సరైన హిట్‌లేక సతమతమవుతున్న సుమంత్‌కు మళ్ళీరావా పెద్ద ఊరటనిచ్చింది. ఇలాంటి క్లాస్‌హిట్ తర్వాత సుమంత్ ఆచితూచి కథలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. మళ్ళీరావా ఇచ్చిన ఊపుతో వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు సుమంత్. అయితే తాజాగా మరో సినిమాను ప్రారంభించే పనిలో ఉన్నాడు ఈ హీరో.
లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఈషారెబ్బాను హీరోయిన్‌గా ఎంపిక చేశారని సమాచారం. అమీతుమీ సినిమాలోని నటన, తన అందంతో ఈషాకు తర్వాత అవకాశాలు పెరిగాయి. ఈ భామ రీసెంట్‌గా అ! సినిమాలో నటించింది. ప్రస్తుతం సుమంత్ సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. ఉగాదికి ఈ సినిమాను ప్రారంభించనున్నట్లు తెలస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment