మమ్మమ్మాస్‌.. | Tamannah Bhatia item song in Akkineni Naga Chaitanya Savyasachi | Sakshi
Sakshi News home page

మమ్మమ్మాస్‌..

Published Thu, May 24 2018 12:26 AM | Last Updated on Thu, May 24 2018 12:26 AM

Tamannah Bhatia item song in Akkineni Naga Chaitanya Savyasachi - Sakshi

తమన్నా, నాగచైతన్య

స్పెషల్‌ సాంగ్స్‌లో మరింత స్పెషల్‌గా కనిపించడమే కాదు డ్యాన్స్‌లో రెండింతలు రెచ్చిపోతారు తమన్నా. మళ్లీ ఇప్పుడు మరోసారి రెచ్చిపోవడానికి రెడీ అవుతున్నారు. నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సవ్యసాచి’. ఇందులో నిధి అగర్వాల్‌ కథానాయిక. ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘అల్లరి అల్లుడు’ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణ మమ్మమాస్‌ అనేలా దుమ్మురేపిన ‘నిన్ను రోడ్డు మీద చూసినది..’ సాంగ్‌ను ‘సవ్యసాచి’ చిత్రం కోసం రీమిక్స్‌ చేస్తున్నారు.

ఈ స్పెషల్‌ సాంగ్‌లోనే చైతూతో కలిసి స్టేజ్‌ను అదరగొట్టనున్నారు తమన్నా. ఈ సాంగ్‌ను వచ్చే నెలలో షూట్‌ చేయనున్నారు. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ కోసం భారీ సెట్‌ వేస్తున్నారు. ఆల్రెడీ తమన్నా ‘అల్లుడు శీను, స్పీడున్నోడు, జై లవకుశ’ చిత్రాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ పాటల్లో ఆమె స్టెప్స్‌ అదుర్స్‌. ఇప్పుడీ పాటలోనూ మాస్‌ స్టెప్స్‌తో మెస్మరైజ్‌ చేస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ మిల్కీ బ్యూటీ చైతూకు జోడీగా ‘100 పర్సెంట్‌ లవ్‌’, ‘తడాఖా’ చిత్రాల్లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement