Aadhi Pinisetty Starrer Clap Movie Trailer Released: ఆది పినిశెట్టి, ఆకాంక్షా సింగ్ జంటగా నటించిన చిత్రం ‘క్లాప్’. పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహించగా.. ఐబి కార్తికేయన్ సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందిన ఈ మూవీకి ఇళయరాజా సంగీతమందించడం విశేషం. స్పోర్ట్స్ డ్రామాగా తెరెకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న క్లాప్ నేరుగా ఓటీటీ వేదికగా విడుదల కానుంది. పముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్లో మార్చి 11 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
'మనం జీవితంలో ఓడిపోయేది ఎప్పుడో తెలుసా ? మన టాలెంట్ మీద మనకే నమ్మకం లేని ఆ క్షణం' అంటూ ప్రారంభమైన క్లాప్ ట్రైలర్ ఆద్యంతం అలరించింది. 'పరిగెత్తూ.. వేగంగా పరిగెత్తూ.. నువ్వు పోటీ చేసేది మనుషులతో కాదు టైమ్తో' అనే డైలాగ్ చివర్లో ఆకట్టుకునేలా ఉంది. భాగ్యలక్ష్మీ అనే యువతిని అథ్లేట్గా చేయడానికి ఆది పడిన కష్టమేంటీ అనేదే సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కోచ్గా ఆది అదిరిపోయే నటన కనబర్చి ఆకట్టుకున్నాడు.
Clap Movie: వేగంగా పరిగెత్తమంటున్న ఆది.. అలరిస్తోన్న 'క్లాప్' ట్రైలర్
Published Sun, Mar 6 2022 8:38 PM | Last Updated on Sun, Mar 6 2022 8:46 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment