
సుమంత్, నందితా శ్వేతా జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘కపటధారి’. జి.ధనుంజయన్ సమర్పణలో లలితా ధనుంజయన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకుడు. సోమవారం ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను, ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి, సినిమా పెద్ద హిట్ కావాలని టీమ్‌కు అభినందనలు తెలిపారు హీరో నాగచైతన్య. పోస్టర్‌పై ఆర్టికల్ 352 అని ప్రత్యేకంగా రాసి ఉంది. అంటే.. ఈ సినిమా ఎమర్జెన్సీ నేపథ్యంలో ఉంటుందని ఊహించుకోవచ్చు. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment