ఎక్కువగా ఏసీని వాడుతున్నారని.. | Angry over use of AC, man in Kerala kills wife and son | Sakshi
Sakshi News home page

ఎక్కువగా ఏసీని వాడుతున్నారని..

Published Sat, Apr 9 2016 4:29 PM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

ఎక్కువగా ఏసీని వాడుతున్నారని..

ఎక్కువగా ఏసీని వాడుతున్నారని..

ఆంగ్మలీ: ఏసీని ఎక్కువగా ఉపయోగిస్తున్నారనే కారణంతో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి.. భార్య, కొడుకుతో గొడవపడి వారిని చంపేశాడు. ఏసీ ఆన్ చేసుకుని నిద్రపోతున్న భార్య, కొడుకును చూసి ఆవేశాన్ని అణుచుకోలేక పోయిన 81 ఏళ్ల పాల్ వారిద్దరినీ ఇనుప రాడ్డుతో కొట్టాడు. కొడుకు థామస్ అక్కడిక్కడే మరణించగా, భార్య మేరీ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయినట్టు పోలీసులు చెప్పారు. కేరళలోని ఆంగ్మలీలో ఈ ఘటన జరిగింది.

తల్లి, బిడ్డలను రాడ్తో కొట్టిన తర్వాత బంధువులకు ఫోన్ చేసి పాల్ జరిగిన విషయం చెప్పాడు. అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసినా వృద్ధాప్యం కారణంగా చేసుకోలేకపోయాడు. గత కొద్ది రోజులుగా తన కుటుంబ సభ్యులు ఏసీని ఎక్కువగా వాడుతున్నారని, దీనివల్ల కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని, కేవలం పెన్షన్తో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టమవుతోందని, అందుకే వారిని చంపినట్లు పాల్ పోలీసుల విచారణలో తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement