thomas
-
‘చచ్చి’ బతికాడు!
అమెరికాలోని కెంటకీలో థామస్ హోవర్ అనే 36 ఏళ్ల వ్యక్తి డ్రగ్ ఓవర్‌డోస్ వల్ల గుండెపోటుకు గురయ్యాడు. హుటాహుటిన బాప్టిస్ట్ హెల్త్ రిచ్మండ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతనిక బతికి బట్ట కట్టడం కల్లేనని వైద్యులు తేల్చారు. అవయవ దానం చేసి ఉండటంతో ముందుగా గుండెను సేకరించాలని నిర్ణయించారు. ఆపరేషన్ టేబుల్‌పైకి తీసుకెళ్లి సరిగ్గా కత్తులూ, కటార్లకు పని చెప్పబోయే సమయానికి మనవాడు ఉన్నట్టుండి కళ్లు తెరిచాడు! కాళ్లూ చేతులూ కదిలించేందుకు ప్రయతి్నంచాడు. తన పరిస్థితి అర్థమై కన్నీరు పెట్టుకున్నాడు. ఇదంతా చూసి డాక్టర్లంతా దిమ్మెరపోయారు. దాంతో అవయవ సేకరణ ప్రయత్నాలకు స్వస్తి చెప్పారు. ఇది 2021 అక్టోబర్‌లో జరిగితే ఆస్పత్రి వర్గాలు మాత్రం వెలుగులోకి రానివ్వలేదు. కనీసం హూవర్ కుటుంబీకులకు కూడా సమాచరమివ్వలేదు. పైగా అతనిలో కనిపిస్తున్న ప్రాణ లక్షణాలను పట్టించుకోకుండా అవయవాలను సేకరించాల్సిందిగా డాక్టర్లపై ఒత్తిడి తెచ్చాయి. వారు నిరాకరించడంతో వేరే వైద్యులను నియోగిస్తే వాళ్లు కూడా చేతులెత్తేశారు. దీనికి ప్రత్యక్ష సాక్షి అయిన ఆస్పత్రి మాజీ ఉద్యోగి ఒకరు గత జనవరిలో హూవర్ సోదరి డోనాకు విషయం చేరవేయడంతో ఇదంతా వెలుగులోకి వచ్చింది. చివరికి వైద్యుల సలహా మేరకు అతన్ని ఇంటికి తీసుకెళ్లిందామె. హూవర్ బ హుశా ఇంకెంతో కాలం బతక్కపోవచ్చన్న డాక్టర్ల అంచనాలను వమ్ము చేస్తూ సోదరి సంరక్షణలో అతను చాలావరకు కోలుకున్నాడు. ఈ ఉదంతం ఇప్పుడు కెంటకీలో టా కాఫ్ ద టౌన్‌గా మారింది. కెంటకీ అటార్నీ జనరల్ కార్యాలయం దీనిపై విచారణ కూడా జరుపుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విండీస్ క్రికెటర్‌కు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.... ఐదేళ్ల పాటు నిషేధం
వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ డెవాన్ థామస్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బిగ్ షాకిచ్చింది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు థామస్‌పై ఐసీసీ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. శ్రీలంక క్రికెట్ (SLC), ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ECB), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) అవినీతి నిరోధక నిబంధనలను థామస్ ఉల్లంఘించడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. థామస్ కూడా తన నేరాన్ని అంగీకరించినట్లు ఐసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. లంక ప్రీమియిర్ లీగ్ 2021లో ఫిక్సింగ్ పాల్పడ్డాడన్న అభియోగాల నేపథ్యంలో గతేడాది థామస్‌పై ఐసీసీ తాత్కాలికంగా సస్సెన్షన్ వేటు వేసింది. అదే విధంగా యూఏఈ, కరీబియన్ లీగ్‌లో బుకీలు కలిసినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు నేరం రుజువు కావడంతో ఐదేళ్ల పాటు ఎటువంటి క్రికెట్ ఆడకుండా అతడిపై ఐసీసీ బ్యాన్ విధించింది. ఇక విండీస్ తరఫున డెవాన్ ఒక టెస్ట్, 21 వన్డేలు, 12 టీ20లు ఆడాడు. ఇందులో మొత్తంగా 320 పరుగులు, 36 క్యాచ్‌లు, 4 రనౌట్లు, 8 స్టంపింగ్‌లు చేశాడు. టెస్ట్‌ల్లో, వన్డేల్లో బౌలింగ్ సైతం చేసిన థామస్.. ఫార్మాట్‌కు 2 చొప్పున 4 వికెట్లు పడగొట్టాడు. -
అంతరిక్ష పర్యాటకం సాధ్యమే!
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకం సాధ్యమేనని.. మన దేశం పూర్తిస్థాయి దేశీయ పరిశోధనలతో ముందుకు వెళ్తోందని ఇస్రో శాస్త్రవేత్త కల్పన కాళహస్తి, మిస్సైల్ విమెన్ ఆఫ్ ఇండియాగా పేరుపొందిన డీఆర్డీవో శాస్త్రవేత్త టెస్సీ థామస్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ది పార్క్ హోటల్లో ఫిక్కీ ఫ్లో ఆధ్వర్యంలో శుక్రవారం ‘స్టెల్లార్ జరీ్నస్’కార్యక్రమం నిర్వహించారు. ఫిక్కీ చైర్పర్సన్ ప్రియా గజ్దర్.. పలువురు శాస్త్రవేత్తలు, ఫిక్కీ ఆధ్వర్యంలోని 200 మంది మహిళలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెస్సీ థామస్, కల్పన కాళహస్తి తమ అనుభవాలను పంచుకున్నారు. మార్స్‌పైకి మనిషి వెళ్లడం చూడాలి.. సైన్స్‌కు లింగ భేదం లేదని.. డీఆర్డీఓ, ఇస్రో వంటి వేదికల్లో పురుషులు, మహిళలు ఉమ్మడి లక్ష్యం కోసం కలసి పనిచేస్తున్నారని టెస్సీ థామస్ పేర్కొన్నారు. తాను డీఆర్డీఓ వేదికగా పరిశోధన రంగంలోకి అడుగుపెట్టినప్పుడు మహిళలు ఒకట్రెండు శాతమే ఉండేవారని.. ఇప్పుడు 15 శాతం ఉన్నారని తెలిపారు. వినయం, నిబద్ధతను తన గురువు అబ్దుల్ కలాం వద్ద నేర్చుకున్నానని చెప్పారు. దేశ రక్షణ వ్యవస్థ కోసం అగ్ని క్షిపణులను రూపొందించడంలో కృషి తనకు జీవితకాల సంతృప్తిని ఇచి్చందన్నారు. అగి్న–4, అగ్ని–5 క్షిపణుల రూపకల్పనలో దేశీయ సాంకేతికత వాడుతున్నామని వివరించారు.మార్స్‌పైకి మనిíÙని పంపడాన్ని చూడాలనేది తన కోరిక అని చెప్పారు. ఏలియన్స్ లేవని చెప్పలేం..: సాధారణ హాలీవుడ్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ ఖర్చుతో భారత్ మూన్ ల్యాండర్‌ను ప్రయోగించడం దేశ ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్త కల్పన కాళహస్తి తెలిపారు. ‘‘మూన్ ల్యాండర్ 4 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి, అధిక వేగంతో చంద్రుడి సమీపానికి చేరుకుంది. ఆ వేగాన్ని సమర్థవంతంగా నియంత్రించి.. చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ చేయగలిగాం. శక్తివంతమైన భారత పరిశోధనలకు ఇది మంచి ఉదాహరణ. భవిష్యత్‌లో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాం. ప్రయోగాల్లో పూర్తిస్థాయిలో దేశీయ సాంకేతికతను ఉపయోగించనుండటం గర్వకారణం..’’అని చెప్పారు. అంతరిక్ష పర్యాటకం దిశగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయన్నారు. అంగారకుడిపై పరిశోధన కూడా తన కలల ప్రాజెక్టు అని చెప్పారు. ఏలియన్ల గురించి ప్రస్తావిస్తూ.. విశ్వంలో మనకు తెలియని అద్భుతాలెన్నో ఉన్నాయని, అందులో ఏలియన్స్ కూడా భాగం కావొచ్చని పేర్కొన్నారు. -
నాలుగు సార్లు ఎమ్మెల్యే, మాజీ ఆర్ధిక మంత్రి.. ఆయన ఆస్తులెంతో తెలుసా?
తిరువనంతపురం: ఎన్నికల నేపథ్యంలో కేరళ మాజీ ఆర్ధిక శాఖ మంత్రిగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఎల్డిఎఫ్ నేత, పతనంతిట్ట అభ్యర్థి డా. థామస్ ఐజాక్ వార్తల్లో నిలిచారు. అప్పుడప్పుడు అమెరికా పర్యటనలు, డిజైనర్ కుర్తాలంటే ఇష్టపడే థామస్ ఐజాక్ సాధారణ జీవనశైలితో తోటి నేతలకు ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నారు. నిబద్ధత కలిగిన కమ్యూనిస్ట్ నేతగా పేరొందిన థామస్ ఐజాక్ అఫిడవిట్‌ను సమర్పించారు. ఐజాక్ పేరిట రూ. 9.6 లక్షల విలువైన 20,000 పుస్తకాలు తప్ప మరే ఆస్తి లేదని తెలుస్తోంది. అద్దె ఇంట్లోనే బ్యాంక్ సేవింగ్స్‌లో రూ.6,000, సహా వివిధ బ్యాంక్ అకౌంట్లలో రూ.1.31 లక్షల డిపాజిట్లు ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నేత అయినప్పటికీ ఐజాక్ తిరువనంతపురంలో తన సోదరుడి ఇంట్లో అద్దెకి నివసిస్తున్నారు. 10వేల విలువ చేసే షేర్లు పెన్షనర్ల ట్రెజరీ ఖాతాలో రూ.68,000, ఎస్బీఐ సేవింగ్స్ ఖాతాలో రూ.39,000, కేఎస్ఎఫ్ఈ సుగమా ఖాతాలో రూ.36,000 ఉన్నాయి. అంతేకాకుండా, అతను కేఎస్ఎఫ్ఈలో చిట్ ఫండ్‌ను వివిధ వాయిదాలలో మొత్తంగా రూ.77వేలు చెల్లించారు. అదనంగా, మలయాళం కమ్యూనికేషన్స్‌లో రూ.10వేలు విలువ చేసే షేర్లు మాత్రమే ఆయన పేరు ఉండటం గమనార్హం. -
బడ్డింగ్ మెథడ్‌లో గ్రాఫ్టింగ్ చేస్తూ.. పనస వైభవం!
కేరళలోని కొట్టాయంకు చెందిన రైతు వి.ఎ. థామస్ 8 ఏళ్ల క్రితం రబ్బర్ సాగుకు స్వస్తి చెప్పారు. 70 ఏళ్ల వయసులో రసాయనిక వ్యవసాయం వదిలి సేంద్రియ వ్యవసాయం చేపట్టారు. ఇంత వరకే అయితే పెద్ద విశేషం లేదు. కొట్టాయం దగ్గర్లోని చక్కంపుఝ గ్రామంలోని తమ 5 ఎకరాల కుటుంబ క్షేత్రాన్ని 400 రకాల పనస చెట్లతో జీవవైవిధ్యానికి చెరగని చిరునామాగా మార్చారు థామస్. బడ్ గ్రాఫ్టింగ్ లేదా బడ్డింగ్ మెథడ్‌లో గ్రాఫ్టింగ్ చేస్తూ కొత్త రకాలను సృష్టిస్తున్నారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ పనస తొనలను రుచి చూస్తారు. నచ్చిన రకాల మొక్కల్ని వెంట తెచ్చి నాటుకుంటారు. రెండేళ్లు, ఏడాదిన్నరలోనే కాపుకొచ్చే వియత్నాం, కంబోడియాల నుంచి కూడా కొన్ని పనస రకాలను సేకరించారు. మొక్కలతో పాటు ఎండబెట్టిన పనస తొనలను అమ్ముతూ ఎకరానికి ఏటా రూ.4 లక్షల ఆదాయం పొందుతున్నారు. ఎండబెట్టిన పచ్చి పనస కాయలను కిలో రూ. వెయ్యి. ఎండబెట్టిన పనస పండ్లను కిలో రూ. 2 వేలకు అమ్ముతుండటం విశేషం! ఇవి కూడా చదవండి: ‘వ్యవసాయ’ ఉద్గారాలు 31% కాదు.. 60%! -
రూ.రెండొందలు తీసుకో.. ఫొటోకు ఫోజిచ్చుకో..
శ్రీరంగరాజపురం: ‘రూ.రెండు వందలు తీసుకోండి.. ఫొటోకు ఫోజు ఇవ్వండి’ అని గంగాధరనెల్లూరు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి డాక్టర్ థామస్ ప్రజలను అభ్యర్థిస్తున్నారు. మండలంలోని వెంకటాపురం సచివాలయం పరిధిలో పొదలపల్లె దళితవాడలో మీ ఇంటికే మీ థామస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనం లేక వెలవెలబోయింది. ప్రతి ఇంటికీ వెళ్లి రూ.200 ఇచ్చి తన వెంటా నడిస్తే మీకు మరిన్ని డబ్బులు ఇస్తామని చెప్పారు. అయినా జనం రాకపోవడంతో గంగాధరనెల్లూరు మండలంలోని కొండేపల్లెలో తమ గ్రామానికి చెందిన బంధువు అంత్యక్రియలకు వెళుతున్న వారిని పిలిచి రూ.200 తీసుకోండి ఫొటోకు ఫోజు ఇవ్వండి అని చెప్పి వారికి పార్టీ కండువా వేసి పార్టీలో చేరినట్లు ప్రచారం చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమ గ్రామం ఎప్పటికీ వైఎస్సార్సీపీ కంచు కోట అని చెప్పారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుప్పయ్య మాట్లాడుతూ టీడీపీ అధినేతకు తాము ఏ మాత్రం తీసిపోమని అన్నట్లు థామస్ వ్యవహరశైలి ఉందన్నారు. శ్రీరంగరాజపురం మండలం వైఎస్సార్సీపీ పార్టీకి కంచుకోట అని అన్నారు. టీడీపీ ఎన్ని కుప్పి గంతులు వేసిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదన్నారు. -
థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా 2018
‘‘2018’లాంటి అద్భుతమైన సినిమాని థియేటర్స్‌లోనే చూడాలి. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుందని మాట ఇస్తున్నా’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. టొవినో థామస్, కుంచక్కో బోబన్, వినీత్ శ్రీనివాసన్, అసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘2018’. జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వం వహించారు. వేణు కున్నప్పిలి, సీకే పద్మకుమార్, ఆంటో జోసెఫ్ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో కొన్ని ప్రధాన ఏరియాల్లో ‘బన్నీ’ వాసు ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో జూడ్ ఆంటోనీ మాట్లాడుతూ–‘‘కేరళలో 2018లో వచ్చిన వరద బాధితుల్లో నేనూ ఒక్కణ్ణి. ఈ కథని ప్రపంచానికి చెప్పాలనుకుని ‘2018’ తీశాను. భాషతో సంబంధం లేకుండా అందరికీ ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు. -
కాదేదీ బిజినెస్‌కు అనర్హం.. రెంజిని కళాహృదయం నిద్రలేచిన వేళ
‘కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బు బిళ్ల...కావేదీ కవితకనర్హం అన్నారు శ్రీశ్రీ. కుక్కపిల్ల, అగ్గిపుల్లల సంగతేమిటోగానీ వృథాగా పడి ఉన్న ఖాళీ సీసాలు మాత్రం తమ విలువ తెలుసుకోమన్నాయ్! మరి రెంజిని కళాహృదయం ఊరుకుంటుందా! ఎన్నెన్నో కళాకృతులను సృష్టించి పాత వస్తువులకు కొత్త శోభను తీసుకువచ్చింది. తన అభిరుచిని వ్యాపారంగా మలిచి విజయం సాధించింది 35 సంవత్సరాల రెంజిని థామస్....దుబాయ్‌లో ఎం.బి.ఎ. ఫైనాన్స్ చదువుకున్న రెంజిని ఆ రంగంలో కాకుండా మీడియా ఫీల్డ్‌లో పనిచేసింది. 2015లో స్వరాష్ట్రం కేరళకు వచ్చిన రెంజినికి వివాహం అయింది. ‘9 టు 5’ షెడ్యూల్ బోర్ కొట్టడం వల్ల మళ్లీ ఉద్యోగం చేయాలనిపించలేదు. ఖాళీ సమయాన్ని తన ఇష్టమైన పెయింటింగ్‌తో గడిపేది.స్వస్థలం కొచ్చిలో తన పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఆర్ట్ లవర్స్‌తో ఒక కమ్యూనిటీని ఏర్పాటు చేసింది. భర్త కూడా ఆర్టిస్ట్ కావడం వల్ల ఇంటినిండా ఆర్ట్ ముచ్చట్లే! బయటకు వెళ్లినప్పుడు రెంజినికి ఎక్కడ పడితే అక్కడ వృథాగా పడి ఉన్న గాజు సీసాలు కనిపించేవి. భర్త నిర్వహించే ‘సౌండ్ స్టూడియో’కు పాత సంగీత పరికరాలను కొనుగోలు చేయడానికి పాత వస్తువులు అమ్మే ఒక దుకాణానికి వెళ్లింది. అక్కడ వృథాగా పడి ఉన్న ఖాళీ సీసాలు కనిపించాయి. ఆ సమయంలో తనలోని కళాహృదయం నిద్రలేచింది! సీసాలతో పాటు పాత టైర్ రిమ్స్. బకెట్లు, గ్లాసులు.. మొదలైనవి సేకరించడం ప్రారంభించింది రెంజిని. ఒక ఫైన్ మార్నింగ్ వాటితో ఆర్ట్ మొదలుపెట్టింది. వృథా వస్తువులతో కొన్ని హోమ్డేకర్ ఐటమ్స్ తయారుచేసి ఫ్రెండ్స్‌కు బహుమతిగా ఇచ్చింది.‘అద్భుతం’ అనడమేకాదు ‘వీటితో వ్యాపారం చేస్తే బాగుంటుంది’ అని సలహా ఇచ్చారు. వారి సలహాతో ఆన్–డిమాండ్ ఆర్డర్స్ కోసం డెకరేషన్ ఐటమ్స్ తయారీ మొదలుపెట్టింది. వివిధ రూపాల్లో ఆర్ట్ కోసం ఖర్చుపెట్టడం తప్ప ఆర్ట్ ద్వారా డబ్బు సంపాదించడం తనకు ఇదే తొలిసారి! పర్యావరణం కోసం పనిచేస్తున్న ‘క్లైమెట్ కలెక్టివ్’ అనే స్వచ్ఛందసంస్థ మహిళా వ్యాపారుల కోసం ‘క్లైమెట్ ఛేంజింగ్ కాంపిటీషన్’ నిర్వహించింది. రెంజిని తయారుచేసిన కళాకృతులను చూసి ‘క్లైమెట్ కలెక్టివ్’ నిర్వాహకులు ప్రశంసించారు. మరిన్ని కళాకృతులు తయారు చేయాల్సిందిగా కోరారు. రెంజిని ఈ పోటీలో సెమీ–ఫైనల్స్ వరకు వెళ్లింది. ఐఐఎం–బెంగళూరు స్టార్టప్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన రెంజిని అక్కడ ఎన్నో విషయాలు తెలుసుకుంది. అప్ సైకిల్డ్ ప్రాడక్ట్స్‌కు మంచి డిమాండ్ ఉన్న విషయం తనకు అర్థమైంది. ఈ ఉత్సాహంతో ‘వాపసీ’ పేరుతో ఆన్లైన్లో డెకరేషన్ స్టోర్ ప్రారంభించింది. ఇందులో గ్లాస్ బాటిల్స్, కొబ్బరి చిప్పలు, రకరకాల పాతవస్తువులతో తయారు చేసిన 21,000 హోమ్డెకరేషన్ ఐటమ్స్ కనువిందు చేస్తాయి. గ్లాస్ వర్క్ అనేది కత్తి మీద సాములాంటిది. బోలెడు ఓపిక ఉండాలి. చిన్న తప్పు దొర్లినా గ్లాస్ పాడై పోతుంది. తాను చేసిన తప్పులతోనే ఎన్నో పాఠాలు నేర్చుకుంది రెంజిని. ‘మొదట్లో నా వర్క్స్‌పై నాకు అంతగా ఆత్మవిశ్వాసం ఉండేది కాదు. అయితే ఐఐఎం–బెంగళూరు పాఠాలతో నాపై నాకు ఆత్మవిశ్వాసం ఏర్పడింది’ అంటున్న రెంజిని థామస్ భవిష్యత్‌లో మరిన్ని పర్యావరణ హిత కళాకృతులను తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. -
Thomas Lee: ప్రముఖ బిలియనీర్, ఫైనాన్షియర్ ఆత్మహత్య
అమెరికన్ బిలియనీర్, ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడి, పరపతి కొనుగోళ్లలో అగ్రగామిగా పేరుగాంచిన థామస్ లీ ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం (ఫిబ్రవరి 23) తన మాన్‌హట్టన్ కార్యాలయంలో 78 ఏళ్ల వయస్సులో థామస్ లీ ఆత్మహత్య చేసుకున్నట్లు న్యూయార్క్ పోస్ట్ కథనం పేర్కొంది. ఫిఫ్త్ అవెన్యూ మాన్‌హట్టన్‌లోని తన ప్రధాన కార్యాలయం థామస్‌లీ చనిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. తనను తాను తుపాకీ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయన్ను రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అయితే ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. లీ ఈక్విటీ సంస్థకు చైర్మన్ అయిన థామస్‌లీ ఆ సంస్థను 2006లో స్థాపించారు. అలాగే 1974లో స్థాపించిన థామస్ హెచ్ లీ పార్ట్నర్స్ సంస్థకు గతంలో చైర్మన్‌గా, సీఈవోగా పనిచేశారు. ది లింకన్ సెంటర్, ది మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్, హార్వర్డ్ యూనివర్సిటీ, బ్రాండీస్ విశ్వవిద్యాలయం, మ్యూజియం ఆఫ్ జ్యూయిష్ హెరిటేజ్ వంటి వాటిలో ట్రస్టీగా, బోర్డ్ సభ్యుడిగా సేవలు అందించారు. (ఇదీ చదవండి: ఇంకెన్నాళ్లు వెయిట్ చేయిస్తారు..? ఐటీ కంపెనీ ఫ్రెషర్ల ఆవేదన) థామస్‌లీ గత 46 సంవత్సరాలుగా వార్నర్ మ్యూజిక్ స్నాపిల్ బెవరేజెస్ వంటి ప్రసిద్ధ బ్రాండ్ల కొనుగోలు, ఆ తర్వాత అమ్మకాలతో సహా వందలాది డీల్స్‌లో 15 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా పెట్టుబడులు పెట్టారు. (ఇదీ చదవండి: అతిగా ఫోన్ వాడుతున్నారా.. ఈమెకు జరిగిందే మీకూ జరగొచ్చు!) -
‘పీఎం కేర్స్’ ట్రస్టీలుగా రతన్ టాటా, సుప్రీం మాజీ జడ్జి
సాక్షి, న్యూఢిల్లీ: పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీలుగా పలువురు ప్రముఖల పేర్లను నామినేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అందులో.. ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్, లోక్‌సభ మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండా సహా పలువురు ఉన్నారు. ఈ మేరకు బుధవారం అధికారిక ప్రకటన చేసింది కేంద్రం. కొత్తగా నియామకమైన సభ్యులతో సహా పీఎం కేర్స్ ఫండ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమైన మరుసటి రోజునే ఈ ప్రకటన వెలువడింది. ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ‘పీఎం కేర్స్ ఫండ్‌లో అంతర్గతంగా భాగమైనందుకు ట్రస్టీలను ప్రధాని మోదీ స్వాగతించారు.’ అని ఓ ప్రకటన చేసింది ప్రధాని కార్యాలయం. ఇతర ట్రస్టీల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షాలు ఉన్నారు. మరోవైపు.. పీఎం కేర్స్ ఫండ్ సలహాదారుల బోర్డుకు కాగ్ మాజీ అధికారి రాజీవ్ మెహ్రిషి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ ఛైర్పర్సన్ సుధా మూర్తి, టీచ్ ఫర్ ఇండియా సహ వ్యవస్థాపకులు ఆనంద్ షాలను నామినేట్ చేసింది కేంద్రం. దేశంలో కరోనా మహమ్మారి విజృంభించిన క్రమంలో అత్యవసర సహాయ చర్యల కోసం 2020లో పీఎం కేర్స్ ఫండ్ ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని ఎక్స్ అఫీసియో ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. పీఎం కేర్స్‌కు విరాళాలు ఇచ్చిన వారందరికీ పన్ను మినహాయింపు వర్తింపుజేశారు. అలాగే.. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు గత ఏడాది మే 29న పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రెన్ ఫండ్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 4వేలకుపైగా చిన్నారుకు ఈ నిధి ద్వారా సాయం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇదీ చదవండి: పీఎం కేర్స్‌కు 4,345 మంది ఎంపిక -
చైతన్య భారతి: టెస్సీ థామస్ / 1963 అగ్ని పుత్రిక
భువనేశ్వర్. జనవరి 3 మంగళవారం 2012. కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ యూనివర్శిటీ క్యాంపస్. భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మాట్లాడుతున్నారు. పదిహేనువేల మంది సైంటిస్టులు, ఇరవై మంది నోబెల్ గ్రహీతలు, ఐదొందల మంది విదేశీ ప్రతినిధులు, లక్షమంది యువకులు, యువతులు శ్రద్ధగా వింటున్నారు. తొంభై తొమ్మిదవ ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ మొదలైన రోజది! సైన్స్ అండ్ టెక్నాలజీలో మనమింకా ఎంతో సాధించాలని అంటున్నారు మన్మోహన్. అంటూ అంటూ... సడెన్‌గా... మిస్సయిల్ ఉమన్ టెస్సీ థామస్‌ను మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని అన్నారు. సదస్సు ఒక్కసారిగా బర్త్‌డే బెలూన్లా పేలింది. హర్షధ్వానాలు చెమ్కీ ముక్కలై గాల్లో తేలాయి! టెస్సీ థామస్ వంటి కృతనిశ్చయం గల మహిళలు మన అమ్ముల పొదిలో ఉంటే భారత్ ఇలాంటి అగ్నులు ఎన్నింటినైనా అలవోకగా కురిపించగలదనే భావం మన్మోహన్ మాటల్లో ధ్వనించింది. టెస్సీ... అగ్ని ప్రాజెక్టుకు డైరెక్టర్! ఈ అగ్నిపుత్రికకు ఇన్స్పిరేషన్... తుంబా. కేరళ రాజధాని తిరువనంతపురానికి శివార్లలో ఉన్న అరేబియా తీర ప్రాంత గ్రామం ‘తుంబా’కు, టెస్సీ చదువుకున్న తీరప్రాంత పట్టణం అలప్పుళకు మధ్య కొన్ని వందల కి.మీ. దూరం ఉన్నప్పటికీ, ఆ దూరాన్ని ఇప్పుడు మనం... పన్నెండేళ్ల వయసులో టెస్సీ ఏర్పరచుకున్న జీవిత ధ్యేయంతో మాత్రమే కొలవాలి! టెస్సీకి ఇన్స్పిరేషన్ మనుషుల నుంచి రాలేదు. తుంబాలో ఆనాడు తను చూసిన రాకెట్ ఎగిరే ప్రదేశం నుంచి వచ్చింది. సాదా సీదా చీరలో, చిరునవ్వుతో కనిపించే టెస్సీతో రెండు నిమిషాలు మాట్లాడితే చాలు తక్షణ శక్తిలా ఆడపిల్లలకు తక్షణ ఆత్మవిశ్వాసం కలుగుతుంది. భవిష్యత్తుపై కొత్త ఆశతో వారి కళ్లు మెరుస్తాయి. ఏదైనా సాధించగలను అన్న ధీమా వస్తుంది! 1988లో పుణె నుంచి హైదరాబాద్‌లోని అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లేబరేటరీకి బదలీ అయిన కొత్తల్లో ప్రాజెక్టు డైరెక్టర్ ఎ.పి.జె. కలామ్ ఇదే విధమైన ధీమాను, అత్మవిశ్వాన్ని టెస్సీలో కలిగించారు. ఆమె ప్రావీణ్యాలను మలిచిన మరో గురువు అవినాశ్ చందర్. అనతికాలంలోనే ఈ శిష్యురాలు తన గురువులిద్దరి ప్రఖ్యాతిని, డి.ఆర్.డి.ఓ. ప్రతిష్టను నిలబెట్టగలిగారు. (చదవండి: ఎస్. త్రిపాఠీ నిరాలా / 1897–1961 కాలాతీత కవి) -
పెరరివాళన్.. ఇప్పటికే ఆలస్యమైంది.. పెళ్లి చేసుకో
చెన్నై: సుదీర్ఘ కారాగారవాసం తర్వాత జీవితఖైదీ ఏజీ పెరరివాళన్ జైలు నుంచి విడుదలయ్యారు. సర్వోన్నత న్యాయస్థానం సంచలన ఆదేశాలతో ఆయనకు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. జైలు నుంచి విడుదలైన పెరరివాళన్‌ను తాను కలవాలనుకుంటున్నట్టు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ చెప్పారు. అతడు సాధారణ జీవితం గడపాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. 1999లో ఏజీ పెరరివాళన్‌కు మరణశిక్ష విధించిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి జస్టిస్ కేటీ థామస్ నేతృత్వం వహించారు. ‘పెరరివాళన్‌ను నేను చూడాలనుకుంటున్నాను. మీకు సమయం దొరికితే, దయచేసి నన్ను కలవండి’ అంటూ కేరళలోని కొట్టాయంలో ఉన్న తన నివాసం నుంచి ఆయన ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’తో మాట్లాడారు. ‘సుదీర్ఘ కారాగారవాసం తర్వాత 50 సంవత్సరాల వయస్సులో జైలు నుంచి విడుదలైన అతడితో నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. అతను త్వరలో పెళ్లి చేసుకోవాలి. ఇప్పటికే ఆలస్యమైంది. ఇప్పటివరకు తల్లిదండ్రుల ప్రేమను మాత్రమే పొందాడు. వైవాహిక జీవితాన్ని అతడు గడపలేదు. తన ప్రియమైన వారితో అతడు సంతోషంగా జీవించాలి. పెరరివాళన్‌ను జైలు నుంచి బయటకు తీసువచ్చిన ఘనత అతడి తల్లి (అర్పుతం అమ్మాల్)కి దక్కుతుంది. ఈ ఘనతకు ఆమె సంపూర్ణంగా అర్హురాల’ని జస్టిస్ కేటీ థామస్ పేర్కొన్నారు. (చదవండి: ఇది అమ్మ విజయం, పెరారివాలన్ భావోద్వేగం) రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులకు 23 ఏళ్ల తర్వాత మరణశిక్ష అమలు చేయాలన్న నిర్ణయాన్ని 2013లో జస్టిస్ కేటీ థామస్ వ్యతిరేకించారు. దీంతో 2014లో ముగ్గురు దోషుల మరణశిక్షలను మారుస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సుదీర్ఘ కాలం పాటు జైలు జీవితం గడిపిన వారిని ఉరితీయడం అంటే ఒక నేరానికి రెండు శిక్షలు అమలు చేసినట్టు అవుతుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన గట్టిగా వాదించారు. అంతేకాదు దోషుల పట్ల ఉదారత చూపాలని అప్పట్లో సోనియా గాంధీని వేడుకున్నారు. దోషులను విడుదల చేయాలన్న తమిళనాడు మంత్రివర్గ ప్రతిపాదనను గవర్నర్ పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టారు. యావజ్జీవ కారాగార శిక్ష మొత్తం జీవితకాలానికి సంబంధించిదైనప్పటికీ.. భారత రాజ్యాంగం ఉపశమనాన్ని అనుమతిస్తుంది అని జస్టిస్ థామస్ అన్నారు. మహాత్మా గాంధీ హత్య కేసులో గోపాల్ గాడ్సేకు 14 సంవత్సరాల తర్వాత ఉపశమనం లభించిందని.. అతనితో పాటు జీవిత ఖైదులో ఉన్న ఇతర దోషులందరినీ కూడా విడుదల చేశారని గుర్తు చేశారు. ‘జైలు నుంచి విడుదలైన తర్వాత గోపాల్ గాడ్సే జీవితాన్ని చూడండి. అతడు పూర్తిగా మారిపోయాడు. పుస్తకాలు కూడా రాశాడు. మహాత్మా గాంధీ హంతకులను విడుదల చేసి.. వారిలో పరివర్తన తేవడానికి అనుమతించారు. మరి రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులను ఎందుకు సంస్కరించకూడద’ని థామస్ ప్రశ్నించారు. పెరరివాళన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును మిగిలిన ఆరుగురు దోషులకు కూడా వర్తింపజేయాలని అన్నారు. (చదవండి: పెరరివాళన్ పెళ్లి ఏర్పాట్లు షురూ) -
భార్యాబిడ్డలు
థామస్ చెరియన్, కృష్ణ భగవాన్ ఇద్దరే ఉన్నారు ఆ గదిలో. అది భగవాన్ ఇల్లు. ఇంట్లో భగవాన్ గది. గది మధ్యలో ఖరీదైన పెద్ద సోఫా ఉంటుంది. ఆ సోఫా ఎదురుగా అంతే ఖరీదైన నాలుౖVð దు కుషన్ ఛైర్లు ఉంటాయి. భగవాన్ కోసం వచ్చే ఖరీదైన మనుషుల కోసం ఏర్పాటు చేసినవి అవి.థామస్ చెరియన్ ఖరీదైన వాడేం కాదు. నికార్సైనవాడు. నికార్సైనవాడు కాబట్టే నేరుగా భగవాన్ గదిలోకి వచ్చి కూర్చున్నాడు. భగవాన్ కూర్చోమనలేదు. కానీ చెరియన్ కూర్చున్నాడు! చెరియన్ వచ్చేటప్పటికి భగవాన్ తెల్లటి పంచె, తెల్లటి లాల్చీలో సోఫాపైన వెల్లకిలా పడుకుని రిలాక్స్డ్గా సీలింగ్ వైపు చూస్తూ ఉన్నాడు. ‘‘భగవాన్.. నువ్వు తెలివైనవాడివి కావచ్చు. నీ తెలివితేటలు నీ భార్యాబిడ్డలకు ఉపయోగపడినంత వరకు ఎవరికేం అభ్యంతరం ఉండదు. అయితే నీకొక్కడికే భార్యాబిడ్డలు ఉంటారనుకుంటునట్లు న్నావ్’’ అన్నాడు చెరియన్. మెల్లిగా సోఫాలోంచి లేచి కూర్చుని, కాలు మీద కాలు వేసుకున్నాడు భగవాన్. సోఫాలో తల పక్కనే పెట్టుకుని ఉన్న గన్ని తీసి పంచె కొసతో మృదువుగా తుడిచాడు. తన చేతిలో గన్ని చూశాక, చెరియన్ ఇంకొక్క మాట కూడా మాట్లాడడనే అనుకున్నాడు భగవాన్. కానీ చెరియన్ మాట్లాడాడు!‘‘భగవాన్.. నేనేం అన్యాయంగా అడగడం లేదు. నాకు రావలసింది నాకు ఇచ్చెయ్. ‘ఇంకో డీల్ చెయ్యి, రెండూ కలిపి ఇస్తాం’ అంటున్నారు మీ వాళ్లు. రోజు కూలీ లాంటి వాణ్ణి నేను. ఎప్పటిదప్పుడే ఇవ్వకపోతే శాటిస్ఫై కాను’’ అన్నాడు చెరియన్. ‘‘కోటి రూపాయల సెటిల్మెంట్ హైదరాబాద్‌లో చిల్లర సంగతి చెరియన్. అందులో నీ లక్ష ఇంకా చిల్లర. చిల్లర విషయాలు డీల్ చెయ్యడానికి నా దగ్గర తెలివైనవాళ్లు లక్షల్లో ఉన్నారు. నువ్వు నా వరకు రావడమే వింతగా ఉంది’’ అన్నాడు భగవాన్.‘‘నీ దగ్గరి తెలివైనవాళ్లకు తెలివి ఎక్కువైంది భగవాన్. నెల రోజుల నుంచీ తిరుగుతున్నాను. ముందు ఇస్తామని ఒప్పుకుని, తర్వాత ‘నువ్వు చేసిందేమీ లేదు’ అంటున్నారు.’’ ‘‘నాతోనూ అన్నారు.. ఈ సెటిల్మెంట్లో నువ్వు చేసిందేమీ లేదని. ఎవరిదో ఫోన్ నెంబరు ఇచ్చావట. అంతేగా! ‘దానికి లక్షేమిటి?’ అంటున్నారు’’ అన్నాడు భగవాన్. అతడి పంచె ఇప్పుడు గన్ ట్రిగ్గర్‌ని తుడుస్తోంది. ‘‘నేను ఎంత చేశాను అని కాదు భగవాన్. నా పేరు నీ దాకా వచ్చిందంటే నేను చెయ్యాల్సిందే చేశాననే కదా..’’ భగవాన్ విసుగ్గా చూశాడు. ‘‘వెళ్లు చెరియన్. నా చేతుల్తో ఇప్పుడు నీకు లక్ష ఇచ్చానంటే.. నా సిస్టమ్‌ని నేనే దెబ్బతీసినట్లు. నీకు న్యాయం జరిగినా, అన్యాయం జరిగినా.. జరగాల్సిందే జరుగుతుంది. వెళ్లు’’ అన్నాడు. ‘‘వెళ్లడానికి రాలేదు భగవాన్. తీసుకెళ్లడానికే వచ్చాను’’ అన్నాడు చెరియన్. భగవాన్‌కి తిక్కరేగింది. గన్ని పొజిషన్లోకి తీసుకున్నాడు. టప్.. టప్.. రెండు బులెట్లు దిగాయి. అయితే దిగింది భగవాన్ గుండెల్లోకి. సోఫాలోనే అతడు ఒరిగిపోయాడు. అరుపులు బయటికి వినిపించే గది కాదు అది. పోలీసు కుక్కలు వాసనపట్టే గది కూడా కాదు. తుపాకీని జేబులో పెట్టుకుని పైకి లేచాడు చెరియన్. భగవాన్‌కి దగ్గరగా వెళ్లి చూశాడు. చచ్చిపోయాడు. భగవాన్ గన్ భగవాన్ చేతిలోనే ఉంది. ఎవర్నో కాల్చబోతే ఎవరో కాల్చేశారు అన్నంత వరకు మొదట అర్థమైపోతుంది పోలీసులకు. ఆ గదిలో డబ్బు కోసం వెదికే అవసరం లేకపోయింది చెరియన్‌కి. సోఫాల వెనుక వరుసగా బస్తాలు పేర్చి ఉన్నాయి. ఒక బస్తా ఓపన్ చేశాడు. రెండువేల నోట్ల కట్టలు. వాటిని వదిలేశాడు. ఇంకో బస్తా తెరిచాడు. ఐదొందల నోట్ల కట్టలు. వాటిల్లోంచి రెండు కట్టలు తీసుకుని నడుము దగ్గర ప్యాంటు లోపలకి దోపుకున్నాడు. ‘‘ఏంటలా ఉన్నారు?’’ ఇంట్లోకి రాగానే అడిగింది చెరియన్ భార్య.‘‘పని ఎక్కువగా ఉంది’’ అని తన గదిలోకి, అక్కడి నుంచి స్నానానికి వెళ్లిపోయాడు చెరియన్. పిల్లలిద్దరూ నిద్రపోయారు. రాత్రి పన్నెండు కావస్తోంది. ‘‘భోజనం వడ్డించాను. రండి’’ అంది భార్య. ‘‘ఊరెళ్లాలి అంటున్నావ్ కదా. రేపు వెళ్తారా నువ్వూ, పిల్లలు’’ అన్నాడు భోం చేస్తూ. ‘‘రేపా! ఒక్క రోజులో అన్నీ సర్దుకోలేనండీ ’’ అంది భార్య.‘‘సరే.. ’’ అన్నాడు. ‘‘నిద్రొస్తోంది. వెళ్లి పడుకుంటాను’’ అందామె.. భర్త భోజనం పూర్తయ్యాక. తర్వాత తనూ వెళ్లి పడుకున్నాడు. పడుకున్నాడే కానీ నిద్ర పట్టలేదు. అతడి కళ్లల్లో భగవాన్ మెదులుతున్నాడు. టక్.. టక్.. టక్.. ఎవరో తలుపు తడుతున్నారు. టైమ్ చూశాడు చెరియన్. ఒంటి గంట దాటుతోంది. టక్ టక్.. టక్ టక్.. టక్.. తలుపు చప్పుడు ఎక్కువైంది. కనీసం ఉదయం వరకైనా పోలీసులు తనకు టైమ్ ఇస్తారనుకున్నాడు!లేదా.. భగవాన్ మనుషులు అయి ఉంటారు.మెల్లిగా పైకి లేచి, రివాల్వర్ తీసుకున్నాడు. తలుపు దగ్గరకు వెళ్లి ఒక్క క్షణం ఆగి, తలుపు తెరిచాడు. ఒక్కసారిగా షాక్ తిన్నాడు.ఎదురుగా.. భ.. గ.. వా.. న్!!!‘‘ప్ఛ్.. తొందరపడ్డావు చెరియన్’’ అన్నాడు భగవాన్. ‘‘నేను తొందరపడ్డం కాదు భగవాన్. నువ్వే ఆలస్యం చేశావ్.. నా డబ్బు నాకు ఇవ్వకుండా..’’అన్నాడు ధైర్యం తెచ్చుకుని.ఒక మనిషి ఇంకో మనిషితో మాట్లాడుతున్నట్లుగానే ఉంది వాళ్ల సంభాషణ.‘‘దేవుడితో పోరాడుతూ నీ దగ్గరికి వచ్చాను చెరియన్. ఇదిగో, నీ ఉంగరం. నన్ను షూట్ చేస్తున్నప్పుడు పడిపోయింది. ఉంగరం మీద జీసెస్ ఉన్నాడు కదా... పట్టుకోలేకపోయాను. పైన పేరు వేయించుకున్నావ్. ఈజీగా దొరికిపోయేవాడివి. అందుకే ఎవరికీ దొరక్కుండా తెచ్చేశాను’’ అన్నాడు భగవాన్. తన వేళ్ల వైపు చూసుకున్నాడు చెరియన్. నిజమే. ఉంగరం పడిపోయింది! ‘‘ఒకటి కనుక్కున్నాను చెరియన్’’ అన్నాడు భగవాన్.. ఉంగరం ఇచ్చేశాక కూడా అక్కడి నుంచి కదలకుండా! మానవజన్మపై ప్రీతి అతడిని వదులుతున్నట్లు లేదు. ‘‘మనం తొందరపడినా, ఆలస్యం చేసినా.. బతుకును మాత్రం కోల్పోకూడదు.. కనీసం భార్యాబిడ్డల కోసమైనా. ఆ విషయం నాకు చనిపోయాక తెలిసింది’’ అని గాలిలోకి లేచాడు భగవాన్. లోపలికొచ్చాడు చెరియన్. భార్యాబిడ్డలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అవతలి వైపు భార్యాబిడ్డలు గుర్తొచ్చారు అతడికి. - మాధవ్ శింగరాజు -
తండ్రి గ్లౌవ్స్... తనయుడి పంచ్
గోల్డ్‌కోస్ట్: అమెచ్యూర్ బాక్సర్ అయిన తండ్రి కెరీర్ చేయి విరగడంతో అర్ధాంతరంగా ముగిసింది. కానీ... తనయుడి కెరీర్ ఆరంభంలోనే సూపర్ హిట్టయింది. కెనడాకు చెందిన 20 ఏళ్ల థామస్ బ్లుమెన్ఫీల్డ్కు నాన్న బాబ్ అంటే ప్రాణం. ఆయన్నే ఫాలో అయ్యేవాడు. తన తండ్రి బాక్సింగ్ గ్లౌవ్స్‌కు ఇచ్చే విలువేంటో తెలుసుకున్న థామస్ అవే బాక్సింగ్ గ్లౌవ్స్ (తండ్రి గ్లౌవ్స్‌ను తను 8 ఏళ్ల వయస్సప్పుడు దాచిపెట్టుకున్నాడు)తో ఇప్పుడు గోల్డ్‌కోస్ట్‌లో పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. లైట్ వెల్టర్ వెయిట్లో ఫైనల్ చేరిన అతను ఇప్పుడు స్వర్ణం వేటలో ఉన్నాడు. ఆసీస్‌లో కొడుకు వెన్నంటే లేకపోయినప్పటికీ బాబ్ టీవీల్లో తనయుడి విజయాన్ని తనివితీరా ఆస్వాదించి ఉంటారు. తన విజయంపై థామస్ మాట్లాడుతూ ‘నాకు బాక్సింగ్ కంటే నాన్నంటేనే ఇష్టం. ఆయన బాక్సింగ్ కాకుండా టెన్నిస్, టేబుల్ టెన్నిస్ ఏది ఆడినా నేను దాన్నే అనుసరించేవాణ్ని’ అని అన్నాడు. -
ఐ లవ్ యు మమ్మీ...
బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుందంటారు.. అది మనుషులకైనా.. పశుపక్ష్యాదులకైనా.. అమ్మ అంతే.. అలాగే ఉంటుంది.. ఇంతకీ విషయమేమిటంటే.. ఇక్కడుందే ఈ బుల్లి బ్లాక్ స్కిమ్మర్ పక్షి.. పుట్టి రెండ్రోజులే అయింది.. ఇంట్లోని మిగతా పిల్లలు దీని కన్నా పెద్దవి.. దీంతో అమ్మ రోజూ తెచ్చి పెడుతున్న చేప ముక్కలను దీని దగ్గర్నుంచి లాగేసుకుని.. అవే తినేస్తున్నాయి. పెద్దవి కావడంతో దాదాగిరి కూడా చేస్తున్నాయి.. చాలా చిన్నది కదా.. మరి అమ్మకెలా చెప్పడం.. ఆకలి ఎలా తీర్చుకోవడం.. అయితే.. బిడ్డ ఆకలి గురించి అమ్మకు ఎవరైనా చెప్పాలా.. అమ్మ ఓ కంట కనిపెడుతూనే ఉంది. అందుకే ఈ రోజు చేప ముక్క తెచ్చి.. మిగతావాటికి పెట్టకుండా.. ముందుగా దీనికే పెట్టింది.. అంతే.. అమ్మకు.. ఐ లవ్ యూ చెప్పాలనుకుందో.. థాంక్యూ అనాలనుకుందో తెలియదు గానీ.. ఇలా వెంటనే వచ్చి.. తల్లిని వాటేసుకుంది.. ఈ చిత్రాన్ని ఫ్లోరిడాకు చెందిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ థామస్ చాడ్విక్ తీశారు. ఆయన కొన్ని రోజులుగా ఓ బ్లాక్ స్కిమ్మర్ బర్డ్ కుటుంబాన్ని గమనిస్తూ ఉన్నారట. తల్లి పక్షి.. చేప ముక్క ముందుగా దీనికి పెట్టగానే.. వెంటనే అదిలా ప్రతిస్పందించిందని ఆయన తెలిపారు. -
సనావే థామస్–రూపేశ్ జంటకు టైటిల్
కొచ్చి: ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు డబుల్స్ విభాగంలో టైటిల్ లభించింది. ప్లస్ 35 వయో విభాగంలో సనావే థామస్–రూపేశ్ కుమార్ జంట విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన జేబీఎస్ విద్యాధర్ (హైదరాబాద్)–దిజు వలియవిటిల్ (కేరళ) జోడీతో జరిగిన ఫైనల్లో సనావే–రూపేశ్ ద్వయం 21–12తో తొలి గేమ్‌ను గెలిచి, రెండో గేమ్‌ను 17–21తో కోల్పోయింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సనావే–రూపేశ్ జంట 9–7తో ఆధిక్యంలో ఉన్న దశలో విద్యాధర్–దిజు ద్వయం గాయం కారణంగా వైదొలిగింది. ప్లస్ 45 వయో విభాగం ఫైనల్లో శ్రీకాంత్–నవదీప్ జంట 18–21, 21–18, 15–21తో చట్‌చాయ్ బూన్మీ–విత్యా పొనోమ్చాయ్ (థాయ్‌లాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది. ప్లస్ 40 వయో సింగిల్స్ విభాగం ఫైనల్లో అనీష్ 4–21, 9–21తో హౌసెమరి ఫుజిమోటో చేతిలో ఓడిపోయాడు. -
ఎక్కువగా ఏసీని వాడుతున్నారని..
ఆంగ్మలీ: ఏసీని ఎక్కువగా ఉపయోగిస్తున్నారనే కారణంతో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి.. భార్య, కొడుకుతో గొడవపడి వారిని చంపేశాడు. ఏసీ ఆన్ చేసుకుని నిద్రపోతున్న భార్య, కొడుకును చూసి ఆవేశాన్ని అణుచుకోలేక పోయిన 81 ఏళ్ల పాల్ వారిద్దరినీ ఇనుప రాడ్డుతో కొట్టాడు. కొడుకు థామస్ అక్కడిక్కడే మరణించగా, భార్య మేరీ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయినట్టు పోలీసులు చెప్పారు. కేరళలోని ఆంగ్మలీలో ఈ ఘటన జరిగింది. తల్లి, బిడ్డలను రాడ్‌తో కొట్టిన తర్వాత బంధువులకు ఫోన్ చేసి పాల్ జరిగిన విషయం చెప్పాడు. అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసినా వృద్ధాప్యం కారణంగా చేసుకోలేకపోయాడు. గత కొద్ది రోజులుగా తన కుటుంబ సభ్యులు ఏసీని ఎక్కువగా వాడుతున్నారని, దీనివల్ల కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని, కేవలం పెన్షన్‌తో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టమవుతోందని, అందుకే వారిని చంపినట్లు పాల్ పోలీసుల విచారణలో తెలిపాడు. -
ఆంధ్రా అబ్బాయి, అమెరికా అమ్మాయి
పూతలపట్టు : ఆంధ్రా అబ్బాయి, అమెరికా అమ్మాయి శుక్రవారం కాణిపాకంలో ఒకటయ్యారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు లేరు. అయినా ఆమెను వివాహమాడి పలువురికి స్ఫూర్తిగా నిలిచాడు అబ్బాయి. పూతలపట్టు మండలం గోపాలకృష్ణాపురం గ్రామానికి చెందిన గోవిందశెట్టి చిన్న కుమారుడు ఇంద్రశేఖర్ సేలంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తిచేశాడు. బెంగళూరులోని నార్వీ విజన్ కంపెనీలో పనిచేస్తూ ఐదేళ్ల కిందట సౌత్ అమెరికా వెళ్లాడు. అక్కడ అదే కంపెనీలో ఏడాది క్రితం అమెరికాలోని లియానా స్టేట్‌కు చెందిన లూజ్మిలా థామస్ కూడా చేరింది. పరిచయమేర్పడింది. అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అమ్మాయి కుటుంబ పరిస్థితులను ఇంద్రశేఖర్‌కు వివరించింది. ఆమె తల్లిదండ్రులు జార్జ్, జూలియానా చనిపోయినా ఆమె అన్న వీరి పెళ్లికి అంగీకరించారు. శుక్రవారం ఉదయం కాణిపాకం ఆలయం వద్ద ఓ కల్యాణ మండపంలో వివాహం చేసుకున్నారు. -
యువతే దేశానికి భవిత
ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత యూనివర్సిటీలదే మహిళా వర్సిటీ స్నాతకోత్సవంలో డీఆర్డీవో శాస్త్రవేత్త టెస్సీ థామస్ యూనివర్సిటీక్యాంపస్ : ‘‘మన దేశ జనాభాలో 60 శాతం యువత ఉంది. వీరిని అన్ని విధాలా తీర్చిదిద్ది దేశానికి ఉపయోగపడేలా చేయాల్సిన బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉంది’’ డీఆర్డీవో శాస్త్రవేత్త టెస్సీ థామస్ అన్నారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించిన స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ స్వీకరించారు. అనంతరం ఆమె స్నాతకోపన్యాసం చేశారు. ప్రస్తుత సమాజంలో మహిళ ప్రాత మారిందన్నారు. వంట, ఇంటి శుభ్రత, పిల్లల సంరక్షణకు ఇప్పటికి దాకా పరిమితమైన సంప్రదాయ మహిళ.. ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తోందన్నారు. సాంస్కృతిక, రాజకీయ, క్రీడా, కార్పొరేట్, తదితర ఏ రంగాలోనైనా సవాల్‌ను స్వీకరించడానికి మహిళలు సిద్ధంగా వున్నారని చెప్పారు. మహిళలను చక్కగా తీర్చిదిద్దితే ఏ రంగంలోనైనా రాణించగలరని ఆధునిక మహిళ నిరూపిస్తున్నదన్నారు. విద్యార్థులు పుస్తకాలు ఎక్కువగా చదివేలా ప్రోత్సహించాలన్నారు. దీనివల్ల వారిలో సృజనాత్మకత, ఆలోచనా ధోరణి పెరుగుతుందన్నారు. పుస్తక పరిజ్ఞానానికి ప్రాక్టికల్ పరిజ్ఞానంగా మార్చుకోగలిగితే విజయాలు పొందవచ్చన్నారు. అధ్యాపకులు బోధనలో వస్తున్న ఆధునిక మార్పులను అందిపుచ్చుకోవాలని కోరారు. పోటీతత్వాన్ని విద్యార్థులు అందుకోవాలంటే వారికి మెరుగైన శిక్షణ అవసరమన్నారు. మన దేశంలో కీలకమైన పదవులను పోషిస్తున్న వారిలో మహిళల సంఖ్య పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. అయితే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో, పరిశోధనల్లో మహిళలు చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. లింగ వివక్ష, కుటుంబ ప్రోత్సాహం లేకపోవడం వల్ల కొంతమంది ఈ రంగంలోకి రావడం లేదన్నారు. విద్యార్థులు వైఫల్యాలు నుంచి పాఠాలు నేర్చుకుంటే విజయం సాధిస్తామని చెప్పారు. వీసీ రత్నకుమారి అధ్యక్షోపన్యాసం చేస్తూ విశ్వవిద్యాలయాల ప్రగతిని వివరించారు. విశ్వవిద్యాలయం అన్ని రంగాల్లో పురోగతిని సాధించిందన్నారు. కార్యక్రమానికి రిజిస్ట్రార్ విజయలక్ష్మి, డీన్లు మంజువాణి, రమణమ్మపాల్గొన్నారు. 1,196 మందికి డిగ్రీలు స్నాతకోత్సవంలో 16 మందికి బంగారు పతకాలు, 10 మందికి బుక్‌ప్రైజ్‌లు, నలుగురికి నగదు బహుమతులు, 54 మందికి పీహెచ్‌డీలు, 8 మందికి ఎంఫిల్, 431 మందికి పీజీలు, 512 మందికి డిగ్రీలు, 191 మందికి దూరవిద్యా డిగ్రీలు ప్రదానం చేశారు. విద్యార్థినుల సందడి స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్థినులు సందడి చేశారు. కోర్సు పూర్తయి వివిధ ప్రదేశాల్లో స్థిరపడి స్నాతకోత్సవానికి వచ్చిన న వారందరూ పరస్పరం ఆప్యాయంగా పలకరించుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. డిగ్రీలు అందుకుని ఫొటోలు దిగుతూ ఆనందంగా గడిపారు. -
'ప్రభుత్వ పదవులకు దూరంగా ఉండటమే మంచిది'
తిరువనంతపురం: పదవీవిరమణ అనంతరం సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు జ్యూడీషియల్ ఇంక్వైరీ కమిషన్ మినహా అన్ని పదవులకు రెండేళ్ల పాటు స్వచ్ఛందంగా దూరంగా ఉండడం మంచిదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కేటీ థామస్ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సదాశివం కేరళ గవర్నర్‌గా రానున్నారంటూ వార్తలు వస్తుండటంపై సోమవారం థామస్ పై విధంగా స్పందించారు. ఆరు సంవత్సరాల పాటు సుప్రీం న్యాయమూర్తిగా సేవలందించిన థామస్.. 2002 లో పదవీ విరమణ పొందారు. రాజీనామా చేసిన న్యాయమూర్తులు ప్రభుత్వ పదవులకు దూరంగా ఉండాలన్న నియమనిబంధనలు ఏమీ లేకపోయినా.. ఇది తన అభిప్రాయంగా పేర్కొన్నారు. ప్రజలు ఎప్పుడూ న్యాయవ్యవస్థను నిశితంగా గమనిస్తూ ఉంటారని.. వారికి ఎటువంటి అనుమానాలకు తావివ్వకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇచ్చే పదవులకు దూరంగా ఉండటమే మంచిదని తెలిపారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివంను కేరళ గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించబోతోందన్న అంశంపై రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చ మొదలైంది. దేశ అత్యున్నత న్యాయ పదవిని అలంకరించిన ఓ వ్యక్తికి గవర్నర్‌గా అధికారాలు అప్పగిస్తే అది అనూహ్య పరిణామమే అవుతుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. -
ఈ నెల నూనె లేనట్టే
ఇంత వరకు దిగుమతి కాని పామోలిన్ తెల్లకార్డుగలవారిపై రూ.3.70 కోట్ల అదనపు భారం నర్సీపట్నం: జూలై నెలకు పామాయిల్ సరఫరా అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికీ డీలర్లు డీడీలు తీయకపోవడం దీనికి నిదర్శనం. జిల్లాలో ప్రస్తుతం 12,34,104 కార్డులున్నాయి. ఒక్కొక్క కార్డుపై నెలకు లీటరు పామాయిల్ నూనె సరఫరా చేసేవారు. నూనె సరఫరా ఎప్పటినుంచో కొనసాగుతున్నా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం అమ్మహస్తం పథకంలోకి చేర్చింది. వాస్తవానికి పౌరసరఫరాల కోటాగా జిల్లాకు 12 లక్షల 34వేల 104 లీటర్ల పామాయిల్‌ను సరఫరా చేయాలి. మలేషియా నుంచి కాకినాడ పోర్టుకు దిగుమతయ్యే పామాయిల్‌ను రాష్ట్రంలోని 18 జిల్లాలకు సరఫరా చేస్తుంటారు. ప్రస్తుతం దిగుమతి లేకపోవడంతో సరఫరా నిలిచిపోయింది. రేషన్ కార్డుపై రూ.40కు లీటరు నూనె సరఫరా చేస్తున్నారు. దీని ధర బయటి మార్కెట్లో రూ.70 వరకు పలుకుతోంది. ప్రస్తుతం కోటాలో పామాయిల్ సరఫరా చేయకపోవడం వల్ల కార్డుదారులు బయట రూ.70కి కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం కార్డుదారులు సుమారు రూ.3.70 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. రెండు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విశేషం. -
ప్రాణమిచ్చే బతుకు దీపాలు
దేవుడు ప్రాణం పోస్తాడు... డాక్టర్లు ప్రాణం నిలుపుతారు మరి... నర్సులు?... ప్రాణాల మీద ఆశ కల్పిస్తారు బతకగలమనే భరోసా కల్పిస్తారు... ఇక ఈ జీవితం ఇంతే అనుకున్న రోగికి... నీకు ఇంకా జీవితం ఉంది... ఆ జీవితాన్ని ఆనందంగా జీవించాలి... అంటూ జీవించడానికి కావాల్సిన ధైర్యాన్ని నూరిపోస్తారు. అడుగడుగునా సేవలందిస్తూ స్వస్థత చేకూరుస్తారు. కొడిగడుతున్న ప్రాణాలకు రెండు చేతులనూ అడ్డుగా పెట్టి ఆసరాగా నిలుస్తారు. ఇలాంటి సేవలకు గుర్తింపుగా... జ్ఞానలక్ష్మి, సౌమ్య, డైజీ థామస్ అనే నర్సులు... రాష్ట్రపతి చేతుల మీదుగా ఇటీవల ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’ అవార్డులు అందుకున్నారు... వారి అనుభవాలు, అభిప్రాయాల సుమహారం! నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి పట్టణంలో జీవదాన్ ఆసుపత్రి. రకరకాల పేషెంట్లలో గుండెపోటు వచ్చిన పేషెంట్లు ఇద్దరు ఉన్నారు. డ్యూటీ డాక్టర్లు రౌండ్స్ పూర్తి చేసుకుని నర్సులకు చెప్పి వెళ్లిపోయారు. వాళ్లలా వెళ్లిన కొంతసేపటికే ఒక పేషెంటుకి గుండెపోటు వచ్చింది. డ్యూటీలో ఉన్న సౌమ్య సిస్టర్‌కి ఏం చేయాలో పాలుపోలేదు. పేషెంటు ప్రాణాపాయంలో ఉన్నాడు. దేవుడిచ్చిన ప్రాణానికి ఆపద వాటిల్లింది. ప్రాణాన్ని కాపాడి వృత్తి ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. ఆ నిమిషం ఆమెకి తెలిసింది అదొక్కటే... అంతే! కరెంట్ స్ట్రోక్స్ ఇచ్చేశారు. పేషెంటు తెరిపిన పడ్డాడు. డాక్టరు ఇవ్వాల్సిన ఆ ట్రీట్మెంట్ను తానే నిర్వహించే చొరవ ఆ క్షణంలో తీసుకోక తప్పలేదు. ఇంతలో మరో పేషెంటుకు కూడా అదే పరిస్థితి... అతడి గుండెమీద కొట్టి, కొట్టి... ఆగిపోబోతున్న గుండెను కొట్టుకునేలా చేశారు. ఈ రోజు ఏమిటిలా అనుకుంటూండగా సాయంత్రానికి మరో ఉపద్రవం. ప్రసూతి విభాగంలో ఒక బిడ్డ పుట్టగానే ఏడవలేదు, అపస్మారక స్థితిలో ఉంది. అందరిలో కంగారు... ఇంతలో సౌమ్య సిస్టర్ వెంటనే నోటితో బిడ్డకు గాలి అందించి కాపాడారు. ఇరవై మూడేళ్ల వృత్తి జీవితంలో సౌమ్య సిస్టర్‌కి ఇలాంటి అనుభవాలెన్నో. ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ... ‘‘మా వృత్తిలో ఇవి చాలా మామూలే, కానీ ఈ మూడూ ఒకేరోజు జరగడం మాత్రం చాలా విచిత్రం. ఆ రోజు నాకు నా వృత్తిధర్మాన్ని పూర్తిగా నిర్వర్తించాననే తృప్తి కలిగింది. ప్రాణాన్ని ఇవ్వగలిగింది దేవుడొక్కడే. ఆ ప్రాణానికి ఆపద వాటిల్లినప్పుడు కాపాడే ప్రయత్నమే మాది. ఆ ప్రయత్నాన్ని అంకితభావంతో చేయాలి. ఇన్నేళ్లుగా అదే చేస్తూ వచ్చాను’’ అన్నారు సిస్టర్ సౌమ్య. సిస్టర్ సౌమ్యది కేరళ రాష్ట్రంలోని మారుమూల గ్రామం. 1980లో విజయవాడలోని ఫ్రాన్సిస్కన్ క్లారిస్ట్ కాంగ్రెగేషన్ కాన్వెంట్లో చేరారు. అక్కడ పదేళ్లపాటు శిక్షణ పొందిన తర్వాత జీవదాన్ సంస్థ నిర్వహిస్తున్న ఆసుపత్రిలో నర్సుగా చేరారు. ‘‘పేషెంట్లు తమ ప్రాణాలను మా చేతుల్లో పెడతారు. సాంత్వన పరుస్తూ మాట్లాడి, ప్రాణాలను కాపాడి ఆరోగ్యంగా ఇంటికి సాగనంపాలి. మా దృష్టి వ్యక్తి ప్రాణం కాపాడడం మీదనే ఉండాలి. ఒక్కోసారి అనుకున్నది అనుకున్నట్లు జరగక పేషెంటు ప్రాణం పోవచ్చు. కానీ మా మనసులో పేషెంటుని కాపాడాలనే తపన చావకూడదు’’ అంటారామె. ఆమెతోపాటుగా అదే రోజు రాష్ట్రపతి నుంచి అవార్డును అందుకున్న మరో సిస్టర్ జ్ఞానలక్ష్మి. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లో యశోదా నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్. ‘‘మాది ఖమ్మం జిల్లా కొత్తగూడెం. మా నాన్న జార్జ్ సింగరేణి కాలరీస్‌లో ఆడిటర్. మా కాలేజ్ ప్రిన్సిపల్ కైలాసపతిగారు మా నాన్నగారికి సలహా ఇవ్వడంతో నేను ఇంటర్ తర్వాత బి.ఎస్.సి నర్సింగ్‌కి హైదరాబాద్‌కు వచ్చాను. కోర్సు పూర్తయిన తర్వాత 1970వ సంవత్సరం ఫిబ్రవరిలో వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో స్టాఫ్‌నర్సుగా చేరాను. ఈ రంగంలోకి వచ్చి నలభై ఐదేళ్లు కావస్తోంది. ఇన్నేళ్లలో క్లినికల్ ఏరియా, ఆపరేషన్ థియేటర్, టీచింగ్... ఈ మూడు రంగాల్లోనూ పనిచేశాను. నర్సింగ్ రంగంలో ఎన్ని విభాగాలలో ఉద్యోగం చేసినప్పటికీ ఆత్మసంతృప్తి మాత్రం పేషెంటుకు నేరుగా సేవచేయగలిగిన క్లినికల్ ఏరియాలోనే’’నంటారామె. ‘‘వరంగల్‌లో ఓ పదహారేళ్ల అమ్మాయి మా హాస్పిటల్లో చేరింది. ఆమెకు అన్నీ బెడ్ మీదనే. అలాంటి అమ్మాయిని నెల రోజుల్లో నడిపించాను. డాక్టర్లు మందులు ఇస్తారు, డాక్టరు బాధ్యత పూర్తయిన చోట మా బాధ్యత మొదలవుతుంది. ఆ అమ్మాయి మంచానికి అతుక్కుపోతే ఇక జీవితం ఏమిటి అని మనసు కలచి వేసేది. దాంతో నా ఉద్యోగ విధులకే పరిమితం కాకుండా ప్రత్యేక శ్రద్ధతో ఆమెకి ఫిజియోథెరపీ చేయించడం, రోజూ పరామర్శించి ‘నీకు తగ్గిపోతుంది, నడుస్తావు, నువ్వు పెళ్లి చేసుకుని బిడ్డనెత్తుకోవడాన్ని కూడా మేము చూస్తాం’ అని చెప్తుండేదాన్ని. డిశ్చార్జ్ అయి వెళ్లేటప్పుడు ఆ అమ్మాయి, వారి తల్లిదండ్రుల ముఖాల్లో కనిపించిన ఆనందాన్ని మర్చిపోలేను. ఒక జీవితాన్ని నిలపగలిగాను అనే సంతోషాన్ని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు’’ అంటారు జ్ఞానలక్ష్మి. వీరిద్దరూ ఇలా అంటుంటే ఇదే అవార్డును వీరితోపాటు అందుకున్న డైజీ థామస్ మాత్రం... ‘దేవుడి సేవలో మా బాధ్యతను నిర్వర్తిస్తున్నాం’ అంటారు. ‘‘ఈ వృత్తిలో ఉండాల్సింది సేవచేయాలనే అకుంఠిత దీక్ష మాత్రమే. అది మనసులో కలగాలి. మనస్ఫూర్తిగా సేవ చేయాలనే తపన ఉండాలి. అంతకు మించిన స్ఫూర్తి మరోటి ఉండదు’’ అంటారు. ఈమె సికింద్రాబాద్‌లోని రైల్వే ఆసుపత్రిలో చీఫ్ మాట్రన్. ఈ వృత్తిలోని వారికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. వారి సేవలకు ఈ అవార్డులు కరదీపికలు కాలేవు. కానీ గుర్తు చేసుకోవడానికి ఒక వేదిక మాత్రం కాగలుగుతాయి. - వాకా మంజులారెడ్డి, ఇన్పుట్స్: ప్రభాకర్, న్యూస్‌లైన్, ఎల్లారెడ్డి -
‘ఉల్లి’ భారం తగ్గిస్తాం: కేంద్ర మంత్రి థామస్
న్యూఢిల్లీ: కోయకుండానే కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి ధరలు 15-20 రోజుల్లో దిగొస్తాయని వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉల్లి పంట చేతికి రానుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కొత్త పంట త్వరలోనే మార్కెట్‌కు రానుందని కేంద్ర ఆహారం, వినియోగదారుల వ్యవహారాల మంత్రి కె.వి.థామస్ చెప్పారు. ఉల్లిపాయలు, ఇతర అత్యవసర వస్తువుల ధరలు నింగినంటడంపై చర్చ జరగాలని రాజ్యసభలో శనివారం ఎంపీ నరేష్ అగర్వాల్ (ఎస్పీ) డిమాండ్ చేశారు. ఈ మేరకు స్వల్పకాలిక చర్చ చేపట్టారు. మంత్రి థామస్ స్పందిస్తూ, జూలై-అక్టోబర్ మధ్యకాలంలో ఉల్లి ధరలు పెరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. రబీ సీజన్లో దేశవ్యాప్తంగా 60 శాతమే ఉల్లి ఉత్పత్తి జరిగిందని చెప్పారు. మిగతాది ఖరీఫ్‌లో చేతికొస్తుందని తెలి పారు. ఉల్లిని దాచిపెట్టి ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలో అక్రమాలకు పాల్పడుతున్న వ్యాపారులను అరెస్టు చేసినట్లు చెప్పారు. -
ఆహార భద్రతపై మంత్రి శ్రీధర్‌బాబు సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆహార భద్రత అమలు చేసేందుకు కావాల్సిన ముందస్తు ఏర్పాట్లు చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. శుక్రవారం ఆయన పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్షించారు. ఆహార భద్రత చట్టం పార్లమెంటులో ఆమోదించిన తర్వాత రాష్ట్రంలో చేపట్టాల్సిన చర్యలు - ఏర్పడే సమస్యలు - పరిష్కారానికి చేయాల్సిన పనులపై ఆయన అధికారులతో మాట్లాడారు. ఆహార భద్రత చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రంలో అదనంగా కావాల్సిన బియ్యాన్ని ఎలా సమకూర్చుకోవాలనే అంశంపై ప్రణాళిక రూపొందించాలని మంత్రి సూచించారు. ఆహార భద్రతకు సంబంధించి రాష్ట్రంలో పరిస్థితిపై కేంద్ర ఆహర శాఖ మంత్రి థామస్‌తో రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు సోమవారం సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితిని కూలంకుషంగా వివరించేందుకు వీలుగా ఆయన రాష్ట్ర అధికారుల నుంచి సమగ్ర సమాచారం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాపంపిణీ కోసం నెలకు సగటున 3.25 లక్షల టన్నుల బియ్యం వినియోగిస్తుండగా ఆహార భద్రత చట్టం అమలు చేస్తే నాలుగు లక్షల టన్నులు అవసరమవుతాయని అధికారులు వివరించారు.