Ronald Reagan
-
ట్రంప్‌పై దాడి.. రీగన్‌ను గుర్తుచేసుకున్న కుమార్తె
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా నాటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్‌ను అతని కుమార్తె పాటీ డేవిస్ గుర్తు చేసుకుని, తన తండ్రి విషయంలోనూ ఇలాగే జరిగిందంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. రోనాల్డ్ రీగన్ 1981లో ఒకరోజు వాషింగ్టన్లో తన ప్రసంగం ముగించుకుని తన నివాసానికి వెళుతుండగా జాన్ హింక్లీ జూనియర్ అనే వ్యక్తి రీగన్‌పై కాల్పులు జరిపాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రీగన్ కొన్నాళ్లకు కోలుకున్నప్పటికీ, పాక్షికంగా పక్షవాతానికి గురయ్యడు. రోనాల్డ్ రీగన్ కుమార్తె పాటీ డేవిస్ నటి, రచయిత్రి. ఆమె న్యూయార్క్ టైమ్స్‌లో ఓ కథనం ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు.‘అది 1981, మార్చి 30.. నేను నా ఆస్పత్రి కార్యాలయంలో కూర్చున్నాను. ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ మా ఆఫీసు తలుపును తోసుకుంటూ లోనికి వచ్చాడు. దీంతో అతని మీద నాకు మొదట నాకు కోపం వచ్చింది. అయితే ఏదో జరగరానిది జరిగిందన్న భావన అతని ముఖంలో కనిపించింది. ఇంతలో అతను పాటీ.. అక్కడ కాల్పులు జరిగాయన్నాడు. ఆ రోజు నా జీవితంలో మరచిపోలేని రోజులలో ఒకటి. నా తండ్రి రోనాల్డ్ రీగన్ బతికి ఉంటారో ఉండరో తెలియదు. అతనికి చికిత్స అందిస్తున్న వైద్యులకు కూడా ఈ విషయం తెలియదు. మా అమ్మ.. మా నాన్నను తలచుకుంటూ రోదిస్తోంది. మా నాన్న హాస్పిటల్ బెడ్‌పై కదలలేని పరిస్థితిలో ఉన్నాడు.డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగినప్పుడు అతని కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. వారు అనుభవిస్తున్న వేదన ఎటువంటిదో నాకు తెలుసు. అధ్యక్షుడు లేదా అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థి జీవితం ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. అమెరికాలో ప్రస్తుతం 1981కి మించిన హింసాత్మక స్థితి ఉంది. ఈ అనుభవం ట్రంప్‌ను ఎలా మారుస్తుందో నేను ఊహించలేను. సోవియట్ యూనియన్‌తో ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముగించడానికి, అణ్వాయుధాలపై ఒప్పందాన్ని చేసుకునేందుకు దేవుడు తనను భూమిపైకి పంపాడని నా తండ్రి నమ్మాడు. సమయం అమూల్యమైనది. ఈ బహుమతిని అర్థవంతంగా ఉపయోగించడం అందరికీ తప్పనిసరి అని నాన్న గుర్తు చేసేవారని’ పాటీ డేవిస్ పేర్కొన్నారు. This is how the Secret Service reacted in 1981 when Ronald Reagan was shot.pic.twitter.com/N4GBoHqMWZ— Keith Boykin (@keithboykin) July 13, 2024 -
మన జాతీయగీతం మిల్బన్ నోట
వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్‌లో ఏర్పాటు చేసిన మన ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగింపు కార్యక్రమంలో ఆఫ్రికన్–అమెరికన్ సింగర్, నటి మేరీ మిల్బన్ ఆలపించిన మన జాతీయగీతం ‘జనగణమన’ వీడియో వైరల్‌గా మారింది. ‘అద్భుతం’ అంటున్నారు నెటిజనులు. ‘భారతీయులు నన్ను తమ కుటుంబసభ్యుల్లో ఒకరిగా ప్రేమిస్తారు’ అంటున్న మిల్బన్ మన ప్రధానికి పాదాభివందనం చేసింది. మన జాతీయగీతం మాత్రమే కాదు ‘ఓమ్ జై జగదీష్ హరే’ భక్తిగీతాన్ని కూడా అద్భుతంగా ఆలపిస్తుంది మిల్బన్. -
పట్టు ఉండాలి
పిల్లలకు పూర్తిగా స్వేచ్ఛను ఇవ్వడం అంటే వారి కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకునే బాధ్యతను నుంచి మనం తప్పించుకోవడమే. మనిషికి దేవుడు ఏదైనా కఠిన పరీక్ష పెట్టాడూ అంటే, అది పిల్లల విషయంలోనే అయి ఉంటుంది. ఈ ఉద్యోగాలు, లోకంతో నెగ్గుకు రావడం.. ఇవన్నీ కూడా పిల్లలను తీర్చిదిద్దే ప్రయత్నాలతో పోల్చి చూస్తే చాలా చిన్నవిగా అనిపిస్తాయి. పిల్లల ఆరోగ్యం, చదువులు, వారి అభివృద్థి, భవిష్యత్తు.. ఈ ఆలోచనలతోనే మనిషి జీవితం గడిచిపోతుంది. అరిజోనాలోని ఆర్మే స్కూల్ నుంచి ఒక రోజు రొనాల్డ్ రీగన్కు కంప్లైంట్ వచ్చింది. మీ అమ్మాయి స్మోక్ చేస్తోందనీ, స్కూల్ రూల్స్ ఫాలో అవడం లేదనీ! అలాంటి ఫిర్యాదే పిల్లల్లో ఆఖరివాడి గురించి కూడా ఆ తర్వాత కొన్నేళ్లకు వచ్చింది. ‘మీ అబ్బాయికి ఫ్రెంచిలో సి గ్రేడ్, ఆల్జీబ్రాలో డి గ్రేడు వచ్చింది. మాతో పాటు మీరు కూడా కేర్ తీసుకోవాలి’ అని. రీగన్ కన్ఫ్యూజన్లో పడిపోయాడు. అప్పటికింకా ఆయన పూర్తిగా రాజకీయాల్లోకి రాలేదు. రెండు సందర్భాల్లోనూ పిల్లల్ని దగ్గర కూర్చొబెట్టుకుని మాట్లాడాడు. కానీ అతడికి అపనమ్మకం.. తన మాట వింటారా అని. అలాగే చాలాసార్లు ఆయన డైలమాలో పడేవారు. ‘‘పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులకు తెలిసిన పద్ధతులు... చెయ్యిపట్టి నడిపించడం లేదా నీ దారి నువ్వు వెతుక్కొమ్మని చెయ్యి వదిలేయడం! చెయ్యిపట్టి ఎక్కడికి నడిపిస్తాం? మనం వచ్చిన దారిలో, మనకు తెలిసిన దారిలోనే కదా. ఈ ‘స్టేజ్ డైరెక్షన్’లో పిల్లలకు కనీసం ఉండవలసిన స్వేచ్ఛ ఎక్కడో జారిపోతుంది. ఇక.. పిల్లలకు పూర్తిగా స్వేచ్ఛను ఇవ్వడం అంటే వారి కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకునే బాధ్యతను నుంచి మనం తప్పించుకోవడమే. జారిపోయిన పిల్లల స్వేచ్ఛకు, తప్పించుకున్న పెద్దల బాధ్యతకు జీవితం ఎక్కడో ఒక చోట నిలబెట్టి మరీ మూల్యం అడుగుతుంది. నిర్లక్ష్యం, మూల్యం అన్నవి పిల్లల వయసుకు అర్థం కానివి! అర్థమయ్యేలా చెప్పకపోతే వారిని జీవితాంతం బాధపెట్టేవి!! మరెలా?’’ అని రీగన్ తన భార్యతో దీర్ఘ సంభాషణ చేసేవారు. ఆయన భార్య నాన్సీ మాత్రం.. పిల్లల్ని పట్టుకునే నడిపించాలి అనేవారు. ఆమె మాటే నిజం అనిపిస్తుంటుంది. (నేడు రొనాల్డ్ రీగన్ జయంతి) -
అమెరికా అధ్యక్షుడిగా రొనాల్డ్ రీగన్
ఆ నేడు 4 నవంబర్, 1980 ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసిన రొనాల్డ్ రీగన్ ఘనవిజయం సాధించారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జిమ్మీ కార్టర్‌పై ఆయన భారీ మెజారిటీ సాధించారు. నాలుగేళ్లకు ఒకసారి జరిగే అమెరికన్ ఎన్నికల్లో ఎవరో ఒకరు గెలవడం సాధారణమే అయినా, 1980 నాటి అధ్యక్ష ఎన్నికల్లో మాత్రం ఒక విశేషం ఉంది. సినీనటులు ఎన్నికల్లో ఘన విజయాలు సాధించడం ఆ కాలానికి భారత్‌కు కొత్త కాదు గానీ, అమెరికాకు మాత్రం కొత్తే. హాలీవుడ్లో పేరుప్రఖ్యాతులు గల నటుడైన రొనాల్డ్ రీగన్‌ను రిపబ్లికన్ పార్టీ తన అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దించడమే విశేషంగా వార్తల్లోకెక్కితే, అమెరికన్ ఓటర్లు కూడా ఆయనకు పట్టం కట్టి, రాజకీయ రంగంపై వెండితెర ప్రభావం తక్కువేమీ కాదని నిరూపించారు. -
జర్మనీల మధ్య గోడ కూలింది...
ఆ నేడు 1990 అక్టోబర్ 3 బెర్లిన్ గోడ కూలింది. తూర్పు, పశ్చిమ జర్మనీలు ఒకటయ్యాయి. దాంతో 45 ఏళ్లుగా ఎడమొహం పెడమొహంగా ఉన్న రెండు జర్మనీలు కలసిపోయి ఐక్యజర్మనీ పునరావిర్భవించినట్లయింది. నాటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్, సోవియట్ నాయకుడు మిహాయిల్ గోర్బచెవ్‌ల చొరవతో ఈ పరిణామం సంభవించింది. తూర్పు, పశ్చిమ జర్మనీలకు రాజధానులుగా ఉన్న బెర్లిన్, బాన్లు తిరిగి స్వతంత్ర నగరాలయ్యాయి. రెండు జర్మనీలకు మధ్య అడ్డుగా ఎంతో పటిష్టంగా నిర్మించి ఉన్న బెర్లిన్ గోడను కూలగొట్టడానికి కొన్ని నెలలు పట్టిందంటే అతిశయోక్తి కాదు! మొత్తం మీద దీనినొక ప్రజాస్వామిక విజయంగా వర్ణించవచ్చు. -
పేపర్లను ఉండలా చుట్టి....
‘నా పేరు రోనాల్డ్ రీగన్. నేను అమెరికా సంయుక్త రాష్ట్రాలకు అధ్యక్షుణ్ణి. కానీ మీరెవరో నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పీలే గురించి ఈ ప్రపంచానికి తెలుసు..’ ఇదీ వైట్‌హౌస్‌లో పీలేనుద్దేశించిన నాటి అమెరికా అధ్యక్షుడు అన్న మాటలు.. ఈ భూమండలంపై బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలేకున్న పేరు ప్రఖ్యాతులు ఎలాంటివో చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు. సాకర్ చరిత్రలో మారడోనా, ప్లాటిని, బెకెన్బార్, బెక్‌హమ్, రొనాల్డో, మెస్సీ, నైమర్ ఇలా ఎంతోమంది సూపర్స్టార్లున్నారు. భవిష్యత్‌లో వస్తారు కూడా.. అయినా నూటికి 90 మంది ఒక్క పీలేనే ఆల్‌టైమ్ గ్రేట్‌గా ఎందుకు చెబుతుంటారు..? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న అమెరికా అధ్యక్షుడే తనను తాను పరిచయం చేసుకునే స్థాయికి పీలే ఎలా ఎదిగాడు..? నిజానికి తను పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతుడేమీ కాదు.. తన కుటుంబానికి పేరు ప్రతిష్టలు అంతకంటే లేవు. పుట్టింది కడు పేదరికంలో.. సావు పాలోలోని బారు పట్టణంలో పీలే చిన్నతనం పేదరికం లోనే సాగింది. బతుకు బండి సాగేందుకు టీ దుకాణాల్లో పనివాడుగా చేరాడు. ఇలాంటి నేపథ్యం నుంచి కూడా తానెంతో ఇష్టపడే ఫుట్‌బాల్ ఆటను మాత్రం విడిచిపెట్టలేదు. తండ్రి శిక్షణ ఇచ్చినా ఆడుకునేందుకు తనకంటూ ఓ ఫుట్‌బాల్ కూడా లేదు. దీని కోసం పేపర్లను బంతిలాగా తయారు చేసి దానికి చుట్టూ తాడు కట్టి దాంతోనే ప్రాక్టీస్ కొనసాగించేవాడు. ఇంతటి క్లిష్ట సమయంలోనూ పట్టుదలతోనే ముందుకు సాగాడు. అమెచ్యూర్ ఆటగాడిగా స్థానిక క్లబ్బులకు ఆడుతూ మెరుపులాంటి ఆటతీరుతో అధికారుల దృష్టిని ఆకర్షించసాగాడు. 15 ఏళ్ల వయస్సులో పీలే కోచ్ డి బ్రిటో... సాంటోస్ క్లబ్‌కు తీసుకెళ్లాడు. వారికి పీలేను చూపిస్త్తూ ఇతడు ‘ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఫుట్‌బాల్ ఆటగాడు’గా భవిష్యత్‌ను చెప్పాడు. ట్రయల్స్‌లో పీలే ఆటతీరు చూసి వెంటనే ఒప్పందం చేసుకున్నారు. అది మొదలు ప్రపంచ ఫుట్‌బాల్ క్రీడా ముఖచిత్రంపై ఈ దిగ్గజ ఆటగాడి పేరు మార్మోగిపోయింది. ఆ మరుసటి ఏడాదే జాతీయ జట్టుకు.. 17 ఏళ్లకే ప్రపంచకప్ ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీ సెమీస్‌లో ఫ్రాన్స్‌పై హ్యాట్రిక్ గోల్స్‌తో ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. ఫైనల్లో స్వీడన్‌పై జట్టు సాధించిన ఐదు గోల్స్‌లో రెండింటిని తనే సాధించాడు. పీలే ఆడిన ఏ మ్యాచ్‌లోనూ బ్రెజిల్ జట్టు ఓడకపోవడం విశేషం. - రంగోల నరేందర్ (సాక్షి స్పోర్ట్స్)