mary
-
మేరీ మిల్బెన్ ఎవరు? ఆమె ప్రధాని మోదీకి ఎందుకు మద్దతు పలికారు?
ఆఫ్రికన్-అమెరికన్ హాలీవుడ్ నటి, గాయని మేరీ మిల్బెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదనకు మద్దతు పలికారు. ఆఫ్రికన్ యూనియన్‌కు జీ-20లో శాశ్వత సభ్యత్వం ఇవ్వడం గురించి ప్రధాని ప్రస్తావించారు. ఈ నేపధ్యంలోనే అమెరికన్ సింగర్ మిల్బెన్ ప్రధాని మోదీని ప్రశంసించారు. ఆఫ్రికన్ యూనియన్ను జీ-20లో పూర్తిస్థాయి సభ్యునిగా చేర్చాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదనకు తాను మద్దతు ఇస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఈ మాట ద్వారా ఆమె కోట్లాది మంది భారతీయుల హృదయాలను మరోసారి గెలుచుకున్నారు. మేరీ మిల్బెన్ గాయని మాత్రమే కాదు మంచి నటి కూడా. ఆన్లైన్ సిరీస్ ఇంపాక్ట్ నౌ ఆమెకు ఎంతో పేరు తెచ్చింది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇదే కాకుండా ఆమె పలు ప్రాజెక్ట్‌లలో పనిచేసి మంచినటిగానూ పేరు తెచుకున్నారు. సింగర్ మిల్బెన్ జేఎండీఈఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకురాలు, సీఈవో. ఆమె ఏర్పాటు చేసిన సంస్థ పలువురు నిపుణులకు అవకాశాలను కల్పించింది. ఈ నటి 2010లో హెలెన్ హేస్ అవార్డును అందుకుంది. మేరీ మిల్బెన్ తల్లి అల్థియా పెంటెకోస్టల్ సంగీత పాస్టర్‌గా పనిచేశారు. ఆమె భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత అల్థియా మిల్బెన్ను పెంచి పెద్ద చేశారు. ఆమె తన తల్లి నుండి సంగీతాన్ని వారసత్వంగా అందుకున్నారు. తన 5 సంవత్సరాల వయస్సులోనే మిల్బెన్.. ఓక్లహోమా సిటీలో ఒక ప్రదర్శన ద్వారా తన ప్రతిభను నిరూపించుకున్నారు. మిల్బెన్‌కు ముగ్గురు సోదరీమణులు, ఒక సోదరుడు. మిల్బెన్ వివాహం చేసుకోలేదు. ఆమె రాజకీయాలపై కూడా ఆసక్తి కనబరిచారు. మిల్బెన్ పుట్నం సిటీ హై స్కూల్లో చదివారు. ఓక్లహోమా విశ్వవిద్యాలయంలో టెనార్ డాన్ బెర్నార్డిని నుండి ఆమె ఒపెరాను నేర్చుకున్నారు. మిల్బెన్ 2004లో ఆఫ్రికన్-అమెరికన్ మహిళా విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా, 2003లో మొదటి ఆఫ్రికన్-అమెరికన్ మహిళా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. అమెరికా అధ్యక్షులు జార్జ్ బుష్, బరాక్ ఒబామా, డోనాల్డ్ ట్రంప్, జో బైడెన్ కోసం జాతీయ గీతంతో పాటు పలు దేశభక్తి గీతాలను పాడిన ఏకైక గాయకురాలిగా మిల్బెన్ పేరు తెచ్చుకున్నారు. మిల్బెన్ ‘ఓం జై జగదీశ్’ పాట పాడటం ద్వారా ఆమె భారతీయులకు చేరువయ్యారు. ఇది కూడా చదవండి: ప్రొఫెసర్ వాసుదేవన్‌ను నాటి సీఎం జయలలిత ఎందుకు మెచ్చుకున్నారు? -
పొట్టకూటి కోసం రోడ్ల మీద టికెట్లు అమ్ముతున్న నటి
కరోనా వల్ల ఎంతోమంది నటీనటులు ఇబ్బందిపడ్డారు. కొందరు ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అందులో మలయాళ నటి మేరీ ఒకరు. 2016లో వచ్చిన యాక్షన్ హీరో బిజు మూవీతో గుర్తింపు పొందింది మేరీ. సినిమాల్లోనే కాకుండా పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది. కానీ కోవిడ్ సమయంలో ఆమె జీవితం అతలాకుతలమైంది. సినిమా ఛాన్సులు లేక జీవనోపాధి భారమైంది. పూట గడవటం కూడా కష్టంగా మారడంతో గత్యంతరం లేక రోడ్ల మీద లాటరీ టికెట్లు విక్రయిస్తోంది. ఉదయం ఆరున్నర గంటలకు ఇంట్లో నుంచి బయలు దేరి ఏ సాయంత్రానికో ఇల్లు చేరుకుంటోంది. లాటరీ టికెట్ల అమ్మకం ద్వారా రోజుకి రూ300 సంపాదిస్తోంది. కాగా మేరీ సుమారు 35 సినిమాల్లో నటించింది. సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో కూతురి పెళ్లి చేసింది. పనిలో పనిగా ఓ ఇల్లు కట్టుకోవాలనుకుంది. లోను తీసుకుని ఇంటి నిర్మాణం ప్రారంభించింది. కానీ ఇంతలో కరోనా వైరస్ విజృంభించి కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ వైపరీత్యం తర్వాత ఆమెకు ఆఫర్లు రావడం తగ్గిపోయాయి. అసలే మేరీ తనయుడి ఆరోగ్యం అంతంత మాత్రమే! అతడి వైద్య ఖర్చులు భరించాలన్నా, కుటుంబానికి తిండి పెట్టాలన్నా, తీసుకున్న అప్పు తీర్చాలన్నా ఏదో ఒక పని చేయక తప్పదనుకుంది. అందుకోసం లాటరీ టికెట్లు అమ్ముతూ వచ్చిన కొద్దిపాటితో పూట గడుపుతోంది. చదవండి: నా పెళ్లిలో పెద్ద గొడవ, చెప్పులతో కొట్టుకున్నారు: కత్రినా బుల్లితెర నటి ప్రెగ్నెంటా? అదేంటి పెళ్లైంది, కానీ భర్త లేడుగా! -
జనం లేని దీవిలో 30 ఏళ్లు నిర్భంధించారు
నేరమైనా, న్యాయమైనా కొన్నిసార్లు బలం ఎటు తూగితే అటు సాగుతుంది సమాజం. నిజానిజాలను నిర్ధారించే సాహసం చేయకుండానే! ఓ పోరాటం ఒంటరిగా నిస్సహాయతకు గురవుతుంటే.. వ్యతిరేక సాక్ష్యాలు కోకొల్లలై బలపడుతుంటే.. బహుశా అల్పమైన బతుకులు ఆయువు తీరేవరకూ తలవంచక తప్పదేమో?! అస్పష్టమైన నేరానికి నిర్బంధమనే శిక్షను చట్టం ఎప్పుడూ వ్యతిరేకిస్తుంది. కానీ నిర్దోషినని నిరూపించుకోగలగాలి కదా? అదే జరగలేదు ఆమె జీవితంలో! తనకే తెలియని ఓ ఉచ్చులో చిక్కుకుని ఓ విషాదాంతంగా ముగిసిపోయింది. చరిత్రలో ఓ మిస్టరీగా మిగిలిపోయింది. ఆమె అసలు పేరు మేరీ మల్లాన్. అయితే నేటికీ ఆమెను ‘టైఫాయిడ్ మేరీ’గానే గుర్తిస్తారంతా. 1869లో సెప్టెంబర్ 23న ఉత్తర ఐర్లాండ్‌లోని కూక్స్ టౌన్లో పుట్టింది. 1883లో తన 15వ ఏట బంధువులతో కలసి అమెరికాకు వలస వచ్చింది. అప్పట్లో ఇంటి, వంట పనులకు అక్కడ మంచి వేతనం ఉండడంతో వంట మనిషిగా కొలువులో చేరింది. ఆఖరికి అదేSఆమె తలరాతను మార్చింది. మేరీ చేతి వంట తిన్నవారెవరైనా సరే అమృతాన్ని రుచి చూసినట్టే. అంత అద్భుతమైన పాక ప్రావీణ్యంతో వంట మనిషిగా మేరీ జీవితం బాగానే సాగింది కొన్నేళ్ల పాటు. 1900లో అప్పటికే ఉనికిలోకి వచ్చిన టైఫాయిడ్ వ్యాప్తికి అపరిశుభ్రతే కారణమని కనిపెట్టారు శాస్త్రవేత్తలు. టైఫాయిడ్ సోకిన రోగి ద్వారానే అది ఇతరులకు వ్యాప్తి చెందుతుందని గుర్తించారు. ఈ పరిశీలన, పరిశోధన పర్యవసానం.. మేరీ.. టైఫాయిడ్ మేరీ కావడం. మేరీకి.. టైఫాయిడ్‌కి ఏంటి సంబంధం? అది తెలుసుకోవాలంటే ఆమెకు ఏమాత్రం సంబంధం లేని జార్జ్ సాపర్ అనే సివిల్ ఇంజినీర్ గురించి చెప్పుకోవాలి. 1906లో చార్లెస్ హెన్రీ వారెన్ అనే ధనికుడి ఇంట్లో ఒకేసారి ఆరుగురికి టైఫాయిడ్ వచ్చింది. వారంతా పరిశుభ్రతను పాటించే వ్యక్తులే. ఆ చుట్టుపక్కల టైఫాయిడ్ బాధితులు లేకపోవడంతో తమ కుటుంబానికి ఈ వ్యాధి ఎలా వ్యాపించిందో తెలుసుకోవాలని టైఫాయిడ్ వ్యాప్తిపై అనుభవం ఉన్న జార్జ్ సాపర్ని కోరాడు హెన్రీ. దాంతో మేరీ జీవితంలోకి ఆమె ప్రమేయం లేకుండా ఎంటర్ అయ్యాడు సాపర్. అప్పటికే హెన్రీ వారెన్ ఇంట్లో వంట మనిషిగా ఉన్న మేరీ.. ఆ కుటుంబంలో వారికి టైఫాయిడ్ సోకిన వారానికి చెప్పాపెట్టకుండా మానేసిందనే పాయింట్ పట్టుకున్నాడు సాపర్. ఆరా తియ్యడం మొదలుపెట్టాడు. మేరీ ఎవరి ఇంట్లోనూ ఎక్కువ కాలం పనిచేయదని, ఎప్పుడూ మారుతూ ఉంటుందని, ఆమె పనిచేసి వెళ్లిన ప్రాంతాల్లో టైఫాయిడ్ వ్యాపిస్తుందని తెలుసుకున్నాడు. అతడి అనుమానం బలపడింది. వివరాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు జనహితార్థం మేరీని న్యూయార్క్ దగ్గరలోని నార్త్ బ్రదర్ దీవిలో బంధించారు. మేరీకి వైద్య పరీక్షలు చేయించారు. అయితే ఆమెలో ఎలాంటి బ్యాక్టీరియా, వైరస్లు లేవని వైద్యులు తేల్చారు. దాంతో ఆ నిర్బంధాన్ని మేరీ వ్యతిరేకించింది. తన హెల్త్ రిపోర్ట్స్ సాక్ష్యంగా 1910లో న్యూయార్క్ స్టేట్ బోర్డ్ ఆఫ్ హెల్త్‌కు ఫిర్యాదు చేసి.. విడుదలైంది.. ఇకపై వంట చెయ్యకూడదనే షరతులకు ఒగ్గి! బయటకు వచ్చాక లాండ్రీ పని చేసుకుని బతికింది. కానీ చాలీచాలని జీతం జీవనానికి ఇబ్బందిగా మారడంతో.. మారు పేరు పెట్టుకుని మళ్లీ వంట చెయ్యడం మొదలు పెట్టింది. అదే ఆమె పాలిట శాపమైంది. 1915లో స్లోనే మహిళా ఆసుపత్రిలో వంట మనిషిగా చేరింది మేరీ. అక్కడ 22 మంది వైద్యసిబ్బందికి ఒకేసారి టైఫాయిడ్ వ్యాపించడం, అందులో ఇద్దరు చనిపోవడంతో.. మళ్లీ పోలీసులు రంగంలోకి దిగారు. ఈసారి మేరీని మనుషులు లేని దీవికి తరలించారు. ఆ దీవిలో మేరీ ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 30 ఏళ్లు నిర్బంధంలో గడిపింది. పక్షవాతం బారిన పడి ఆరేళ్లు కష్టపడింది. తన 69 ఏట (1938) న్యుమోనియాతో చనిపోయింది. శరీరంలో బ్యాక్టీరియా లేకుండా వ్యాధిని ఎలా వ్యాప్తి చేసిందనేది తేలకుండానే ఆమె కథ ముగిసింది. వైద్య పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో మేరీ పరిస్థితిపై పరిశోధనలు, విశ్లేషణలే కాదు.. ఆమె తరపున నిలబడి పోరాడిన మనుషులూ లేరు. అయితే ఈ ట్రాజెడీ స్టోరీ తెలుసుకున్న వారు మాత్రం.. ఆమె వంట చేసేటప్పుడు చేతులు శుభ్రం చేసుకునేది కాదేమోనని అభిప్రాయపడుతుంటారు. ∙సంహిత నిమ్మన -
ఎగిసిన క్షమా కేతనం పునరుత్థాన ఆదివారం
‘మృతులుండే సమాధిలో యేసుక్రీస్తును వెదకడానికి వచ్చారా? ఆయన ఇక్కడ లేడు, సజీవుడయ్యాడు. తన వారిని కలుసుకోవడానికి గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన్ను శుక్రవారం ఇదే సమాధిలో పడుకోబెట్టగా, ఇపుడు ఖాళీగా ఉన్న ఆ స్థలాన్ని కావాలంటే చూడండి’ అంటూ ఖాళీ సమాధిలో ఉన్న ఒక దేవదూత, ఈస్టర్ ఆదివారం తెల్లవారుజామునే ప్రభువు దేహానికి పరిమళ క్రియలు సంపూర్తి చేసేందుకు వచ్చిన యేసు తల్లి మరియకు, సలోమి అనే మరొక స్త్రీకి, ప్రభువు శిష్యురాలైన మగ్దలేనే మరియకు ఇంకా ఇతర స్త్రీలకు ఆనాటి ‘బ్రేకింగ్ న్యూస్’ ప్రకటించాడు. అది విని స్త్రీలంతా విస్మయమొంది భయంతో వణుకుతూ పారిపోయారు. అయితే సజీవుడైన యేసుక్రీస్తు మగ్దలేనే మరియకు ఆ రోజే మొట్టమొదట కనిపించి, తన పునరుత్థాన శుభవార్తను తన శిష్యులకు ప్రకటించమని ఆదేశించాడు. అయితే యేసు మరణంతో పుట్టెడు దుఃఖంలో కూరుకుపోయిన శిష్యులకు ఇది నమ్మశక్యంగా కనిపించలేదు. అందువల్ల వాళ్లంతా భోజనానికి కూర్చున్న సమయంలో యేసుప్రభువు వారిమధ్య ప్రత్యక్షమై, వారి అపనమ్మకాన్ని బట్టి వారిని మందలించి, సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి తన పునరుత్థాన క్షమా శుభవార్తను ప్రకటించమని ఆదేశించాడు (మార్కు 16:1–10). అందువల్ల క్రైస్తవానికి పునాది యేసుప్రభువు పునరుత్థానమే!! ప్రపంచంలోని అతి చిన్నదైన ఇజ్రాయేలు అనే దేశంలోని యూదయ అనే ఒక మూలన ఉన్న ప్రాంతంలో యేసుక్రీస్తు దైవకుమారుడుగా జన్మించి, ఒక సాధారణ మానవుడుగా అయినా ఏ లోపమూ లేని పాపరహితమైన సంపూర్ణ మానవుడుగా 33 ఏళ్ళపాటు సామాన్యులు, నిరుపేదలు, నిరక్షరాస్యులైన అతి సాధారణ ప్రజలతో మమేకమై జీవించిన యేసుక్రీస్తు ప్రబోధాలు, విలక్షణమైన ఆయన దైవికత మూల స్తంభాలుగా ఆరంభమైన ‘క్రైస్తవం’ అతి కొద్దికాలంలోనే అనేక ప్రపంచ దేశాలకు పాకి అనేక ప్రపంచ నాగరికతల్ని ప్రభావితం చేసింది. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ, కరడుగట్టిన హింసాత్మకతకు పుట్టినిల్లుగా మారిన లోకానికి ప్రేమ, సాత్వికత్వం, దీనత్వం, సమన్యాయం, క్షమాభావనల సౌరభాలనద్ది, కోట్లాదిమంది అనామకులకు ఉనికినిచ్చిన ఒక ఆత్మీయవిప్లవమైంది. క్రైస్తవం స్పృశించిన ప్రతి జీవి, నేల పరివర్తన నొంది పులకరించింది. ఈస్టర్ పండుగ అంటే, ఈ లోకం సిలువ వేసి చంపిన ఒక మహనీయుడు తిరిగి సజీవుడయ్యాడని సంబరపడే సందర్భం మాత్రమే కాదు, హింసకు ప్రతి హింసే జవాబని మాత్రమే తెలిసిన లోకానికి, క్రీస్తు జీవితంలో పరిఢవిల్లిన క్షమాపణను, ప్రేమను పరిచయం చేసి విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన శుభారంభపు తొలి దినమది. రెండు రోజుల ముందే సిలువలో యేసు ప్రభువు మీద ఉవ్వెత్తున విరుచుకుపడ్డ కనీ వినీ ఎరుగని దౌర్జన్యం, దమనకాండ, హింస ఆయన ప్రేమ, క్షమాపణ శక్తి ముందు నిర్వీర్యమై ఓటమి పాలయ్యాయని లోకానికి ప్రకటితమైన రోజు అది. అది సమాప్తమే... కాని అంతం కాదు... శుక్రవారం నాటి యేసు సిలువ యాగం విషాదంతో సమాప్తమైంది. అయితే ఆదివారం తెల్లవారు జామున యేసు పునరుత్థానంతో లోకంలో ‘క్షమాయుగపు’ శుభారంభం జరిగింది. మానవాళిని తన అపారమైన కృపలో భాగం చేసుకోవాలన్న దేవుని అనాది సంకల్పం, అలా దౌర్జన్యం, దుర్మార్గం పైన యేసు సిలువ బలియాగం ద్వారా ఘన విజయం సాధించి క్రైస్తవానికి బీజాలు వేసింది. శుభ శుక్రవారం నాడు సిలువలో, ఈస్టర్ ఆదివారం నాడు యేసు పునరుత్థానంతో ఖాళీ అయిన రాతి సమాధిలో దేవుని ప్రేమ, క్షమాపణ పునాదులుగల దేవుని రాజ్యం వెల్లివిరిసింది. ఆయన్ను సిలువ వేసి చంపి అంతం చేద్దామనుకున్న రోమా సామ్రాజ్యం ఆ తరువాత మూడొందల ఏళ్లకే పతనమై భూస్థాపితమైంది. కానీ నాటి సిలువలో, ఖాళీ సమాధిలో అంకురార్పణ జరిగిన దేవుని క్షమారాజ్యం ఈ రెండువేల ఏళ్లుగా ప్రపంచమంతా విస్తరిస్తూనే ఉంది, కోట్లాదిమందికి ఆశీర్వాదాల్ని ప్రసాదిస్తూనే. ఆరున్నర అడుగుల ప్రభువు యూదుల అత్యున్నత చట్టసభ సన్ హెడ్రిన్లో సభ్యుడైన అరిమతై యోసేపు తన కోసం తొలిపించుకున్న ఒక కొత్త రాతి సమాధిలో శుభ శుక్రవారం నాటి సాయంత్రం యేసుప్రభువు పార్థివ దేహాన్ని ఖననం చేశారని బైబిల్ పేర్కొంటోంది (మత్తయి 27:57–60, యోహాను 19:41). ప్రభువు సమాధి ఒక తోటలో ఉండిందని కూడా యోహాను సువార్త పేర్కొంది (19:41). పైగా యెరూషలేములో హీబ్రు భాషలో ‘గొల్గొతా’ అని, లాటిన్ భాషలో ‘కల్వరి’ అని పిలిచే కపాలం లాగా కనిపించే ఒక కొండకు దగ్గరలో ఆయన్ను సిలువ వేశారని, దానికి దగ్గరలోని ఒక తోటలోనే ఆయన సమాధి ఉందని కూడా బైబిల్ పేర్కొంది. ఈ ఆనవాళ్ళంటికీ సరిపోలిన ఆయన సమాధి స్థలం కోసం చరిత్రలో పురాతత్వశాస్త్రవేత్తలు, బైబిల్ పండితులు చేసిన ఎంతో అన్వేషణ, పరిశోధనలు ఫలించి ‘గార్డెన్ టూంబ్’గా పిలిచే ఒక రాతి సమాధి యెరూషలేము పట్టణంలో దమస్కు ద్వారానికి దగ్గరలో బయటపడింది. బైబిల్ పురాతత్వ పరిశోధనలకు పితామహుడుగా పేర్కొన దాగిన ఎడ్వర్డ్ రాబిన్సన్ అనే అమెరికన్ చరిత్రకారుడు 1852 దాకా చేసిన తన పరిశోధనల సారాంశాన్నంతా ‘బిబ్లికల్ రీసెర్చ్ ఇన్ పాలస్తీనా’ అనే పేరుతో ఒక గ్రంథంగా ప్రచురించడంతో ఈ సమాధి విషయం ప్రపంచానికి తెలిసింది. అప్పటి నుండి ‘గార్డెన్ టూంబ్’ అనే ఈ సమాధి స్థలం క్రైస్తవ పర్యాటకులకు ముఖ్యంగా ప్రొటెస్టెంట్ తెగకు చెందిన వారికి దర్శనీయ స్థలమైంది. ఈ తోట భూగర్భంలో బయటపడిన బ్రహ్మాండమైన ఒక రాతి నీటి తొట్టి, ఒక పెద్ద ఒలీవ నూనె గానుగ ఒకప్పుడు అదొక ఆలివ్ తోట అని చెప్పడానికి రుజువులయ్యాయి. గొప్ప విశేషమేమిటంటే, ఆ సమాధిని అరిమతై యోసేపు తన కోసం తన ఎత్తు ప్రకారంగా తొలిపించుకున్నాడు. కాని అనుకోకుండా యేసుప్రభువును అందులో పడుకోబెట్టినపుడు, ఆ భాగం యేసుప్రభువు ఎత్తుకు సరిపోలేదు. అందువల్ల ఆయన కాళ్ళుండిన స్థలంలో సమాధి రాతి గోడను నాలుగంగుళాలపాటు అప్పటికప్పుడు తొలిపించిన గుర్తులు కనిపిస్తాయి. దాన్ని బట్టి యేసుప్రభువు ఎత్తు ఆరడుగుల ఐదంగుళాలకు పైనే ఉంటుందని అంచనా వేయవచ్చు. పైగా ఆయన సమాధికి అడ్డుగా పెట్టిన అతి పెద్ద రాయిని మనకోసం ఎవరు తొలగిస్తారంటూ ప్రభువు అనుచరులైన మగ్దలేనే మరియ తదితర స్త్రీలు ఈస్టర్ ఆదివారం తెల్లవారుజామున ఆయన సమాధి వద్దకు వెళ్తూ మాట్లాడుకున్నట్టు బైబిల్లో చదువుతాము. నాడు సమాధికి అడ్డంగా ఐదడుగుల ఎత్తు రెండు టన్నుల బరువున్న ఒక గుండ్రటి రాయిని పెట్టారన్నది, ఇపుడా సమాధి ద్వారం వద్ద దాన్ని దొర్లించడానికి చేసిన రాతి కాలువలాంటి స్థలాన్ని బట్టి అర్థమవుతుంది. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ సువార్త ప్రబోధకులు -
నెల రోజుల అమ్మ
స్త్రీ అమ్మగా మారడానికి రోజులు అక్కర్లేదు. ఒక్క నిమిషం చాలు. పసిబిడ్డ గుండెలకు తాకిన మరుక్షణమే ఏ స్త్రీ అయినా తల్లిలా మారిపోతుంది. మేరి అనిత కూడా అలా మారింది. కాని ఆమె షించాల్సిన పాత్ర నెలరోజులు మాత్రమే అనే వాస్తవం ఉద్వేగభరితమైనది. జూన్ 14, 2020. ఎర్నాకులంలోని చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు ఒక ఫోన్ వచ్చింది. షీనా అనే మహిళకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, ఆమెకు ఆరు నెలల కుమారుడు ఉన్నాడని, ఆ పసివాణ్ణి చూసుకోవడానికి మనిషి కావాలని. కాని ఎవరూ లేరు. చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కలిసి పని చేస్తున్నడా. మేరీ అనితకు ఈ సంగతి తెలిసింది. ఆమె క్లినికల్ సైకాలజిస్ట్. స్పెషల్ చిల్డ్రన్ కోసం ఒక కేంద్రం నడుపుతోందామె. ‘ఎవరూ లేరు. కాని నేను ఆ పసివాడికి తల్లినవుతాను’ అంది మేరీ. కోవిడ్ వచ్చిన తల్లిదండ్రులు ఆ పసివాడి పేరు ఉన్నికుట్టన్. తల్లిదండ్రులు నర్సులుగా హర్యానా వెళ్లి ఉపాధి పొందుతున్నారు. అక్కడ మొదట తండ్రికి కరోనా వచ్చింది. అతడు అక్కడే క్వారంటైన్లోకి వెళ్లగా తల్లి బాబును తీసుకొని కేరళలోని సొంత ప్రాంతమైన ఎర్నాకులం వచ్చింది. వచ్చాక ఆమెకు కోవిడ్ పాజిటివ్ తేలింది. అదృష్టవశాత్తు పసివాడికి నెగెటివ్ వచ్చింది. తల్లి వైద్యానికి ఆస్పత్రిలో ఉంటే పసివాణ్ణి ఎవరు చూసుకోవాలనే సమస్య వచ్చింది. షీనా బంధువులు కాని ముసలి తల్లిదండ్రులు కాని సాయం చేసే స్థితిలో లేరు. ఆ సమయంలో మేరీ అనిత ముందుకు వచ్చింది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త అడ్వకేట్‌గా పని చేస్తున్నాడు. వారిని సలహా అడిగితే వారంతా మనస్ఫూర్తిగా పసివాడికి సాయం చేయమన్నారు. పిల్లవాడికి ఏ క్షణమైనా కోవిడ్ వచ్చే అవకాశం ఉండటంతో మేరి అనిత వాణ్ణి తీసుకొని పక్కనే ఉన్న ఒక ఖాళీ ఫ్లాట్‌లోకి మారి క్వారంటైన్లోకి వెళ్లింది. నెల రోజులుగా బాబుకు అమ్మలా మారి బాగోగులు చూసుకుంది. నెల రోజుల తల్లి ఉన్నికుట్టన్‌కు అమ్మపాలు అలవాటు. కాని మేరి అనిత మెల్లగా పోతపాలలోకి మార్చగలిగింది. మెల్లమెల్లగా పసివాడు మేరిలోనే తల్లిని చూసుకోసాగాడు. ఈ నెలరోజులు వారి మధ్యగట్టి బంధం ఏర్పడిపోయింది. తండ్రి హర్యానా నుంచి తిరిగి రాగా, తల్లి కోవిడ్ నుంచి బయట పడగా రెండు రోజుల క్రితం మేరి ఆ పసివాణ్ణి సొంత తల్లిదండ్రులకు అధికారుల సమక్షంలో అప్పజెప్పింది. ఉన్నికుట్టన్ తల్లిని గుర్తుపట్టి మెల్లగా నవ్వాడు. కాని పసివాణ్ణి తిరిగి ఇస్తూ మేరి కంట నీరు పెట్టుకుంది. ‘ఆమె దేవతలా నా బిడ్డను కాపాడింది’ అని షీనా అంది. మేరి ఉండే అపార్ట్మెంట్లోని వారంతా వచ్చి ఉన్నికుట్టన్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే తన ఇల్లు చేరుకున్నాక ఉన్ని కుట్టన్ మేరి కోసం ఏడుపు మొదలు పెట్టాడు. అది గమనించిన తల్లి షీనా వెంటనే మేరికి కాల్ చేసింది. ‘ఒకసారి వీడియోకాల్ చేస్తాను. మాట్లాడండి’ అని ప్రాధేయపడింది. మేరి అనిత ఆ విన్నపాన్ని మన్నించలేదు. ‘వద్దు. మీ ప్రేమతో వాణ్ణి నన్ను మరిపించండి’ అని మెల్లగా ఫోన్ పెట్టేసింది. పాశం పెంచుకునే సందర్భాలు ఎంత సంతోషాన్ని ఇస్తాయో తుంచుకునే క్షణాలు అంత బాధను మిగులుస్తాయి. కరోనా నమోదు చేసిన లీలల్లో ఇది ఒకటి. -
ముగిసిన మేరీమాత ఉత్సవాలు
కర్నూలు సీక్యాంప్: ఈ నెల 2వ తేదీ నుంచి బిషప్ చర్చిలో నిర్వహిస్తున్న మేరీమాత ఉత్సవాలు శనివారంతో ముగిశాయి. చివరిరోజు జిల్లా నలుమూలల నుంచి క్రైస్తవులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కర్నూలు, అనంతపురం డయాసిస్ బిషప్ పూల ఆంతోని దైవసందేశం వినిపించారు. శత్రువును కూడా ప్రేమతో జయించాలని ఆయన ఉద్బోధించారు. దివ్యవాణి ఆధ్యాత్మిక చానల్ కోఆర్డినేటర్ పప్పుల సుధాకర్, ఉపదేశి ఆంతోని, మరియదళ్ సభ్యులు, యూత్, క్యాథలిక్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
ఎక్కువగా ఏసీని వాడుతున్నారని..
ఆంగ్మలీ: ఏసీని ఎక్కువగా ఉపయోగిస్తున్నారనే కారణంతో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి.. భార్య, కొడుకుతో గొడవపడి వారిని చంపేశాడు. ఏసీ ఆన్ చేసుకుని నిద్రపోతున్న భార్య, కొడుకును చూసి ఆవేశాన్ని అణుచుకోలేక పోయిన 81 ఏళ్ల పాల్ వారిద్దరినీ ఇనుప రాడ్డుతో కొట్టాడు. కొడుకు థామస్ అక్కడిక్కడే మరణించగా, భార్య మేరీ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయినట్టు పోలీసులు చెప్పారు. కేరళలోని ఆంగ్మలీలో ఈ ఘటన జరిగింది. తల్లి, బిడ్డలను రాడ్‌తో కొట్టిన తర్వాత బంధువులకు ఫోన్ చేసి పాల్ జరిగిన విషయం చెప్పాడు. అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసినా వృద్ధాప్యం కారణంగా చేసుకోలేకపోయాడు. గత కొద్ది రోజులుగా తన కుటుంబ సభ్యులు ఏసీని ఎక్కువగా వాడుతున్నారని, దీనివల్ల కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని, కేవలం పెన్షన్‌తో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టమవుతోందని, అందుకే వారిని చంపినట్లు పాల్ పోలీసుల విచారణలో తెలిపాడు. -
మేలుకొలుపు
ముక్కూముఖం తెలియకపోయినా ముంగిటకొచ్చేస్తారు. మనతో మనసారా ముచ్చట్లు పెట్టేస్తారు.వీనుల విందుగా పాడేస్తారు. వెలుగులు నింపాలని మన తరఫున దేవుడ్ని ప్రార్థిస్తారు. ముందుగానే పండుగ కళ తెచ్చేస్తారు. మధురానుభూతిని మిగిల్చి వెళ్లిపోతారు. అర్ధరాత్రిళ్లు వచ్చే అతిథులు వీరు. అను‘రాగాల’ బంధువులు వీరు. ..:: ఎస్.సత్యబాబు దేవుడు తనను తల్లిగా స్వీకరించనున్నాడని తెలియగానే మేరీ మాతకు పట్టలేని ఆనందం కలుగుతుంది. దాంతో ఆమె ఆ సంతోషాన్ని తన సోదరితో పంచుకోవడానికి మార్గంగా పాటను ఎంచుకుంది. అయితే అంతకు ముందే ఆమె సోదరి పాటతో ఆమెకు స్వాగతం పలికింది. ఏసుప్రభువు జన్మదిన సంబరాలకు, ఎల్లలెరుగని సంగీతానికి ఉన్న అనుబంధం బైబిల్ కథల్లో అడుగడుగునా ప్రస్ఫుటిస్తుంది. క్రిస్మస్ వచ్చిందంటే ఇళ్లన్నీ ఇంపైన సంగీత నిలయాలవుతాయి. ప్రార్థనా మందిరాలన్నీ పాటల వేదికలవుతాయి. వీటిలో అత్యంత ఆసక్తి కలిగించేవి అర ్ధరాత్రుల్లో సందడి చేసే కేరల్స్. పుట్టుక వెనుక... తొలుత క్రీస్తు రాక గురించిన సమాచారాన్ని ఏంజెల్స్ ద్వారా తెలుసుకున్న మూగజీవాలు ఆనందంతో వీధుల్లో తిరుగుతూ అందరికీ ఈ విషయాన్ని పాటల రూపంలో తెలియజేశాయట. ఈ కథను ఆధారం చేసుకుని ఆవిర్భవించినవే కేరల్స్ సంబరాలు. క్రిస్మస్ పండుగకు కొన్ని రోజుల ముందుగా (సుమారుగా 5 నుంచి వారం రోజులు) ప్రారంభమై డిసెంబర్ 23 రాత్రితో ఈ కేరల్స్ సందడి ముగుస్తుంది. చీకటిలో వెలుగుపాటలు సాధారణంగా డిసెంబర్ 15 తర్వాత ప్రారంభమవుతుంది కేరల్స్ సందడి. రాత్రి 9 గంటల ప్రాంతంలో కేరల్స్ గ్రూప్స్ వీధుల్లో సంచరిస్తాయి. ఇళ్లలో మేలుకొలుపు పాటలు అందుకుంటాయి. తెల్లవారుఝామున 5 గంటల వరకూ వీరి సందడి కొనసాగుతుంది. అందుబాటులో ఉండే ఇళ్లను ఎంచుకుని వారికి ముందస్తు సమాచారం ఇచ్చి ఆయా ఇళ్లకు వెళ్తారు. క్రిస్మస్ శుభవార్త చెప్పడం, పాటలు పాడడం, ఆనందాన్ని పంచడం, ఆయా కుటుంబీకుల క్షేమం గురించి ప్రార్థించడం, బైబిల్ ఇచ్చి వెళ్లడం.. ఈ బృందం పనులు. ‘చర్చి మెంబర్స్ ఇళ్లకు మాత్రమే కాక నాన్ చర్చి మెంబర్స్ ఇళ్లకూ వెళ్తుంటాం. ఒకచోట కార్యక్రమం జరుగుతుంటే పొరుగింటివాళ్లు వచ్చి అడుగుతారు. అప్పుడు అక్కడికీ వెళ్తాం’ అని సిటీలోని కేరల్గ్రూప్ సభ్యురాలైన అమూల్య షెరాన్ చెప్పారు. ఒక్కో ఇంట్లో అత్యధికంగా 15 నిమిషాలకు మించి గడపరు. రోజులో 10 నుంచి 15 ఇళ్ల వరకూ చుట్టేస్తారు. ఇంగ్లిష్, హిందీ, తెలుగు.. ఇలా పలు భాషల్లో పాటలు పాడతారు. అందరూ బంధువులే... అపరిచితుల్ని అను‘రాగ’బందీలుగా మారుస్తూ ఈ కేరల్స్ సంప్రదాయం నగరంలో అద్భుతంగా అల్లుకుపోతోంది. సాధారణంగా పాస్టర్ల అనుమతితో చర్చిలకు సంబంధించిన బృందాలు కేరల్స్ గ్రూప్స్‌గా ఏర్పాటవుతాయి. ఈ కార్యక్రమానికి పెరుగుతున్న ఆదరణ కారణంగా కొందరు స్వచ్ఛందంగా బృందాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. పరిచయస్తులు, బంధువులు, మిత్రుల ఇళ్లకు ఒక్కోసారి అపరిచితుల ఇళ్లకు సైతం వెళుతున్నారు. ఈ బృందాల్లో విద్యార్థులు, వ్యాపారులు, ఐటీ ప్రొఫెషనల్స్.. ఇలా భిన్న రంగాలకు చెందిన వారు సభ్యులుగా మారుతున్నారు. సింగర్స్, గిటారిస్ట్‌లు, కీబోర్డ్ ప్లేయర్స్, కాంగో ప్లేయర్స్.. ఇలా విభిన్న రకాల వాద్యాలు పలికించగల నేర్పు ఉన్నవారు తమ టాలెంట్ చూపించడానికి ఈ సందర్భం అద్భుతమైన అవకాశంగా మారుతోంది. కుల, మతాలకు అతీతంగా సంగీతాభిమానులను, వినూత్న వేడుకలను ఆస్వాదించే వారిని అమితంగా ఆకట్టుకుంటోంది. వణికించే చలిని సైతం లెక్కచేయకుండా పెద్దసంఖ్యలో కేరల్స్ గ్రూప్‌లలో సభ్యులవుతున్నారు. కొన్నిసార్లు కేరల్ గ్రూప్స్ మెంబర్స్ సంఖ్య ఎక్కువైపోతుండడంతో మినీ బస్సులు సైతం ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. ఇతరుల బాగు కోసం మా న్యూలైఫ్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చి తరపున కేర్‌సెల్ గ్రూప్స్ అని వ్యవహరిస్తాం. పారడైజ్ కేర్‌సెల్, అల్వాల్ కేర్‌సెల్.. అలా ఇవి లొకేషన్ వైజ్ డివైడ్ అవుతాయి. మా గ్రూప్‌లో 20 మంది ఉన్నాం. నేను 2012 నుంచి కేరల్ గ్రూప్‌తో వెళుతున్నా. చలిలో వెళ్లడం. కొత్త వ్యక్తుల్ని కలవడం, అపరిచితులైనా వారి బాగు కోసం మనస్ఫూర్తిగా ప్రార్థించడం.. ఇవన్నీ గొప్ప ఫీలింగ్‌ని అందిస్తాయి. కొంత మంది టీ, కాఫీ, బిస్కెట్స్ మాతో షేర్ చేసుకుంటారు. మాకు ఒక లీడ్ సింగర్, గిటారిస్ట్ ఐసెక్, ఫిమేల్ ఓకలిస్ట్ మీతీ ఉన్నారు. ప్రీతమ్, నేను కో ఆర్డినేట్ చేస్తాం. - అమూల్య షెరాన్ -
ప్రేమ పేరుతో కానిస్టేబుల్ నయ వంచన
నమ్మించి మహిళను లొంగదీసుకుని దగా డీఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు కదిరి టౌన్:చట్టాన్ని రక్షిస్తూ.. ప్రజల్ని కాపాడాల్సిన పోలీసే.. ఓ మహిళను ప్రేమ పేరుతో నమ్మించి లొంగదీసుకుని.. ఆపై వంచించాడు. బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై కదిరి పట్టణ డీఎస్పీకి శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేసింది. శనివారం బాధితురాలు మీడియాకు ఈ వివరాలు వెల్లడించింది. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన మేరీ(38) కొంత కాలం క్రితం భర్త నుంచి విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది. మదనపల్లిలోనే ఆమె ఆదర్శ ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ పేరుతో స్వచ్ఛంద సంస్థ నడుపుతోంది. అప్పట్లో తన సంస్థ కార్యక్రమాలకు కదిరి ఎమ్మెల్యే షాజహాన్‌ను ఆహ్వానిస్తుండేది. అప్పట్లో ఆయన వద్ద గన్‌మెన్‌గా ఉన్న వివాహితుడైన కానిస్టేబుల్ ఆంజనేయులు(పీసీ-141) మేరీతో పరిచయం పెంచుకున్నాడు. ఏదైనా పని ఉంటే ఎమ్మెల్యేతో చెప్పి చేయిస్తానంటూ ఆశ చూపాడు. అనంతరం నిన్ను ప్రేమిస్తున్నాను.. జీవితాంతం నీకు తోడుగా ఉంటానంటూ నమ్మబలికి సన్నిహితంగా మెలిగాడు. ఏడాది క్రితం కదిరి పట్టణ పోలీస్ స్టేషన్‌కు బదిలీ కావడంతో.. తనకు తిండితో ఇబ్బందిగా ఉందని, కదిరికి వచ్చి తనతో పాటు ఉండాలని మేరీని కోరాడు. కానీ తన సంస్థ కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుందని తొలుత ఆమె నిరాకరించినప్పటికీ, తర్వాత కొందరితో చెప్పించడంతో ఒప్పుకుంది. దీంతో మే 23న కదిరిలోని రాజేంద్రప్రసాద్ వీధిలోని అద్దె ఇంట్లో కాపురం పెట్టాడు. ఈ విషయం తెలిసి సదరు కానిస్టేబుల్ సోదరుడు వెంకటస్వామి, అతని ఇరువురు కుమారులు ఇటీవల మేరీ ఇంట్లోకి చొరబడి నానా దుర్భాషలాడుతూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ దౌర్జన్యం చేశారు. ఆంజనేయులు సైతం తనను కులం పేరుతో దూషిస్తూ.. ఇకపై నీకు, నాకు ఎలాంటి సంబంధం లేదు.. జరిగిన విషయాన్ని ఎక్కడైనా చెబితే నీ అంతు చూస్తానంటూ బెదిరించి, వస్తువులు చిందరవందర చేసి భయభ్రాంతులకు గురిచేసినట్లు బాధితురాలు డీఎస్పీ ఎదుట వాపోయింది. తనకు ఎలాంటి హానీ కలగకుండా చూడాలని, నిందితుడిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి కానిస్టేబుల్ ఆంజనేయులుపై కేసు నమోదు చేస్తామని డీఎస్పీ దేవదానం, పట్టణ ఎస్ఐ-2 రహిమాన్ తెలిపారు. -
ఇద్దరిని మింగిన వ్యవసాయ బావి
గుండ్రాతిమడుగు(కురవి), న్యూస్‌లైన్ : వ్యవసాయ బావి ఇద్దరిని మింగింది. ప్రమాదవశాత్తూ బావిలో ఇద్దరు చిన్నారులు పడిపోగా వారిని రక్షించేందుకు ఓ యువకుడు అందులోకి దిగాడు. ఇద్దరు చిన్నారుల్లో ఒకరిని ఒడ్డుకు చేర్చిన అతడు మరో చిన్నారి కోసం నీళ్లలోకి వెళ్లాడు. నీళ్లలో మునిగిపోతున్న ఆ బాలిక భయంతో అతడిని గట్టిగా పట్టుకోవడంతో ఊపిరాడక ఇద్దరూ ప్రాణాలొదిలారు. మండలంలోని గుండ్రాతిమడుగు(విలేజి) శివారు పెద్దతండా స్టేజీ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గుండ్రాతిమడుగు(విలేజి) శివారు పెద్దతండా స్టేజీ వద్ద నాగార్జున పెంకు ఫ్యాక్టరీలో తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాలకు చెందిన వలసకూలీలు పనిచేస్తున్నారు. పెంకు ఫ్యాక్టరీ వెనుక కొంతదూరంలో వ్యవసాయ బావి ఉంది. కూలీల పిల్లలు వ్యవసాయబావి వద్దకు సాయంత్రం ఆడుకునేందుకు వెళ్లారు. కొందరు పిల్లలు బావిలోకి దిగి ఈత కొడుతుండగా, గోపి అమ్మాజీ, రమణ దంపతుల కుమార్తె మేరీ(7), మరో బాలుడు మేళిక కిషోర్‌తోపాటు మరికొందరు వారిని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తూ కాలుజారడంతో మేరి, కిషోర్ బావిలో పడిపోయారు. ఇది గమనించి బావి పక్కనే ఉన్న మరికొందరు పిల్లలు ఏడుస్తూ ఫ్యాక్టరీ వైపు పరుగులు తీశారు. ఫ్యాక్టరీ ఆవరణలో కట్టెలు కొడుతున్న నిమ్మక దుర్గాప్రసాద్(22)కు విషయం చెప్పడంతో అతడు పరుగున వెళ్లి బావిలోకి దిగాడు. మునుగుతూ తేలుతున్న కిషోర్‌కు చేయి అందించి ఒడ్డుకు చేర్చాడు. ఆ తర్వాత ఆతృతలో తనకు ఈత రాని విషయూన్ని మరిచిపోయి నీళ్లలో మునిగిపోతున్న మేరీని రక్షించేందుకు ముందుకు వెళ్లాడు. అయితే అప్పటికే భయం తో ఉన్న మేరి అతడిని గట్టిగా పట్టుకుంది. అప్పటికే ఆల స్యం కావడం, మేరీ అతడిని విడవకపోవడంతో ఊపిరాడక ఇద్దరు కలిసే ప్రాణాలు వదిలారు. ఈలోపు అక్కడికి చేరుకున్న కూలీలు వారి మృతదేహాలను ఫ్యాక్టరీలో బయటకు తీసి, ఎస్సై ఎండీ మస్తాన్మియాకు సమాచారం అందించా రు. ఆయన సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మానుకోట ఆస్పత్రికి తరలించారు. పెంకు ఫ్యాక్టరీలో విషాదం.. విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని నాయుడువలస గ్రామానికి చెందిన నిమ్మక దుర్గాప్రసాద్,చుక్క దంపతులు ఐదేళ్ల క్రితం ఇక్కడికి వలస వచ్చారు. వారికి ఏడు నెలల పసిపాప ఉంది. మరో మృతురాలు మేరీ తల్లిదండ్రులు గోపి అమ్మాజీ, రమణ దంపతులు తూర్పుగోదావరి జిల్లా కిర్లపూడి మండలంలోని సింహాద్రిపురం నుంచి 18 సంవత్సరాల క్రితం వలస వచ్చారు. ఇక్కడే ఫ్యాక్టరీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారితోపాటు ఆ ప్రాంతానికి చెందిన సుమారు మరో 40 కుటుంబాలు ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాయి. బతుకుదెరువు కోసం వచ్చిన ఆ కుటుంబాల్లో దుర్గాప్రసాద్, మేరీల మృతి పెను విషాదం నింపింది. కార్మికుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.