US Singer Mary Millben Support PM Modi Over Manipur Issue - Sakshi
Sakshi News home page

అమెరికాలో మోదీకి పాదాభివందనం.. ఇప్పుడు మణిపూర్‌పై కీలక వ్యాఖ్యలు

Published Fri, Aug 11 2023 9:05 AM | Last Updated on Fri, Aug 11 2023 9:29 AM

US Singer Mary Millben Support PM Modi Over Manipur Issue - Sakshi

వాషింగ్టన్‌: భారత్‌లో దేశవ్యాప్తంగా మణిపూర్‌లో దారుణ ఘటనపై చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక, పార్లమెంట్‌ వేదికగా మణిపూర్‌లో జరుగుతున్న నిరసనలపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. మణిపూర్‌లో శాంతి నెలకొల్పే బాధ్యత తనదంటూ మోదీ హామీ ఇచ్చారు. మరోవైపు.. మణిపూర్‌ ఘటనపై అమెరికా గాయని మేరీ మిల్‌ బెన్‌ తాజాగా స్పందించారు. ఈ క్రమంలో మణిపూర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. 

కాగా, మణిపూర్‌ నిరసనలపై మేరీ మిల్‌ బెన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా మణిపూర్ సమస్యపై ఆమె.. ప్రధాని నరేంద్ర మోదీకి మద్ధతు తెలిపారు.  మణిపూర్‌ తల్లులు, కుమార్తెలు, మహిళలకు మోదీ న్యాయం చేస్తారనే విశ్వాసం తనకు ఉందని స్పష్టం చేశారు. అలాగే, స్వాతంత్ర్య భారతావనిలో సత్యాన్ని తెలియజేయండి నాకు మోదీపై విశ్వాసం ఉందన్నారు. ఆయన కోసం నేను ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు. అయితే, లోక్‌సభలో మోదీ సర్కార్‌పై అవిశ్వాసం వీగిపోయిన తర్వాత మిల్‌ బెన్‌ ఈ కామెంట్స్‌ చేశారు. 

ఇదిలా ఉండగా.. ఇటీవల ప్రధాని మోదీ అగ్రరాజ్యం అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలో ప్రముఖ గాయని మిల్ బెన్ మన దేశ జాతీయ గీతం జనగణ మన పాడిన తర్వాత మోదీని కలిసి ఆయనకు పాదాభివందనం చేశారు. ఈ సందర్బంగా తనకు మోదీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. 

ఇది కూడా చదవండి: మణిపూర్‌ శాంతికి నాదీ హామీ.. ఈ పాపం కాంగ్రెస్‌ది కాదా? అవిశ్వాసం చర్చలో ప్రధాని మోదీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement