సనావే థామస్–రూపేశ్ జంటకు టైటిల్
కొచ్చి: ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు డబుల్స్ విభాగంలో టైటిల్ లభించింది. ప్లస్ 35 వయో విభాగంలో సనావే థామస్–రూపేశ్ కుమార్ జంట విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన జేబీఎస్ విద్యాధర్ (హైదరాబాద్)–దిజు వలియవిటిల్ (కేరళ) జోడీతో జరిగిన ఫైనల్లో సనావే–రూపేశ్ ద్వయం 21–12తో తొలి గేమ్‌ను గెలిచి, రెండో గేమ్‌ను 17–21తో కోల్పోయింది.
నిర్ణాయక మూడో గేమ్‌లో సనావే–రూపేశ్ జంట 9–7తో ఆధిక్యంలో ఉన్న దశలో విద్యాధర్–దిజు ద్వయం గాయం కారణంగా వైదొలిగింది. ప్లస్ 45 వయో విభాగం ఫైనల్లో శ్రీకాంత్–నవదీప్ జంట 18–21, 21–18, 15–21తో చట్‌చాయ్ బూన్‌మీ–విత్యా పొనోమ్‌చాయ్ (థాయ్‌లాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది. ప్లస్ 40 వయో సింగిల్స్ విభాగం ఫైనల్లో అనీష్ 4–21, 9–21తో హౌసెమరి ఫుజిమోటో చేతిలో ఓడిపోయాడు.