lottery tickets
-
పొట్టకూటి కోసం రోడ్ల మీద టికెట్లు అమ్ముతున్న నటి
కరోనా వల్ల ఎంతోమంది నటీనటులు ఇబ్బందిపడ్డారు. కొందరు ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అందులో మలయాళ నటి మేరీ ఒకరు. 2016లో వచ్చిన యాక్షన్ హీరో బిజు మూవీతో గుర్తింపు పొందింది మేరీ. సినిమాల్లోనే కాకుండా పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది. కానీ కోవిడ్ సమయంలో ఆమె జీవితం అతలాకుతలమైంది. సినిమా ఛాన్సులు లేక జీవనోపాధి భారమైంది. పూట గడవటం కూడా కష్టంగా మారడంతో గత్యంతరం లేక రోడ్ల మీద లాటరీ టికెట్లు విక్రయిస్తోంది. ఉదయం ఆరున్నర గంటలకు ఇంట్లో నుంచి బయలు దేరి ఏ సాయంత్రానికో ఇల్లు చేరుకుంటోంది. లాటరీ టికెట్ల అమ్మకం ద్వారా రోజుకి రూ300 సంపాదిస్తోంది. కాగా మేరీ సుమారు 35 సినిమాల్లో నటించింది. సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో కూతురి పెళ్లి చేసింది. పనిలో పనిగా ఓ ఇల్లు కట్టుకోవాలనుకుంది. లోను తీసుకుని ఇంటి నిర్మాణం ప్రారంభించింది. కానీ ఇంతలో కరోనా వైరస్ విజృంభించి కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ వైపరీత్యం తర్వాత ఆమెకు ఆఫర్లు రావడం తగ్గిపోయాయి. అసలే మేరీ తనయుడి ఆరోగ్యం అంతంత మాత్రమే! అతడి వైద్య ఖర్చులు భరించాలన్నా, కుటుంబానికి తిండి పెట్టాలన్నా, తీసుకున్న అప్పు తీర్చాలన్నా ఏదో ఒక పని చేయక తప్పదనుకుంది. అందుకోసం లాటరీ టికెట్లు అమ్ముతూ వచ్చిన కొద్దిపాటితో పూట గడుపుతోంది. చదవండి: నా పెళ్లిలో పెద్ద గొడవ, చెప్పులతో కొట్టుకున్నారు: కత్రినా బుల్లితెర నటి ప్రెగ్నెంటా? అదేంటి పెళ్లైంది, కానీ భర్త లేడుగా! -
133 కోట్ల డాలర్ల.. ‘మెగా’ జాక్‌పాట్!
షికాగో: అమెరికాలో ఇద్దరు అదృష్టవంతులు మెగా మిలియన్స్ లాటరీలో ఏకంగా 133.7 కోట్ల డాలర్ల జాక్‌పాట్ గెలుచుకున్నారు. జూలై చివర్లో ఓ పెట్రోల్‌బంక్‌లో కొన్న టికెట్‌ను ఈ అదృష్టం వరించిందని లాటరీ సంస్థ పేర్కొంది. ఏకమొత్త చెల్లింపు కింద విజేతలకు 78 కోట్ల డాలర్లు అందుతుంది. దాన్ని వారిద్దరూ పంచుకుంటారు. వారి కోరిక మీద పేర్లను గోప్యంగా ఉంచారు. ఇది అమెరికా చరిత్రలో మూడో అతి పెద్ద జాక్‌పాట్. గత ఏప్రిల్ నుంచి వరుసగా 29 డ్రాల్లో ఒక్కరు కూడా గెలుచుకోకపోవడంతో అది ఇంత భారీగా పెరిగిందట. ఇదీ చదవండి: రూ.2.3 లక్షల టిప్ ఇచ్చాడు.. తీసుకున్నాక సీన్ రివర్స్.. ఆమె ఆనందం ఆవిరి.. -
లాటరీ టికెట్ల దందా : టీడీపీ నాయకుడు అరెస్ట్
చిత్తూరు, పుంగనూరు: పట్టణంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు చంద్రశేఖర్ చట్టవిరుద్ధంగా లాటరీ టికెట్ల వ్యాపారంలో అరెస్ట్ అయ్యాడు. గురువారం సీఐ గంగిరెడ్డి విలేకరులకు తెలిపిన మేరకు.. పట్టణంలోని ఓ మాజీ కౌన్సిలర్ భర్త చంద్రశేఖర్ తన అనుచరులైన రియాజ్‌బాషా, రషీద్బాషాతో కలసి లాటరీ టికెట్లు విక్రయిస్తుండగా ఈనెల 2వ తేదీన కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. దీనిపై దర్యాప్తు చేసి ఉదయం 9 గంటలకు బస్టాండులో ఉండగా చంద్రశేఖర్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 12 లాటరీ టికెట్లను, రూ.4,790 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండుకు తరలించారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించేవారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
వందల కోట్ల లాటరీ..
ఏదైనా వస్తువు కనబడకుండా పోయి.. తిరిగి దొరికితే మనంత అదృష్టవంతులు లేరనుకుంటాం. అదే వందల కోట్ల లాటరీ తగిలి.. ఆ టికెట్ పోయి.. తర్వాత దొరికితే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ ఆనందానికి అవధులు లేకుండా పోతుంది కదా.. అలాంటి అద్భుతమే జరిగింది స్కాట్లాండ్లో. అబెర్డీన్ షైర్‌కు చెందిన దంపతులైన 57 ఏళ్ల ఫ్రెడ్, 67 ఏళ్ల లెస్లీ హిగిన్స్లు ‘లైఫ్ చేంజింగ్’ లాటరీ టికెట్‌ను కొనుక్కున్నారు. డ్రాలో తమ నంబర్ వచ్చిందో లేదోనని కనుక్కునేందుకు స్థానికంగా ఉండే లాటరీ కార్యాలయా నికి వెళ్లారు. అయితే లాటరీ వారికి రాలేదని ఆ టికెట్‌ను అక్కడి సిబ్బందిలో ఒకరు చించి చెత్త బుట్టలో వేశాడు. సిబ్బంది సరిగా చూడకుండానే ఆ లాటరీ టికెట్ చించిపడేశారనీ ఆరోపిస్తూ సహాయ కేంద్రంలో విచారణ కోరారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి అతడి నంబర్‌ను ఎలాగోలా కనుక్కొన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే తీసిన డ్రాలో హిగిన్స్ నంబర్ ఉందని తేలింది. దీంతో చెత్తబుట్టను మొత్తం వెతికించి అతడి టికెట్‌ను తిరిగిచ్చేశారు. ఇంతకీ ఆ టికెట్‌కు తగిలిన లాటరీ మొత్తం ఎంతో తెలుసా..! అక్షరాలా రూ.461 కోట్లు. జీవితంలో చూడనంత మొత్తాన్ని గెలుచుకోవడంతో ఆ దంపతులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు. -
రూ కోటి చేతికి అందినట్టే అంది..
సాక్షి, ముంబై : కష్టాన్ని నమ్ముకుని బతికే సుహాస్ కదమ్ లాటరీలో రూ కోటికి పైగా గెలుచుకున్నాడని తెలియగానే ఇక తన కష్టాలు తీరాయనుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన 44 ఏళ్ల సుహాస్ కదమ్ కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన బతుకు మారుతుందనే ఆశతో గత ఐదేళ్లుగా లాటరీ టిక్కెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఉన్నట్టుండి లాటరీలో రూ కోటి గెలుచుకున్నట్టు సమాచారం అందడంతో కదమ్ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. నలసపరకు చెదిన కదం తాను లాటరీలో గెలుచుకున్న బహుమతి మొత్తం వసూలు చేసుకునేందుకు లాటరీ విభాగానికి వెళ్లగా ఒకే ప్రైజ్‌ను ముగ్గురు వ్యక్తులు తామే గెలుచుకున్నామని చెప్పడంతో అధికారులు విస్తుపోయారు. సరైన టికెట్‌తో వచ్చిన వ్యక్తికి లాటరీ బహుమతిని అప్పగించామని వారు కదమ్‌తో చెప్పారు. తాను కొన్న టికెట్ నకిలీదని లాటరీ డిపార్ట్మెంట్ తేల్చిచెప్పడంతో నిరుత్సాహానికి లోనైన కదమ్ నగరంలోని మహాత్మా ఫూలే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గుర్తింపు కలిగిన కేంద్రాల్లోనే నకిలీ టికెట్లు ఎలా అమ్ముతున్నారో బట్టబయలు చేయాలని ఆయన పోలీసు అధికారులను కోరారు. తన బంధువులు సైతం లాటరీలో తాను గెలుపొందినందుకు అభినందనలు తెలిపిన క్రమంలో జరిగిన పరిణామాలపై తాను తీవ్రంగా కలత చెందానని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, నకిలీ లాటరీ టికెట్ల ముద్రణ, పంపిణీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. -
నిన్నటిదాకా బికారి.. నేడు లక్షాధికారి
సాక్షి, తిరువనంతపురం : అదృష్టం అంటే ఆ టీ కొట్టు ఓనర్‌దే. నిన్నమొన్నటిదాకా అతనో నిరుపేద. హఠాత్తుగా భాగ్యలక్ష్మి బంపర్ లాటరీ తగిలింది.. ఒక్కసారిగా లక్షాధికారి అయ్యాడు. కేరళలోని పారాయిలముక్కులో బాబు (48) టీ కొట్టు నిర్వహిస్తూ జీవిస్తున్నాడు. అతని భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దాదాపు పదేళ్లుగా అతనికి లాటరీ టిక్కెట్లు కొనే అలవాటుంది. ఈ క్రమంలోనే అతను కేరళ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే శ్రీశక్తి లాటరీని కొనుగోలు చేశారు. బాబు కొనుగోలు చేసిన లాటరీకే బంపర్ ప్రైజ్ రూ. 60 లక్షలు తగిలింది. లాటరీ తగిలిన విషయం తెలిసి ఒక్కసారిగా నన్ను నేను నమ్మలేకపోయానని బాబు చెప్పారు. బాబు కొన్న టిక్కెట్‌కు బంపర్ ప్రైజ్ 60 లక్షలు తగలడంతో పాటు.. కన్సొలేషన్ ప్రైజ్ కింద మరో 30 వేలు వచ్చాయి. లాటరీ తగిలిన విషయం తెలిసాక రెండు రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా దాక్కున్నానని.. తరువాత ప్రభుత్వం ఇచ్చిన్ చెక్‌ను బ్యాంకులో డిపాజిట్ చేశాక.. మళ్లీ బయటకు వచ్చానని బాబు చెబుతున్నారు. నిన్నమొన్నటి వరకూ ఒక్కడినే స్వేచ్ఛగా తిరిగిన నాకు.. ఇప్పుడు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు వచ్చాయని వాపోయారు. -
లాటరీ టికెట్లు విక్రయం: నలుగురి అరెస్ట్
గుంటూరు : సింగిల్ నంబర్ లాటరీ టెకెట్లు విక్రయిస్తున్న నలుగురిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 10 వేలతో పాటు లాటరీ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత లాటరీలను విక్రయిస్తున్నారనే సమాచారంతో గత కొన్ని రోజులుగా పోలీసులు లాటరీలు అమ్ముతున్నవారిపై దృష్టి సారించారు. -
వద్దనుకున్న అదృష్టం తలుపు తడితే...
లాటరీ టికెట్లు కొని డబ్బు వృథా చేస్తున్నాడని భర్తతో అమెరికాలో నార్త్ కరోలినాకు చెందిన ఓ మహిళ ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేది. భర్త తీరు చూసి విసిగిపోయిన ఆమె తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. లాటరీ టికెట్ల వల్ల డబ్బు దండగే తప్ప లాభం లేదని భర్తకు తెలియజెప్పాలని భావించి కొన్ని లాటరీ టికెట్లు కొని అతనికి ఇచ్చింది. అయితే ఆమె ఊహించనిది జరిగింది. ఆమె కోరుకోకున్నా లాటరీ తగిలింది. లాటరీలో 6.68 కోట్ల రూపాయలు వచ్చాయి. భర్తతో గొడవపడటం వల్లే లీసెస్టర్‌కు చెందిన గ్లెండా బ్లాక్వెల్కు ఇలా అదృష్టం కలసి వచ్చింది. డబ్బులు వృథా చేస్తున్నావంటూ తన భర్తను చాలాసార్లు కోప్పడ్డానని, ఇకపై అలా మాట్లాడనని చెప్పింది. లాటరీ తగిలినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. లాటరీ డబ్బుతో ఓ ఇల్లు, కొంత భూమి కొనుగోలు చేస్తామని బ్లాక్వెల్ చెప్పింది. కుమార్తెకు సాయం చేస్తామని, కాలేజీలో చదువుకుంటున్న ఇద్దరు మనవరాళ్ల కోసం కొంత డబ్బు కేటాయిస్తామని భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించింది. -
వద్దంటే.. కోట్లు వచ్చాయి
అమెరికాలో నార్త్ కరోలినాకు చెందిన ఓ మహిళ ఎప్పుడూ భర్తతో గొడవ పెట్టుకునేది. భర్త లాటరీ టికెట్లు కొని డబ్బు వృథా చేస్తున్నాడన్నది ఆమె వాదన. భర్త తీరు చూసి విసిగిపోయిన ఆమె తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. భర్త కోరిక మేరకు ఆమె కొన్ని లాటరీ టికెట్లు కొని ఇచ్చింది. వీటి వల్ల డబ్బు దండగే తప్ప, లాభం ఉండదని చెప్పింది. అయితే ఆమె ఊహించనిది జరిగింది. ఆమె కోరుకోకున్నా లాటరీ తగిలింది. లాటరీలో 6.68 కోట్ల రూపాయలు వచ్చాయి. భర్తతో గొడవపడటం వల్ల లీసెస్టర్‌కు చెందిన గ్లెండా బ్లాక్వెల్కు ఇలా అదృష్టం కలసి వచ్చింది. డబ్బులు వృథా చేస్తున్నావంటూ తన భర్తను చాలాసార్లు కోప్పడ్డానని, ఇకపై అలా మాట్లాడనని చెప్పింది. లాటరీ తగిలినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. లాటరీ డబ్బుతో ఓ ఇల్లు, కొంత భూమి కొనుగోలు చేస్తామని బ్లాక్వెల్ చెప్పింది. కూతురికి సాయం చేస్తామని, కాలేజీలో చదువుకుంటున్న ఇద్దరు మనవరాళ్ల కోసం కొంత డబ్బు కేటాయిస్తామని భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించింది. -
పచ్చ లాటరీ.. అబ్బో భలే వ్యాపారం!
► నిషేధిత టికెట్ల ముద్రణ.. ► విక్రయం పెట్టుబడి లేకుండా రోజుకు రూ.3 లక్షల వ్యాపారం ► దగ్గరుండి జరిపిస్తున్న జిల్లా టీడీపీ కీలక నేత ► పోలీసులకూ నెలవారీ మామూళ్లు ► పేదల జేబులు గుల్ల సాక్షి టాస్క్ ఫోర్స్: ‘‘రోజుకు రూ.3 లక్షలు.. పది రోజులకు రూ.30 లక్షలు.. నెలకు రూ.90 లక్షలు ఏడాదికి రూ 10.8 కోట్లు..’’ అబ్బో ఇదేదో భలే వ్యాపారంలా ఉంది కదూ..? నిజమే.. ఈ వ్యాపారం చేయాలంటే తొలుత టీడీపీలో క్రియాశీలక కార్యకర్తగా ఉండాలి. తర్వాత జిల్లా పార్టీలో కీలక పోస్టులో ఉన్న నాయకుడి అండదండలు ఉండాలి. స్పెషల్ బ్రాంచ్‌లో ఓ కానిస్టేబుల్‌కు రోజువారీ వ్యాపారం లెక్కలు చూపించి అతనికీ వాటా ఇవ్వాలి. ఒక్క రూపాయీ పెట్టుబడి అవసరంలేదు. ఇంతకూ ఏమిటా వ్యాపారం అంటారా..? దాని పేరే లాటరీ టికెట్లు. చెప్పుకోవడానికి చిన్నదిగా అనిపించినా ఈ వ్యాపారం చేసి ఏడాదిలో కోట్లకు పడగలెత్తుతున్నారు. అధికార పార్టీ నాయకులు, కొందరు పోలీసు అధికారుల కనుసన్నల్లో చిత్తూరు నగరంలో సాగుతున్న ఈ దందాపై ‘సాక్షి’ టాస్క్‌ఫోర్స్ పరిశీలన కథనం.. రాష్ట్రంలో లాటరీ టికెట్ల విక్రయాలపై ఎప్పటి నుంచో నిషేధం ఉన్నా.. రిక్షా కార్మికులు, హమాలీలు, రోజువారీ కూలి చేసే వాళ్లు, మెకానిక్‌లు, పెయింటర్లు, పండ్ల వ్యాపారులు లక్ష్యంగా, వాళ్లకున్న బలహీనతే పెట్టుబడిగా లాటరీ వ్యాపారం జరుగుతోంది. కంప్యూటర్లో కొన్ని సీరియల్ నెంబర్లను తయారుచేసి ఓ తెల్లకాగితంపై ప్రింట్తీస్తారు. వాటిని లాటరీ టికెట్లుగా నగరంలో చెలామణి చేస్తున్నారు. ఇలా ఒక రోజుకు లక్ష నుంచి 1.5 లక్షల టికెట్లను విక్రయిస్తున్నారు. నిర్వాహకుడికి రోజుకు రూ.3 లక్షల వరకు నగదు వచ్చి చేరుతుంది. దీపావళి, ఉగాది, సంక్రాంతి లాంటి పండుగ సమయాల్లో ఈ వ్యాపారం రెట్టింపవుతుంది. ఎంతలేదన్నా నెలకు దాదాపు రూ.కోటి, ఏడాదికి రూ.12 కోట్ల వ్యాపారం ఒక్క చిత్తూరు నగరంలోనే నకిలీ లాటరీ విక్రయాల ద్వారా జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడి హస్తం ఉంది. ఈ దందాలో ఏదైనా ఇబ్బందులు వస్తే తమను రక్షించాలని చిత్తూరులోని టీడీపీ ప్రధాన నాయకుడి నుంచి హామీ తీసుకున్నారు. గతంలో లాటరీ విక్రయించిన వాళ్లు కూడా ప్రస్తుతం అధికారపార్టీ నేత హామీతో పలమనేరు, తమిళనాడు, మదనపల్లె ప్రాంతాలకు టికెట్లు పంపుతున్నారు. రోజువారీ వ్యాపారంలో 50 శాతం వాటాలు ఆయనకు వెళుతున్నాయి. ఆ నేత చెప్పిన వాళ్లవైపు పోలీసులు కన్నెత్తి చూడరని, ఆయన కరుణ లేనిదే వ్యాపారం చేయడం కుదరదని ఇతర వ్యాపారులు చెబుతున్నారు. చిత్తూరు నుంచి ఎగుమతి చిత్తూరు నగరంలో తయారయ్యే లాటరీలు బంగారుపాళ్యం, పలమనేరు, సత్యవేడు, కుప్పం, పుంగనూరు, మదనపల్లె, గంగాధరనెల్లూరు ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. చిత్తూరులోని వన్నియార్ బ్లాక్‌లో గతంలో లాటరీల ప్రింటింగ్ జరిగేది. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చిన గొడవతో ఈ ప్రాంతం అందరికీ తెలిసిపోవడంతో నిర్వాహకులు తయారీ స్థలాన్ని మార్చేశారు. నగరంలోని సంతపేట వద్ద ఉన్న పాత లైబ్రరీ వద్ద ఓ ప్రధాన డీలర్ నుంచి అన్ని ప్రాంతాలకు లాటరీలు సరఫరా చేస్తున్నారు. మధ్యాహ్నం 1.30, సాయంత్రం 4, రాత్రి 8 గంటల ప్రాంతాల్లో మాత్రమే పనిచేసే ఈ కార్యాలయం నుంచి పెద్ద మొత్తంలో నకిలీ లాటరీ టికెట్లు పంపిణీ అవుతున్నాయి. చిత్తూరులో పాత బస్టాండు, హై రోడ్డు, సంతపేట, గిరింపేట, సీబీ.రోడ్డు, దర్గాచౌక్, ఎస్టేట్, కొంగారెడ్డిపల్లె, బజారువీధి, చర్చీవీధి, పలమనేరు రోడ్డు ప్రాంతాల్లో ఎప్పుడూ లాటరీల విక్రయాలు జరుగుతూనే ఉంటాయి. వీటికి డిమాండ్ ఎక్కువ నకిలీ లాటరీల్లో ప్రముఖంగా చాలా బ్రాండ్లు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒక్కో టికెట్ ధర రూ.2 చొప్పున విక్రయిస్తున్నారు. చిత్తూరులో ప్రింటయ్యే లాటరీల్లో సింగమ్ రూ.24కు (12 టికెట్లు), కుయిల్ రూ.40 (20 టికెట్లు), రోజా రూ.60 (30 టికెట్లు), తంగమ్ రూ.100 (50 టికెట్లు), డీర్ రూ.100 (50 టికెట్లు), నల్లనేరమ్ రూ.200 (వంద టికెట్లు), ఆపిల్ రూ.200(వంద టికెట్లు), కుమరన్ రూ.400 (200 టికెట్లు), విష్ణు రూ.500 (250 టికెట్లు) విక్రయిస్తున్నారు. వీటిల్లో ఉండే నెంబర్ల సీరీస్ ఆధారంగా బహుమతులు వచ్చేలా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోజుకు రూ.3 లక్షల వ్యాపారంలో టికెట్లు కొన్నవారు అందరికీ కలిపి మొత్తం మీద రూ.10 వరకు బహుమతులు వచ్చేలా ప్లాన్‌చేసి మిగిలిన మొత్తాన్ని దోపిడీ చేస్తున్నారు. వ్యవహారం కొందరు ప్రజలకు తెలిసినా ఈ బలహీనతను వదల్లేక, ఇందులోంచి బయటపడలేక చేతిలో ఉన్న నగదును లాటరీకు తగలేస్తున్నారు. స్పెషల్ బ్రాంచ్ పాత్ర లాటరీ అమ్మకాలపై నగరంలో గత ఏడాది మొదట్లో పోలీసుల దాడులుచేసి కేసులు పెట్టారు. ఈ వ్యాపారం జరపకూడదని వ్యాపారులకు గట్టిగానే చెప్పారు. కొంతకాలం తరువాత లాటరీ విక్రయాల జోలికి వెళ్లొద్దంటూ టీడీపీ నేత ఒకరు పైస్థాయి నుంచి చెప్పించారు. తాము ఎవరి పేరు చెబుతామో వారిని అరెస్టు చేయాలని, మిగిలిన వ్యాపారుల వద్దకు వెళ్లొద్దని అనధికారిక ఆదేశాలు అందాయి. దీంతో పోలీసుల్లో కొందరు నెలసరి మామూళ్లకు అలవాటుపడి లాటరీ విక్రయాలను పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) పాత్ర బలంగా వినిపిస్తోంది. లాటరీ ముద్రించే వ్యక్తులు ఎస్బీలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ చెప్పిన వాళ్లకే విక్రయానికి టికెట్లను ఇస్తారని అందరూ చెప్పుకుంటున్నారు. ఆ వ్యక్తి చెప్పనిదే కొత్త వ్యాపారులకు లాటరీ టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. చిత్తూరు నగరాన్ని ప్రక్షాళన చేయడానికి ఎస్పీ శ్రీనివాస్ ఎన్ని చర్యలు చేపడుతున్నా పోలీసుల అండదండలతో జరుగుతున్న ఇలాంటి వ్యాపారాలు ప్రజల్లో ఖాకీలపై ఉన్న నమ్మకాన్ని వమ్ముచేస్తున్నాయి. ఎందరు చెప్పినా అంతే చిత్తూరు నగరంలో జరుగుతున్న నకిలీ లాటరీల వ్యవహారంపై గతంలోనే మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ జిల్లా కలెక్టర్ నుంచి ఎస్పీ వరకు అందరికీ ఫిర్యాదు చేశారు. సొంత పార్టీలోని వ్యక్తులు చేస్తున్న ఈ అనాగరిక చర్య వల్ల పార్టీకి సైతం చెడ్డ పేరు వస్తోందని స్వయాన మంత్రి బొజ్జలకు సైతం ఫిర్యాదు చేశారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అయితే ఏకంగా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలోనే నగరంలో జరుగుతున్న లాటరీ వ్యాపారంపై ప్రస్తావించారు. అయినా సరే అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. -
ఊరంతా లాటరీ కొట్టింది
స్పెయిన్‌లో 1812 నుంచి జాతీయ లాటరీ ‘ఎల్ గోర్డో’ నడుస్తోంది. డిసెంబరు 22న దీనికి డ్రా తీస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద లాటరీగా ఇది పేరుపడింది. ఈసారి 3.2 కోట్ల మంది స్పెయిన్వాసులు లాటరీ టిక్కెట్లు కొన్నారు. లాటరీ నెంబర్లను ఆడేవారు ఎంచుకోవడం ఉండదు. ముందుగానే ఐదెంకల నెంబర్లను టిక్కెట్లపై ముద్రించి అమ్ముతారు. తర్వాత స్కూలు పిల్లలతో డ్రా తీయిస్తారు. ఈసారి ఈ లాటరీ ఓ ఊరి తలరాతనే మార్చేసింది. తీర ప్రాంత పట్టణమైన రొక్క్వెటాస్ డి మార్ అనే చిన్న పట్టణంలో ఏకంగా 1,600 మంది రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోయారు. 79140 నెంబరుగల టిక్కెట్టుకు లాటరీ తగిలింది. ఫలితాలు చూసుకున్న ఈ ఊరివాసుల్లో ఆనందానికి అవధుల్లేవు. ఎందరో రోడ్లపైకి వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు. అధికారికంగా లెక్కతేల్చి చూడగా... ఏకంగా 1,600 మందికి తలా ఒకరికి మూడు కోట్ల రూపాయలు వచ్చాయి. పైగా ఈ టిక్కెట్లన్నీ ఒకే షాపులో కొన్నవి కావడం విశేషం. ఎక్కువగా మధ్యతరగతి, శ్రామికులు నివసించే ఈ పట్టణంలో అవసరాల్లో ఉన్నవారికే డబ్బు దక్కిందని స్పెయిన్వాసులు సంతృప్తి వెలిబుచ్చుతున్నారు. -
బిచ్చగాళ్ల ఖాతాలు..రూ.లక్షల్లో లావాదేవీలు
అవాక్కయ్యారా! అది బీహార్‌లోని ఓ గ్రామం.. ఓ కేసు దర్యాప్తులో భాగంగా బ్యాంకు ఖాతా వివరాల సేకరణకు సీసీఎస్ అధికారులు అక్కడికి వెళ్లారు. లక్షల్లో లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఇంకేముంది.. కేసు కొలిక్కి వచ్చేసినట్టేనని ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఖాతాదారుడిని విచారిద్దామనుకున్న అధికారులు అవాక్కయ్యారు. ఎందుకంటే.. అతనో బిచ్చగాడు. ఈ వ్యవహారాన్ని లోతుగా ఆరా తీస్తే అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కథాకమామీషు ఏమిటంటే... సాక్షి, సిటీబ్యూరో : ‘‘+92తో ప్రారంభమయ్యే ఫోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. లాటరీ తగిలిందని చెప్పడంతో నమ్మి నగదు బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేసి మోసపోయా’’... పోలీసులకు ఇటీవల వరుసగా వస్తున్న ఫిర్యాదులివి. ఇలాంటి ఓ కేసుకు సంబంధించి సీసీఎస్ అధికారుల దర్యాప్తులో పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ఫోన్ల ద్వారా లాటరీ తగిలిందంటూ, తక్కువ ధరకే వస్తువులంటూ సౌతాఫ్రికా దేశాలు కేంద్రంగా ప్రజలను మోసగిస్తున్న నైజీరియన్లు.. ఏ సందర్భంలోనూ ఇక్కడకు రాకుండా, పోలీసులకు ఆధారాలు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటి స్కామ్స్‌లో బ్యాంకు ఖాతాలు ఎంతో కీలకం. వీటిని వారే నేరుగా తెరిస్తే పోలీసులకు దొరికే అవకాశాలు ఉంటాయి. దేశం బయట ఉన్న బ్యాంకులవి అయితే కస్టమర్లు అనుమానించే ప్రమాదం ఉంది. ఇలా కాకుండా ఉండేందుకు ఇక్కడివే, బోగస్ చిరునామాలతో ఉండేవి తప్పనిసరి. దీనికోసం నైజీరియన్లు భారీ పథక రచన చేస్తున్నారు. ముంబై, ఢిల్లీల్లో కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు ఎరవేస్తున్నారు. ఈ ఏజెంట్లు చేయాల్సిందల్లా బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లోని గ్రామాలకు వెళ్లి బ్యాంకు ఖాతాలు తెరవడమే. ‘గుర్తింపు’న్న భిక్షగాళ్లతోనే.. ఆయా రాష్ట్రాలకు వెళ్తున్న ఈ ఏజెంట్లు అక్కడి గ్రామాల్లో సంచరిస్తూ ఆధార్ వంటి ధ్రువీకరణలు కలిగిన భిక్షగాళ్లు, పేదల్ని గుర్తిస్తున్నారు. ఒక రోజు కోసం ఆ గుర్తింపు పత్రాలతోపాటు వారి ఫొటోలు ఇస్తే రూ.2500 చెల్లిస్తామంటూ ఎర వేస్తున్నారు. ఇలా తీసుకున్న పత్రాలతో స్థానిక బ్యాంకుల్లో వారి పేర్లతోనే ఖాతాలు తెరుస్తున్నారు. అనంతరం గుర్తింపు పత్రాల్ని బిక్షగాళ్లు/పేదలకే ఇచ్చేస్తున్నారు. అయితే ఏటీఎం కార్డును మాత్రం సైబర్ నేరగాళ్లకు అప్పగిస్తున్నారు. ఈ ఖాతాల ఆధారంతో సైబర్ నేరగాళ్లు దేశవ్యాప్తంగా ఉన్న అనేకమందికి లాటరీలు, బహుమతుల పేరుతో ఫోన్లు, ఎస్సెమ్మెస్‌ల ద్వారా ఎర వేస్తున్నారు. ఇందుకోసం పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో తీసుకున్న ఇంటర్నేషనల్ రోమింగ్ కలిగిన సిమ్‌కార్డులు (+92 సిరీస్‌తో ఉంటాయి) ఉపయోగిస్తున్నారు. ఎవరికీ చిక్కకుండా.. నమ్మినవారికి భిక్షగాళ్ల బ్యాంక్ ఖాతా నెంబర్లు ఇచ్చి అందులో నగదు వేయిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా మోసపోయిన వాళ్లు పోలీసుల్ని ఆశ్రయించినా... దర్యాప్తులో భాగంగా పాకిస్థాన్ నుంచి సెల్ నెంబర్ల వివరాలు తెలుసుకోలేరు. ఖాతా ఆధారంగా దర్యాప్తు చేసినా... అది భిక్షగాళ్లు/పేదల వరకు వెళ్లి ఆగిపోతుంది. ఖాతాలు తెరిచిన వారికి, ఏజెంట్లకు మధ్య... ఏజెంట్లకు సైబర్ నేరగాళ్లకు మధ్య ఎలాంటి లింకు లేకపోవడంతో దొరకడం కష్టమవుతుంది. ‘+92’తో బహుపరాక్ ఈ తరహా నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీసీఎస్ డీసీపీ జి.పాలరాజు నగర ప్రజలకు సూచించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో... నిందితుల్ని పట్టుకోవడం, రికవరీలు చేయడం అంతకష్టమని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ‘+92’ సిరీస్‌తో వచ్చే ఫోన్లు/ఎస్సెమ్మెస్‌ల విషయంలో ప్రమత్తంగా ఉండాలని కోరారు.