
మళ్ళీరావా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన ముద్దగుమ్మ ఆకాంక్ష సింగ్. పలు హిందీ సీరియల్స్ లో నటించిన ఆకాంక్ష తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమైంది. హీరోయిన్ గా తొలి సినిమానే ఘనవిజయం సాధించటంతో ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం చిత్రం ప్రమోషన్ లో బిజీగా ఉన్న ఆకాంక్ష తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
తాను పెళ్లయిన తరువాతే నటనను కెరీర్ గాఎంచుకున్నానని తెలిపింది ఆకాంక్ష. ఏడేళ్ల క్రితమే ఆకాంక్షకు పెళ్లైందట. 16 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడిన ఈ భామ 20 ఏళ్లకు పెళ్లి చేసుకుంది. తరువాత భర్త సహకారంలో నటనలో శిక్షణ తీసుకొని యాక్టింగ్ ను కెరీర్ గా ఎంచుకుంది. మళ్ళీరావా సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆకాంక్ష తెలుగు లో బిజీ అవుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment