కోన ఫ్యామిలీ నుంచి మరో రైటర్ | Celeb Stylist neeraja kona Turns writer | Sakshi
Sakshi News home page

కోన ఫ్యామిలీ నుంచి మరో రైటర్

Published Sat, Apr 8 2017 3:13 PM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM

కోన ఫ్యామిలీ నుంచి మరో రైటర్

కోన ఫ్యామిలీ నుంచి మరో రైటర్

నీరజ కోన.. సినీ ఇండస్ట్రీతో పరిచయం ఉన్న వారికి సుపరిచితమైన పేరు. ప్రముఖ రచయిత కోన వెంకట్ సోదరిగానే కాక, టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్కు స్టైలిస్ట్గా కూడా నీరజ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపించే నీరజ ఇప్పుడు తన లోని మరో టాలెంట్ను ప్రూవ్ చేసుకుంది. ఇప్పటి వరకు ఫ్యాషన్ డిజైనర్గా మాత్రమే తెలిసిన ఈమె, ఇప్పుడు అన్న బాటలో అడుగులు వేస్తూ కలం పట్టుకుంది.

సాయి ధరమ్ తేజ్ హీరో సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తిక్క సినిమా కోసం ఓ పాట రాసింది. ఈ సినిమాకు సంగీతం అందించిన తమన్ తో ఉన్న స్నేహం కారణంగా పాట రాసేందుకు అంగీకరించిన నీరజ, తమన్తో పాటు హీరో, దర్శకనిర్మాతలను కూడా ఆశ్చర్యపరిచింది. తిక్క సినిమాలో గేయ రచయితగా ఆకట్టుకున్న నీరజ, త్వరలో ఓ సినిమాకు రచన చేసేందుకు రెడీ అవుతోంది.

ఇప్పటికే రైటర్స్ అసోషియేషన్ లో పేరు కూడా రిజిస్టర్ చేయించుకున్న నీరజ, ఓ పెద్ద నిర్మాణ సంస్థతో చర్చలు జరుపుతుందట. త్వరలోనే నీరజ కథ అందించబోయే సినిమా ఎనౌన్స్మెంట్ వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. మరి నీరజ కూడా అన్న కోన వెంకట తరహాలో కమర్షియల్ రైటర్ అనిపించుకుంటుందో లేక తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement