తిరువనంతపురం: ఎన్నికల నేపథ్యంలో కేరళ మాజీ ఆర్ధిక శాఖ మంత్రిగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఎల్‌డిఎఫ్ నేత, పతనంతిట్ట అభ్యర్థి డా. థామస్ ఐజాక్ వార్తల్లో నిలిచారు. అప్పుడప్పుడు అమెరికా పర్యటనలు, డిజైనర్ కుర్తాలంటే ఇష్టపడే థామస్ ఐజాక్ సాధారణ జీవనశైలితో తోటి నేతలకు ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నారు.
నిబద్ధత కలిగిన కమ్యూనిస్ట్ నేతగా పేరొందిన థామస్ ఐజాక్ అఫిడవిట్‌ను సమర్పించారు. ఐజాక్ పేరిట రూ. 9.6 లక్షల విలువైన 20,000 పుస్తకాలు తప్ప మరే ఆస్తి లేదని తెలుస్తోంది.
అద్దె ఇంట్లోనే
బ్యాంక్ సేవింగ్స్‌లో రూ.6,000, సహా వివిధ బ్యాంక్ అకౌంట్లలో రూ.1.31 లక్షల డిపాజిట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నేత అయినప్పటికీ ఐజాక్ తిరువనంతపురంలో తన సోదరుడి ఇంట్లో అద్దెకి నివసిస్తున్నారు.
10వేల విలువ చేసే షేర్లు
పెన్షనర్ల ట్రెజరీ ఖాతాలో రూ.68,000, ఎస్‌బీఐ సేవింగ్స్ ఖాతాలో రూ.39,000, కేఎస్‌ఎఫ్‌ఈ సుగమా ఖాతాలో రూ.36,000 ఉన్నాయి. అంతేకాకుండా, అతను కేఎస్‌ఎఫ్‌ఈలో చిట్ ఫండ్‌ను వివిధ వాయిదాలలో మొత్తంగా రూ.77వేలు చెల్లించారు. అదనంగా, మలయాళం కమ్యూనికేషన్స్‌లో రూ.10వేలు విలువ చేసే షేర్‌లు మాత్రమే ఆయన పేరు ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment