
'నా సినిమా ఆగిపోలేదు'
పండగ చేస్కో సినిమా తరువాత ఒక్క సినిమాకూడా అంగకీరించని గోపిచంద్ మలినేని, ఇటీవల మెగా హీరో సాయిధరమ్ తేజ్తో ఓ సినిమాను ప్రారంభించాడు. అయితే సాయి ప్రస్తుతం సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తిక్క సినిమా షూటింగ్లో బిజీగా ఉండటంతో గోపిచంద్ సినిమా ఇంకా సెట్స్ మీదకు రాలేదు. అయితే అదే సమయంలో సాయిధరమ్ తేజ్ ఇతర దర్శకులతో సినిమాలు అంగీకరించాడన్న వార్తలు వినిపించాయి.
దీంతో తిక్క తరువాత సాయిధరమ్ తేజ్ చేయబోయే సినిమాపై అనుమానాలు ఏర్పాడ్డాయి. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ప్రారంభమైన సినిమాను పక్కన పెట్టి, సాయి మరో దర్శకుడితో సినిమా ప్రారంభిస్తున్నాడన్న టాక్ వినిపించింది. ఇలాంటి రూమర్స్కు ఫుల్ స్టాప్ పెడుతూ త్వరలోనే తమ సినిమా స్టార్ అవుతుందన్న సంకేతాలిచ్చాడు దర్శకుడు గోపిచంద్. తన సినిమా స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్లో ఉందని, పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్తో అలరిస్తానని ట్విట్టర్లో కామెంట్ చేశాడు.
Don't trust any false news abt my film..script is in final stage ...it's a pakka commercial entertainer
— Gopichand Malineni (@megopichand) 2 June 2016