
ఆకాంక్షసింగ్, నాగార్జున
డాక్టర్‌కు గర్ల్‌ఫ్రెండ్ దొరికింది. మరి.. డాన్ ప్రేయసి సంగతేంటి అంటే... అందుకే నేను వచ్చాగా అని ‘మళ్లీరావా’ ఫేమ్ ఆకాంక్షసింగ్ అన్నారు. నాగార్జున, నాని హీరోలుగా వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ ఓ మల్టీస్టారర్ మూవీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో డాన్‌గా నాగార్జున, డాక్టర్‌గా నాని నటిస్తున్నారని సమాచారం.
ఆల్రెడీ నాని సరసన రష్మికా మండన్నాను కథానాయికగా ఎంపిక చేశారు. తాజాగా నాగార్జున సరసన ఆకాంక్షా సింగ్‌ను హీరోయిన్‌గా సెలక్ట్ చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రం షూటింగ్ స్పీడ్‌గా జరుగుతోంది. రీసెంట్‌గా నాగార్జున– నానీలపై ఫెస్టివల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సాంగ్‌ను చిత్రీకరించారు. అవసరాల శ్రీనివాస్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, కెమెరా: శ్యామ్‌దత్.
Comments
Please login to add a commentAdd a comment