పాత సినిమాల్లోని పాటలను రీమిక్స్ చేయటం అన్ని చిత్ర పరిశ్రమల్లో ఓ ట్రెండ్‌గా కొనసాగుతోంది. అయితే కొన్ని పాటల మాత్రమే ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాయి. సరిగా మెప్పించని పాటలు సోషల్ మీడియాలో నెటిజన్ల విమర్శలకు గురవుతున్న విషయం తెలిసిందే. సిద్దార్థ్ మల్హోత్రా, తారా సుతారియా నటించిన మసక్కలి 2.0 హిందీ పాట ఇటీవల విడుదలైంది. కొత్త వర్షన్ మసక్కలి పాటను తనీష్ బాగ్చి రూపొందించారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. తాజాగా ఈ మసక్కలి 2.0 పాటపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ట్విటర్‌లో స్పందించారు.
‘ఒక పాటను రూపొందించడానికి నిద్రలేని రాత్రులను గడపాల్సి వస్తుంది. పలుమార్లు మార్చి మార్చి పాటను రూపొందించాల్సి ఉంటుంది. ఒరిజినల్ మసక్కలి పాట కోసం సుమారు 200 మంది సంగీతకారులు పనిచేశారు. అందుకే ఒకసారి మసక్కలి ఒరిజినల్ పాటను విని సంతోషించండి’ అని రెహమన్ పేర్కొన్నారు. అంతేకాకుండా మసక్కలి ఒరిజనల్ పాట లింక్‌ను కూడా షేర్ చేశాడు. కాగా ఈ పాటను ఏఆర్ రెహమన్ ‘ఢిల్లీ 6’ మూవీ కోసం కంపోజ్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ పాట పెద్ద మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఈ పాటను మోహిత్ చౌహాన్ పాడగా, ప్రసూన్ జోషి సాహిత్యం అందించారు. ఇక ‘ఢిల్లీ 6’ సినిమాలో సోనమ్ కపూర్, అభిషేక్ బచ్చన్‌లు జంటగా నటించిన విషయం తెలిసిందే. ‘ఢిల్లీ 6’ సినిమాకు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించారు.
Enjoy the original #Masakali https://t.co/WSKkFZEMB4@RakeyshOmMehra @prasoonjoshi_ @_MohitChauhan pic.twitter.com/9aigZaW2Ac
— A.R.Rahman (@arrahman) April 8, 2020
Comments
Please login to add a commentAdd a comment