
వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్‌లో ఏర్పాటు చేసిన మన ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగింపు కార్యక్రమంలో ఆఫ్రికన్–అమెరికన్ సింగర్, నటి మేరీ మిల్బన్ ఆలపించిన మన జాతీయగీతం ‘జనగణమన’ వీడియో వైరల్‌గా మారింది.
‘అద్భుతం’ అంటున్నారు నెటిజనులు. ‘భారతీయులు నన్ను తమ కుటుంబసభ్యుల్లో ఒకరిగా ప్రేమిస్తారు’ అంటున్న మిల్బన్ మన ప్రధానికి పాదాభివందనం చేసింది. మన జాతీయగీతం మాత్రమే కాదు ‘ఓమ్ జై జగదీష్ హరే’ భక్తిగీతాన్ని కూడా అద్భుతంగా ఆలపిస్తుంది మిల్బన్.