Malli Rava
-
సుమంత్ హీరోగా ‘ఇదం జగత్’
సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూసిన అక్కినేని వారసుడు సుమంత్ ఇటీవల మళ్ళీరావా సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా సుమంత్‌ను సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువచ్చింది. మళ్ళీరావా ఇచ్చిన జోష్‌తో మరిన్ని సినిమాలకు ఓకె చెప్పాడు సుమంత్. ప్రస్తుతం అనిల్ శ్రీకంఠంని దర్శకుడి పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు సుమంత్. ఈ సినిమాలో ప్రేమమ్ ఫేం అంజు కురియెన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు ఇదం జగత్ అనే టైటిల్‌ను కన్ఫామ్ చేశారు. తాజాగా ఈ సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాలో సుమంత్ ఫొటో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో తొలిసారిగా సుమంత్ నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో పాటు సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘‘సుబ్రహ్మణ్యపురం’ సినిమాలోనూ నటిస్తున్నాడు. -
మళ్ళీరావా చాలా బాగుంది – రాఘవేంద్రరావు
సుమంత్, ఆకాంక్ష సింగ్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాహుల్ నక్క నిర్మించిన రొమాంటిక్ డ్రామా ‘మళ్ళీ రావా’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా చూసిన దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘మళ్ళీరావా’ నాకు బాగా నచ్చింది. సుమంత్ నటన అద్భుతం. కెమెరా పనితనం, సంగీతం కొత్తగా అనిపించాయి. ఆకాంక్ష సింగ్‌తో పాటు చిన్న పిల్లలు కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ టైమ్ దర్శకత్వం వహించిన గౌతమ్ అనుభవం ఉన్నవాడిలా తీశారు. ఈ సినిమాతో నిర్మాతగా మారి విజయం అందుకున్న రాహుల్ యాదవ్‌కి శుభాకాంక్షలు. అందరూ చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు. -
నాగ్-సుమంత్.. అసలు గొడవేంటీ..?
టాలీవుడ్ అగ్రహీరో కింగ్ నాగర్జునకు, తన మేనల్లుడైన హీరో సుమంత్‌లకు మధ్య విభేదాలు తలెత్తాయని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. ఏఎన్నార్ మరణాంతరం ఆస్తుల పంపకం దగ్గర ఇద్దరి మధ్య తేడా వచ్చిందని రకరకాల రూమర్లు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై ఈ ఇద్దరు హీరోలు ఇంతవరకు స్పందించలేదు. అయితే తన కొత్త సినిమా ‘మళ్ళీ రావా’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక వీడియో ఇంటర్వ్యూలో సుమంత్ ఈ విషయమై స్పందించాడు. తనకు తన మావయ్యకు విభేదాలున్నాయన్న మాట అవాస్తవమని సుమంత్ అన్నాడు. అసలు బయట ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నట్లు కూడా తనకు తెలియదని సుమంత్ అన్నాడు. తాను తన మావయ్యతో రోజూ మాట్లాడతానని.. తరచుగా కలుస్తుంటానని చెప్పాడు. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు కలవడం కొంచెం తగ్గిందని చెప్పాడు. మేమంతా ఒక ఫ్యామిలీ అని చెప్పుకొచ్చిన సుమంత్.. అఖిల్.. చైతూ.. రానా.. ఇలా తన ఫ్యామిలీ హీరోలతో మంచి సాన్నిహిత్యం ఉందని.. వీరితో కలిసి సినిమాలు కూడా చేయాలనుకుంటున్నానన్నాడు. తాను క్యారెక్టర్.. విలన్ రోల్స్ చేయడానికి కూడా రెడీ అని సుమంత్ చెప్పాడు. ‘మనం’ సినిమాకు నంది అవార్డు రాకపోవడంపై వివాదం చెలరేగడం గురించి స్పందిస్తూ.. ఇలాంటివి మామూలే అని.. హాలీవుడ్లో ఎందరో గొప్ప దర్శకులకు ఆస్కార్ అవార్డులు రాలేదని.. కొందరికి లేటుగా వచ్చాయని.. కాబట్టి ఈ వివాదం గురించి తాను కామెంట్ చేయనని.. తమ సినిమాకు ప్రేక్షకులు అద్భుతమైన విజయాన్నందించారని.. అది చాలని సుమంత్ అన్నాడు. ఇక ప్రేమకథ సినమాతో సుమంత్‌ను హీరోగా నాగర్జున పరిచియం చేసిన విషయం తెలిసిందే. అంతేగాకుండా సుమంత్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారిన సమయంలోనూ ‘సత్యం’ సినిమాను నిర్మించి అతన్ని హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేశాడు. -
సీఎం ఇంటికి 'మళ్లీరావా'
చాలా గ్యాప్ తర్వాత హీరో సుమంత్ చేసిన సినిమా 'మళ్లీరావా'. కొత్త దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ శుక్రవారం ప్రేక్షకుల ముందకు వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో సినిమా సక్సెస్‌ను ఎంజాయి చేస్తున్నాడు సుమంత్. ఈ నేపథ్యంలో వచ్చిన ఓ సందేశం ఆయన సంతోషాన్ని రెట్టింపు చేసింది. ఆ సందేశమేమిటంటే మళ్లీరావా సినిమా చూడాలని, ఓ ప్రింట్ కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి నుంచి మేసేజ్ వచ్చిందట. ఈ విషయాన్ని సుమంత్ ట్వీట్ చేశారు. మా సినిమాను చూడలనుకోవడం చాలా సంతోషంగా ఉందని, ప్రింట్ పంపిస్తున్నట్టు ఆయన ట్విట్టర్లో తెలిపారు. కాగా, రాహుల్ యాదవ్ నక్క నిర్మించిన ఈ మూవీలో హిందీ టీవీ ఆర్టిస్ట్ ఆకాంక్ష సింగ్ హీరోయిన్గా నటించింది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. మిర్చి కిరణ్, మాస్టర్ సాత్విక్, బేబి ప్రీతి ఆస్రాని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. Just got a msg from honorable CM KCR garu's residence, requesting for a print to be sent for viewing. Sending it with pleasure and gratitude 🙏🏼 — Sumanth (@iSumanth) December 8, 2017 -
డబ్బు కోసం పని చేయను
‘‘మళ్ళీ రావా’ రొమాంటిక్ లవ్ స్టోరీ. కార్తీక్, అంజలి మధ్య సాగే ప్రేమకథ. 20 ఏళ్ల పాటు ఇద్దరు ప్రేమికుల మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొన్ని సందర్భాల వల్ల విడిపోయిన వాళ్లిద్దరూ మళ్లీ ఎలా కలిశారు? అన్నది కథ’’ అని హీరో సుమంత్ అన్నారు. సుమంత్, ఆకాంక్ష సింగ్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాహుల్ నక్క నిర్మించిన ‘మళ్ళీ రావా’ నేడు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సుమంత్ విలేకరులతో మాట్లాడారు. ► ఈ సినిమాను కథ రూపంలో చెప్పాలంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ, స్క్రీన్‌ప్లే చాలా వైవిధ్యంగా ఉంటుంది. మూడు దశల్లో సాగే ప్రేమకథ. ఒకటి చిన్నప్పుడు, మరొకటి వర్కింగ్ ప్లేస్‌లో, ఇంకొకటి కాస్త మెచ్యూర్డ్ ఏజ్‌లో సాగుతుంది. ఈ మూడు స్టేజ్‌ల సన్నివేశాలు సమాంతంరగా ఉండేలా గౌతమ్ ప్రెజెంట్ చేశాడు. గతంలో ‘నా ఆటోగ్రాఫ్, ప్రేమమ్’ వంటి సినిమాలొచ్చినా ‘మళ్ళీ రావా’ కథనం కొత్తగా ఉంటుంది. ► నేను గతంలో ‘గోదావరి, మధుమాసం’ వంటి ప్రేమకథా చిత్రాల్లో నటించినా, వాటికి భిన్నంగా సాగే చిత్రమిది. ఇదొక సహజమైన ప్రేమకథ. పాటలన్నీ కథలో భాగంగా వస్తుంటాయి. ∙గౌతమ్ చెప్పిన రెండు గంటల కథ వినగానే నా కళ్లలో నీళ్లు వచ్చాయి. తను చేయాలనుకున్న సన్నివేశాలను వేరే నటీనటులతో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో చేసి చూపించాడు. తన ప్లానింగ్ నచ్చడంతోనే సినిమా చేస్తానన్నా. ► నిర్మాత రాహుల్ మేకింగ్‌లో పాటించిన ప్లానింగ్ చూసి ఆశ్చర్యపోయాను. ఓ నటుడిగానే నేను ఇందులో ఇన్వాల్వ్ అయ్యా. దర్శక–నిర్మాతలు చక్కగా ప్లాన్ చేయడం వల్ల సినిమాను 35 రోజుల్లోనే పూర్తి చేశాం. అయితే ప్రీ–ప్రొడక్షన్ వర్క్‌కు పది నెలల సమయం పట్టింది. ► నేను డబ్బు కోసమే సినిమాలు చేయను. అందుకు మా తాతగారు (నాగేశ్వర రావు), కుటుంబ సభ్యులకు థ్యాంక్స్. నేను సంపాదించిన డబ్బు కూడా చక్కగా ఇన్వెస్ట్ చేశా. నా సంతృప్తి కోసం పని చేస్తున్నా. గత 17 ఏళ్లలో నేను చేసింది 22 సినిమాలే. గతంలో వరుసగా సినిమాలు చేశా. ఇప్పుడు నాకు ఆ తొందర లేదు. సహజమైన కథలు ఉన్న సినిమాలు చేయాలనుకుంటున్నా. ► ‘మళ్ళీ రావా’ తర్వాత రెండు సినిమాలు చేయబోతున్నా. వాటిలో ఒకటి డార్క్ థ్రిల్లర్. మరో సినిమా వివరాలను త్వరలోనే చెబుతా. -
కథ విని షాకయ్యా – సుమంత్
విడిపోయి పదమూడేళ్లు గడిచిన తర్వాత కూడా ప్రత్యేకంగా ఒకరిని గుర్తుపెట్టుకుంటే, ఆ వ్యక్తిపై ప్రేమ అయినా ఉండాలి. ద్వేషం అయినా ఉండాలి. కార్తీక్ కూడా అంజలిని గుర్తుపెట్టుకున్నాడు. మరి ప్రేమతోనా?.. ద్వేషంతోనా? అనేది తెలియాలంటే మా సినిమా చూడాలంటున్నారు కథానాయకుడు సుమంత్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘మళ్ళీ రావా..’. ఆకాంక్షా సింగ్ కథానాయిక. రాహుల్ నక్క నిర్మించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న విడుదల చేయనునున్నారు. తాజాగా చిత్రం ఆడియో టీజర్‌ను రిలీజ్ చేశారు. సుమంత్ మాట్లాడుతూ– ‘‘ఏడాది క్రితం గౌతమ్ చెప్పిన కథ విని షాక్ అయ్యా. కళ్లు మూసుకుని సినిమా చేయవచ్చు అనిపించింది. నేచురల్ లవ్‌స్టోరీ. ‘గోదావరి’ చిత్రం తర్వాత అంత సంతృప్తినిచ్చిన చిత్రమిది’’ అన్నారు. ‘‘కార్తీక్– అంజలిల మధ్య నడిచే లవ్‌స్టోరీ డ్రామానే చిత్రకథ. 30 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేశాం. శ్రవణ్ మంచి సంగీతం ఇచ్చారు’’ అన్నారు దర్శకుడు. ‘‘మంచి అవుట్‌పుట్ వచ్చింది. సుమంత్‌గారు బాగా సపోర్ట్ చేశారు. ఆయనకు థ్యాంక్స్’’ అన్నారు రాహుల్. -
ప్రేమను వెతుక్కుంటూ..!
చిన్ననాటి నుంచి ఆ అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తాడు. అయితే కాలం వాళ్లను విడదీస్తుంది. ప్రేమను వెతుక్కుంటూ అతను పదమూడేళ్ల తర్వాత వెళితే ఆ అమ్మాయి అతన్ని గుర్తుపట్టకుండా వెళ్లిపోతుంది. అసలు వీళ్ల ప్రేమకథ ఏంటి? ఇన్నేళ్లు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అన్న విషయాలను తెలుసుకోవాలంటే ‘మళ్లీ రావా’ సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్, ఆకాంక్షా సింగ్ జంటగా స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్క ఈ చిత్రం నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్‌ను విడుదల చేశారు. గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ–‘‘కథను నమ్మి నాకు దర్శకునిగా అవకాశం ఇచ్చిన రాహుల్‌గారికి, సుమంత్‌గారికి కృతజ్ఞతలు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు.‘‘మా బ్యానర్లో వస్తున్న తొలి చిత్రమిది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు రాహుల్‌యాదవ్. అన్నపూర్ణ, కాదంబరి కిరణ్, మిర్చి కిరణ్, కార్తీక్ అడుసుమిల్లి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్.