అథ్లెటిక్‌ నేపథ్యంలో... | Aadhi Pinisetty Clap Song Shooting in Hyderabad | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్‌ నేపథ్యంలో...

Published Thu, Sep 26 2019 12:39 AM | Last Updated on Thu, Sep 26 2019 12:39 AM

Aadhi Pinisetty Clap Song Shooting in Hyderabad - Sakshi

ఆది పినిశెట్టి

విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘క్లాప్‌’. ప్రిత్వి ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఆకాంక్షా  సింగ్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఐబీ కార్తికేయన్‌ సమర్పణలో శ్రీ షిరిడీసాయి మూవీస్, బిగ్‌ ప్రింట్‌ పిక్చర్స్, సర్వన్త్‌ రామ్‌ క్రియేషన్స్‌ బ్యానర్లపై రామాంజనేయులు జవ్వాజి, యం.రాజశేఖర్‌ రెడ్డి తెలుగు, తమిళ్‌ భాషల్లో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘‘అథ్లెటిక్‌ స్పోర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది.

రెండు విభిన్నమైన పాత్రల్లో ఆది పినిశెట్టి నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ పాటను హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరిస్తున్నాం. దినేశ్‌ మాస్టర్‌ నృత్య రీతులు సమకూరుస్తున్న ఈ స్పెష్‌ల్‌ సాంగ్‌లో మోనాల్‌ గజ్జర్‌ చిందేస్తున్నారు. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. నాజర్, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మాజీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్‌ కుమార్, సహ నిర్మాతలు: ఫై.ప్రభ ప్రేమ్, జి.మనోజ్, జి.శ్రీహర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement