![aadhi pinisetty sabdham grand release on february 28](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/Aadi-Pinishetty-SABDHAM.jpg.webp?itok=ptN-F-1I)
‘వైశాలి’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ కాంబినేషన్‌లో రూపొందిన ద్వితీయ చిత్రం ‘శబ్దం’. లక్ష్మీ మీనన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సిమ్రాన్, లైలా, రాజీవ్ మీనన్ తదితరులు ఇతరపాత్రలు పోషించారు. తెలుగు, తమిళ భాషల్లో శివ నిర్మించారు. ఈ నెల 28న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
తెలుగులో ఎన్ సినిమాస్ ద్వారా రిలీజ్ అవుతోంది. ‘‘సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘శబ్దం’. తమన్ అద్భుతమైన సంగీతం అందించారు. ప్రేక్షకులు గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని పొందేలా విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment