ఆఫ్రికన్-అమెరికన్ హాలీవుడ్ నటి, గాయని మేరీ మిల్బెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదనకు మద్దతు పలికారు. ఆఫ్రికన్ యూనియన్‌కు జీ-20లో శాశ్వత సభ్యత్వం ఇవ్వడం గురించి ప్రధాని ప్రస్తావించారు. ఈ నేపధ్యంలోనే అమెరికన్ సింగర్ మిల్బెన్ ప్రధాని మోదీని ప్రశంసించారు.
ఆఫ్రికన్ యూనియన్‌ను జీ-20లో పూర్తిస్థాయి సభ్యునిగా చేర్చాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదనకు తాను మద్దతు ఇస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఈ మాట ద్వారా ఆమె కోట్లాది మంది భారతీయుల హృదయాలను మరోసారి గెలుచుకున్నారు. మేరీ మిల్బెన్ గాయని మాత్రమే కాదు మంచి నటి కూడా. ఆన్‌లైన్ సిరీస్ ఇంపాక్ట్ నౌ ఆమెకు ఎంతో పేరు తెచ్చింది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇదే కాకుండా ఆమె పలు ప్రాజెక్ట్‌లలో పనిచేసి మంచినటిగానూ పేరు తెచుకున్నారు.
సింగర్ మిల్బెన్ జేఎండీఈఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకురాలు, సీఈవో. ఆమె ఏర్పాటు చేసిన సంస్థ పలువురు నిపుణులకు అవకాశాలను కల్పించింది. ఈ నటి 2010లో హెలెన్ హేస్ అవార్డును అందుకుంది. మేరీ మిల్బెన్ తల్లి అల్థియా పెంటెకోస్టల్ సంగీత పాస్టర్‌గా పనిచేశారు. ఆమె భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత అల్థియా మిల్బెన్‌ను పెంచి పెద్ద చేశారు. ఆమె తన తల్లి నుండి సంగీతాన్ని వారసత్వంగా అందుకున్నారు. తన 5 సంవత్సరాల వయస్సులోనే మిల్బెన్.. ఓక్లహోమా సిటీలో ఒక ప్రదర్శన ద్వారా తన ప్రతిభను నిరూపించుకున్నారు.
మిల్బెన్‌కు ముగ్గురు సోదరీమణులు, ఒక సోదరుడు. మిల్బెన్ వివాహం చేసుకోలేదు. ఆమె రాజకీయాలపై కూడా ఆసక్తి కనబరిచారు. మిల్బెన్ పుట్నం సిటీ హై స్కూల్‌లో చదివారు. ఓక్లహోమా విశ్వవిద్యాలయంలో టెనార్ డాన్ బెర్నార్డిని నుండి ఆమె ఒపెరాను నేర్చుకున్నారు. మిల్బెన్ 2004లో ఆఫ్రికన్-అమెరికన్ మహిళా విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా, 2003లో మొదటి ఆఫ్రికన్-అమెరికన్ మహిళా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. అమెరికా అధ్యక్షులు జార్జ్ బుష్, బరాక్ ఒబామా, డోనాల్డ్ ట్రంప్, జో బైడెన్ కోసం జాతీయ గీతంతో పాటు పలు దేశభక్తి గీతాలను పాడిన ఏకైక గాయకురాలిగా మిల్బెన్ పేరు తెచ్చుకున్నారు. మిల్బెన్ ‘ఓం జై జగదీశ్’ పాట పాడటం ద్వారా ఆమె భారతీయులకు చేరువయ్యారు.
ఇది కూడా చదవండి: ప్రొఫెసర్ వాసుదేవన్‌ను నాటి సీఎం జయలలిత ఎందుకు మెచ్చుకున్నారు?
Comments
Please login to add a commentAdd a comment