
సాక్షి, తిరువనంతపురం : అదృష్టం అంటే ఆ టీ కొట్టు ఓనర్‌దే. నిన్నమొన్నటిదాకా అతనో నిరుపేద. హఠాత్తుగా భాగ్యలక్ష్మి బంపర్ లాటరీ తగిలింది.. ఒక్కసారిగా లక్షాధికారి అయ్యాడు. కేరళలోని పారాయిలముక్కులో బాబు (48) టీ కొట్టు నిర్వహిస్తూ జీవిస్తున్నాడు. అతని భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దాదాపు పదేళ్లుగా అతనికి లాటరీ టిక్కెట్లు కొనే అలవాటుంది. ఈ క్రమంలోనే అతను కేరళ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే శ్రీశక్తి లాటరీని కొనుగోలు చేశారు. బాబు కొనుగోలు చేసిన లాటరీకే బంపర్ ప్రైజ్ రూ. 60 లక్షలు తగిలింది. లాటరీ తగిలిన విషయం తెలిసి ఒక్కసారిగా నన్ను నేను నమ్మలేకపోయానని బాబు చెప్పారు. బాబు కొన్న టిక్కెట్‌కు బంపర్ ప్రైజ్ 60 లక్షలు తగలడంతో పాటు.. కన్సొలేషన్ ప్రైజ్ కింద మరో 30 వేలు వచ్చాయి.
లాటరీ తగిలిన విషయం తెలిసాక రెండు రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా దాక్కున్నానని.. తరువాత ప్రభుత్వం ఇచ్చిన్ చెక్‌ను బ్యాంకులో డిపాజిట్ చేశాక.. మళ్లీ బయటకు వచ్చానని బాబు చెబుతున్నారు. నిన్నమొన్నటి వరకూ ఒక్కడినే స్వేచ్ఛగా తిరిగిన నాకు.. ఇప్పుడు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు వచ్చాయని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment