ఒక బిట్‌కాయిన్ ధర ఈ రోజు సుమారు రూ. 80 లక్షల కంటే ఎక్కువే. కాబట్టి ఎవరైనా 10,000 బిట్‌కాయిన్‌లను కలిగి ఉంటే.. అతడు పెద్ద సంపన్నుడనే చెప్పాలి. అయితే కొన్ని సంవత్సరాలకు ముందు ఓ వ్యక్తి 10వేల బిట్‌కాయిన్‌లు (Bitcoins) చెల్లించి కేవలం రెండు పిజ్జాలను కొనుగోలు చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
అమెరికాకు చెందిన ఐటీ ప్రోగ్రామర్ 'లాస్లో హనిఎజ్' (Laszlo Hanyecz) 2010 మే 17న తన దగ్గరున్న 10వేల బిట్‌కాయిన్‌లను డాలర్లలోకి మార్చుకున్నాడు. ఆ డాలర్లతో 2 డామినోస్ పిజ్జాలను ఆర్డర్ చేసుకుని తినేసాడు. ఆ బిట్‌కాయిన్‌ల విలువ నేడు రూ. 8వేల కోట్లు. అయితే హనిఎజ్ ఇప్పుడు పశ్చాతాప పడిన ఏం ప్రయోజనం లేదు.
బిట్‌కాయిన్
2010లో ఒక బిట్‌కాయిన్ విలువ 0.05 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 2.29 రూపాయలకు సమానమన్నమాట. అయితే ఈ రోజు ఒక బిట్‌కాయిన్ విలువ రూ. 80 లక్షల కంటే ఎక్కువ. దీన్ని బట్టి చూస్తే బిట్‌కాయిన్ విలువ ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
అమెరికా ఎన్నికల్లో 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) గెలిచిన తరువాత బిట్‌కాయిన్ విలువ భారీగా పెరిగింది. కొన్నాళ్ల కిందట తక్కువ ధరకే అందుబాటులో ఉన్న ఇప్పుడు లక్ష డాలర్ల మార్కుని దాటేసింది. కాగా ఇటీవల కాలంలో బిట్‌కాయిన్ కొంత తగ్గుముఖం పట్టింది. ట్రంప్ గెలుపు తరువాత బిట్‌కాయిన్ విలువ తగ్గడం ఇదే మొదటిసారి.
Comments
Please login to add a commentAdd a comment