'జవాన్'గా మెగా హీరో | sai dhara tejs next movie title soldier | Sakshi
Sakshi News home page

'జవాన్'గా మెగా హీరో

Published Thu, Jun 9 2016 8:59 AM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

'జవాన్'గా మెగా హీరో - Sakshi

'జవాన్'గా మెగా హీరో

యంగ్ జనరేషన్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా ఆ ప్రభావం తన మీద పడకుండా, మీడియం రేంజ్ సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు. వరుసగా పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలతో మంచి సక్సెస్లు సాధించిన సాయి, తన నెక్ట్స్ సినిమాల టైటిల్స్తోనే సినిమాల మీద అంచనాలు పెంచేస్తున్నాడు.

ప్రస్తుతం సునీల్ రెడ్డి దర్శకత్వంలో తిక్క సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తను చేయబోయే నెక్ట్స్ సినిమాను కూడా లైన్లో పెట్టాడు. ప్రముఖ రచయిత బివియస్ రవి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు సాయి. ఈ సినిమాకు జవాన్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. దర్శకుడు హరీష్ శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement