వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ డెవాన్ థామస్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బిగ్ షాకిచ్చింది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు థామస్‌పై ఐసీసీ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. శ్రీలంక క్రికెట్ (SLC), ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ECB), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) అవినీతి నిరోధక నిబంధనలను థామస్ ఉల్లంఘించడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
థామస్ కూడా తన నేరాన్ని అంగీకరించినట్లు ఐసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. లంక ప్రీమియిర్ లీగ్ 2021లో ఫిక్సింగ్ పాల్పడ్డాడన్న అభియోగాల నేపథ్యంలో గతేడాది థామస్‌పై ఐసీసీ తాత్కాలికంగా సస్సెన్షన్ వేటు వేసింది. అదే విధంగా యూఏఈ, కరీబియన్ లీగ్‌లో బుకీలు కలిసినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి.
అయితే ఇప్పుడు నేరం రుజువు కావడంతో ఐదేళ్ల పాటు ఎటువంటి క్రికెట్ ఆడకుండా అతడిపై ఐసీసీ బ్యాన్ విధించింది. ఇక విండీస్ తరఫున డెవాన్ ఒక టెస్ట్, 21 వన్డేలు, 12 టీ20లు ఆడాడు. ఇందులో మొత్తంగా 320 పరుగులు, 36 క్యాచ్‌లు, 4 రనౌట్లు, 8 స్టంపింగ్‌లు చేశాడు. టెస్ట్‌ల్లో, వన్డేల్లో బౌలింగ్ సైతం చేసిన థామస్.. ఫార్మాట్‌కు 2 చొప్పున 4 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment