ఈ పిజ్జా మహా ఘాటు గురూ..! | World's hottest pizza can make 'tongues bleed' | Sakshi
Sakshi News home page

ఈ పిజ్జా మహా ఘాటు గురూ..!

Published Sun, Feb 16 2014 4:35 AM | Last Updated on Sat, Sep 2 2017 3:44 AM

ఈ పిజ్జా మహా ఘాటు గురూ..!

ఈ పిజ్జా మహా ఘాటు గురూ..!

ఇది ప్రపంచంలోనే అత్యంత కారంగా ఉండే పిజ్జా. సాల్ట్‌డీన్ సిజ్లర్‌గా పిలిచే ఈ పిజ్జాను చిత్రంలోని వ్యక్తి పాల్ తయారుచేస్తాడు. ఈయనకు బ్రిటన్‌లోని సాల్ట్‌డీన్‌లో పిజ్జా హౌస్ ఉంది. ఇది ఎంత కారంగా ఉంటుందంటే.. ఏడాది కాలంలో ఈయన 1500 పిజ్జాలు అమ్మితే.. దీన్ని పూర్తిగా తినగలిగింది 9 మందే. ఎవరో ఎందుకు.. ఈయన కూడా తాను తయారుచేసిన పిజ్జాను పూర్తిగా తినలేడు. ఆ మధ్య బ్రిటన్‌లోని వార్విక్ యూనివర్సిటీ వాళ్లు వచ్చి.. ఈ పిజ్జాను చెక్ చేసి.. ప్రపంచంలోనే అత్యంత కారంగా ఉండే మిర్చీల కన్నా ఇది మూడు రెట్లు ఎక్కువ ఘాటుగా ఉందని తేల్చారు. ఈ పిజ్జాను తినడానికి ప్రయత్నించిన వాళ్లు కూడా భయంకరమైన కడుపు నొప్పితో బాధపడ్డారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement