
సినిమా ఇండస్ట్రీలో వివాదాలు, ఆరోపణలు కొత్తేం కాదు. పలువురు యాక్టర్స్ వల్ల తోటి నటీనటులు ఇబ‍్బంది పడిన సందర్బాలు చాలానే ఉన్నాయి. కాకపోతే ఎవరో ఒకరు వాటిని బయటపెడితే గానీ అసలు సంగతి తెలియదు. తాజాగా ఓ మలయాళ నటి.. ఓ హీరో డ్రగ్స్ తీసుకుని మరీ షూటింగ్ లో పాల్గొంటున్నాడనే విషయాన్ని బయటపెట్టింది.
(ఇదీ చదవండి: 'పెద్ది' కోసం తెలుగు ట్రైనింగ్.. వర్షం పడింది)
పలు మలయాళ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న విన్సీ సోనీ.. ఈ మధ్య కాలంలో తాను నటిస్తున్న ఓ మూవీ సెట్ లో ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ఓ అగ్ర హీరో తనని ఇబ్బంది పెట్టాడని స్వయంగా ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేసింది.
'ఈ మధ్య ఓ సినిమా షూటింగ్ చేస్తున్న టైంలో నా డ్రస్సు కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఈ విషయాన్ని ఆ మూవీ హీరో నాతో చెప్పాడు. సరే మార్చుకుంటాలే అని క్యారవ్యాన్ వైపు వెళ్తుండగా.. తను కూడా నాతో పాటు వస్తానని అందరి ముందు అన్నాడు'
(ఇదీ చదవండి: 57 ఏళ్ల వయసులో మళ్లీ తండ్రి కాబోతున్న నటుడు?)
'మరోసారి ఓ సీన్ షూట్ చేస్తున్న టైంలో సదరు హీరో నోటి నుంచి తెల్లని పదార్థం ఒకటి అనుకోకుండా బయటపడింది. అది డ్రగ్స్ కాక ఇంకేం అయ్యింటుంది. అప్పటినుంచి డ్రగ్స్ అలవాటు ఉన్నవారితో నటించకూడదని నిర్ణయించుకున్నాను. చెప్పాలంటే ఆ రోజు సెట్ లో జరిగింది అసహ్యకరమైన అనుభవం' అని విన్సీ తన వీడియోలో చెప్పుకొచ్చింది.
2019లో వికృతి సినిమాతో నటిగా మారిన విన్సీ.. తర్వాత రేఖ, జనగణమన, సౌదీ వెళ్లక్క, పద్మిని, పళజన్ ప్రణయం తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు హీరో పేరు చెప్పకుండా తనకెదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టి వార్తల్లో నిలిచింది.
(ఇదీ చదవండి: 'పుష్ప 2'కి నా మ్యూజిక్ పెట్టుకోలేదు.. అయినా బాధ లేదు)