ముగిసిన మేరీమాత ఉత్సవాలు
కర్నూలు సీక్యాంప్: ఈ నెల 2వ తేదీ నుంచి బిషప్ చర్చిలో నిర్వహిస్తున్న మేరీమాత ఉత్సవాలు శనివారంతో ముగిశాయి. చివరిరోజు జిల్లా నలుమూలల నుంచి క్రైస్తవులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కర్నూలు, అనంతపురం డయాసిస్ బిషప్ పూల ఆంతోని దైవసందేశం వినిపించారు. శత్రువును కూడా ప్రేమతో జయించాలని ఆయన ఉద్బోధించారు. దివ్యవాణి ఆధ్యాత్మిక చానల్ కోఆర్డినేటర్ పప్పుల సుధాకర్, ఉపదేశి ఆంతోని, మరియదళ్ సభ్యులు, యూత్, క్యాథలిక్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.