
సమంత్ హీరోగా నటించిన ‘మళ్ళీ రావా’ చిత్రంలో మంచి నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు ముంబై భామ ఆకాంక్షా సింగ్. ముందు మేనల్లుడు సరసన నటించిన ఆకాంక్ష వెంటనే మేనమామ నాగార్జున సరసన నటించే అవకాశం కొట్టేశారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగ్, నాని హీరోలుగా రూపొందుతోన్న సినిమాలోనే నాగ్ పక్కన నటిస్తున్నారామె. ఇప్పుడీ బ్యూటీ కన్నడ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నారు. సుదీప్ హీరోగా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న కన్నడ చిత్రం ‘పహిల్వాన్’. ఈ సినిమాలో ఫైటర్ అండ్ బాక్సర్‌గా సుదీప్ కనిపించనున్నారు. ఇందుకోసం ఆయన స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇందులో ఆకాంక్షా సింగ్ హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యారట. ఈ సినిమాతోనే బాలీవుడ్ యాక్టర్ సునిల్ శెట్టి శాండిల్‌వుడ్‌కి పరిచయం కానుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.