బ్యాక్‌ టు షూట్‌ | Sumanth next movie shooting restarts | Sakshi
Sakshi News home page

బ్యాక్‌ టు షూట్‌

Published Tue, Nov 3 2020 2:56 AM | Last Updated on Tue, Nov 3 2020 2:56 AM

Sumanth next movie shooting restarts - Sakshi

సుమంత్‌ హీరోగా మురళీకృష్ణ దర్శకత్వంలో గుజ్జు రాము సమర్పణలో శర్మ చుక్కా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్‌కి ముందు ఈ చిత్రానికి సంబంధించి ఓ షెడ్యూల్‌ నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మళ్లీ చిత్రీకరణ ప్రారంభించారు. ‘బ్యాక్‌ టు షూట్‌’ అని చిత్రబృందం పేర్కొంది. సుమంత్, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఆద్యంతం ఆసక్తికర కథనంతో, వినోదాత్మక సన్నివేశాలతో సినిమా నడుస్తుందని చిత్రబృందం తెలియజేసింది. త్వరలోనే ఈ చిత్రం టైటిల్‌ని ప్రకటించనున్నారు. సుమంత్‌ సరసన నాయికగా ఐమా నటిస్తోన్న ఈ చిత్రంలో మధునందన్, ధన్‌రాజ్, హైపర్‌ ఆది తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మార్క్‌ కె. రాబిన్, కెమెరా: సిద్ధం మనోహర్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: మాదాల ఝాన్సీకృష్ణ, రమేష్‌ మహేంద్రవాడ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement