అక్కినేని వారసుడు కూడా అదే పని చేస్తున్నాడు | Devdas Song remix for sushanth movie | Sakshi
Sakshi News home page

అక్కినేని వారసుడు కూడా అదే పని చేస్తున్నాడు

Published Sat, Jul 2 2016 12:31 PM | Last Updated on Mon, Sep 4 2017 3:59 AM

అక్కినేని వారసుడు కూడా అదే పని చేస్తున్నాడు

అక్కినేని వారసుడు కూడా అదే పని చేస్తున్నాడు

స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరోలు సక్సెస్ కోసం ఫ్యామిలీ ఇమేజ్ను బాగానే వాడేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ జనరేషన్ హీరోలు రీమిక్స్ పాటలతో తన వారసత్వాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్లు కూడా ఈ ప్రయత్నం చేశారు. ఇక సాయి ధరమ్ తేజ్ సక్సెస్లో రీమిక్స్ పాటల ప్రభావం కూడా బాగానే ఉంది.

తాజాగా అక్కినేని వారసుడిగా పరిచయం అయిన యంగ్ హీరో సుశాంత్ కూడా ఇదే ఫార్ములాను నమ్ముకుంటున్నాడు. ఏకంగా ఏఎన్నార్ నటించిన ఆల్ టైం క్లాసిక్ దేవదాసు సినిమాలోని పాటను రీమిక్స్ చేస్తున్నాడు సుశాంత్. నాగేశ్వరరావు, సావిత్రి  జంటగా నటించిన పల్లెకు పోదాం పారును చూద్దాం పాటను తన లేటెస్ట్ సినిమా కోసం రీమిక్స్ చేస్తున్నాడు సుశాంత్. మరి ఈ సెంటిమెంట్ అయిన సుశాంత్కు వర్క్ అవుట్ అవుతుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement