berths in trains
-
ఏసీ బెర్త్‌కు రూ.1000.. నాన్ ఏసీకి రూ.500
సాక్షి, హైదరాబాద్: ఏసీ బెర్త్‌కు రూ.1000..నాన్ ఏసీ బెర్త్‌కు రూ.500. ఇవి టికెట్ చార్జీలు కాదు. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు బెర్తులు కావాలంటే టికెట్ కలెక్టర్లకు (టీసీలకు) సమర్పించుకోవలసిన ఆమ్యామ్యాలు. ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉన్న రైళ్లు, కొన్ని ప్రత్యేక రైళ్లలో ఈ తరహా బేరాలు జోరుగా సాగుతున్నాయి. టీసీలే స్వయంగా డబ్బులు తీసుకొని బెర్తులు కట్టబెట్టడంతో వెయిటింగ్‌లిస్ట్‌లో ఉన్న వారు నిశ్చింతంగా ప్రయాణం చేస్తున్నారు. నిజానికి టికెట్ నిర్ధారణ అయితే తప్ప ట్రైన్లో ప్రయాణం చేసేందుకు అవకాశం లేదు. ప్రతి ట్రైన్ బయలుదేరడానికి 4 గంటల ముందు ప్రయాణికుల జాబితా విడుదల అవుతుంది. ఆ జాబితాలో ఉన్న వాళ్లు మాత్రమే రిజర్వేషన్ లభించిన ప్రయాణికులు. కానీ ప్రతి ట్రైన్‌కు వందల సంఖ్యలో వెయిటింగ్‌లిస్ట్ ప్రయాణికులు ఉంటారు. చార్ట్ (జాబితా) సిద్ధమైన తరువాత వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకోవచ్చు. ఆన్లైన్లో కొనుగోలు చేసిన వారికి టికెట్ డబ్బులు వారి ఖాతాలోకి ఆటోమేటిక్‌గా రీఫండ్ అవుతాయి. కానీ కొందరు ప్రయాణికులు వెయిటింగ్ లిస్ట్ టికెట్లపైనే ప్రయాణం చేస్తారు. ఏదో ఒకవిధంగా వెళ్లిపోవాలనే ఉద్దేశంతో టికెట్లను రద్దు చేసుకోకుండా ప్రయాణాన్ని కొనసాగిస్తారు. డిమాండ్, రద్దీ ఎక్కువగా ఉన్న రైళ్లలో ఈ తాకిడి మరింత తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులపైనే కొందరు టీసీలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. నాన్ ఏసీ స్లీపర్ బోగీల్లో బెర్తులకు రూ.500, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ వంటి బోగీల్లో బెర్తులకు రూ.1000 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.శబరి రైళ్లకు డిమాండ్ ఫుల్... ప్రస్తుతం హైదరాబాద్ నుంచి అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున శబరిమలకు తరలివెళ్తున్నారు. కొంతమంది సాధారణ భక్తులు సైతం దర్శనానికి వెళ్తున్నారు. దీంతో ప్రతిరోజు రాకపోకలు సాగించే శబరి ఎక్స్‌ప్రెస్‌తో పాటు ప్రత్యేక రైళ్లకు సైతం డిమాండ్ బాగా ఉంది. రోడ్డు మార్గంలో వెళ్లాలన్నా, ఫ్లైట్‌లో వెళ్లాలన్నా పెద్దమొత్తంలో వెచ్చించవలసి ఉంటుంది. చార్జీల భారం దృష్ట్యా ఏదోఒకవిధంగా రైళ్లలో వెళ్లడమే మంచిదని భావించే వెయిటింగ్‌లిస్ట్ ప్రయాణికుల అవసరాన్ని కొందరు టీసీలు సొమ్ము చేసుకుంటున్నారు. నగరంలోని వనస్థలిపురం, నాగోల్ ప్రాంతాలకు చెందిన నలుగురు స్నేహితులు నవంబర్ 27వ తేదీన 12 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ 17230)లో సికింద్రాబాద్ నుంచి శబరికి బయలుదేరారు. వాళ్ల ప్రయాణానికి ఇంచుమించు నెల రోజుల క్రితమే సెకండ్ ఏసీ రిజర్వేషన్ కోసం టికెట్లు కొనుగోలు చేశారు. కానీ ప్రయాణ తేదీ నాటికి కూడా టికెట్లు నిర్ధారణ కాలేదు. రిజర్వేషన్ లభించలేదు. చార్ట్ (ప్రయాణికుల జాబితా) సిద్ధమైన తరువాత కూడా ఆ ప్రయాణికులు వెయిటింగ్ జాబితా (5 నుంచి 8 వరకు)లోనే ఉండిపోయారు. అయినప్పటికీ టికెట్లను రద్దు చేసుకోకుండా అదే ట్రైన్లో బయలుదేరారు. రైలు ప్రారంభమైన కొద్దిసేపటికి వెళ్లి టీసీని సంప్రదించారు. ‘మొదట్లో ఎలాంటి గ్యారంటీ ఇవ్వకపోయినప్పటికీ ట్రైన్ తిరుపతికి చేరుకున్న తరువాత ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.1000 చొప్పున మొత్తం రూ.4000 తీసుకొని నాలుగు బెర్తులు కేటాయించాడు. సెకండ్ ఏసీలోనే ఆ సదుపాయం లభించడంతో ప్రయాణం నిశ్చింతగా సాగింది.’ అని ఆ ప్రయాణికులు చెప్పారు. తమతో పాటు మరి కొందరికి కూడా రూ.1000 చొప్పున తీసుకొని ఏసీ బోగీల్లో, రూ.500 చొప్పున తీసుకొని స్లీపర్‌లో బెర్తులు ఇచి్చనట్లు వారు చెప్పారు.ఎలా సాధ్యం... ⇒ రిజర్వేషన్లు నిర్ధారణ అయిన ప్రయాణికులు ఆకస్మికంగా తమ ప్రయాణాలను రద్దు చేసుకో వ చ్చు. అలాంటి వాళ్ల సంఖ్య తక్కువగానే ఉంటుంది. ట్రైన్లో విధులు నిర్వహించే టికెట్ ఎగ్జామినర్, టికెట్ కలెక్టర్, తదితర సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రయాణికుల వివరాలను తమ వద్ద ఉండే హ్యాండ్ హెల్డ్ మిషన్లలో నమోదు చేయాలి. ⇒ ఈ క్రమంలోనే కొందరు టీసీలు ఇలాంటి ప్రయాణికుల వివరాలను నమోదు చేయడంలోనే తమ హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు.⇒ సదరు ప్రయాణికుల పేరు వద్ద ‘కాన్సిల్’ అని కాకుండా ‘జాయిన్’ అని నమోదు చేసి ఆ బెర్తులను వెయిటింగ్ లిస్ట్ వాళ్లకు కేటాయిస్తున్నారు. అయితే ఆన్లైన్ టికెట్లపైన ఇది సాధ్యం కాదు. రిజర్వేషన్ కేంద్రాల్లో కొనుగోలు చేసిన వెయిటింగ్ లిస్ట్ టికెట్లపైనే టీసీలు ఈ తరహా ప్రయోగాలు చేస్తున్నట్లు సమాచారం. -
ట్రైన్లో బెర్త్ కూలి.. ప్యాసింజర్ మృతి
తిరువనంతపురం: ట్రైన్ అప్పర్ బెర్త్ ఒక్కసారిగా కూలిపోవటంలో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. కేరళకు చెందిన ప్యాసింజర్ అలిఖాన్ సీకే తన స్నేహితులతో ఆగ్రాకు.. ఎర్నాకులం-హజ్రత్ నిజాముద్దీన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జూన్ 16న జరిగిన ఈ ప్రమాద ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ట్రైన్ తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ప్రయాణిస్తున్న సమయలో ఒక్కసారిగా అలిఖాన్ సీకేపై అప్పర్ బెర్త్కూలిపోయింది.దీంతో ఆయన మెడకు తీవ్రంగా గాయాలు అయ్యాయి.దీంతో ఆయన్ను రామగుండంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తలించారు. ఇక్కడ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్రైన్లో జరిగిన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తటంలో రైల్వే మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ‘ఎక్స్’లో స్పందించారు. అప్పర్ బెర్త్ కూలిపోయిందని తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. ‘‘ రైల్వే అధికారుల ట్రైన్‌లోని బెర్త్‌ను పరిశీలించారు.ప్రయాణీకుడు అలిఖాన్ సీకే సీటు నెం. S/6 కోచ్‌లో 57 (లోయర్ బెర్త్). అయితే ఆయనపై ఉన్న పైబెర్త్కు చైన్ సరిగ్గా అమర్చకపోవడం వల్లనే కిందకు పడిపోయింది. కానీ, పైబెర్త్ డ్యామెజీ కారణంగా కిందపడలేదు’’ అని వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై రామగుండం రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి గాయాలైన ప్రయాణికుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారని తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై కేరళ కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ప్రధాని మోదీ ప్రభుత్వంలో రైల్వేలో జరుగుతున్న ప్రమాదాలపై విమర్శలు చేసింది. ఈ ప్రమాదాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. -
తిరుగు ప్రయాణానికి ఇక్కట్లు
విశాఖపట్నం : దసరా పండగ గడిచిపోయింది. ఊళ్లకెళ్లినవారంతా ఇప్పుడు స్వస్థలాలకు లగేజీలు సిద్ధం చేసుకుంటున్నారు. సోమవారం నుంచీ విధుల్లోకి చేరాలని ఉద్యోగులు, బడికి పోవాలని విద్యార్ధులు సన్నద్ధమవుతున్నారు. వీరందరికీ గమ్యం చేరుకునేందుకు ఒకటే మార్గం. రైళ్ల మీదే ఆధారపడుతున్నారు. బెర్తులన్నీ దసరాకు రెండు మాసాల ముందే రిజర్వేషనులో నిండిపోతే ఇప్పుడు తత్కాల్ కోటాలో బెర్తు లభ్యమైనా ఇంటిల్లిపాదీ సర్దుకుపోదామనే రైల్వే ఎంక్వైరీ మొదలెట్టారు. శుక్రవారం రైల్వే స్టేషన్‌లోని విచారణ కార్యాలయం వద్ద వేలాది మంది ఎంక్వైరీ చేపట్టారు. ఆదివారం రద్దీ ప్రభావం సోమవారం కూడా కొనసాగుతుందని రైల్వే వర్గాలు ప్రకటించడంతో తత్కాల్ కోసం ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. అందరి ప్రయాణికుల దృష్టి కేవలం ఆదివారం రైళ్లపైనే ఉండడంతో ఆ రోజు ప్రయాణాలు అంత ఈజీ కాదని అంటున్నారు. ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో బెర్తులు లేకపోవడంతో ఆదివారం ప్రయాణం కోసం అధిక శాతం ప్రయాణికులు ప్యాసింజర్లపైనే ఆశలు పెట్టుకున్నారు. బెర్తులు దొరకని ప్రయాణికులతో పాటు ప్యాసింజర్ల రైళ్లనే రెగ్యులర్‌గా నమ్ముకునే సాధారణ ప్రయాణికులతో ఆదివారం రైళ్లు కిటకిటలాడే అవకాశాలున్నాయి. కొనసాగుతున్న అష్టకష్టాలు... విశాఖ నుంచి హౌరా చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల అవస్థలు నెలాఖరువరకూ కొనసాగడం ఖాయమని స్పష్టమవుతోంది. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు (12704) స్లీపర్, థర్డ్ ఏసీ క్లాసులకు ఆదివారం నుంచి వరుసగా నాలుగు రోజులు రిగ్రెట్, ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌కు (18646) స్లీపర్ క్లాసులో శనివారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు రిగ్రెట్ ఏర్పడగా థర్డ్ ఏసీ క్లాసుకు వారంరోజుల పాటు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. కోరమండల్ (12842), మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లకు (12840) చాంతాండంత నిరీక్షణ జాబితా నెలకొంది. వీటితో పాటు వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో బెర్తులు లభించే ఛాన్స్‌లు లేవు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు (12727) ఆదివారం రిగ్రెట్ చూపగా మరో వారం రోజుల పాటు నిరీక్షణ జాబితా కొనసాగుతోంది. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో (17015) ఆదివారం ప్రయాణానికి నిరీక్షించే ప్రయాణికులు 196 మంది ఉన్నారు. ఎల్టీటీ (18519), ఫలక్నామా (12703) ఎక్స్‌ప్రెస్‌లలో నిరీక్షణ జాబితా 200 మందికి పైనే ఉంది. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11020), విజయవాడ వెళ్లే జన్మభూమి ఇంటర్ సిటీ (12805) ఎక్స్‌ప్రెస్‌లలో నిరీక్షణ జాబితా 300 పై చిలుకే చేరుకుంది. అన్ని రైళ్లలోనూ ఏసీ చైర్‌కార్‌కు టికెట్ రాని (రిగ్రెట్) పరిస్థితి ఉంది. సింహాద్రి (17240), రత్నాచల్ (12717) రైళ్లకు చాంతాడంత నిరీక్షణ జాబితా ఉంది. బెంగళూర్ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో (18463) నిరీక్షణ జాబితా 360కు పైగా ఉంటే టాటా-యశ్వంత్‌పూర్ (12889), హౌరా-యశ్వంత్‌పూర్ (12863) రైళ్లకు భారీ ఎత్తున నిరీక్షణ జాబితా కొనసాగుతోంది. ఈ రైళ్లకు విశాఖ నుంచి కోటా లేకపోవడంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల బాధలు వర్ణనాతీతం.