ట్రైన్‌లో బెర్త్‌ కూలి.. ప్యాసింజర్‌ మృతి | Kerala man deceased train berth falls on him Railways no defect in seat | Sakshi
Sakshi News home page

ట్రైన్‌లో బెర్త్‌ కూలి.. ప్యాసింజర్‌ మృతి

Published Thu, Jun 27 2024 9:24 AM | Last Updated on Thu, Jun 27 2024 1:02 PM

Kerala man deceased train berth falls on him Railways no defect in seat

తిరువనంతపురం: ట్రైన్‌ అప్పర్‌ బెర్త్ ఒక్కసారిగా కూలిపోవటంలో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. కేరళకు చెందిన ప్యాసింజర్‌ అలిఖాన్ సీకే తన స్నేహితులతో ఆగ్రాకు.. ఎర్నాకులం-హజ్రత్ నిజాముద్దీన్ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

జూన్ 16న జరిగిన ఈ ప్రమాద ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ట్రైన్‌ తెలంగాణలోని  వరంగల్‌  జిల్లాలో ప్రయాణిస్తున్న సమయలో ఒక్కసారిగా అలిఖాన్ సీకేపై అప్పర్‌ బెర్త్‌కూలిపోయింది.దీంతో ఆయన మెడకు తీవ్రంగా గాయాలు అయ్యాయి.దీంతో ఆయన్ను రామగుండంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తలించారు. ఇక్కడ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్రైన్‌లో జరిగిన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తటంలో రైల్వే మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి  ‘ఎక్స్‌’లో స్పందించారు. అప్పర్ బెర్త్ కూలిపోయిందని తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. ‘‘ రైల్వే అధికారుల ట్రైన్‌లోని బెర్త్‌ను పరిశీలించారు.ప్రయాణీకుడు అలిఖాన్ సీకే సీటు నెం. S/6 కోచ్‌లో 57 (లోయర్ బెర్త్). అయితే ఆయనపై ఉన్న పైబెర్త్‌కు చైన్ సరిగ్గా అమర్చకపోవడం వల్లనే కిందకు పడిపోయింది. కానీ, పైబెర్త్‌ డ్యామెజీ కారణంగా కిందపడలేదు’’ అని వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై రామగుండం రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి గాయాలైన ప్రయాణికుడిని  చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారని తెలిపారు. 

ఈ ప్రమాద ఘటనపై కేరళ కాంగ్రెస్‌ తీవ్రంగా మండిపడింది. ప్రధాని మోదీ ప్రభుత్వంలో రైల్వేలో జరుగుతున్న ప్రమాదాలపై విమర్శలు చేసింది. ఈ ప్రమాదాలకు కేంద్ర ప్రభుత్వం  బాధ్యత వహించాలని డిమాండ్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement