దేశంలోని సంపూర్ణ రాజ్యాంగ అక్షరాస్యత జిల్లా ఏది? | Only Constitution Literate District in India | Sakshi
Sakshi News home page

దేశంలోని సంపూర్ణ రాజ్యాంగ అక్షరాస్యత జిల్లా ఏది?

Published Mon, Oct 16 2023 2:22 PM | Last Updated on Mon, Oct 16 2023 2:22 PM

Only Constitution Literate District in India - Sakshi

అది కేరళలోని ఒక జిల్లా. అక్కడి పౌరులందరికీ రాజ్యాంగంలో నియమనిబంధనలు, హక్కులు గురించి క్షుణ్ణంగా తెలుసు. జిల్లాలోలోని ప్రతీ పౌరుడు రాజ్యాంగాన్ని చదివాడు. ఇటువంటి విలక్షణత కలిగిన జిల్లా దేశంలో ఇదొక్కటేనని చెప్పవచ్చు. 

ఈ జిల్లా పేరు కొల్లాం. ఈ జిల్లాలలో 10 ఏళ్లు దాటిన ప్రతీఒక్కరికీ రాజ్యాంగానికి సంబంధించిన పరిజ్ఞానం ఉంది. రెండేళ్ల క్రితం కేరళలోని పౌరులందరికీ రాజ్యాంగంపై అవగాహన కల్పించే ‍ప్రయత్నం జరిగింది. ‘సిటిజన్‌’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపధ్యంలో ఈ జిల్లాల్లోని పిల్లలు, పెద్దలు, అధికారులు, శ్రామికులు ఇలా అందరూ రాజ్యాంగాన్ని చదివి, దానిపై అవగాహన ఏర్పరుచుకున్నారు. 

కొల్లాం జిల్లా జనాభా 14 లక్షలు. ఈ జిల్లాలోని వారికి వివిధ పంచాయతీలు, కొల్లాం జిల్లా యోజన సమితి, కేరళ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లోకల్‌ ఎడ్మినిస్ట్రేషన్‌ మొదలైనవన్నీ ‘సిటిజన్‌-2022’ కింద రాజ్యాంగంపై అవగాహన కల్పించాయి. ఈ నేపధ్యంలో కొల్లాం రాజ్యాంగ అక్షరాస్యత జిల్లాగా మార్పునొందింది. 

2023 జనవరి 14న కేరళ సీఎం పినరయి విజయన్‌ కొల్లాం జిల్లాను భారత తొలి రాజ్యాంగ అక్షరాస్యత జిల్లాగా ప్రకటించారు. జిల్లాలోని 7 లక్షల కుటుంబాలకు చెందిన 23 లక్షల మంది పౌరులకు రాజ్యాంగ అక్షరాస్యతను అందించాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు కొల్లంలో దాదాపు 90% మందికి అవగాహన తరగతులు నిర్వహించారు. ఫలితంగా జిల్లాలో సంపూర్ణ రాజ్యాంగ అక్షరాస్యత సాధ్యమయ్యిందని అధికారులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement