ప్రేమను వెతుక్కుంటూ..! | Sumanth"s malli raava movie first look and teaser release today | Sakshi
Sakshi News home page

ప్రేమను వెతుక్కుంటూ..!

Published Fri, Aug 4 2017 11:45 PM | Last Updated on Sun, Sep 17 2017 5:10 PM

ప్రేమను వెతుక్కుంటూ..!

ప్రేమను వెతుక్కుంటూ..!

చిన్ననాటి నుంచి ఆ అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తాడు. అయితే కాలం వాళ్లను విడదీస్తుంది. ప్రేమను వెతుక్కుంటూ  అతను పదమూడేళ్ల తర్వాత వెళితే ఆ అమ్మాయి అతన్ని గుర్తుపట్టకుండా వెళ్లిపోతుంది. అసలు వీళ్ల ప్రేమకథ ఏంటి? ఇన్నేళ్లు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అన్న విషయాలను తెలుసుకోవాలంటే ‘మళ్లీ రావా’ సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి. సుమంత్, ఆకాంక్షా సింగ్‌ జంటగా స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రాహుల్‌ యాదవ్‌ నక్క ఈ చిత్రం నిర్మించారు.

ఈ చిత్రం ఫస్ట్‌ లుక్, టీజర్‌ను విడుదల చేశారు. గౌతమ్‌ తిన్ననూరి మాట్లాడుతూ–‘‘కథను నమ్మి నాకు దర్శకునిగా అవకాశం ఇచ్చిన రాహుల్‌గారికి, సుమంత్‌గారికి కృతజ్ఞతలు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు.‘‘మా బ్యానర్‌లో వస్తున్న తొలి చిత్రమిది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు రాహుల్‌యాదవ్‌. అన్నపూర్ణ, కాదంబరి కిరణ్, మిర్చి కిరణ్, కార్తీక్‌ అడుసుమిల్లి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సతీష్‌ ముత్యాల, సంగీతం: శ్రవణ్‌ భరద్వాజ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement