![Thandel Movie Day 2 Collection](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/thandel.jpg.webp?itok=9KHabdR7)
బాక్సాఫీస్ వద్ద తండేల్ రెండో రోజు కూడా భారీ కలెక్షన్స్ సాధించింది. నాగచైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం ఉండనుందని బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. చందు మొండేటి డైరెక్షన్‌కు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తోడైతే ఎలా ఉంటుందో తండేల్ విజయం చూపుతుంది. నాగచైతన్య, సాయి పల్లవి జోడిపై ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు రూ. 21.27 కోట్లు రాబట్టి నాగచైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/1_442.jpg)
శనివారం వీకెండ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద తండేల్ దెబ్బ బలంగానే పడింది. రెండురోజులకు గాను రూ. 41.20 కోట్లు రాబట్టింది. ఇంకా ఆదివారం సెలవు రోజు ఉంది కాబట్టి సులువుగా రూ. 50 కోట్ల మార్క్‌ను దాటుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో బన్నీ వాసు, అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మించారు. సినిమా విడుదలకు ముందే తండేల్ పాటలు, డైలాగులతో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. సినిమా బాగుందని పాజిటివ్ టాక్ రావడంతో టికెట్ల బుకింగ్‌లో వేగం పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment