కరోనా వల్ల ఎంతోమంది నటీనటులు ఇబ్బందిపడ్డారు. కొందరు ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అందులో మలయాళ నటి మేరీ ఒకరు. 2016లో వచ్చిన యాక్షన్ హీరో బిజు మూవీతో గుర్తింపు పొందింది మేరీ. సినిమాల్లోనే కాకుండా పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది. కానీ కోవిడ్ సమయంలో ఆమె జీవితం అతలాకుతలమైంది. సినిమా ఛాన్సులు లేక జీవనోపాధి భారమైంది. పూట గడవటం కూడా కష్టంగా మారడంతో గత్యంతరం లేక రోడ్ల మీద లాటరీ టికెట్లు విక్రయిస్తోంది. ఉదయం ఆరున్నర గంటలకు ఇంట్లో నుంచి బయలు దేరి ఏ సాయంత్రానికో ఇల్లు చేరుకుంటోంది. లాటరీ టికెట్ల అమ్మకం ద్వారా రోజుకి రూ300 సంపాదిస్తోంది.
కాగా మేరీ సుమారు 35 సినిమాల్లో నటించింది. సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో కూతురి పెళ్లి చేసింది. పనిలో పనిగా ఓ ఇల్లు కట్టుకోవాలనుకుంది. లోను తీసుకుని ఇంటి నిర్మాణం ప్రారంభించింది. కానీ ఇంతలో కరోనా వైరస్ విజృంభించి కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ వైపరీత్యం తర్వాత ఆమెకు ఆఫర్లు రావడం తగ్గిపోయాయి. అసలే మేరీ తనయుడి ఆరోగ్యం అంతంత మాత్రమే! అతడి వైద్య ఖర్చులు భరించాలన్నా, కుటుంబానికి తిండి పెట్టాలన్నా, తీసుకున్న అప్పు తీర్చాలన్నా ఏదో ఒక పని చేయక తప్పదనుకుంది. అందుకోసం లాటరీ టికెట్లు అమ్ముతూ వచ్చిన కొద్దిపాటితో పూట గడుపుతోంది.
చదవండి: నా పెళ్లిలో పెద్ద గొడవ, చెప్పులతో కొట్టుకున్నారు: కత్రినా
బుల్లితెర నటి ప్రెగ్నెంటా? అదేంటి పెళ్లైంది, కానీ భర్త లేడుగా!
Comments
Please login to add a commentAdd a comment