paul
-
పాల్ ల్యాబ్స్ తో ఆధునిక విద్యాబోధన
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆధునిక విద్యాబోధన అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పాల్ ల్యాబ్స్‌కు శ్రీకారం చుట్టినట్లు పాల్ ల్యాబ్స్ రాష్ట్ర నోడల్ అధికారి విజయభాస్కర్ పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పర్సనల్ అడాప్టివ్ లెర్నింగ్ (పాల్) కార్యక్రమంపై రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు గుంటూరులోని ఏసీ కళాశాల వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన ఓరియెంటేషన్ తరగతులు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా నోడల్ అధికారి విజయభాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పాల్ ల్యాబ్స్ మంజూరు చేసిన 60 పాఠశాలల పరిధిలోని ప్రధానోపాధ్యాయులతో పాటు గణిత, సైన్స్ ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల మేధస్సుకు మరింత పదును పెట్టాలని చెప్పారు. రాష్ట్ర సమన్వయకర్త కేవీ సత్యనారాయణ మాట్లాడుతూ పాల్ కార్యక్రమ ఉద్దేశం, ప్రధానోపాధ్యాయుల బాధ్యతలను వివరించారు. -
500 ఏళ్ల కళా చరిత్రలో అతి పెద్ద వేలం... మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడి ఆర్ట్ కలెక్షన్
న్యూయార్క్: దివగంత మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు పాల్ అలెన్‌కి సంబంధించిన ఆర్ట్ సేకరణలను వేలం వేయనున్నట్టు క్రిస్టీస్ ప్రకటించింది. ఈ ఆర్ట్ విలువ సుమారు రూ. 7 వేల కోట్లు పైనే ఉంటుందని పేర్కొంది. దాదాపు 150కి పైగా ఆర్ట్ కలెక్షన్లను వేలం వేయనున్నట్లు తెలిపింది. అంతేకాదు ఇది 500 ఏళ్ల కళా చరిత్రలో అతి పెద్ద అత్యంత అసాధారణమైన ఆర్ట్ వేలంగా వెల్లడించింది. వీటిలో ఫ్రెంచ్ చిత్రాకారుడి పాల్ సెజాన్చే ఆర్ట్ "లా మోంటాగ్నే సెయింట్ విక్టోయిర్" కూడా ఉంటుందని పేర్కొన్నారు. దీని విలువే సుమారు రూ. 650 కోట్లు ఉంటుందని వేలం సంస్థ వెల్లడించింది. వీటిని బిలియనీర్ ఆస్తులతో కలిపి ఈ వేలం వేస్తుందని తెలిపింది. అలెన్ కోరిక మేరకు వేలం వేయగా వచ్చిన మొత్తాన్ని స్వచ్ఛంద కార్యక్రమాలకు వినియోగిస్తామని సంస్థ పేర్కొంది. అంతేకాదు అలెన్ దృష్టిలో కళ అనేది విశ్లేషణాత్మకమైన భావోద్వేగంతో కూడుకున్నదని వెల్లడించింది. కళాకారుడు అంతర్గత దృక్కోణం మనందరికి స్ఫూర్తినిచ్చేలా వాస్తవిక దృక్ఫథాన్ని వ్యక్తం చేస్తోందని అలెన్ విశ్వసించేవాడని క్రిస్టీస్ వేలం సంస్థ చెబుతోంది. వేలం సంస్థ సీఈవో గుయిలౌమ్ సెరుట్టి మాట్లాడుతూ... ఈ వేలం ఈవెంట్ మరెవ్వరికీ జరగని విధంగా ఉంటుందని అన్నారు. 1975లో బిల్ గేట్స్‌తో కలిసి మైక్రోసాఫ్ట్‌ను స్థాపించిన అలెన్.. 2018లో మరణించారు. (చదవండి: రైలు పైకి ఎక్కేందుకు శతవిధాల యత్నం...పోలీస్ ఎంట్రీతో..) -
బ్రెయిన్ ట్యూమర్‌తో హ్యారీపోటర్ నటుడి మృతి
హాలీవుడ్ నటుడు పాల్ రిట్టర్(54) కన్నుమూశారు. బ్రెయన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆయన ఆదివారం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను తెలియజేయడానికి చింతిస్తున్నామని కుటుంబ సభ్యుల్లో ఒకరు తెలిపారు. అతడి మరణవార్త తెలిసిన హాలీవుడ్ నటీనటులు సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. "పాల్ అద్భుతమైన మనిషి. అందరితో ఎంతో సరదాగా ఉండేవాడు. నాతో కలిసి పని చేసిన వారిలో అతడు గ్రేట్ నటుడు. ఆయన మన మధ్య లేడన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను" అని ఫ్రైడే నైట్ డిన్నర్ రచయిత రాబర్ట్ పాపర్ ట్వీట్ చేశారు. పాల్ రిట్టర్ 1992లో 'ద బిల్' చిత్రంతో నటనారంగంలోకి ప్రవేశించారు. క్వాంటమ్ ఆఫ్ సోలేస్, సన్ ఆఫ్ రాంబో, హ్యారీపోటర్, హాఫ్ బ్లడ్ ప్రిన్స్ వంటి పలు చిత్రాల్లో నటించారు. చెర్నోబిల్ సిరీస్‌లో తన అద్భుత నటనకుగానూ అభిమానుల ప్రశంసలు దక్కించుకున్నారు. 'ఫ్రైడే నైట్ డిన్నర్'లోనూ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. చదవండి: పెళ్లికి ముందే గర్భవతినని చెప్పాలనుకున్నా: హీరోయిన్ లాస్య గ్రాండ్ పార్టీ: రచ్చ లేపిన బిగ్‌బాస్ కంటస్టెంట్లు -
పాల్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
ఆదిలాబాద్, రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూడలో ఈనెల 21న మృతి చెందిన ఫిట్టర్ కార్మికుడు శనిగారపు పాల్ కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఐఎన్టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు సిద్దంశెట్టి రాజమోగిళి డిమాండ్ చేశారు. గురువారం ఖైరిగూడ ఓసీపీని సందర్శించి పాల్ మృతి చెందిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ప్రమాదానికి గల కారణాలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాల్ మృతిపై యాజమాన్యం కార్మికులను పక్క దారి పట్టించే ప్రయత్నం చేసిందన్నారు. పోస్టుమార్టం చేసే సమయంలో పాల్ అంతర్గత శరీర భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని దాన్ని బట్టి పాల్ వడదెబ్బతో మృతి చెందలేదనే అనుమానాలు నిజమయ్యాయన్నారు. ఏ కారణంతో మృతి చెందాడో యాజమాన్యం ఇప్పటి వరకు గుర్తించలేకపోవటం చేతగాని తనమన్నారు. పాల్ మృతిని గని ప్రమాదంగా గుర్తించి నెల రోజుల్లో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అందించాలని, అన్ని రకాల బెనిఫిట్స్‌ని సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు. కార్మిక సమస్యల పరిష్కారంలో ఐఎన్టీయూసీ కార్మికుల పక్షాన నిలబడి పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్ నల్లగొండ సదాశివ్, నాయకులు మాధవకృష్ణ, ప్రవీణ్‌కుమార్, ఎస్కే అబ్బాస్, ఎండీ గౌస్, తదితరులు పాల్గొన్నారు. -
‘మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా పాల్
న్యూఢిల్లీ: మీడియా రంగానికి చెందిన డాక్టర్ హెచ్.ఎస్.పాల్‌ను ఏసీఎస్ మీడియా కార్పొరేషన్ తాజాగా ‘మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్–2018’ అవార్డుతో సత్కరించింది. ఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయంలో జరిగిన ‘కంట్రీవైడ్ మీడియా ఇంపాక్ట్ అవార్డ్స్’ కార్యక్రమంలో పాల్‌కు ఈ అవార్డును అందజేశారు. కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు డాక్టర్(ప్రొఫెసర్) పీకే పాటసాని, ఏసీఎస్ మీడియా కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన డాక్టర్(ప్రొఫెసర్) అభిరామ్ కులశ్రేష్ఠ తదితరులు పాల్గొన్నారు. 1989 నుంచి మీడియారంగంలో ఉన్న పౌల్ ప్రస్తుతం కశ్మీర్‌లోనే అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ఇంగ్లీష్ పత్రిక ‘డైలీ ఎక్సెల్షియర్’కు ఢిల్లీ బ్యూరో చీఫ్‌గా కొనసాగుతున్నారు. -
ఎక్కువగా ఏసీని వాడుతున్నారని..
ఆంగ్మలీ: ఏసీని ఎక్కువగా ఉపయోగిస్తున్నారనే కారణంతో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి.. భార్య, కొడుకుతో గొడవపడి వారిని చంపేశాడు. ఏసీ ఆన్ చేసుకుని నిద్రపోతున్న భార్య, కొడుకును చూసి ఆవేశాన్ని అణుచుకోలేక పోయిన 81 ఏళ్ల పాల్ వారిద్దరినీ ఇనుప రాడ్డుతో కొట్టాడు. కొడుకు థామస్ అక్కడిక్కడే మరణించగా, భార్య మేరీ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయినట్టు పోలీసులు చెప్పారు. కేరళలోని ఆంగ్మలీలో ఈ ఘటన జరిగింది. తల్లి, బిడ్డలను రాడ్‌తో కొట్టిన తర్వాత బంధువులకు ఫోన్ చేసి పాల్ జరిగిన విషయం చెప్పాడు. అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసినా వృద్ధాప్యం కారణంగా చేసుకోలేకపోయాడు. గత కొద్ది రోజులుగా తన కుటుంబ సభ్యులు ఏసీని ఎక్కువగా వాడుతున్నారని, దీనివల్ల కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని, కేవలం పెన్షన్‌తో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టమవుతోందని, అందుకే వారిని చంపినట్లు పాల్ పోలీసుల విచారణలో తెలిపాడు. -
ఈ పిజ్జా మహా ఘాటు గురూ..!
ఇది ప్రపంచంలోనే అత్యంత కారంగా ఉండే పిజ్జా. సాల్ట్డీన్ సిజ్లర్గా పిలిచే ఈ పిజ్జాను చిత్రంలోని వ్యక్తి పాల్ తయారుచేస్తాడు. ఈయనకు బ్రిటన్‌లోని సాల్ట్డీన్లో పిజ్జా హౌస్ ఉంది. ఇది ఎంత కారంగా ఉంటుందంటే.. ఏడాది కాలంలో ఈయన 1500 పిజ్జాలు అమ్మితే.. దీన్ని పూర్తిగా తినగలిగింది 9 మందే. ఎవరో ఎందుకు.. ఈయన కూడా తాను తయారుచేసిన పిజ్జాను పూర్తిగా తినలేడు. ఆ మధ్య బ్రిటన్‌లోని వార్విక్ యూనివర్సిటీ వాళ్లు వచ్చి.. ఈ పిజ్జాను చెక్ చేసి.. ప్రపంచంలోనే అత్యంత కారంగా ఉండే మిర్చీల కన్నా ఇది మూడు రెట్లు ఎక్కువ ఘాటుగా ఉందని తేల్చారు. ఈ పిజ్జాను తినడానికి ప్రయత్నించిన వాళ్లు కూడా భయంకరమైన కడుపు నొప్పితో బాధపడ్డారట.