
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా నాటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్‌ను అతని కుమార్తె పాటీ డేవిస్ గుర్తు చేసుకుని, తన తండ్రి విషయంలోనూ ఇలాగే జరిగిందంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
రోనాల్డ్ రీగన్ 1981లో ఒకరోజు వాషింగ్టన్‌లో తన ప్రసంగం ముగించుకుని తన నివాసానికి వెళుతుండగా జాన్ హింక్లీ జూనియర్ అనే వ్యక్తి రీగన్‌పై కాల్పులు జరిపాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రీగన్ కొన్నాళ్లకు కోలుకున్నప్పటికీ, పాక్షికంగా పక్షవాతానికి గురయ్యడు. రోనాల్డ్ రీగన్ కుమార్తె పాటీ డేవిస్ నటి, రచయిత్రి. ఆమె న్యూయార్క్ టైమ్స్‌లో ఓ కథనం ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు.
‘అది 1981, మార్చి 30.. నేను నా ఆస్పత్రి కార్యాలయంలో కూర్చున్నాను. ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ మా ఆఫీసు తలుపును తోసుకుంటూ లోనికి వచ్చాడు. దీంతో అతని మీద నాకు మొదట నాకు కోపం వచ్చింది. అయితే ఏదో జరగరానిది జరిగిందన్న భావన అతని ముఖంలో కనిపించింది. ఇంతలో అతను పాటీ.. అక్కడ కాల్పులు జరిగాయన్నాడు. ఆ రోజు నా జీవితంలో మరచిపోలేని రోజులలో ఒకటి. నా తండ్రి రోనాల్డ్ రీగన్ బతికి ఉంటారో ఉండరో తెలియదు. అతనికి చికిత్స అందిస్తున్న వైద్యులకు కూడా ఈ విషయం తెలియదు. మా అమ్మ.. మా నాన్నను తలచుకుంటూ రోదిస్తోంది. మా నాన్న హాస్పిటల్ బెడ్‌పై కదలలేని పరిస్థితిలో ఉన్నాడు.
డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగినప్పుడు అతని కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. వారు అనుభవిస్తున్న వేదన ఎటువంటిదో నాకు తెలుసు. అధ్యక్షుడు లేదా అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థి జీవితం ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. అమెరికాలో ప్రస్తుతం 1981కి మించిన హింసాత్మక స్థితి ఉంది. ఈ అనుభవం ట్రంప్‌ను ఎలా మారుస్తుందో నేను ఊహించలేను. సోవియట్ యూనియన్‌తో ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముగించడానికి, అణ్వాయుధాలపై ఒప్పందాన్ని చేసుకునేందుకు దేవుడు తనను భూమిపైకి పంపాడని నా తండ్రి నమ్మాడు. సమయం అమూల్యమైనది. ఈ బహుమతిని అర్థవంతంగా ఉపయోగించడం అందరికీ తప్పనిసరి అని నాన్న గుర్తు చేసేవారని’ పాటీ డేవిస్ పేర్కొన్నారు.
This is how the Secret Service reacted in 1981 when Ronald Reagan was shot.pic.twitter.com/N4GBoHqMWZ
— Keith Boykin (@keithboykin) July 13, 2024