వాష్టింగ్టన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక పర్యటన ముగింపు సందర్భంగా యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ (USICF) నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ హాలీవుడ్ నటి, గాయని మేరీ మిల్‌బెన్ భారత జాతీయ గీతం ‘జన గణ మన’ ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీని తర్వాత ఓం జై జగదీశే హరే పాట కూడా పాడారు.
చివరిలో ఆమె ప్రధాని మోదీకి పాదాభివందనం చేశారు. వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటరులో యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రధాని హాజరు కాగా ఈ ఘటన చోటు చేసుకుంది. మిల్‌బెన్ మాట్లాడుతూ.. జాతీయ గీతం, దేశభక్తి సంగీతాన్ని ఆలపించడానికి తనకు ఆహ్వానం పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక మూడు రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని అటునుంచి ఈజిప్టు పర్యటనకు పయనమయ్యారు. 1997 తర్వాత ఈజిప్టులో భారత్ ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి. భారత ప్రధాని అమెరికా బయలుదేరే ముందే ఈజిప్ట్ పర్యటననుద్దేశించి మాకు అత్యంత సన్నిహితమైన దేశం ఈజిప్టు సందర్శించడం చాలా సంతోషంగా ఉందన్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రత్యేకతను సంతరించుకుంది.
#WATCH | Award-winning international singer @MaryMillben performs the Indian National Anthem at the Ronald Reagan Building in #WashingtonDC #HistoricStateVisit2023 #ModiInUSA #IndiaUSAPartnership pic.twitter.com/pIsXoJlodx
— DD News (@DDNewslive) June 24, 2023
చదవండి: Titanic Submarine Disaster: ‘టైటాన్ మునుగుతుందని ముందే చెప్పా’.. అందుకే జాబ్ నుంచి పీకేశారు!
Comments
Please login to add a commentAdd a comment