ప్రారంభమైన ఆది పినిశెట్టి ‘క్లాప్’ | Aadhi Pinishetty Bilingual Sports Film Clap Launched | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన ఆది పినిశెట్టి ‘క్లాప్’

Jun 12 2019 2:14 PM | Updated on Jun 12 2019 2:14 PM

Aadhi Pinishetty Bilingual Sports Film Clap Launched - Sakshi

విభిన్నమైన పాత్రలను చేస్తూ వర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న  ఆది పినిశెట్టి మరో కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. అథ్లెటిక్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సాగే ‘క్లాప్’ చిత్రంలో రెండు విభిన్నమైన క్యారెక్టర్స్‌లో ఆది హీరోగా  నటిస్తున్నారు. ఆది పినిశెట్టి సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. రామాంజనేయులు జవ్వాజి సమర్పణలో పృథ్వి ఆదిత్య  దర్శకుడిగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బిగ్ ప్రింట్ పిక్చర్స్, సర్వన్త్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లు పై ఐబి కార్తికేయన్, యం .రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమా బుధవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో అతిరథ మహారధులు మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సి. కళ్యాణ్, చంటి అడ్డాల, శ్రీమతి శోభారాణి, కొమర వెంకటేష్,  హీరోలు నాని, సందీప్ కిషన్, ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, బొమ్మరిల్లు భాస్కర్, రచయిత చిన్నికృష్ణ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

పూజాకార్యక్రమాల అనంతరం హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ ఆకాంక్ష సింగ్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా క్లాప్ నివ్వగా మెగా నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తమిళ్ చిత్రానికిగాను హీరో నాని క్లాప్ నిచ్చారు. ‘క్లాప్’ బౌండెడ్ స్క్రిప్ట్‌ను ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, బొమ్మరిల్లు భాస్కర్‌లు చిత్ర యూనిట్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. ‘పృథ్వి ఆదిత్య కథ చెప్పగానే వెంటనే ఈ సినిమా చేస్తాను అని చెప్పాను. అంతలా ఇంప్రెస్ అయ్యాను. వెరీ ఆర్ట్ టచ్చింగ్ మూవీ . డైరెక్టర్ చాలా టాలెంట్ వున్న వ్యక్తి. ఎంతో రీసెర్చ్ చేసి ఈ కథ రాశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. వాటన్నిటికంటే ఈ క్లాప్ చిత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ముఖ్యంగా డైరెక్టర్ కన్విక్షన్ బాగా నచ్చింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. రెండు షేడ్స్ వున్న పాత్రల్లో నటిస్తున్నాను. బాగా చెయ్యాలనే తపనతో వున్నాను. నిర్మాత కార్తికేయన్ నేను ఎప్పటినుండో సినిమా చెయ్యాలనుకుంటున్నాం, ఇన్నాళ్లకు కుదిరింది’ అన్నారు. 

దర్శకుడు పృథ్వి ఆదిత్య మాట్లాడుతూ.. ఇది వెరీ స్పెషల్ డే నాకు. వన్ ఇయర్ నుండి ఈ కథపై వర్క్ చేశాను. కార్తికేయన్‌కి పాయింట్ చెప్పగానే నచ్చి ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చారు. వెంటనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయమన్నారు. ఆది కథ విని వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అథ్లెటిక్ స్పోర్ట్స్ నేపథ్యంలో చిత్ర కథ సాగుతుంది’ అన్నారు. హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ.. ‘తెలుగులో ఇది  నా మూడవ సినిమా. తమిళ్‌లో ఫస్ట్ సినిమా. చాలా ఎక్సయిటింగ్‌గా వుంది. ఈ చిత్రంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేస్తున్నాను. వెరీ ఇంపార్టెంట్ రోల్. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూర్స్‌కి థాంక్స్’ అన్నారు.

1
1/7

2
2/7

3
3/7

4
4/7

5
5/7

6
6/7

7
7/7

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement