డబ్బు కోసం పని చేయను | Malli Raava Movie Press Meet | Sakshi
Sakshi News home page

డబ్బు కోసం పని చేయను

Dec 8 2017 1:19 AM | Updated on Dec 8 2017 1:19 AM

Malli Raava Movie Press Meet - Sakshi

‘‘మళ్ళీ రావా’ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ. కార్తీక్, అంజలి మధ్య సాగే ప్రేమకథ. 20 ఏళ్ల పాటు ఇద్దరు ప్రేమికుల మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొన్ని సందర్భాల వల్ల విడిపోయిన వాళ్లిద్దరూ మళ్లీ ఎలా కలిశారు? అన్నది కథ’’ అని హీరో సుమంత్‌ అన్నారు. సుమంత్, ఆకాంక్ష సింగ్‌ జంటగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రాహుల్‌ నక్క నిర్మించిన ‘మళ్ళీ రావా’ నేడు రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా సుమంత్‌ విలేకరులతో మాట్లాడారు.

► ఈ సినిమాను కథ రూపంలో చెప్పాలంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ, స్క్రీన్‌ప్లే చాలా వైవిధ్యంగా ఉంటుంది. మూడు దశల్లో సాగే ప్రేమకథ. ఒకటి చిన్నప్పుడు, మరొకటి వర్కింగ్‌ ప్లేస్‌లో,  ఇంకొకటి కాస్త మెచ్యూర్డ్‌ ఏజ్‌లో సాగుతుంది. ఈ మూడు స్టేజ్‌ల సన్నివేశాలు సమాంతంరగా ఉండేలా గౌతమ్‌ ప్రెజెంట్‌ చేశాడు. గతంలో ‘నా ఆటోగ్రాఫ్, ప్రేమమ్‌’ వంటి సినిమాలొచ్చినా ‘మళ్ళీ రావా’ కథనం కొత్తగా ఉంటుంది.

► నేను గతంలో ‘గోదావరి, మధుమాసం’ వంటి ప్రేమకథా చిత్రాల్లో నటించినా, వాటికి భిన్నంగా సాగే చిత్రమిది.  ఇదొక సహజమైన ప్రేమకథ. పాటలన్నీ కథలో భాగంగా వస్తుంటాయి.  
∙గౌతమ్‌ చెప్పిన రెండు గంటల కథ వినగానే నా కళ్లలో నీళ్లు వచ్చాయి. తను చేయాలనుకున్న సన్నివేశాలను వేరే నటీనటులతో, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో చేసి చూపించాడు. తన ప్లానింగ్‌ నచ్చడంతోనే సినిమా చేస్తానన్నా.

► నిర్మాత రాహుల్‌ మేకింగ్‌లో పాటించిన ప్లానింగ్‌ చూసి ఆశ్చర్యపోయాను. ఓ నటుడిగానే నేను ఇందులో ఇన్‌వాల్వ్‌ అయ్యా. దర్శక–నిర్మాతలు చక్కగా ప్లాన్‌ చేయడం వల్ల సినిమాను 35 రోజుల్లోనే పూర్తి చేశాం. అయితే ప్రీ–ప్రొడక్షన్‌ వర్క్‌కు పది నెలల సమయం పట్టింది.

► నేను డబ్బు కోసమే సినిమాలు చేయను. అందుకు మా తాతగారు (నాగేశ్వర రావు), కుటుంబ సభ్యులకు థ్యాంక్స్‌. నేను సంపాదించిన డబ్బు కూడా చక్కగా ఇన్వెస్ట్‌ చేశా. నా సంతృప్తి కోసం పని చేస్తున్నా. గత 17 ఏళ్లలో నేను చేసింది 22 సినిమాలే. గతంలో వరుసగా సినిమాలు చేశా. ఇప్పుడు నాకు ఆ తొందర లేదు. సహజమైన కథలు ఉన్న సినిమాలు చేయాలనుకుంటున్నా.

► ‘మళ్ళీ రావా’ తర్వాత రెండు సినిమాలు చేయబోతున్నా. వాటిలో ఒకటి డార్క్‌ థ్రిల్లర్‌. మరో సినిమా వివరాలను త్వరలోనే చెబుతా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement