crores
-
రెండే రెండు పిజ్జాలు.. రూ. 8 వేల కోట్లు
ఒక బిట్‌కాయిన్ ధర ఈ రోజు సుమారు రూ. 80 లక్షల కంటే ఎక్కువే. కాబట్టి ఎవరైనా 10,000 బిట్కాయిన్లను కలిగి ఉంటే.. అతడు పెద్ద సంపన్నుడనే చెప్పాలి. అయితే కొన్ని సంవత్సరాలకు ముందు ఓ వ్యక్తి 10వేల బిట్కాయిన్లు (Bitcoins) చెల్లించి కేవలం రెండు పిజ్జాలను కొనుగోలు చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.అమెరికాకు చెందిన ఐటీ ప్రోగ్రామర్ 'లాస్లో హనిఎజ్' (Laszlo Hanyecz) 2010 మే 17న తన దగ్గరున్న 10వేల బిట్కాయిన్లను డాలర్లలోకి మార్చుకున్నాడు. ఆ డాలర్లతో 2 డామినోస్ పిజ్జాలను ఆర్డర్ చేసుకుని తినేసాడు. ఆ బిట్కాయిన్ల విలువ నేడు రూ. 8వేల కోట్లు. అయితే హనిఎజ్ ఇప్పుడు పశ్చాతాప పడిన ఏం ప్రయోజనం లేదు.బిట్‌కాయిన్2010లో ఒక బిట్‌కాయిన్ విలువ 0.05 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 2.29 రూపాయలకు సమానమన్నమాట. అయితే ఈ రోజు ఒక బిట్‌కాయిన్ విలువ రూ. 80 లక్షల కంటే ఎక్కువ. దీన్ని బట్టి చూస్తే బిట్‌కాయిన్ విలువ ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.అమెరికా ఎన్నికల్లో 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) గెలిచిన తరువాత బిట్‌కాయిన్ విలువ భారీగా పెరిగింది. కొన్నాళ్ల కిందట తక్కువ ధరకే అందుబాటులో ఉన్న ఇప్పుడు లక్ష డాలర్ల మార్కుని దాటేసింది. కాగా ఇటీవల కాలంలో బిట్‌కాయిన్ కొంత తగ్గుముఖం పట్టింది. ట్రంప్ గెలుపు తరువాత బిట్‌కాయిన్ విలువ తగ్గడం ఇదే మొదటిసారి. -
రూ.కోట్లలో లాటరీ గెలుపొందిన భారతీయులు (ఫొటోలు)
-
ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్లు @ 10 కోట్లు
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) మరో ఘనతను సాధించింది. రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ల సంఖ్య 10 కోట్లను తాకింది. ప్రధానంగా గత ఐదేళ్లలోనే కోటి మంది కొత్తగా రిజిస్టర్ అయ్యారు. వెరసి గత ఐదేళ్లలో రిజిస్టర్డ్ ఇన్వెస్టర్లు మూడు రెట్లు పెరిగారు. డిజిటైజేషన్లో వేగవంత వృద్ధి, ఇన్వెస్టర్లకు అవగాహన పెరుగుతుండటం, నిలకడైన స్టాక్ మార్కెట్ల పురోగతి, ఆర్థిక వృద్ధిలో అందరికీ భాగస్వామ్యం(ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) తదితర అంశాలు ఇందుకు సహకరిస్తున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ పేర్కొంది. గురువారానికల్లా(ఆగస్ట్ 8) యూనిక్ రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ల సంఖ్య తాజాగా 10 కోట్ల మైలురాయికి చేరినట్లు వెల్లడించింది. దీంతో మొత్తం క్లయింట్ల ఖాతాల(కోడ్స్) సంఖ్య 19 కోట్లను తాకినట్లు తెలియజేసింది. క్లయింట్లు ఒకటికంటే ఎక్కువ(ట్రేడింగ్ సభ్యులు)గా రిజిస్టరయ్యేందుకు వీలుండటమే దీనికి కారణం. 25ఏళ్లు.. నిజానికి ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్ల సంఖ్య 4 కోట్ల మార్క్‌కు చేరుకునేందుకు 25 ఏళ్లు పట్టింది. 2021 మార్చిలో ఈ రికార్డ్ సాధించగా.. తదుపరి రిజి్రస్టేషన్ల వేగం ఊపందుకోవడంతో సగటున ప్రతీ 6–7 నెలలకు కోటి మంది చొప్పున జత కలిసినట్లు ఎన్ఎస్ఈ తెలియజేసింది. ఈ ట్రెండ్ కొనసాగడంతో గత 5 నెలల్లోనే కోటి కొత్త రిజి్రస్టేషన్లు నమోదైనట్లు వెల్లడించింది. క్లయింట్ల కేవైసీ విధానాలను క్రమబదీ్ధకరించడం, ఇన్వెస్టర్లకు అవగాహనా పెంపు కార్యక్రమాలు, సానుకూల మార్కెట్ సెంటిమెంటు తదితర అంశాలు ఇందుకు తోడ్పాటునిచి్చనట్లు ఎన్ఎస్ఈ బిజినెస్ డెవలప్మెంట్ చీఫ్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ వివరించారు. -
‘ఈసీ’ సంచలన ప్రకటన.. తనిఖీల్లో పట్టుబడ్డవి ఎంతంటే..
న్యూఢిల్లీ: దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మొత్తం ఏడు దశల్లో జరిగే ఈ ఎన్నికల్లో ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ జరగనుంది. పోలీసుల ప్రత్యేక తనిఖీల్లో పట్టుబడుతున్న వాటిపై ఎన్నికల కమిషన్(ఈసీ) తాజాగా సంచలన విషయం వెల్లడించింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్‌కు ముందే ఏకంగా 4 వేల650 కోట్ల రూపాయల విలువైన వస్తువులు, నగదును పట్టుకున్నట్లు ప్రకటించింది. గతేడాది తొలి దశ పోలింగ్‌కు ముందు పట్టుబడ్డ రూ.3475 కోట్ల వస్తువులు, నగదుతో పోలిస్తే ఈసారి పట్టుబడ్డ వాటి విలువ రూ.1175 కోట్లు ఎక్కువ. ఇంత విలువైన వస్తువులు, నగదు పట్టుకోవడం ఎన్నికలు న్యాయంగా జరగాలనే తమ ధృడ సంకల్పానికి నిదర్శనమని ఈసీ తెలిపింది. పట్టుబడ్డ వాటిలో 45 శాతం దాకా డ్రగ్స్, నార్కోటిక్సే కావడం గమనార్హం. ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రలోభాల వాడకం కారణంగా వనరులు తక్కువగా ఉన్న చిన్న రాజకీయ పార్టీలకు సమన్యాయం జరిగే అవకాశాలు తగ్గిపోతాయని పేర్కొంది. ఇదీ చదవండి.. రూ.200కోట్ల ఆస్తి దానం.. సన్యాసంలోకి భార్యాభర్తలు -
కాలేజ్‌కి కూడా వెళ్లలేదు..కానీ ఏడాదికి ఏకంగా రూ. 10 కోట్లు..!
ఓ వ్యక్తి కాలేజ్ చదువు కూడా చదవకుండా కోట్లు గడిస్తున్నాడంటే నమ్ముతారా..!. ఏ వ్యాపారం చేసో అనుకుంటే పొరబడ్డట్లే. ఎందుకంటే..అతడు చక్కగా పెద్ద కార్పోరేట్ కంపెనీలో అప్రెంటీస్‌గా మొదలు పెట్టి..ఏకంగా కంపెనీ పార్ట్నర్గా పనిచేసే స్థాయికి చేరకున్నాడు. ఎలాంటి గ్రాడ్యుయేషన్ చదువులు చదవకుండా.. ఎలా అతడికి సాధ్యం అయ్యింది? అతడి సక్సెస్ సీక్రెట్ ఏంటంటే.. యూకేకి చెందిన న్యూటన్(30) యూవివర్సిటి విద్య కూడా చదవలేదు. కానీ డెలాయిట్ కంపెనీలో పార్టనర్‌గా పనిచేస్తున్నాడు. అతడి వార్షిక వేతనం సుమారుగా రూ. 10 కోట్లు పైనే ఉంటుందట. ఇదంతా ఎలా సాధ్యం అనే కదా..!. అతడి కెరీర్ జర్నీ 12 ఏళ్ల క్రితం డెలాయిట్ కంపెనీలో బ్రైట్‌స్టార్ట్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్‌లో చేరడంతో మొదలయ్యింది. అలా కంపెనీ పార్ట్నర్గా పనిచేసే స్తాయికి ఎదిగిపోయాడు. అది కాలేజ్డ్రాపౌట్స్ కోసం ఏర్పాటు చేసిన డెలాయిట్ బ్రైట్ స్టార్ అప్రెంటీస్ ప్రోగ్రామ్ అతడి తలరాతనే మార్చిందని చెప్పొచ్చు. నూటన్ పెరిగిందంతా డోరెట్స్లోనే. తన తండ్రి 16 ఏళ్ల వయసులో పాఠశాల చదువును విడిచిపెట్టి ఆర్మీలో చేరిపోయాడు. తన అమ్మ పబ్‌లోనూ, ట్రావెలింగ్ ఏజెన్సీలోనూ పనిచేసేది. దీంతో తల్లిదండ్రుల ప్రంపంచానికి దూరంగా పెరిగాడు న్యూటన్. ఆర్థిక పరిస్థితి వల్లే కదా తాను ఈ పరిస్థితిని ఎదుర్కొంటోంది అని భావించి సంపాదన మార్గాల గురించి తీవ్రంగా అన్వేషించడం ప్రారంభించేవాడు. తీరిక దొరికితే అందుకోసమే వెతికేవాడు. ఐతే అనుకోకుండా విశ్వవిధ్యాలయంలో గణితం అధ్యయనం చేసేందుకు సీటు లభించింది. ఇలా అతడి కుటుంబంలో విశ్వవిద్యాలయంలో సీటు పొందిన ఏకైక వ్యక్తి కూడా న్యూటనే. కానీ అందులో చేరలేదు. సంపాదన మార్గాల మీదే అతడి ధ్యాసంతా. అందుకోసం రెండు మూడు చిన్నా చితకా ఉద్యోగాలు కూడా చేసేవాడు. అంతేగాదు స్కూల్ చదువుతో డబ్బులు వచ్చే స్కీములు ఏం ఉన్నాయా అని చూసేవాడు. ఆ కారణాల రీత్యా అతడు చదువాలనే దానిపై దృష్టి కేంద్రీకరించ లేదు. ఆ అన్వేషణలో భాగంగానే న్యూటన్ డెలాయిట్ బ్రైట్‌స్టార్ట్ అప్రెంటిస్ ప్రోగ్రామ్‌లో చేరాడు. ఐతే ఇది విద్యార్థులు కళాశాలలో చేరి చదువుకునేలా చేసేందుకు ఏర్పాటు చేసిన ఉపాది మార్గం ఇది. దీన్ని కాలేజ్ యూనివర్సిటీలే ఏర్పాటు చేశాయి. అయితే ఇదంతా న్యూటన్‌కి నచ్చక ఒకింత అసహనం అనిపించినా, డబ్బు సంపాదించే మార్గం దొరికిందన్న ఉద్దేశ్యంతో అందులో జాయిన్ అయ్యాడు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ కంపెనీ పార్ట్నర్గా క్వాలిఫైడ్ అకౌంటెంట్ అండ్ ఆడిటర్‌గా విధులు నిర్వర్తించే రేంజ్‌కి చేరాడు. నిజానికి డెలాయిట్ కంపెనీ రిక్రూట్మెంట్ కోసం ఈ బ్రైట్‌స్టార్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా విద్యార్థుల ఉపాది పొందుతూ కాలేజ్ చదువును చదువుకునేలా ప్రోత్సహిస్తుంది. అంతేగాక ఈ ప్రోగ్రాం ద్వారా వారిలో దాగున్న టాంటెంట్ బయటకి వెలికితీస్తుంది. పైగా సామాజికంగా ఆర్థిక నేపథ్యం సరిగా లేని వ్యక్తులకు ఈ ప్రోగ్రాం ఒక గొప్ప వరం. అంతేగాదు కెరీర్లో మంచిగా సెటిల్ అవడానికి ఉపకరించే గొప్ప ఉపాధి మార్గం ఇది. ఇక్కడ న్యూటన్ సంపాదన ధ్యాస కళాశాలకు వెళ్లనీయకుండా చేసినా..ఉద్యోగంలో ఉన్నతంగా ఎదిగేలా చేసి ఈ స్థాయికి తీసుకురావడం విశేషం. ఇక్కడ డిగ్రీలు, పీహెచ్‌డీలు కాదు ముఖ్యం. సంపాదించాలనే కసి పట్టుదల అన్ని నేర్చుకునేలా, ఎదిగిలే చేస్తుందనడానికి న్యూటనే స్ఫూర్తి కదూ..!. (చదవండి: ఆర్బీఐ మాజీ గవర్నర్‌కే పాఠాలు బోధించిన వ్యక్తి..కోట్ల ఆస్తులను..!) -
రూ. 200 కోట్ల హవాలా గుట్టు రట్టు.. ఆ పార్టీ పనేనా..?
చెన్నై: లోక్‌సభ ఎన్నికల వేళ ఆదాయపన్ను శాఖ అధికారులు రూ.200 కోట్ల హవాలా గుట్టు రట్టు చేశారు. మలేషియా నుంచి వచ్చిన హవాలా ట్రేడర్ వినోత్‌కుమార్ జోసెఫ్‌ను చెన్నై ఎయిర్‌పోర్టులో అడ్డుకున్న ఐటీ అధికారులు అతడి నుంచి రూ.200 కోట్ల హవాలాకు సంబంధించి విస్తుపోయే విషయాలను కనిపెట్టారు. లోక్‌సభ ఎన్నికల వేళ తమిళనాడులోని ఓ ప్రముఖ పార్టీ కోసం రూ.200 కోట్ల హవాలా సొమ్మును దుబాయ్ నుంచి తీసుకురావడానికి ప్లాన్ చేసినట్లు వినోత్ వాట్సాప్ చాట్ల ద్వారా ఐటీ అధికారులు కనిపెట్టారు. వినోత్ లాప్టాప్, మొబైల్‌ఫోన్, ఐ పాడ్లను ఐటీ అధికారులు సీజ్ చేశారు. అప్పు, సెల్వం, మోనికవిరోల, సురేశ్‌లు వినోత్ బృందంలో పనిచేస్తున్నట్లు బయటపడింది. ఈ హవాలా కేసు దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి అప్పగించనున్నారు. కాగా, తమిళనాడులో ఉన్న అన్ని లోక్‌సభ సీట్లకు ఏప్రిల్ 19న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఇదీ చదవండి.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత -
‘ఉబర్’ రైడ్‌కు కోట్లలో బిల్లు..! షాక్ అయిన కస్టమర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడాలో దీపక్ తెంగురియా అనే వ్యక్తి రొటీన్‌గా తాను వెళ్లే రూట్లో ఉబర్ ఆటో రైడ్ బుక్ చేశాడు. రైడ్ తక్కువ దూరమే అయినందున రూ.62 బిల్లు చూపించింది. మామూలే కదా అని ఆటో ఎక్కి డెస్టినేషన్‌లో దిగి బిల్లు పే చేద్దామనుకునే సరికి దీపక్ అవాక్కయ్యాడు. ఏకంగా రూ.7.66 కోట్లు పే చేయాలని బిల్లు చూపించింది. దీంతో ఆశ్చర్యపోవడం దీపక్ వంతైంది. దీపక్‌కు ఇంత భారీ బిల్లు రావడానికి సంబంధించిన వీడియోను ఆయన స్నేహితుడు ఆశిష్ ఎక్స్(ట్విటర్)లో షేర్ చేశాడు. దీనిపై వీడియోలో స్నేహితులిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. చంద్రయాన్‌కు రైడ్ బుక్ చేసుకున్నా ఇంత బిల్లు రాదని ఇద్దరు స్నేహితులు జోకులు వేసుకున్నారు. सुबह-सुबह @Uber_India ने @TenguriyaDeepak को इतना अमीर बना दिया कि Uber की फ्रैंचाइजी लेने की सोच रहा है अगला. मस्त बात है कि अभी ट्रिप कैंसल भी नहीं हुई है. 62 रुपये में ऑटो बुक करके तुरंत बनें करोडपति कर्ज़दार. pic.twitter.com/UgbHVcg60t — Ashish Mishra (@ktakshish) March 29, 2024 అయితే అతి తక్కువ దూరం ఆటో రైడ్‌కు కోట్లలో బిల్లు రావడంపై ఉబర్ స్పందించింది. ‘భారీ బిల్లు ఇచ్చి ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణలు. మాకు కొంత సమయమిస్తే దీనిపై అప్డేట్ ఇస్తాం’అని ఉబర్ సందేశం పంపింది. ఇదీ చదవండి.. వీల్ చైర్లో వచ్చాడు.. విల్ పవర్ చూపాడు -
ఖరీదైన కారు కొన్న ఓజీ నటుడు.. ఎన్ని కోట్లంటే?
ఖరీదైన కార్లను కొనుగోలు చేయడంలో సినీ తారలు ఎప్పుడు ముందుంటారు. తమకిష్టమైన కొత్త కొత్త బ్రాండ్ కార్లను కోట్ల రూపాయలతో కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం మార్కెట్లో అత్యంత విలాసవంతమైన కార్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా లగ్జరీ కార్లలో రోల్స్ రాయిస్ బ్రాండ్ ప్రత్యేకతను కలిగి ఉంటుంది. సెలబ్రిటీలు ఎక్కువగా అలాంటి కార్లను కొనేందుకే ఇంట్రస్ట్ చూపిస్తారు. తాజాగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ సరి కొత్త రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశాడు. ఇటీవలే టైగర్ 3లో విలన్‌గా ప్రేక్షకులను మెప్పించిన ఇమ్రాన్ హష్మీ విలాసవంతమైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ మోడల్ కారును కొనేశారు. ఈ లగ్జరీ బ్రాండ్ కారు విలువ దాదాపు రూ.12 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇమ్రాన్ తన బ్లాక్ కలర్ రోల్స్ రాయిస్ కారులో రైడ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించినఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. గతంలో పఠాన్ సక్సెస్ తర్వాత షారుక్ ఖాన్ సైతం రోల్స్ రాయిస్ కారును కూడా కొనుగోలు చేశాడు. కాగా..ఇమ్రాన్ హష్మీ చివరిసారిగా సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన టైగర్-3లో కనిపించారు. ఈ చిత్రంలో విలన్‌గా మెప్పించారు. ఈ చిత్రం కమర్షియల్‌గా భారీ విజయాన్ని సాధించింది. సెల్ఫీలో అక్షయ్ కుమార్‌తో పాటు ప్రధాన పాత్ర పోషించాడు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ప్రస్తుతం ఇమ్రాన్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న ఓజీ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, ప్రియాంక అరుణ్ మోహన్, అర్జున్ దాస్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. -
రామ్ చరణ్ విలన్.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించాడా?
సినీ తారలకు సినిమా ఒక్కటే ప్రపంచం కాదు. ఎంత స్టార్డమ్ వచ్చినా వారు కేవలం ఆ రంగానికే పరిమితం కారు. తమ టాలెంట్‌ను పలు రకాలుగా చూపిస్తారు. కేవలం సినిమాల్లోనే చేస్తూ ఖాళీగా ఉండరు. కాస్తా సమయంలో దొరికితే చాలు ఏదో ఒక బిజినెస్ చేస్తుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో కనిపిస్తారు నటుడు అరవింద స్వామి. జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదురైనా ధైర్యంగా నిలిచిన అతి కొద్దిమందిలో ఒకరాయన. ఈ పేరు తెలుగువారికి కూడా సుపరిచితమే. ఎందుకంటే రామ్ చరణ్ నటించిన ధృవ చిత్రంలో ప్రతి నాయకుడిగా అభిమానుల మనసులు గెలుచుకున్నారు. 20 ఏళ్లకే సినీ కెరీర్ ప్రారంభం 1991లో 20 ఏళ్లకే మణిరత్నం సినిమా తలపతిలో ఎంట్రీ ఇచ్చిన అరవింద స్వామి.. బొంబాయి, రోజా చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఆ తర్వాతే స్టార్ హీరోగా గుర్తింపు దక్కింది. అనంతరం బాలీవుడ్ భామ కాజోల్‌తో నటించిన చిత్రం మిన్సార కనవు చిత్రానికి జాతీయ అవార్డు వరించింది. ఆ తర్వాత ఏడాదిలోనే సాత్ రంగ్ కే సప్నే చిత్రంలో జూహీ చావ్లా సరసన బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పటికీ కూడా అతన్ని కోలీవుడ్‌లో రజనీకాంత్, కమల్ హాసన్‌ల లాంటి స్టార్స్‌కు వారసుడిగా భావిస్తారు. అయితే 1990ల్లోనే బొంబాయి, రోజా సినిమాలతో సూపర్ స్టార్‌గా ఎదిగిన అరవింద్ స్వామి ఓ వ్యాపారవేత్త అని చాలామందికి తెలియదు. ప్రస్తుతం అరవింద్ స్వామి కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం గురించి వివరాలేంటో తెలుసుకుందాం. 30 ఏళ్లకే నటనకు గుడ్‌బై- పక్షవాతంతో పోరాటం అయితే 90వ దశకం చివరి నాటికి అతని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరిగ్గా ఆడలేదు. దీంతో తన సినిమా కెరీర్ పట్ల నిరాశతో ఉన్న స్వామి.. 2000 తర్వాత సినిమాల్లో నటించడం మానేశాడు. ఆ తర్వాత తన తండ్రి వ్యాపార వ్యవహరాలను చూసుకున్నారు. వీడీ స్వామి అండ్ కంపెనీలో పని చేస్తూనే.. ఆపై ఇంటర్‌ప్రో గ్లోబల్‌లో పని చేయడంపై దృష్టి సారించారు. అయితే 2005లో అతని కాలు పాక్షికంగా పక్షవాతానికి దారితీసింది. వ్యాపార సామ్రాజ్యం అయినప్పటికీ 2005లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడిపించారు. పక్షవాతం నుంచి కోలుకున్నాక పే రోల్ ప్రాసెసింగ్, తాత్కాలిక సిబ్బందిని నియమించే టాలెంట్ మాక్సిమస్ అనే సంస్థను స్థాపించారు. రాకెట్ రీచ్ వంటి మార్కెట్ ట్రాకింగ్ పోర్టల్ డేటా ప్రకారం.. 2022లో టాలెంట్ మాగ్జిమస్ ఆదాయం దాదాపు 418 మిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో రూ. 3300 కోట్లు)గా ఉంది. ప్రస్తుతం అరవింద్ స్వామి ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సినిమాల్లో రీ ఎంట్రీ అయితే మళ్లీ 2013లో తన గురువు మణిరత్న ప్రాజెక్ట్ కాదల్‌తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన స్వామి తెలుగులో రామ్ చరణ్ మూవీ ధృవలో విలన్‌గా మెప్పించారు. 2021లో అతను తమిళ-హిందీ ద్విభాషా చిత్రం తలైవిలో కంగనా రనౌత్ సరసన ఏంజీ రామ్‌చంద్రన్ పాత్రలో నటించారు. -
సూపర్ హిట్ మూవీ.. శివాజీ గణేశన్‌కు రజినీ కళ్లు చెదిరే గిఫ్ట్!
సూపర్ స్టార్ రజినీకాంత్, సౌందర్య, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'పాదయప్ప'. తెలుగులో నరసింహా పేరుతో రిలీజ్ చేశారు. ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. చిత్రానికి కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో రజినీకాంత్ తండ్రిగా శివాజీ గణేశన్ నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాతో రజినీకాంత్, శివాజీకి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. వీరిద్దరు కలిసి చాలా చిత్రాల్లో కనిపించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన చివరి చిత్రమే పాదయప్ప. అయితే ఈ సినిమాకు అప్పట్లో రెమ్యునరేషన్ విషయాకొస్తే కేవలం లక్షల్లోనే ఉండేవి. కానీ ఇప్పుడైతే కోట్లలోనే చూస్తున్నాం. (ఇది చదవండి: 'మీకు దమ్ముంటే హౌస్‌లోకి వెళ్లండి'.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన అఖిల్!) అంతకుముందు సినిమాల వరకు శివాజీ గణేశన్ పారితోషికం రూ.20 లక్షల వరకు తీసుకునేవారట. అయితే పాదయప్ప చిత్రానికి దాదాపు రూ.30 లక్షల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేశారట. కానీ రజినీకాంత్ శివాజీ గణేశన్‌కు జీవితాంతం గుర్తుండిపోయేలా రెమ్యునరేషన్ వచ్చేలా చేశారట. పాదయప్ప సినిమాకు ఏకంగా రూ.1.5 కోట్ల పారితోషికం ఇప్పించాడట. దీంతో వీరిద్దరి మధ్య అనుబంధం ఎంత గొప్పదో అర్థమవుతోంది. అయితే ఆ సమయంలో కోటిన్నర రెమ్యునరేషన్ అంటే చాలా ఎక్కువే. శివాజీ గణేశన్ తీసుకున్న అత్యధిక పారితోషికం కూడా అదేనట. అయితే 1999లో ఈ సినిమా రిలీజ్ కాగా.. శివాజీ గణేశన్ 2001లో కన్నుమూశారు. -
ఎప్పటికి యవ్వనంగా ఉండాలని..వందకిపైగా టాబ్లెట్లు, కొడుకు రక్తం..
యవ్వనంగానే ఉండాలనే అందరూ అనుకుంటారు. కానీ అది కుదరుదు. కాలానుగుణంగా వయసు రీత్య వచ్చే మార్పులను యథాతథాంగా ఆమోదించాల్సిందే. దేనికైనా కొంత వరకే అవకాశం. ఆ తర్వాత కనుమరుగు కాక తప్పదు. ఇది ప్రకృతి నియమం కూడా. దీనికి విరుద్ధంగా చేయాలనుకున్న పనులు ఇంతవరకు వికటించాయే గానీ సఫలం కాలేదు. కానీ ఇక్కడొక మిలీనియర్ దాన్ని సఫలం చేసి తిరగ రాయలనుకుంటున్నాడు. ఎప్పటకీ యవుకుడిలా మంచి దేమధారుఢ్యంతో ఉండాలని అతడు చేస్తున్న పనులు వింటే షాక్ అవుతారు. మల మూత్ర విసర్జనలు సైతం.. వివరాల్లోకెళ్తే..యూఎస్‌కి చెందిన టెక్ మిలీనియర్ బ్రయాన్స్ జాన్సన్‌కి ఓ వింత కోరిక పుట్టింది. ఎప్పటికీ నవయవ్వనంగా ఉండాలనే ఆలోచన వచ్చింది. అందుకోసం యాంటీ ఏజింగ్ అనే ప్రక్రియకు తెరతీశాడు. అందులో భాగంగా అతడు రోజుకు దాదాపు వందకు పైగా అంటే.. దగ్గర దగ్గర 111 మాత్రలు హాంఫట్ చేస్తాడట. ఇక దీని వల్ల తన శరీరంలో ఉత్ఫన్నమయ్యే మార్పులను పర్యవేక్షించేలా ఆర్యోగ్య పర్యవేక్షణకు సంబందించిన అత్యాధునిక పరికరాలతో నిరంతరం పర్యవేక్షిస్తాడు. అవి ఏకంగా అతడి మల మూత్ర విసర్జనలను సైతం పరిక్షించి శరీరంలో వచ్చే మార్పులను పసిగట్టి చెబుతుందట. అలాగే ప్రతి రోజు బేస్ బాల్ టోపీని ధరిస్తాడు. అది అతడి నెత్తిపై వృధ్యాప్య లక్షణాలు కనిపించే తెల్ల జుట్టును డిటెక్ట్ చేసి దాన్ని రిపేర్చేస్తుందట. ప్రస్తుతం జాన్సన్ వయసు 46 ఏళ్లు. అయితే అతడు తన అవయవాలన్నీ 18 ఏళ్ల యువకుడి మాదిరిగే మారేలా చేయడం అతని ఆశయం, ఆశ కూడా. నిజానికి జాన్సన్ తన ప్రాసెసింగ్ కంపెనీ బ్రెయిన్ ట్రీ సొల్యూషన్స్‌ను ప్రముఖ దిగ్గజ ఈబే కంపెనీకి రూ. 6 వేల కోట్లకి విక్రయించడంతో.. జాన్సన్ దిశ తిరగబడిందనే చెప్పాలి. ఇక అక్కడ నుంచి పలు వ్యాపారాలతో మిలీనియర్‌గా మారాడు. జాన్సన్(ఎడమ వైపు), తన కొడుకుతో దిగిన ఫైల్ ఫోటో యాక్సిడెంట్ కాకూడదని.. ఇక జాన్సన్‌కి సడెన్‌గా ఇలా యువ్వనంగా మారాలనే వింత కోరిక ఎలా పుట్టిందో గానీ అందుకోసం అతడు తన జీవనశైలిలో ఎన్ని మార్పులు చేశాడంటే..ఒకప్పుడూ లాస్ఏంజిల్స్ వీధుల్లో గంటకు 16 మైళ్ల వేగంలో ఆడి కారులో రయ్యి.. రయ్యి.. మని వెళ్లే ఆ వ్యక్తి కాస్త..ఇప్పుడూ తానే స్వయంగా నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటు వెళ్తున్నాడు. పైగా ఎక్కడకైనా బయలుదేరే ముందు డ్రైవింగ్ మంత్రాన్ని జపిస్తాడట. ఇది ఎందుకంటే?.. ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇంతలా యవ్వనంగా మారాలని కోట్లు కోట్లు ఖర్చు చేస్తున్న డబ్బు, అతడి కష్టం వృధా అయిపోతాయి కదా!అందుకని. ప్రాజెక్ట్ బ్లూప్రింట్తో.. మనోడు అక్కడితో ఆగలేదు యవ్వనంగా ఉండాలని ఏకంగా తన కొడుకు రక్తాన్ని ఎక్కించుకుంటున్నాడట. రోజు దాదాపు 30 మంది వైద్యుల బృందం ఎమ్మారై వంటి స్కానింగ్‌లు నిర్వహించి.. శరీరంలో ఎక్కడ కొలస్టాల్ పెరుగుతుందో చెక్ చేస్తారు. వృద్ధాప్య ఛాయలు వచ్చేలా జరగుతున్న మార్పులను గమనిస్తుంటారు. అందుకు తగ్గ ట్రీట్మెంట్ వెంటనే అందిస్తారట జాన్సన్‌కి. పైగా ఆ వైద్య బృందం బ్లూప్రింట్ అనే ప్రాజెక్ట్‌తో జాన్సన్‌ని తిరిగి యవ్వనంగా అయ్యేలా అతడి ఏజ్‌ని వెనక్కు తీసుకొచ్చే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేగాదు జాన్సన్ కొల్లాజెన్,స్పెర్మిడిన్, క్రియేటిన్ వంటి పోషకాలతో నిండిన "గ్రీన్ జెయింట్" స్మూతీతో రోజును ప్రారంభిస్తాడట. ఇక జాన్సన్ ఇలా యవ్వనంగా మారేందుకు ఏడాదికి సుమారు రూ. 16 కోట్లు దాక ఖర్చు పెడుతున్నాడు. నిజం చెప్పాలంటే.. మన జాన్సన్ అత్యంత ఖరీదైన వ్యక్తి అనాలి. అతడు చెప్పిన ప్రకారం యవ్వనంగా మారాలని చేస్తున్న ఖర్చును కనుగా టాలీ చేస్తే అతడి విలువ ఏకంగా మూడు వేలు కోట్లు. వామ్మో!..ఏందిరా నీకు ఈ పిచ్చి కోరిక అనిపిస్తుంది కదా!. ఈ మహానుభావుడు పెట్టే ఖర్చు ఒక దేశం అభివృద్ధి లేదా ఓ రెండు పట్టణాలు అదీ కాదంటే..కనీసంచాలా అట్టడుగు కుగ్రామాల అభివృద్ధికి ఖర్చు చేస్తే బాగుపడతాయి. ఎందరో నిరుపేదల కష్టాలు తీరతాయని అనిపిస్తుంది కదా!. (చదవండి: ఎనిమిదో ఖండం! 375 ఏళ్లుగా !..వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
ఆ ఒక్క నిర్ణయంతో రూ.2800 కోట్ల ఆదాయం - కేవలం ఏడేళ్లలో..
ఇండియన్ రైల్వే దినదినాభివృది చెందుతున్న విషయం తెలిసిందే.. ఇందులో భాగంగానే కొత్త ట్రైన్లు ప్రారంభించడమే కాకుండా కొత్త కొత్త సర్వీసులను కూడా అందిస్తోంది. అయితే ఇటీవల రైల్వే ఆదాయానికి సంబంధించిన ఒక వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. భారతీయ రైల్వే గత ఏడు సంవత్సరాలలో పిల్లల టికెట్లు (చైల్డ్ ట్రావెలర్స్) విక్రయించి ఏకంగా రూ. 2800 కోట్లకు పైగా ఆదాయాన్ని పొందినట్లు తెలుస్తోంది. 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే రూ. 560 కోట్లు ఆర్జించినట్లు సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సిఆర్ఐఎస్) వెల్లడించింది. ట్రైన్లో 5 సంవత్సరాల కంటే ఎక్కువ, 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ప్రత్యేక బెర్త్‌లు లేదా రిజర్వ్ కోచ్‌లో సీట్లు ఎంచుకోవచ్చు. అలాంటి వారు సాధారణ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నియమం 2016 ఏప్రిల్ 21 నుంచి అమలులోకి వచ్చింది. అంతకు ముందు రైల్వేలో 5 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు ప్రత్యేక బెర్తులు అందించే వారు. ఆ సమయంలో సగం చార్జీలే వసూలు చేసేవారు. ఈ నియమాలు సవరించిన తరువాత రైల్వే మరింత లాభాలను ఆర్జించడం మొదలుపెట్టింది. ఇదీ చదవండి: బైజూస్ కొత్త సీఈఓగా అర్జున్ మోహన్ - ఇతని బ్యాగ్రౌండ్ ఏంటంటే? 2016 - 17 ఆర్థిక సంవత్సరం నుంచి 2022 - 23 ఆర్థిక సంవత్సరం వరకు దాదాపు 3.6 కోట్లమంది పిల్లలు రిజర్వ్డ్ సీటు లేదా కోచ్ ఎంచుకోకుండా సగం చార్జీల మీద ప్రయాణిస్తే.. 10 కోట్లమంది పిల్లలు ప్రత్యేక బెర్త్/సీటును ఎంచుకుని పూర్తి చార్జీలు చెల్లించినట్లు తెలిసింది. మొత్తం మీద సుమారు 70 శాతం మంది పూర్తి చార్జీలు చెల్లించి బెర్త్ పొందటానికి ఇష్టపడుతున్నట్లు చంద్ర శేఖర్ గౌర్ తెలిపారు. -
నటి తాప్సీ కొత్త కారు ఇదే.. ధర తెలిస్తే అవాక్కవుతారు!
'ఝుమ్మంది నాదం'తో తెలుగు చలన చిత్ర సీమలో అడుగుపెట్టిన 'తాప్సీ' ఆ తరువాత షాడో, వీర వంటి సినిమాలతో తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈమె గణేష్ చతుర్థి సందర్భంగా ఒక ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నటి తాప్సీ కొనుగోలు చేసిన కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన 'జిఎల్ఎస్ 600'. దీని ధర రూ. 3 కోట్లు కంటే ఎక్కువే. దీనిని కంపెనీ ఆదివారం ఆమె ముంబై నివాసంలో డెలివరీ చేసింది. పల్లాడియం సిల్వర్ కలర్ ఆప్షన్ కలిగిన ఈ కారు తన గ్యారేజిలో చేరిన రెండవ బెంజ్ కారు. తాప్సీ గ్యారేజిలో ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ, జీప్ కంపాస్, బీఎండబ్ల్యూ 3-సిరీస్, ఆడి ఏ8ఎల్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి జిఎల్ఎస్ 600 చేరింది. ఈ కొత్త కారు చాలా లగ్జరీ ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇక మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 600 విషయానికి వస్తే.. 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 పెట్రోల్ ఇంజన్ కలిగి 550 హెచ్‌పి పవర్ అండ్ 730 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఇది EQ బూస్ట్ టెక్నాలజీ కూడా పొందుతుంది. కావున అదనపు పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇదీ చదవండి: ఇదే జరిగితే 'డిస్నీ ఇండియా' ముఖేష్ అంబానీ చేతికి! జిఎల్ఎస్ 600 పెద్ద 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే & 12.3 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లే కలిగి కారుకి సంబంధించిన అన్ని వివరాలు డ్రైవర్‌కి అందిస్తుంది. అంతే కాకుండా నప్పా లెదర్ అపోల్స్ట్రే, రిక్లైనింగ్ రియర్ సీట్లు, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్, రిఫ్రిజిరేటర్ కంపార్ట్మెంట్ కలిగిన రియర్ సీట్లు మొదలైన ఆధునిక ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి. ఇదీ చదవండి: గడ్కరీ చెప్పినా అప్పటివరకు తప్పదు.. టాటా ఎండీ శైలేశ్ చంద్ర ఇప్పటికే ఈ ఖరీదైన లగ్జరీ కారుని ఆయుష్మాన్ ఖురానా, దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్, కృతి సనన్, అజయ్ దేవగన్, ఆదిత్య రాయ్ కపూర్, అర్జున్ కపూర్, శిల్పా శెట్టి మాత్రమే కాకుండా ఆర్ఆర్ఆర్ నటుడు రామ్ చరణ్ కూడా కొనుగోలు చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈ కారుపై సెలబ్రిటీలకు ఎంత మక్కువ ఉందో ఇట్టే అర్థమైపోతోంది. -
G20 Summit Budget: జీ20 సమ్మిట్ కోసం భారత్ ఇన్ని కోట్లు ఖర్చు చేసిందా? ఆసక్తికర విషయాలు!
G20 New Delhi summit 2023: ప్రపంచ దేశాలు నేడు భారత్ వైపు చూస్తున్నాయి. ఈ రోజు, రేపు (2023 సెప్టెంబర్ 9, 10) జీ20 సమావేశాలు (G20 Summit) దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతాయనే విషయం అందరికి తెలుసు. ఈ సమావేశాలకు 30 మంది దేశాధినేతలతో పాటు 14 మంది అంతర్జాతీయ సంస్థల అధినేతలు హాజరుకానున్నారు. దీని కోసం కేంద్రం ఎంత ఖర్చు చేసిందనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కేంద్రం జీ20 సమావేశాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కావున న భూతో న భవిష్యత్ అనే రీతిలో ఏర్పాట్లను అంగరంగ వైభవంగా చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, బంగ్లాదేశ్ ప్రధానితో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నాయకులు హాజరవుతున్నారు. మొత్తం ఖర్చు.. కొన్ని నివేదికల ప్రకారం.. జీ20 సమ్మిట్ కోసం కేంద్రం రూ. 4100 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు సమాచారం. రోడ్లు, సెక్యూరిటీ, ఫుట్‌పాత్‌లు, లైటింగ్‌తో పాటు ఇతర పనుల కోసం ఈ డబ్బును ఖర్చు చేసినట్లు నివేదిక పేర్కొంది. మేక్ఓవర్ ప్రక్రియలో భాగంగా దేశ రాజధానిలోని వివిధ ప్రదేశాలలో అనేక శిల్పాలు కూడా ఏర్పాటు చేశారు. జరుగుతున్న ఈవెంట్‌కు సంబంధించిన ఇతర ఖర్చులు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: రూ.20 వేలతో మొదలై ప్రపంచ స్థాయికి.. వావ్ అనిపించే 'వందన' ప్రస్థానం! జీ20 శిఖరాగ్ర సమావేశాల కోసం గతంలో ఇతర దేశాలు కూడా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేశాయి. 2018లో బ్యూనస్ ఎయిర్స్ సమ్మిట్ ఖర్చు $112 మిలియన్స్ కాగా.. 2010 టొరంటోలో జరిగిన సమ్మిట్ కోసం కెనడా CAD 715 మిలియన్స్ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. చివరి శిఖరాగ్ర సమావేశం 2022 నవంబర్‌లో ఇండోనేషియాలోని బాలిలో జరిగింది. 2024 జీ20 సమావేశాలు బ్రెజిల్ నగరంలో జరగనున్నట్లు సమాచారం. -
నెలకు రూ.5 వేల జీతం.. తొలి చిత్రంతోనే రూ.100 కోట్లు!
దియా మీర్జా బాలీవుడ్లో పరిచయం అక్కర్లేనిపేరు. బాలీవుడ్‌లోని అత్యంత గ్లామర్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ముద్దుగుమ్మ ఫెమినా మిస్ ఇండియా-2000 టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత రెహనా హై టెర్రే దిల్ మే (2001) చిత్రంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రం సూపర్‌హిట్ కావడంతో సూపర్ స్టార్‌గా ఎదిగింది. ఆ తర్వాత దస్, లగే రహో మున్నా భాయ్, హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి చిత్రాలలో నటించింది . ఆమె 2019లో కాఫిర్ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. తన ప్రతిభ ఆధారంగానే గుర్తింపు సాధించిన దియా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: మెగాస్టార్ మూవీ రివ్యూ.. అందరికంటే ముందుగానే!) మిస్ ఆసియా పసిఫిక్‌గా నిలిచిన దియా మీర్జా తల్లి బెంగాలీ కాగా, ఆమె తండ్రి జర్మనీకి చెందినవారు. అయితే దియా పుట్టిన తర్వాత ఆమె తల్లి తన భర్త నుంచి విడిపోయింది. ఆ తర్వాత ఆమె తల్లి హైదరాబాద్‌కు చెందిన అహ్మద్ మీర్జాను వివాహం చేసుకుంది. దియా ఇప్పటికీ తన సవతి తండ్రి పేరునే ఇంటిపేరుగా పరిగణిస్తోంది. ఇటీవల ఐఫా-2023 అవార్డుల సందర్భంగా తన లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఐదేళ్ల వయసులోనే.. దియా ఐదేళ్ల వయసులో ఉండగానే తన తండ్రిపై కోపాన్ని పెంచుకుంది. ఐదేళ్లు ఉన్నప్పుడు ఆమెను తండ్రి తిట్టడంతో ఇంటి నుంచి పారిపోయి తన బంధువుల వద్దకు వెళ్లింది. ఆ తర్వాత దియా మీర్జా ఒక మీడియా సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసింది. అప్పుడు ఆమె జీతం నెలకు కేవలం రూ. 5,000 మాత్రమే తీసుకునేదట. (ఇది చదవండి: నెలలు గడుస్తున్నా ఓటీటీకి రాని టాలీవుడ్ మూవీస్.. అసలు కారణాలేంటి?) తొలిచిత్రమే రూ.100 కోట్లు దియా మీర్జా 2001లో 'రెహ్నా హై తేరే దిల్ మే' చిత్రంలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్ ఆర్ మాధవన్ సరసన నటించింది. ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం బాలీవుడ్‌లోని అత్యుత్తమ రొమాంటిక్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంలో దియా మీర్జా ఓ సాధారణ అమ్మాయి పాత్రలో నటించింది. దియా మీర్జా దీవానాపన్, తుమ్కో నా భూల్ పాయేంగే, దమ్, పరిణీత, లగే రహో మున్నాభాయ్, సంజు వంటి చిత్రాలలో కనిపించింది. అయితే దియా వ్యక్తిగత జీవితంలో మాత్రం తన మొదటి భర్త సాహిల్ సంఘితో విడిపోయిన తర్వాత.. ఆమె వైభవ్ రేఖీని వివాహం చేసుకుంది. -
300 కోట్ల ట్రిప్పులు.. సంపాదన ఎన్ని కోట్లో తెలిస్తే అవాక్కవుతారు!
భారతదేశంలో ఉబర్ సర్వీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కస్టమర్లు ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలన్న కారుని బుక్ చేసుకుని గమ్యస్థానాలు చేరుకుంటున్నారు. ఇంతలా పాపులర్ అయిన ఉబర్ ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉబర్ ప్రారంభమైనప్పటి నుంచి డ్రైవర్లు ఇప్పటి వరకు ఏకంగా 300 కోట్ల ట్రిప్పులు తిరిగి రూ. 50,000 కోట్లకు పైగా సంపాదించినట్లు నివేదికలు చెబుతున్నాయి. మనషి నిత్యజీవితంలో ఒక భాగమైపోయిన రవాణాలో ఉబర్ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుండటం చాలా గర్వంగా ఉందని ఉబెర్ ఇండియా ప్రెసిడెంట్ 'ప్రభ్‌జీత్ సింగ్' తెలిపారు. ఇదీ చదవండి: నితిన్ గడ్కరీ ఆవిష్కరించిన ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు.. ఇది చాలా స్పెషల్! భూమి నుంచి చంద్రునికి 86,000 సార్లు.. ఇప్పటి వరకు ఉబర్ ప్రయాణించిన దూరం 'భూమి నుంచి చంద్రునికి' దాదాపు 86,000 సార్లు ప్రయాణించడంతో సమానమని కంపెనీ చెబుతోంది. సుమారు 30 లక్షల మంది డ్రైవర్లు ఉబర్ ద్వారా డ్రైవర్ భాగస్వాములుగా ఉన్నారు. కంపెనీ భారతదేశం అంతటా 125 నగరాల్లో తమ కార్య కలాపాలను నిర్వహిస్తోంది. ఆధునిక కాలంలో ఎక్కువ మంది ఇప్పుడు తమ గమ్యస్థానాలను ఉబర్ సర్వీస్ ద్వారా సురక్షితంగా చేరుకుంటున్నారు. చాలామంది ఉబర్ వినియోగించుకోవడానికి ప్రధాన కారణం కారు మెయింటెనెన్స్ & డ్రైవర్ జీతం నుంచి తప్పించుకోవడమే అని తెలుస్తోంది. ఈ సర్వీసుల వల్ల మరికొందరు సొంత వాహనాలు కొనుగోలు కూడా వాయిదా వేసుకుంటున్నారు. -
కోట్లు సంపాదించేలా చేసిన భారత పర్యటన - ఇండియాలో అమెరికన్ హవా!
విజయవంతమైన వ్యాపారాలన్నీ కూడా కేవలం ఒక్క ఆలోచనతో ప్రారంభమైనవే అనే విషయం అందరికి తెలుసు. ఇలాంటి వ్యాపారాలు భారతదేశంలో కోకొల్లలనే చెప్పాలి. ఇలాంటి కోవకు చెందిన ఒక బిజినెస్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కాలిఫోర్నియా బుర్రిటో.. అమెరికాకు చెందిన పారిశ్రామికవేత్త 'బెర్ట్ ముల్లర్' (Bert Mueller) భారతదేశంలో పర్యటించడానికి వచ్చి క్విక్ సర్వీస్ రెస్టారెంట్ 'కాలిఫోర్నియా బుర్రిటో' (California Burrito) పేరుతో నిర్మించాడు. ఇతడు ధరమ్ ఖల్సా & గేలాన్ డ్రేపర్‌లతో కలిసి దీనిని స్థాపించాడు. బుర్రిటో రెస్టారెంట్ బెంగళూరులో ఉంది. దీనిని బుర్రిటో రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 2010లో ప్రారంభించినట్లు సమాచారం. నిజానికి వీరు ఇండియాలో మొదట గురుగ్రామ్‌లో రెస్టారెంట్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ చివరకు బెంగళూరులో ప్రారంభించారు. దీనికోసం ముల్లెర్ & డ్రేపర్ స్వయంగా చాలా కష్టపడ్డారు. చెన్నైకి విస్తరణ.. క్రమంగా బుర్రిటో రెస్టారెంట్ భారతదేశంలో క్రమంగా అభివృద్ధి చెందటం ప్రారంభమైంది. 2023 మే నెలలో కాలిఫోర్నియా బుర్రిటో చెన్నైకి విస్తరించింది. ఇప్పుడు దేశం మొత్తం మీద బెంగళూరు మాత్రమే కాకుండా ఢిల్లీ ఎన్‌సిఆర్, హైదరాబాద్ నగరాలలో కూడా ఉన్నట్లు సమాచారం. బుర్రిటో రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అయిన ముల్లర్ అమెరికాలోని మోస్ సౌత్‌వెస్ట్ గ్రిల్లో పనిచేశాడు. ది కాలేజ్ ఆఫ్ విలియం అండ్ మేరీ నుంచి ఆర్ట్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి వ్యాపార రంగంలో అడుగుపెట్టాడు. దీనికోసం కుటుంబం, స్నేహితుల నుంచి డబ్బు తీసుకుని తమ ప్రయాణం సాగించి నేడు మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు. 100 స్టోర్ల లక్ష్యం.. ప్రస్తుతం కాలిఫోర్నియా మొత్తంలో బుర్రిటో రెస్టారెంట్ 50 కంటే ఎక్కువ లొకేషన్లలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా ప్రతి సంవత్సరం రూ. 110 కోట్లకంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు సమాచారం. 2025 మార్చి నాటికి కాలిఫోర్నియా బురిటో 100 స్టోర్లను కలిగి ఉండాలని బెర్ట్ ముల్లర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. 15/15 Bert is aiming for California Burrito to have 100 stores by March of 2025. Here’s a sneak peek from the podcast conversation I had with him recently. If you want to watch the entire video, you can find a link to it in my bio. pic.twitter.com/bdMlBk6vae — Caleb Friesen (@caleb_friesen2) August 21, 2023 -
పాముల పెంపకం.. కోట్లలో ఆదాయం - ఎక్కడో తెలుసా?
Snake Farming In China: మనిషి బతకాలంటే ఏదో ఒకటి చేయాలన్న విషయం అందరికి తెలుసు. మనదేశంలో వ్యవసాయం చేస్తూ ధాన్యం, పండ్లు, కూరగాయలు వంటివి విరివిగా పండిస్తారు. అంతే కాకుండా కోళ్లు, గొర్రెలు వంటివి పెంచడం ద్వారా కూడా ఆదాయం పొందుతారు. అయితే చైనాలో ఇందుకు భిన్నంగా పాములను పెంచి కోట్లలో సంపాదిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, చైనాలోని జిసికియావో గ్రామంలో పాములను పెంచి ఏడాదికి కోట్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ గ్రామం స్నేక్ విలేజ్‌గా మారిపోయింది. ఇక్కడ ప్రతి వ్యక్తి సుమారు 30వేలకంటే ఎక్కువ పాములను పెంచుతారని చెబుతారు. పిల్లలు కూడా బొమ్మలకి బదులు పాములతోనే ఆడుకుంటారు. నిజానికి పాములను పెంచుతున్నారు కదా? ఇవన్నీ విషరహితమైనవనుకుంటే పొరపాటే. ఎందుకంటే వీటిలో చాలావరకు ఎక్కువ విషం ఉన్న పాములు కూడా ఉన్నాయని తెలుస్తోంది. పాముల మాంసంతో పాటు వాటి శరీర భాగాలను కూడా అమ్ముతూ బాగా డబ్బు సంపాదిస్తున్నారు. ఒక లీటరు విషం ఏకంగా రూ. 3.5 కోట్లు వరకు ఉంటుంది. ఇదీ చదవండి: మానవాద్భుత సృష్టి.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు! మన దేశంలో పనీర్ మాదిరిగా చైనాలో పాముల మాంసం తింటారు. అంతే కాకుండా క్యాన్సర్ సంబంధిత మందుల తయారీకి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. కావున పాములను చెక్క పెట్టెలు లేదా గాజు పెట్టెలలో పెంచుతారు. ఇవి పెద్దవైన తరువాత విషం సేకరిస్తారు. ఆ తరువాత వంటలు చేసుకోవడానికి ఉపయోగిస్తారు. పాము చర్మం ఖరీదైన బెల్టులు, ఇతర వస్తువుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. -
బ్యాంక్ కస్టమర్లకు దిమ్మతిరిగే విషయం.. చార్జీలు ఎన్ని రూ.వేల కోట్లు కట్టారో తెలుసా?
వివిధ బ్యాంకులు పలు చార్జీల నిమిత్తం ఐదేళ్ల కాలంలో కస్టమర్ల నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేశాయో తెలిసింది. అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్‌లు లేకపోవడంపై పెనార్టీలు, అదనపు ఏటీఎం లావాదేవీలు, ఎస్ఎంఎస్ సేవలపై ఛార్జీల రూపంలో 2018 నుంచి బ్యాంకులు రూ.35,000 కోట్లకు పైగా వసూలు చేశాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపింది. గత ఐదేళ్లలో యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకులతో సహా ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి సేకరించిన గణాంకాలను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ తాజాగా రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. మినిమమ్ బ్యాలెన్స్‌పైనే మ్యాగ్జిమమ్ బ్యాంకులు ఐదేళ్లలో చార్జీల రూపంలో కస్టమర్ల నుంచి వసూలు చేసిన మొత్తం రూ.35,000 కోట్లలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోవడంపై విధించే చార్జీల రూపంలో అత్యధికంగా రూ.21,044.4 కోట్లు, అదనపు ఏటీఎం లావాదేవీల చార్జీలు రూ.8,289.3 కోట్లు, ఎస్ఎంఎస్ సేవల కోసం రూ.6,254.3 కోట్లు వసూలు చేసినట్లు కరాద్ పేర్కొన్నారు. 2015 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాస్టర్ సర్క్యులర్ ప్రకారం, కస్టమర్లు తమ సేవింగ్స్ ఖాతాలలో కనీస బ్యాంక్ బ్యాలెన్స్‌ని నిర్వహించనప్పుడు సహేతుకమైన జరిమానా ఛార్జీలను నిర్ణయించడానికి బ్యాంకులకు అనుమతి ఉంది. ఇదీ చదవండి: కోటీశ్వరులు పెరిగారు.. లక్షాధికారులు తగ్గారు! ఈ లెక్క ఏంటో తెలుసుకోండి.. అన్ని రకాల లావాదేవీల కోసం బ్యాంకులు ఆన్లైన్ అలర్ట్‌ల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆర్బీఐ సర్క్యులర్‌లో పేర్కొంది. అయితే, సహేతుకతను నిర్ధారించడానికి, అటువంటి ఛార్జీలు వాస్తవ ప్రాతిపదికన విధించేలా చూసుకోవాలని బ్యాంకులకు సూచించింది. ఇక ఏటీఎం లావాదేవీలకు సంబంధించి 2022 నవంబర్ నాటి ఆర్బీఐ నూతన ఏటీఎం మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు సేవింగ్స్-బ్యాంక్ ఖాతాదారులకు లొకేషన్‌తో సంబంధం లేకుండా నెలలో కనీసం ఐదు ఉచిత ఆర్థిక లావాదేవీలను అందించాలి. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో అయితే ఒక నెలలో మెట్రో నగరాల్లో మూడు, నాన్-మెట్రో ప్రాంతాలలో ఐదు ఉచిత ట్రాక్సాక్షన్లు ఉంటాయి. -
అక్కడ అద్దె తెలిస్తే అవాక్కవుతారు.. ఆఫీస్ రెంట్ నెలకు ఎన్ని కోట్లంటే?
HDFC: ప్రపంచ మార్కెట్లో రియల్ ఎస్టేట్ రంగం రోజు రోజుకి అమాంతం ముందుకు దూసుకెళుతోంది. ఈ కారణంగా ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో ఒక ఎకరం భూమి ధర ఏకంగా రూ. 100 కోట్లకు చేరిన సంగతి తెలిసింది. కాగా అద్దెలు కూడా భారీగానే పెరిగాయి. దీంతో ఒక బ్యాంకు నెలకు రూ. 1.62 కోట్లు అద్దె చెల్లిస్తూ ఐదు సంవత్సరాల అగ్రిమెంట్‌తో ఆఫీస్ స్పేస్ లీజుకి తీసుకున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నెలకు రూ. 1.62 కోట్లు అద్దె.. నివేదికల ప్రకారం.. హెచ్డీఎఫ్సీ ముంబైలోని వన్ ఇంటర్నేషనల్ సెంటర్లో తన ఆఫీస్ కోసం 64,337 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన స్థలానికి నెలకు రూ. 1.62 కోట్లు అద్దె చెల్లించడానికి అంగీకరించినట్లు తెలిసింది. దీని కోసం సంస్థ ఐదు సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుంది. ఆ తరువాత అగ్రిమెంట్ కాలవ్యవధి పెరుగుతుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. బ్యాంకు 7వ అంతస్తులో మూడు యూనిట్లు, 8వ అంతస్తులో రెండు యూనిట్లను లీజుకు తీసుకుంది. ఇవి టవర్స్ 2, 3లో ఉన్నాయి. ఈ డీల్ కోసం బ్యాంక్ దాదాపు రూ.9.73 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించింది. అయితే అద్దె సంవత్సరానికి 4.5 శాతం పెరగనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పొట్టి మొక్క సాగుతో పుట్టెడు లాభాలు.. నెలకు రూ. 4 లక్షలు పక్కా! ఐదు సంవత్సరాలకు అద్దె ఇలా.. దీని ప్రకారం మార్చి 1, 2024 నుంచి జూలై 31, 2024 వరకు అద్దె రూ. 1.62 కోట్లు. 2024 ఆగష్టు 1 నుంచి 2025 జూలై 31 వరకు అద్దె నెలకు రూ.1.69 కోట్లు. 2025 ఆగష్టు 1 నుంచి 2026 జూలై 31 వరకు అద్దె రూ. 1.77 కోట్లు. 2026 ఆగష్టు 1 నుంచి 2027 జులై 31 వరకు అద్దె రూ.1.85 కోట్లు ఉండనున్నట్లు సంస్థ డాక్యుమెంట్లు వెల్లడిస్తున్నాయి. ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ వేతనం ఎంతో తెలుసా? మరో ఐదేళ్లూ అదే జీతం! గత కొన్ని రోజులకు ముందు హొసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ (HDFC) ప్రైవేట్ బ్యాంకింగ్ రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీలో విలీనమైన సంగతి తెలిసిందే. దీంతో సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరించడంతో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
పెట్టుబడుల సమీకరణలో మరో అడుగు ముందుకు - ఒబెన్ ఎలెక్ట్రిక్
బెంగళూరు: దేశీ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఒబెన్ ఎలెక్ట్రిక్ కొత్తగా రూ. 40 కోట్ల పెట్టుబడులు సమీకరించింది. స్ట్రైడ్ వెంచర్స్, ఇండియన్ రెన్యువబుల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ముంబై ఏంజెల్స్ తదితర సంస్థలు ఇన్వెస్ట్ చేసినట్లు ఒబెన్ సీఈవో మధుమిత అగర్వాల్ తెలిపారు. ఎక్స్టెండెడ్ ప్రీ–సిరీస్ ఏ రౌండ్ కింద ఈ నిధులను సమీకరించినట్లు చెప్పారు. దీంతో ప్రీ–సిరీస్ కింద మొత్తం రూ. 72 కోట్ల పెట్టుబడులు సాధించినట్లయిందని వివరించారు. కొత్తగా ఆవిష్కరించిన తమ తొలి ఎలక్ట్రిక్ బైక్ రోర్ డెలివరీలను ప్రారంభించేందుకు, ఉత్పత్తిని వార్షికంగా లక్ష యూ నిట్లకు పెంచుకునేందుకు ఈ నిధులను ఉప యోగించుకోనున్నట్లు చెప్పారు. జూలై మొద టివారం నుంచి బెంగళూరులో డెలివరీలు ప్రారంభమవుతాయని అగర్వాల్ తెలిపారు. -
మహానేరగాడిలో వికసించిన మానవత్వం.. రూ.10 కోట్లు విరాళం
ఒడిశా: రూ. 200 కోట్లు మనీలాండరింగ్ కేసులో అరెస్టై మాండోలి జైలులో ఊచలు లెక్కబెడుతున్న కరుడుగట్టిన ఆర్ధిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ మంచివాడిగా మారి ఒడిశా రైలు ప్రమాదంలో బాధితులకు రూ.10 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు జైలు నుంచే ఒక లేఖ కూడా రాశాడు. ఎవరీ సుఖేష్.. కోర్టు ధిక్కారణతోపాటు పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు శివిందర్ సింగ్, మాల్విందర్ సింగ్ లకు బెయిల్ ఇప్పిస్తానని నమ్మబలికి వారి భార్యల నుండి సుమారు రూ.200 కోట్లు దోచుకున్న కేసులో ప్రధాన నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్. అయితే తీహార్ జైలులో ఉంటూనే సుఖేష్ ఈ నేరానికి పాల్పడటం ఆశ్చర్యకరం. కేవలం మాటలతోనే మాయ చేయగల ఈ మహా నేరగాడిలో ఉన్నట్టుండి మానవత్వం పరిమళించి రైలు ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. ఇటీవల ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 1200 మంది గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో ప్రమాదంలో అయినవారిని కోల్పోయినవారికి, అనాథలైన పిల్లలకు రూ. 10 కోట్లు ఆర్ధిక సాయం అందించనున్నట్లు సుఖేష్ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు లేఖ రాశారు. లేఖలో ఏమని రాశాడంటే.. "నేను పంపిస్తున్న మొత్తం నగదు చట్టబద్ధంగా సంపాదించినది. దీనికి టాక్స్ కూడా కట్టాను. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలతో పాటు రూ.10 కోట్ల డీడీను కూడా పంపిస్తాను. ఒడిశా రైలు ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసింది. ప్రమాద బాధితులకు ప్రభుత్వం ఎలాగూ అండగా ఉంటుంది. కానీ బాధ్యతగల మంచి పౌరుడిగా నేను కూడా వారికి నా వంతుగా రూ.10 కోట్లు సాయం చేయాలని అనుకుంటున్నాను. ఈ మొత్తం సొమ్ము తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువులకు, పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. దయచేసి నా ఈ అభ్యర్ధనను అంగీకరించి విరాళాలు సేకరించే సంబంధిత శాఖ వివరాలను తెలపగలరు." అని రాశాడు. మహా నేరగాడు, మానవత్వం, రైలు ప్రమాదం, ఒడిశా రైలు ప్రమాదం, సుఖేష్ చంద్రశేఖర్, చట్టబద్ధం, ప్రమాద బాధితులు, ప్రభుత్వం ఇది కూడా చదవండి: ప్లాట్ఫారం నాయకుడిలా మాట్లాడకండి.. నోరు జాగ్రత్త! -
ఐపీల్ ప్రైజ్ మనీ ఎన్ని కోట్లు అంటే ..
-
టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్‌ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు
భారతదేశంలో టీ లేదా చాయ్‌కున్న ఆదరణ అంతా ఇంతా కాదు. అంతేకాదు చాయ్ అమ్మి సక్సెస్ అయిన స్టోరీలు కూడా చాలా ఉన్నాయి. అయితే అనుభవ్ దూబే, ఆనంద్ విజయగాథ మాత్రం కాస్త డిఫరెంట్. ముఖ్యంగా 23 ఏళ్ల అనుభవ్ దూబే సీఏ పరీక్షలో ఫెయిలయ్యాడు. వ్యాపారవేత్త కావాలనుకుని ఏఐఎస్ డ్రీమ్స్‌ను వదిలేసుకున్నాడు. టీ వ్యాపారిగా 150కోట్లు సంపాదిస్తున్నాడు. మధ్యప్రదేశ్, రేవాకు చెందిన అనుభవ్ దూబే ఆనంద్ నాయక్ చిన్ననాటి స్నేహితులు. అనుభవ్ తండ్రి వ్యాపారవేత్త అయినప్పటికీ తన కొడుకును వ్యాపారిగా కాకుండా ఏఐఎస్ ఆఫీసర్ అధికారి కావాలని కోరుకున్నాడు. అప్పటికే సీఏ పరీక్షలో ఫెయిలైన కొడుకు అనుభవ్ దూబేని యూపీఎస్సీకి ప్రిపేర్ కావడాని ఢిల్లీకి పంపించాడు. తండ్రి కోరిక మేరకు అనుభవ్ పరీక్షకు సిద్ధమవుతున్నప్పటికీ ఎందుకో ఉద్యోగంలో తన లైఫ్ సెటిల్ కాదని వ్యాపారమే కరెక్ట్ అని డిసైడయ్యాడు. ఫలితం కోట్ల విలువ చేసే కంపెనీ చాయ్ సుత్తా బార్‌కు కో ఫౌండర్‌గా మారిపోయాడు. కేవలం అయిదేళ్లలో 3 లక్షల నుండి 150 కోట్లకు ఎదిగాడు. 2016లో స్నేహితుడు ఆనంద్ నాయక్‌తో తన ప్లాన్‌గురించి చర్చించాడు. ఆలోచన బానే ఉందిగానీ ఇద్దరి దగ్గరా సరిపడా నిధులు లేవు. కానీ వ్యాపారవేత్త కావాలనుకున్న వాటి పట్టుదల ముందు అదిపెద్ద సమస్యగా తోచలేదు. ఎలాగోలా రూ. 3 లక్షలు సమకూర్చుకుని , తమ తొలి టీ అవుట్‌లెట్‌ను అమ్మాయిల హాస్టల్‌కు ఎదురుగా షురూ చేశాడు. తరువాతి కాలంలో వీరిద్దరితో రాహుల్ కూడా జత కలిశాడు. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!) అసలే లో-బడ్జెట్. ఇక మార్కెటింగ్, ఇంటీరియర్ డిజైన్, బ్రాండింగ్ వంటి వాటి డబ్బులు ఎలా వస్తాయని అనుభవ్,ఆనంద్ మదనపడ్డారు. అయినా ఎక్కడా వెనక్కి తగ్గలే. తోటి స్నేహితుల దగ్గర అప్పు చేసి, సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్‌తో ఇండోర్‌లోని హాస్టల్‌కు ఆనుకుని తొలి అవుట్ లెట్‌ని డిజైన్ చేసుకున్నారు.అంతేకాదు ఆఖరికి బ్యానర్‌ను ప్రింట్ చేయడానికి డబ్బు లేకపోవడంతో, ఒక చెక్క ముక్కను తీసుకుని, చేతితో "చాయ్ సుత్తా బార్" అని రాశారు. ఈ టీ స్టాల్ పేరు, ఆలోచన, ఆశయం యువతను బాగా ఆకట్టుకున్నాయి. (స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు) ప్రస్తుతం అనుభవ్ ,ఆనంద్ దేశంలోని 195 నగరాల్లో చాయ్ సుత్తా బార్ 450కిపైగా అవుట్లెట్లను ప్రారంభించారు. దుబాయ్, యుకె, కెనడా , ఒమన్ వంటి దేశాలతో సహా విదేశాలకు కూడా ఛాయ్ సుత్తా బార్ తన సత్తా చాటుకుంటోంది. చాయ్ సుత్తా బార్ వార్షిక టర్నోవర్ దాదాపు రూ.150 కోట్లు. అనుభవ్ దూబే నికర విలువ దాదాపు 10 కోట్లు ఉంటుందని అంచనా. మట్టి కప్పులు, 250 కుటుంబాలకు ఉపాధి చాయ్ సుత్తాబార్‌లో మట్టి కప్పులు, కుల్హాద్‌లు ప్రధాన ఆకర్షణ. దీనికి 250 కుటుంబాలకు ఉపాధి అవకాశాలను కల్పించారు. మట్టి పాత్రనే వాడుతూ తద్వారా వృత్తి నిపుణులైన కుమ్మరి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు. అలాగే ఇద్దరితో మొదలై చాయ్‌సుత్తా బార్లో ఇపుడు ఎంబీఏ చదివినవారు, ఇతర ఇంజనీర్లతో సహా ఈరోజు 150 మందికి పైగా పని చేస్తున్నారంటే వీరి వ్యాపార దక్షతను అర్థం చేసుకోవచ్చు. ఇంకో విశేషం ఏమిటంటే ఇక్కడి సిబ్బంది దాదాపు అందరూ వికలాంగులు లేదా ఆర్థికంగా పేద నేపథ్యం నుండి వచ్చినవారు కావడం విశేషం. 7 రకాల టీ, పలు రకాల కాఫీలు, ఫాస్ట్ ఫుడ్లను విక్రయిస్తారు. ఇక్కడ టీ 10 రూపాయలకే టీ లభిస్తుంది. అనుభవ్ కష్టాలు, జీవిత పాఠం 2016: స్థానిక గూండాల దాడి 2017: నార్కోటిక్స్ దాడి 2020: కోవిడ్ హిట్; అవుట్లెట్లు మూసివేత 2020: వ్యాపారంలో నమ్మకద్రోహం చేసిన వ్యక్తి 2021: టైప్ 1 డయాబెటిస్ నిర్ధారణ 19 ఏళ్ళపుడు సీఏ వదిలి సివిల్ సర్వీసెస్‌కి 21 ఏళ్ళ వయసులో యూపీఎస్సీకి గుడ్‌బై 20వ దశకం ప్రారంభంలో ఏం చేయాలో తెలియని అయోమయం కట్ చేస్తే.. 3 లక్షల నుండి 150 కోట్లకు రాకింగ్ స్టార్‌గా అనుభవ్ దుబే ‘‘మీ ప్రయత్నాన్ని వదలవద్దు.. విజయం మీ కోసం వేచి ఉంది! ఆపొద్దు ప్రయత్నిస్తూ ఉండు!’’ అంటారు అనుభవ్ దూబే What's the craziest business idea you've ever had? pic.twitter.com/bfKdifIa5i — Anubhav Dubey (@tbhAnubhav) May 15, 2023 -
బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు..
బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు ఓ ఐఐటీయన్. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఆహార బ్రాండ్లలో ఒకటైన ‘బిర్యానీ బై కిలో’ అనే సంస్థను 2015లో విశాల్ జిందాల్ స్థాపించారు. అప్పటి నుంచి కంపెనీ వార్షిక ఆదాయం పెరుగుతూ వస్తోంది. అయితే దీంతోనే అతను సంతృప్తి చెందలేదు. వచ్చే రెండు మూడేళ్లలో రూ.1000 కోట్ల టర్నోవర్ సాధించబోతున్నాడు. బిర్యానీ బిజినెస్‌తో సక్సెస్ అయిన ఐఐటీయన్ కథ ఇది.. అనేక వ్యాపారాలు ఉన్న విశాల్ జిందాల్ స్వయంగా ఆహార ప్రియుడు. అందుకే ఆయనకు ఎన్ని వ్యాపారాలు ఉన్నా బిర్యానీ వ్యాపారమంటేనే ఆయనకు మక్కువ. ఈ బిరియానీ వ్యాపారం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన భారతదేశంలోని ఖాన్సామా సంప్రదాయాన్ని పునరుద్ధరించడం. అంటే ఇక్కడ ప్రతి ఆర్డర్‌ను విడివిడి వండుతారు. వండిన బిర్యానీని మట్టి పాత్రల్లో కాల్చిన పిండి సహాయంతో ప్యాక్ చేస్తారు. ఇదీ చదవండి: అపరిచితుడికి కిడ్నీ దానం.. అపర దాన కర్ణుడు ఈ బిలియనీర్.. ఐఐటీ నుంచి ఇంజినీరింగ్ చేసిన విశాల్ జిందాల్ ఆ తర్వాత న్యూయార్క్‌లోని సిరక్యూస్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఫైనాన్స్ చదివారు. సింగపూర్‌కు చెందిన ఎకోసిస్టమ్ అడ్వైజరీ బోర్డులో జిందాల్ కూడా ఉన్నారు. ఇది అతని మొదటి కంపెనీ కాదు. గుర్గావ్లో కార్పెడియం క్యాపిటల్ పార్టనర్స్ అనే ప్రైవేట్ ఈక్విటీ ఫండ్‌ను స్థాపించారు. ఫిడిలిటీ వెంచర్స్ వ్యవస్థాపకుడు అలాగే ఆ సంస్థకు ఎండీగా, అక్షయం క్యాపిటల్ సీఈవోగా ఉన్నారు. (layoffs: షాకిచ్చిన ఇండియన్ ట్విటర్, 30 శాతం మందికి గుడ్ బై?) భారతీయ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థను ఆయనే స్థాపించి మిలియన్ డాలర్ల కంపెనీగా మార్చారు. ఇది అన్ని మెట్రో నగరాల్లో 100 మంది ఉద్యోగులు, కార్యాలయాలను కలిగి ఉంది. విశాల్ జిందాల్ అమెరికాలో 1994లో అమనో సిన్సినాటి అనే కంపెనీకి మార్కెటింగ్ అసోసియేట్‌గా పనిచేశారు. ‘బిర్యానీ బై కిలో’ సంస్థ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 300 కోట్ల ఆదాయం వస్తుందని ఆశించారు. అయితే ప్రస్తుతం కంపెనీ నష్టాల్లో ఉంది. అయినప్పటికీ జూన్ నాటికి పుంజుకుంటుందని ఆశిస్తున్నారు. కంపెనీకి రూ. 700-750 టిక్కెట్ సైజుతో రోజుకు 10,000 కంటే ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి. ఈ కంపెనీకి అన్ని మెట్రో నగరాలతో సహా 45 కంటే పైగా నగరాల్లో 100కి పైగా అవుట్లెట్లు ఉన్నాయి. (కండోమ్స్ బిజినెస్: 50లక్షలనుంచి రూ. 43వేల కోట్లతో దడ పుట్టించిన బ్రదర్స్) 2022 ఆర్థిక సంవత్సరంలో వారు రూ. 135 కోట్లు, అంతకుముందు 2021 సంవత్సరంలో రూ. 65.6 కోట్లు ఆర్జించారు విశాల్ జిందాల్. వచ్చే రెండు మూడు ఏళ్లలో రూ.1000 కోట్ల టర్నోవర్‌ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందు కోసం మార్కెటింగ్ వ్యయాన్ని కూడా పెంచాలనుకుంటున్నట్లు, మెక్‌డొనాల్డ్స్, స్టార్‌బక్స్ కంటే పెద్ద వ్యాపారాన్ని నిర్మించాలనుకుంటున్నట్లు విశాల్ జిందాల్ టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా సంస్థతో పేర్కన్నారు. ఇదీ చదవండి: Mukesh Ambani Birthday: వ్యాపారంలోకి రాకముందు ముఖేష్ అంబానీ ఏమవ్వాలనుకున్నారో తెలుసా? -
Kara Perez Success Story:ఒకపుడు వెయిట్రెస్.. ఇపుడు కోట్లలో సంపాదిస్తోంది.. ఎలా?
పట్టుదల ఉండాలేగానీ ఏమైనా సాధించవచ్చుఅనేది కారాపెరెజ్ మరోసారి నిరూపించారు.ముఖ్యంగా కష్టాల కొలిమిలో మండిన వారు మరింత శ్రమించి విజయాలు సాధిస్తారు. కారా పెరెజ్అది అలాంటి స్ఫూర్తిదాయకమైన కథే. ఎడ్యుకేషన్ ఫీజు కట్టడానికి అమెరికాలో ఒక హోటల్లో వెయిట్రెస్‌గా పనిచేసింది. ప్రస్తుతం ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కంపెనీ స్థాపకురాలిగా,మనీ ఎక్స్పర్ట్, స్పీకర్‌గా అందరికి ఆదర్శనీయంగా నిలుస్తోంది. పెరెజ్ అమెరికాలో ఆస్టిన్‌లో వెయిట్రెస్‌గా పని చేస్తూన్నపుడు రూ. 15 లక్షలు (ఇండియన్ కరెన్సీ ప్రకారం) సంపాదించేది. ఈ సంపాదనతో నిజానికి అక్కడ బతకడమే కష్టం. దీనికితోడు రూ.24 లక్షలకు పైగా విద్యార్థి రుణాన్ని చెల్లించాల్సి వచ్చింది. అదే ఆమెను క్రియేటివ్‌గా ఆలోచించేలా చేసింది. 2011లో పట్టభద్రురాలైన ఆమెకు ఎన్ని పార్ట్ టైం జాబ్‌లతో కష్టాలు తీరలేదు. అప్పులు, తక్కువ సంపాదన అనే విష వలయం నుండి బయటపడాలని అంతకుముందే క్రియేట్ చేసుకున్న బ్లాగు వైపు దృష్టి పెట్టింది. రోజుకు 12 గంటలు పనిచేస్తూ ఉద్యమంలాగా దీనిపై పనిచేసింది. అప్పులన్నీ తీర్చేసింది. మొదట్లో తన వ్యక్తిగత ప్రయాణం గురించి బ్లాగింగ్ చేసేది. పబ్లిక్ వర్సెస్ ప్రైవేట్ స్టూడెంట్ లోన్లు గురించి డబ్బు, పొదుపు, గురించి అనేక వ్యాసాలు రాసింది. అలా అనేక సమావేశాలకు స్పీకర్‌గా అవకాశం లభించింది. కాలక్రమంలో మహిళలు ఎక్కువ ఆసక్తి చూపడం గమనించింది. దీంతో ఎక్కువగా మహిళలతోనే ఎక్కువ సమావేశమవుతూ, అప్పులను తగ్గించు కోవడానికి లేదా పెట్టుబడులపై సలహాలు ఇవ్వడం ప్రారంభించింది. క్రమంగా బ్లాగ్ కాస్తా ‘బ్రేవ్లీ గో’ అనే ఫైనాన్షియల్ ఎడ్యుకేషనల్ కంపెనీకి నాంది పలికింది. దీని ద్వారా ప్రతి సంవత్సరం రూ. 1.5 కోట్లు సంపాదిస్తోంది. ముఖ్యంగా మహిళల ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక విద్య కోసం తాను పనిచేస్తున్నానని, అందుకే తనను తాను ఫైనాన్షియల్ ఫెమినిస్ట్‌గా చెప్పుకుంటుంది. ఈ సంస్థ ద్వారా వర్క్‌షాప్‌లు, కోర్సులు, స్పీకింగ్ ఎంగేజ్మెంట్స్తో మహిళల్లో డబ్బు సంపాదన, పొదుపు లాంటి అలవాట్లను పెంపొందించడంలో శిక్షణ ఇస్తుంది. 34 ఏళ్ల పెరెజ్ ఇపుడు సేల్స్ ద్వారా లక్ష డాలర్లు, సోషల్ మీడియా మేనేజర్, హైస్కూల్ కోచ్ , ఫ్రీలాన్స్ రైటింగ్ వంటి పార్ట్ టైమ్ ఉద్యోగాలతో మరో 27వేల డాలర్లు ఆర్జిస్తోంది. 2017లో, ఆమె స్పాన్సర్షిప్ డీల్స్ ద్వారా డబ్బు సంపాదిస్తోంది. కాగా తన డొమైన్ పేరుకోసం కేవలం 12 డాలర్లు, వెబ్సైట్ హోస్ట్‌లో 50 డాలర్లు, టెక్సాస్‌లో కంపెనీని స్థాపించడానికి 308 డాలర్లు ఖర్చు చేసింది. వెబ్సైట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌పై న్యాయవాదికి 900 డాలర్లు మాత్రమే ఆమె ఖర్చు చేసింది. -
ప్రపంచ జనాభా 800 కోట్లకు: తిండి, నీళ్లు దొరకవా? ఏం చేయాలి?
మానవాళి హాయిగా సుఖంగా ఉండాలి. మనుషుల మధ్య అసమానతలు తగ్గి అందరూ సంతోషంగా ఉండాలి. కొందరి దగ్గరే సంపద అంతా పోగు పడిపోతే.. మెజారిటీ ప్రజలు డొక్కలు మాడ్చుకుంటూ ఆకలి కేకలే వేస్తోంటే ఆ సమాజం ఎలా మనుగడ సాగించగలుగుతుంది? ఎలా ఆనందంగా ఉండగలుగుతుంది. అన్నింటికన్నా ప్రమాదకరమైనవి అసమానతలు, వివక్షలు. వాటిని రూపు మాపుకుంటూ మానవ సంబంధాలు పెంపొందించుకుంటూ ఉజ్వల భవిష్యత్ దిశగా అడుగులు వేసేలా దేశాల ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుని పకడ్బందీగా అమలు చేయాలి. అప్పుడే మానవాళి మనుగడ సాగించగలుగుతుందని మేథావులు సూచిస్తున్నారు. ప్రపంచ జనాభా 800 కోట్లు అయిపోయిందని చాలా మంది కంగారు పడిపోతున్నారు. అది పెద్ద సమస్య కాదు. సమస్యల్లా పెరిగిన జనాభా చక్కటి మానవ సంబంధాలతో లోటు లేకుండా మనుగడ సాగించడమే. మన వ్యవస్థల్లోని సవాలక్ష అసమానతలు.. లింగ వివక్షలు పెను సవాళ్లను విసురుతున్నాయి. 300కోట్ల మంది పౌష్ఠికాహారం తినే స్థోమత లేక కడుపులు మాడ్చుకుంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. దానికి కారణం ఏంటో మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు. జనాభాలో కేవలం 10 శాతం మంది వద్దే 80 శాతం సంపద పోగుపడ్డమే సమస్య. పేదలకు ఆ సంపద పంపిణీ కాకపోవడం వల్లనే అసమానతలు పెరుగుతున్నాయి. అవే ఆకలి కేకలు పెంచుతున్నాయి. అవే జీవితాలను దుర్భరం చేస్తున్నాయి.అందుకే ప్రపంచమంతా మనిషి మనిషిగా బతికే వీలు కల్పించడంపైనే దృష్టి సారించాల్సి ఉందంటున్నారు మేథావులు. నిన్న కాక మొన్ననే. ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంది బాబోయ్ అంటూ తెలిసో తెలీకో చాలా మంది గగ్గోలు పెట్టేశారు.జనాభా ఇలా పెరుగుతూ పోతే అందరికీ ఆహారం ఎలాగ? అని చాలా సీరియస్‌గా ఆందోళన వ్యక్తం చేసేశారు కూడా. జనాభాని నియంత్రిస్తే ఎలాంటి సమస్యా ఉండదని కొందరైతే చాలా అమాయకంగా సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు. ఇంకొందరైతే ఆహార ఉత్పత్తులు పెంచడంపై ప్రపంచం దృష్టి సారించాలని తోచిన సలహా ఇచ్చారు. ఉన్న ఆహారాన్ని వృధా చేయకుండా ఉంటే అదే పది వేలని కొందరు మేథావులు సూత్రీకరించేశారు. అసలు సమస్య ఎక్కడుంది? సమస్య ఏంటి? అన్నదానిపై ఎవరూ దృష్టి సారించడం లేదు. జనాభా పెరుగుతోంది. ఓకే. అది పెరుగుతుంది. అందులో ఆశ్చర్య పడాల్సింది కానీ ఆందోళన చెందాల్సింది కానీ ఏమీ లేదు కదా. ఒకప్పుడు సగటు జీవితకాలంతో పోలిస్తే ఇపుడు ప్రజల ఆయుష్షు బాగా పెరిగింది. దశాబ్ధాల క్రితం చాలా వ్యాధులకు, రుగ్మతలకు మందులే ఉండేవి కావు. ఏదన్నా సుస్తీ చేస్తేనే రోగనిరోధక శక్తి లేక చనిపోయే పరిస్థితులు ఉండేవి. ఇపుడు ప్రాణాధార ఔషథాలు అందుబాటులోకి వచ్చేశాయి. ఒకప్పుడు పేరు చెప్పడానికే భయపడే క్యాన్సర్ వ్యాధి ఇపుడు ఎవరినీ కంగారు పెట్టడం లేదు. క్యాన్సరా? సరేలే..ఆసుపత్రికెళ్తే తగ్గిపోతుందిలే అనే ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే వైద్య రంగంలో ఊహించని విప్లవాత్మక ఆవిష్కరణలు చోటు చేసుకున్నాయి కాబట్టి. అందు చేత జనాభా పెరుగుతూనే ఉంటుంది. ఇక పెరిగిన జనాభాకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులను పెంచినంత మాత్రాన ఆకలి కేకలు మాయం అయిపోతాయా? ఛస్తే కావు. ఎందుకంటే ఆహార ఉత్పత్తులు పెంచినంత మాత్రాన అవి పేదల చేతుల్లోకి రావు. పేదలు వాటిని వినియోగించు కోగలగాలంటే వాటిని కొనుగోలు చేసే శక్తి వారికి ఉండాలి. అది జరగాలంటే ప్రభుత్వాలు పథకాలు రూపొందించాలి. చాలా దేశాల్లో విచిత్రమైన పరిస్థితి ఉంది. దేశాలు చాలా సంపన్న దేశాలుగా పేరు గడిస్తున్నాయి. కానీ ఆ దేశాల్లో మెజారిటీ ప్రజలు మాత్రం గర్భ దారిద్య్రంలో ఉన్నారు. ఎక్కడో ఎందుకు మన దేశాన్నే తీసుకుంటే.. మన దేశంలోని 80 శాతం సంపద కేవలం పది శాతం మంది కుబేరుల వద్దే ఉంది. మిగతా 90శాతం మందిలో 80 శాతం మంది నిరుపేదలే. వీరిలో మెజారిటీ ప్రజలు పౌష్ఠికాహారం కొనుగోలు చేయగల స్థోమత ఉన్నవారు కారు. ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల మంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునే పరిస్థితిలో లేరని తేలింది.సహజంగానే ఇందులో ఎక్కువ మంది ఆఫ్రికా దేశాల్లోనే ఉంటారు. మన దేశంలో అయితే 97 కోట్ల మంది పౌష్ఠికాహారం కొనగల స్థితిలో లేరు. ఎందుకంటే ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగిపోవడం జీవన ప్రమాణాలు పడిపోవడంతో మండే కడుపుకు కాలే బూడిదలా ఏదో ఒకటి తిని కడుపు నింపుకోవడమే గగనమైపోతోంది. ఇక పౌష్ఠికాహారాన్ని తీసుకోవాలంటే ఎక్కడి నుంచి కుదురుతుంది? ప్రతీ మనిషీ రోజూ కనీసం 400 గ్రాములు కూరగాయలు, పళ్లు తినాలట. ఇంటి మొత్తానికి అరకిలో కూరగాయలతో కాలక్షేపం చేసే దేశంలో ఒక్క మనిషిపై ఇంత పెట్టుబడి పెట్టగల స్థితిలో ప్రజలుంటారా? ఏటా ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతుంటే.. ప్రజల ఆదాయాలు తగ్గుతున్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు ప్రపంచంలోని ఆర్ధిక వ్యవస్థలన్నీ కుప్పకూలడంతో జీవన ప్రమాణాలు మరీ అధ్వాన్నంగా దిగజారాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? (ఇంకా వుంది) -సీఎన్ఎస్ యాజులు, కన్సల్టింగ్ ఎడిటర్, సాక్షి టీవీ -
భారత్ బాండ్ ఈటీఎఫ్ హవా: రెండేళ్లలో అనూహ్య వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ బాండ్ ఈటీఎఫ్‌ల పరిధిలోని నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) రెండున్నరేళ్లలోనే రికార్డు స్థాయికి చేరాయి. రూ.50,000 కోట్ల మార్క్‌ను అధిగమించాయి. వీటి నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ ఈ వివరాలను ప్రకటించింది. 2019 డిసెంబర్లో భారత్ బాండ్ ఈటీఎఫ్ మొదటి విడత ఇష్యూ రావడం గమనార్హం. అప్పటి నుంచి ఐదు ఇష్యూలు పూర్తయ్యాయి. వీటి మెచ్యూరిటీ 2023, 2025, 2030, 2031, 2031లో తీరనుంది. ‘‘ప్రభుత్వరంగ సంస్థల ఆర్థిక బలం, ఇన్వెస్టర్లలో వాటి పట్ల ఉన్న విశ్వాసానికి భారత్ బాండ్ ఈటీఎఫ్‌ల విజయం నిదర్శనం. మన తొలి డెట్ ఈటీఎఫ్ అద్భుత విజయం సాధించడం పట్ల సంతోషంగా ఉంది’’అని కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో పనిచేసే దీపమ్ కార్యదర్శి తుహిన్‌కాంత పాండే తెలిపారు. ఏఏఏ రెటెడ్ కలిగిన ప్రభుత్వరంగ కంపెనీలతో కూడిన నిఫ్టీ భారత్ బాండ్ సూచీల్లో భారత్ బాండ్ ఈటీఎఫ్‌లు ఇన్వెస్ట్ చేస్తాయి. భారత్ బాండ్ ఈటీఎఫ్‌ల ఘన విజయంతో ఇతర అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు 2019 తర్వాత సుమారు 30 వరకు టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్‌ను తీసుకు రావడం గమనార్హం. ప్యాసివ్ డెట్ విభాగంలో రూ.60వేల కోట్ల ఏయూఎంతో ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ అగ్రగామిగా చేరుకోవడానికి భారత్ బాండ్ ఈటీఎఫ్‌లు దోహదపడ్డాయి. -
కోట్లలో మోసపోయిన హీరోయిన్ రిమీ సేన్.. ఎలా అంటే ?
Actress Rimi Sen Gets Cheated Of Over Rs 4 Crore: బాలీవుడ్ హీరోయిన్ రిమీ సేన్ ఏకంగా రూ. 4.14 కోట్లు మోసపోయింది. గోరేగావ్‌కు చెందిన వ్యాపారవేత్త పెట్టుబడి పేరుతో రిమీ సేన్‌ను మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడేళ్ల క్రితం వ్యాపారవేత్తగా చెప్పుకునే రౌనక్ జతిన్ వ్యాస్‌ను అంధేరిలోని జిమ్‌లో కలిసినట్లు రిమీ సేన్ తెలిపింది. తర్వాత తాము స్నేహితులమయ్యామని పేర్కొంది. మంచి రాబడులు వస్తాయని చెప్పి ఒక కొత్త వెంచర్లో పెట్టుబడి పెట్టమని తనకు ఆఫర్ చేశాడని వెల్లడించింది రిమీ. అసలు జతిన్ వ్యాస్ కొత్త కంపెనీని ప్రారంభించలేదని తెలిసి తాను మోసపోయినట్లు గ్రహించినాని చెప్పుకొచ్చింది రిమీ సేన్. జతిన్ వ్యాస్పై ఐపీసీ సెక్షన్లు 420, 409 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ముంబైలోని ఖర్ పోలీసులు తెలిపారు. రౌనక్ జతిన్ వ్యాస్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. రిమీ సేన్ హిందీ, బెంగాలీ, తెలుగు చిత్రాలతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అభిషేక్ బచ్చన్ సరసన సూపర్ డూపర్ హిట్ అయిన 'ధూమ్' సినిమాలో నటించి ప్రేక్షకాదరణ పొందింది. తర్వాత తెలుగులో మెగాస్టార్ చిరంజీవి డబుల్ రోల్ చేసిన 'అందరివాడు' చిత్రంలోనూ యాక్ట్ చేసింది. ఈ సినిమాలో చిరంజీవి తండ్రి, కొడుకుల పాత్రలో అలరించిన సంగతి తెలిసిందే. గరం మసాలా, ఫిర్ హేరా ఫేరీ, క్యూన్ కి, గోల్మాల్, బాగ్బాన్, హంగామా వంటి సినిమాల్లో కూడా నటించి మెప్పించింది రిమీ సేన్. -
రుణమిస్తామని రూ.కోటి టోపీ
యశవంతపుర: కావలసినంత అప్పులు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసిన ఐదు మందిని ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మైసూరుకు చెందిన విన్సన్ అనే వ్యక్తి గార్మెంట్స్ పరిశ్రమను స్థాపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అతని గురించి తెలుసుకున్న సంతోష్, సందేశ్‌లు అప్పు ఇప్పిస్తామని స్నేహం చేశారు. ఓ ఫైవ్ స్టార్ హోటల్లో సమావేశమై విన్సన్‌కు పెద్దమొత్తంలో రెండువేల నోట్లను చూపించారు. రూ.నూరు కోట్లు అప్పు కావాలంటే రూ. కోటి కమీషన్ ఇవ్వాలని చెప్పి డబ్బు తీసుకున్నారు. కొన్నిరోజుల తరువాత సంతోష్, సందేశ్‌లు పత్తా లేరు. విన్సన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంతోష్, సందేశ్‌లతో పాటు ఐదు మందిని అరెస్ట్ చేశారు. -
సీజేఐ బాబ్డే తల్లికే టోకరా
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) శరత్ అరవింద్ బాబ్డే తల్లినే నమ్మించి మోసం చేసిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. బాబ్డే తల్లి ముక్తా అరవింద్ బోబ్డే అస్తుల కేర్ టేకర్‌గా ఉంటున్న వ్యక్తి ఏకంగా 2.5 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు తపస్ ఘోష్(49)ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగపూర్‌లోని జస్టిస్ బాబ్డే తల్లి ఆస్తులకు తపస్ గత10ఏళ్లుగా కేర్ టేకర్ గా వ్యవహరిస్తున్నాడు. వీటిల్లో ప్రధానంగా సిటీలోనే ప్రముఖ ఫంక్షన్ హాళ్లలో ఒకటి కావడంతో అదెప్పుడూ బిజీగా ఉండేది. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో మంచానికే పరిమితమైపోయిన ముక్తాకు తప్పుడు లెక్కలు చెబుతూ ఏళ్ల తరబడి గోల్మాల్ వ్యవహారాలు చేశాడు తపస్. అయితే లెక్కల్లో తేడాలొచ్చాయని గుర్తించిన ముక్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఘోష్‌ను మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. అనంతరం ఈ నెల 16 వరకు రిమాండ్‌కు తరలించారు. సిట్ ఏర్పాటు సీజేఐ జస్టిస్ బోబ్డే తల్లిని ఫ్యామిలీ కేర్ టేకర్ మోసం చేశాడన్న కేసు విచారణకు డీసీపీ వినితా సాహు ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశారు. దర్యాప్తులో కేసు లోతుపాతుల్ని పరిశీలించారు. ఈ మేరకు గడిచిన కొన్నేళ్లుగా తపస్ ఘోష్ రూ.2.5కోట్ల మోసానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. -
కోటి గాజులతో విజయవాడ అమ్మవారికి అలంకరణ
-
ఉగ్రవాద సంస్థలకు రూ. కోట్లు ఖర్చు చేశాం
-
అలా రూ. 2 కోట్లు కొట్టేశాడు
సాక్షి, చెన్నై : అదను, పదును చూసి యజమాని ఇంటికే కన్నం వేసాడో ప్రబుద్ధుడు. యజమాని శైలేష్ ఇతిరాజ్ ఇంట్లో లేని సమయంలో ఆ ఇంటి పనిమనిషి , జార్ఖండ్‌కు చెందిన బికాష్ కుమార్ రాయ్ రూ.18 లక్షల నగదుతో సహా, విలువైన ఆభరణాలను కొట్టేశాడు. యజమాని అందించిన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరికి అతని ఆట కట్టించారు. శైలేష్ కుటుంబంతో సహా ఊరు వెళ్లడాన్ని అదనుగా భావించిన పనివాడు బికాష్ కుమార్ రాయ్ 18 లక్షల నగదుతోపాటు బంగారు ఆభరణాలు, వజ్రాల నగలు దోచుకుని పరారయ్యాడు. మొత్తం విలువ రూ.2.07 కోట్లకు పైమాటే. దీంతో జూలై 31న పోలీసులకు ఫిర్యాదు చేశారు శైలేష్. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. బికాష్ జూలై 29న ఎర్నాకుళం-పాట్నా రైలు ఎక్కాడని రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ప్రత్యేక పోలీసు బృందం పాట్నాకు వెళ్లి మరీ శుక్రవారం అర్థరాత్రి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్‌చేసి, సెంట్రల్ జైలుకు తరలించారు. -
బేబి కిట్ల పథకంలో కోట్ల కుంభకోణానికి టీడీపీ స్కెచ్
-
తిరుపతిలో రైల్వే ఉద్యోగి ఘరానా మోసం
-
ఆన్లైన్ చీటింగ్!
మహబూబ్‌నగర్ క్రైం: సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించి ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.. కొంత నగదు జమ చేసి.. మీరు కొంత మందిని చేర్పిస్తే మీ ఖాతాలో ప్రతినెలా కమీషన్ వేస్తామని నమ్మబలికారు.. ఇలా సామాన్యుల ద్వారా భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేశారు.. ఈ ఘటనపై పది రోజుల క్రితం జిల్లాకేంద్రంలోని మర్లుకు చెందిన మణెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. ఇందులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అనురాధ వెల్లడించారు. హైదరాబాద్ టు దుబాయ్.. హైదరాబాద్‌లోని కొత్తపేట్ పనిగిరికాలనీకి చెందిన మాలావత్ లక్ష్మణ్ అనే వ్యక్తి దుబాయ్‌కి చెందిన అనూప్ థామస్‌తో ఆన్లైన్ ద్వారా పరిచయం చేసుకున్నారు. సీసీటీసీ గ్లోబల్ డాట్కాం ద్వారా రూ.12 వేలు డిపాజిట్ చేసి ఒక ఐడి తీసుకుంటే రోజుకు రూ.0.60 కమీషన్ వస్తుందని, ఎన్ని ఐడీలు తయారు చేస్తే అన్ని డాలర్ల కమీషన్ చెల్లిస్తామ నమ్మబలికారు. మాలావత్ లక్ష్మణ్ ఆ వెబ్‌సైట్‌ను తయారు చేసి దాదాపు 200 మందికి మాయమాటలు చెప్పి అతని ఖాతాతోపాటు భార్య, ఇతర బంధువుల ఖాతాలో రూ.కోట్లలో నగదును జమ చేయించారు. ఇందులో భాగంగానే మాలావత్ లక్ష్మణ్ గతేడాది సెప్టెంబర్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి ద్వారా మహబూబ్‌నగర్‌కు వ చ్చాడు. ఆ తర్వాత జిల్లాకేంద్రం లోని అయోధ్యనగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు విజయప్రతాప్రెడ్డితో పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత మాలావత్ లక్ష్మణ్ ఏర్పాటు చేసిన సీసీటీసీ గ్లోబల్ డాట్కాం గురించి వివరించి దీని ద్వారా సులభంగా డబ్బులు సంపాదించే అవకాశం ఉందని చెప్పడంతో విజయప్రతాప్రెడ్డితోపాటు భీమయ్య, బాలకృష్ణ, గిరి కలిసి సామాన్య అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి పట్టణానికి చెందిన 47 మందిని ఆ వెబ్సైట్లో చేర్పించారు. ఇందులో ఒక్కొక్కరు రూ.80 వేల నుంచి రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేశారు. అలాగే ఒక మహిళ రూ.7.50 లక్షలు జమ చేసింది. దీంట్లో ఒక్కరికి కూడా 10 శాతం నగదు తిరిగి ఇవ్వలేదు. అయితే గత మూడు నెలలుగా ఖాతాలో నగదు పడకపోవడంతో మర్లుకు చెందిన మణెమ్మ విజయప్రతాపరెడ్డిని సంప్రదించగా తనకేం తెలియదని, వెబ్సైట్ తయారు చేసిన వ్యక్తి దగ్గర మాట్లాడుకోవాలని సూచించారు. దీంతో మణెమ్మ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని లోతుగా విచారణ చేపట్టగా వివరాలు బయటికి వచ్చాయని ఎస్పీ పేర్కొన్నారు. కేసులు నమోదు.. మాలావత్ లక్ష్మణ్ నుంచి రూ.1,79,100, విజయప్రతాప్‌రెడ్డి నుంచి రూ.5 లక్షల నగదు సీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. అలాగే మాలావత్ లక్ష్మణ్‌తోపాటు అతని భార్య, ఇతర కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు, విజయప్రతాప్‌రెడ్డి ఖాతాలో ఉన్న రూ.47.41 లక్షలను ఫ్రీజ్ చేశామన్నారు. ఈ కేసులో ఏ1గా మాలావత్ లక్ష్మణ్, అతని అత్త మంగమ్మ, మరదలు కవిత, భార్య సరిత, స్నేహితుడు అఖిల్, ఏ2గా విజయప్రతాప్‌రెడ్డి, ఏ3గా భీమయ్య, ఏ4గా బాలకృష్ణ, ఏ5గా గిరిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. మాలావత్ లక్ష్మణ్, విజయ ప్రతాప్‌రెడ్డిలను అరెస్టు చేసి రిమాండ్ తరలించామని, మిగతా వ్యక్తులు పరారీలో ఉన్నారని వాళ్లను కూడా త్వరలో అరెస్టు చేస్తామని ఎస్పీ వెల్లడించారు. ఇంట్లో కూర్చోని సులువుగా డబ్బులు సంపాదించవచ్చని మల్టీలెవల్ మార్కెటింగ్ ద్వారా ఆన్లైన్లో డబ్బులు పెడితే మోసం పోతారన్నారు. ఇలా డబ్బులు జమ చేస్తే కమీషన్ వస్తోందని చెప్పే వ్యక్తులను ఏమాత్రం నమ్మరాదని డబ్బులు తీసుకుని తర్వాత ఖాతాలను ఎత్తివేసి చీటింగ్ చేస్తారని హెచ్చరించారు. దీంట్లో బాధితులు కట్టిన డబ్బులో కనీసం 10 శాతం కూడా తిరిగి రాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వ ర్లు, డీఎస్పీ భాస్కర్, రూరల్ సీఐ కిషన్, ఎస్ఐ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగాల ఎర..రూ.కోట్లలో టోకరా!
గద్వాల క్రైం : ఎంత చదివినా ఉద్యోగం కోసమే కదా..? లేకపోతే కోరుకున్న కాలేజీలో ఎంబీబీఎస్ సీటు రావాలి.. ఎంత కష్టపడినా అదృష్టం ఉండాలి.. ఇప్పుడు అదృష్టం మీ ఎదురుగా ఉంది.. నాకు పెద్ద పెద్ద అధికారులు తెలుసు.. నాతోపాటే రండి.. అన్ని విషయాలు తెలుస్తాయి..! ఇలా సామాన్యులకు కొందరు మోసగాళ్లు వల వేస్తున్నారు. ఇలాంటి ఉదంతాలు నడిగడ్డలో ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. నడిగడ్డ ప్రాంతంలో.. జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంతోపాటు అలంపూర్, అయిజ, గట్టు, మల్దకల్, మానవపాడు, శాంతినగర్, ఇటిక్యాల తదితర మండలాలకు చెందిన అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాలు, ఉన్నత చదువుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసు శాఖలోనూ హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.లక్షలు వసూలు చేశారు. ఇందులో ఏపీకి చెందిన ఇద్దరిని గద్వాల పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. అయితే ఇలాంటి మోసగాళ్లకు దళారులు అండగా ఉండి నిరుద్యోగులకు వల వేస్తున్నారు. దళారులుగా ఉన్న వారిలో చాలామందికి పలుకుబడిన వ్యక్తులతో సంబంధాలు ఉండడంతో వారిపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేకపోతున్నారు. పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏజెన్సీలు సైతం ఏర్పాటు చేసుకుని రూ.కోట్లు వసూలు చేసి మకాం మార్చిన కేటుగాళ్లు సైతం జిల్లాలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నారు. అసలు సూత్రధారులు.. మధ్యవర్తులను నిలువరిస్తే మోసగాళ్లకు కళ్లెం వేయవచ్చు. ఇవిగో ఘటనలు.. గద్వాలకు చెందిన ఓ వ్యక్తి 2015లో తన కూతరు ఎంబీబీఎస్ ప్రవేశం కోసం హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని కలిసి ముందస్తుగా రూ.15 లక్షలు ఇచ్చి.. సీటు వచ్చిన తర్వాత రూ.50 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా అంతర్జాతీయ ముఠా సభ్యులు పలు రాష్ట్రాల్లో 21 మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.3.39 కోట్లు దోచుకున్నారు. 2015లో జరిగిన ఈ వ్యవహారం జిల్లా ఏర్పాటు తర్వాత ఈ నెల 1న ఈ ముఠా సభ్యులను గద్వాల పట్టణ పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. 2105లో గద్వాల, అయిజకు చెందిన 16 మంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం తెలిసిన వ్యక్తిని ఆశ్రయించారు. జిల్లా సహకార కో–ఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాల కోసం ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షల చొప్పున రూ.24 లక్షలు వసూలు చేశారు. తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చి మీరు ట్రైనింగ్‌లో ఉన్నారు.. కొన్ని నెలల తర్వాత పర్మనెంట్ అవుతుందని నమ్మబలికారు. కానీ ఉద్యోగం మాత్రం రాకపోవడంతో గట్టిగా నిలదీయగా అప్పుడు.. ఇప్పుడు అంటూ కాలయాపన చేశారు. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు తాజాగా జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ముఠాలోని ఓ వ్యక్తిని ఇటీవల అయిజ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 2016లో మల్దకల్ మండలం పాల్వాయికి చెందిన ఇద్దరు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఓ వ్యక్తిని ఆశ్రయించారు. సదరు మోసగాడు కేంద్ర ప్రభుత్వంలో కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి. రూ.3.50 లక్షల చొప్పున రూ.7 లక్షలు వసూలు చేశారు. ఇలా కొల్లాపూర్‌కు చెందిన మరో ఆరుగురు నిరుద్యోగుల నుంచి రూ.24 లక్షలు వసూలు చేశాడు. తర్వాత మౌఖిక పరీక్షలకు వెళ్లండి అంటూ నకీలి పత్రాలు ఇచ్చి హైదరాబాద్‌కు పంపారు. అక్కడికి వెళ్తే ఇలాంటి ఉద్యోగాలకు ఎలాంటి మౌఖిక పరీక్షలు లేవని చెప్పి వెనక్కి పంపారు. మోసపోయిన వీరు సైతం ఈ ఏడాది జనవరిలో గద్వాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ూ జిల్లాలో ఇప్పటి వరకు 30కిపైగా ఇలాంటి కేసులు నమోదైనట్లు పోలీసులు వివరించారు. నమోదు కాని కేసులు సైతం మరో 50 వరకు ఉన్నట్లు సమాచారం. 2015లో జరిగిన వ్యవహారం.. నడిగడ్డలో 2015 సంవత్సరంలో మోస పోయిన బాధితులు ప్రస్తుతం జిల్లా ఏర్పాటుతో ఒక్కొక్కరు ఎస్పీ విజయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో కేటుగాళ్ల లీలలు బయటపడుతున్నాయి. ఇటీవల ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామని రూ.3 కోట్లకుపైగా వసూలు చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే జిల్లాలో ఈ వ్యవహారం నడిపించిన దళారులు, సూత్రధారులు ఎవరనే అంశంపై పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి తమదైన శైలిలో దూసుకువెళ్తున్నారు. ప్రజల్లో చైతన్యం రావాలి.. ప్రభుత్వ ఉద్యోగం డబ్బులు పెడితే రాదు. ప్రజలు మోసపోయేంత వరకు మోసగాళ్లు మోసం చేస్తూనే ఉంటారు. అంతా అయిపోయాక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇకనైనా జిల్లా ప్రజల్లో చైతన్యం రావాలి. త్వరలో పోలీసు శాఖ తరపున అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. – విజయ్‌కుమార్, ఎస్పీ, జోగుళాంబ గద్వాల -
పబ్లిసిటీ ఘనం.. మరి పాలన?
సాక్షి, న్యూఢిల్లీ : మూడేన్నరేళ్ల బీజేపీ పాలనలో పబ్లిసిటీ పేరిట పెట్టిన ఖర్చెంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. సుమారు 3,755 కోట్ల రూపాయలను ఇప్పటిదాకా ఖర్చు చేశారు. సమాచార హక్కు కింద దాఖలు చేసిన ఓ పిటిషన్ ఆధారంగా ఈ విషయం వెల్లడైంది. ఏప్రిల్ 2014 నుంచి అక్టోబర్ 2017 దాకా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, అవుట్డోర్ పబ్లిసిటీ పేరుతో అక్షరాల 37, 54, 06, 23, 616 రూపాయలను ఖర్చు చేశారు. ఇక విడివిడిగా చూసుకుంటే రేడియో, డిజిటల్ సినిమా, దూరదర్శన్, ఇంటర్నెట్, ఎస్ఎంఎస్, టీవీ తదితర ఎలక్ట్రానిక్ మీడియా అడ్వర్టైజ్మెంట్ల కోసం 1,656 కోట్లు ఖర్చు చేసింది. ప్రింట్ మీడియాకొస్తే.. 1,698 కోట్లు, హోర్డింగ్‌లు, పోస్టర్లు, బుక్లెట్లు, క్యాలెండర్లు తదితర ఔట్‌డోర్ అడ్వర్టైజ్మెంట్ల కోసం 399 కోట్లు కేంద్ర ఖర్చు పెట్టింది. ఒక ఏడాది బడ్జెట్ లో ఏదైనా ఓ శాఖ కోసం కేటాయించే నిధుల కంటే ఇది చాలా ఎక్కువ. అంతెందుకు గత మూడేళ్లలో కాలుష్య నివారణ ప్రచారం కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం 56.8 కోట్లు కావటం విశేషం. గతంలో తన్వర్ అనే వ్యక్తి సమాచార హక్కు కింద కేంద్ర సాంకేతిక సమాచార శాఖను కోరగా.. జూన్ 1, 2014 నుంచి ఆగష్టు 31, 2016 వరకు మోదీ యాడ్స్ కోసం 1100 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లు వెల్లడైంది. ఆమ్ ఆద్మీ పార్టీ తమ పాలన, పథకాల గురించి ప్రచారం చేసిన సమయంలో 526 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా.. బీజేపీ-కాంగ్రెస్‌లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఇప్పుడు ఈ విషయం వెలుగు చూడటంతో బీజేపీని ఏకీపడేసేందుకు విపక్షాలు సిద్ధమైపోతున్నాయి. ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి రికవరీ చేయించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. -
ఆ గదిలో కోట్లు కురిశాయి
► కోల్‌కతాలో చిన్న గది నుంచి కార్యకలాపాలు ► హవాలా రూపంలో తరలిన వందల కోట్లు సాక్షి, విశాఖపట్నం: కోల్‌కతాలో ఓ చిన్న గది.. అయి తేనేం అందులోనే రూ.వందల కోట్ల విలువైన కంపెనీలున్నాయి.. కానీ అవి కంటికి కనిపించవు... కేవలం పేపర్లపైనే కనిపిస్తాయి.. హవాలా యువకుడు మహేష్ గురించి ఆరా తీస్తున్న ఐటీ, పోలీస్ అధికారులకు విస్తుపోయే విషయాలెన్నో తెలుస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం తిరుపతిపురంలో పుట్టి, ఉల్లిపాయల వ్యాపారం చేసుకుని బతికే సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మహేష్ రూ.వందల కోట్ల హవాలా రాకెట్‌ను నడిపే స్థాయికి ఎదిగాడు. శ్రీకాకుళంలో ఓ చిన్న ఇంట్లో అద్దెకు ఉంటూ స్టోన్ క్రషింగ్ మిషన్ నడుపుతున్నట్లు జనాన్ని నమ్మించి కోల్‌కతా నుంచి హవాలా నడిపిస్తున్నాడు. కోల్‌కతా నుంచి విశాఖ బ్యాంకు అకౌంట్లకు నగదును మళ్లించి ఇక్కడినుంచే సింగపూర్, చైనా, హాంకాంగ్ దేశాలకు తరలించి హవాలా చేస్తున్నారు. నల్లధనాన్ని చెక్కుల రూపంలో తీసుకుని 12 షెల్ కంపెనీల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఈ సొమ్మును మరికొన్ని కంపెనీల్లోకి మళ్లిస్తున్నారు. విశాఖలోని 22 బ్యాంకుల్లో తప్పుడు పత్రా లతో ఖాతాలు తెరిచి కోట్లాది రూపాయలు వాటిలో జమచేస్తున్నారు. ఇక్కడి నుంచి నేరుగా విదేశాలకు పంపి స్తున్నారు. ఇలా ఒకే బ్యాంకు అకౌంట్లో వివిధ అకౌంట్ల నుంచి రూ.570 కోట్లు జమ అయినప్పటికీ అధికారుల కు అనుమానం రాలేదు. ఆ ధైర్యంతోనే మరో రూ.97 కోట్లు అదే ఖాతాలో జమచేశారు. వాటిని చూసిన అధికారులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. నెల రోజులుగా నిఘా మహేష్ లావాదేవీలపై నెల రోజుల పాటు నిఘా పెట్టా రు. ఈ నెల 9న రంగంలోకి దిగి షెల్ కంపెనీల కోసం జల్లెడ పట్టారు. బెంజ్ కారు కొనుగోలు చేయడానికి ఖాతా నుంచి డబ్బులు తీయడంతో మహేష్ గుట్టు కనిపెట్టారు. తొలుత అతని తండ్రి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. తర్వాత మహేష్‌ను అదుపులోకి తీసుకుని విశాఖ తీసుకు వచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా పెరవలికి చెందిన అన్న దమ్ములు రాజేష్, హరీష్‌లను కూడా అదుపులోకి తీసుకు న్నారు. వీరందరినీ రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. ఇంత భారీగా నల్లధనాన్ని మార్పిడి వెనక కచ్చితంగా చాలా పెద్దవాళ్ల హస్తమే ఉంటుందని ఐటీ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. హవాలా’ మహేష్ అరెస్ట్ వందల కోట్ల రూపాయల హవాలా కేసులో ప్రథమ నిందితుడు వడ్డి మహేష్‌ను అరెస్ట్ చేసినట్లు విశాఖ పోలీసులు ఆదివారం ప్రకటిం చారు. అతడిని సోమవారం కోర్టులో హాజరుపరుస్తామన్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం కేసును సీఐడీకి బదలా యించినట్లు తెలిపారు. -
రూ.పది కోట్లతో లోవ దేవస్థానం బడ్జెట్
– రూ.80 లక్షలు మిగులు – ఏప్రిల్ 13 నుంచి 26వరకు అమ్మవారి గంధామావాస్య జాతరోత్సవాలు – పాలకమండలిలో తీర్మానాలు తునిరూరల్ : ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం రానున్న ఆర్థిక సంవత్సరానికి రూ.పది కోట్లతో అంచనాల బడ్జెట్‌ను ఆమోదించింది. ఆదివారం చైర్మన్ కరపా అప్పారావు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ప్రతిపాదిత బడ్జెట్లో రూ.80లక్షలు మిగులుగా అంచన వేశారు. హుండీలు, వేలంపాటలు, ఇతర ఆదాయ వనరుల ద్వారా రూ.పది కోట్ల సమకూరుతుందని, జీతాలు, అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు, అమ్మవారి ఉత్సవాలకు వ్యయం రూ.9.20కోట్ల అవుతుందని అంచనాలు వేశారు. వ్యయం పోగా రూ.80లక్షలు మిగులుగా అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ఎస్.చంద్రశేఖర్ చూపారు. వేలంపాటలు, బహిరంగా వేలం ద్వారా లైసెన్సులు వసూళ్లును రూ.2.25కోట్లు వస్తుందని పేర్కొని, వేలం పాటలను ఆమోదించారు. గడిచిన మూడు నెలలకు రాబడి, వ్యయాలను ఆమోదించారు. తలుపులమ్మ అమ్మవారి పవిత్ర, ఆచారాలకు, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పనకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్టు చైర్మన్ కరపా అప్పారావు, ధర్మకర్తలు పేర్కొన్నారు. 13 నుంచి ఉత్సవాలు.. తలుపులమ్మ అమ్మవారికి పుట్టింట సంబరాలుగా పేర్కొనే గంధామావాస్య జాతర మహోత్సవాలను ఏప్రిల్ 13 నుంచి 26 వరకు నిర్వహించాలని పాలక మండలి సభ్యులు తీర్మానించారు. జాతర ఉత్సవాలను లోవకొత్తూరు గ్రామంలో లోవదేవస్థానానికి చెందిన నాలుగు ఎకరాల స్థలంలో ఆలయం వద్ద నిర్వహిస్తారు. ఇందుకు అవసరమైన నిధుల వినియోగానికి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోద ముద్రవేశారు. ధర్మకర్తలు యాదాల లోవకృష్ణ, తర్రా బుల్లెబ్బాయి, కిల్లి శ్రీను, నారాయణాచార్యులు, పుల్లంరాజు, దూలం సత్యనారాయణ, సూపరింటెండెంట్లు కె.వి.రమణ, ఎల్.వి.రమణ పాల్గొన్నారు. -
చెరువు పూడికతీత అక్రమాలతో కోట్లకి కోట్లే..
-
కృష్ణా జిల్లాలో రెచ్చి పోతున్న మట్టి మాఫియా
-
లోవకు రూ.1.51 కోట్ల ఆదాయం
- నాలుగు అంశాలు వాయిదా - ఈఓ చంద్రశేఖర్ తుని రూరల్ : ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో 2017-18 ఆర్థిక సంవత్సరానికి వివిధ హక్కులకు నిర్వహించిన వేలం ద్వారా రూ.కోటి, 51 లక్షల 11 వేల 792ల ఆదాయం లభించిందని అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. దేవస్థానంలో తల నీలాలు పొగు చేసుకోవడ, వివిధ వస్తువులు విక్రయానికి శనివారం టెండర్ కం బహిరంగా వేలం నిర్వహించారు. టోల్గేట్, శీతలపానియాలు, క్యాంటీన్ నిర్వహణ, పాలు, పెరుగు విక్రయాల హక్కులకు ఎవరు ఆసక్తి చూపకపోవడంతో వాయిదా వేశారు. నెలకు తలనీలాలు పొగు చేసుకునేందుకు రూ.3.39 లక్షలు, పూజా సామగ్రి, కొబ్బరి కాయలు విక్రయానికి రూ.3,34,200, వస్త్రాల విక్రయానికి రూ.3.54 లక్షలు, యంత్రాలు, ఫ్యాన్సీ సామాన్లు విక్రయానికి రూ.93,100, అమ్మవారి ఫోటోలు అమ్మకానికి రూ.66,116, భక్తులు ఫొటోలు తీసి విక్రయించేందుకు రూ.55 వేలు, తోపుడు బళ్లపై సామాన్లు విక్రయానికి రూ.11,300, చెప్పుల స్టాండు నిర్వహణకు రూ.12,600కు వేలంను ఖరారు చేశారు. నెలకు వీటి మొత్తం రూ.12 లక్షల 59 వేల 316లు కాగా ఏడాదికి రూ.1.51 కోట్ల ఆదాయం సమకూరుతుందని ఈఓ వివరించారు. చైర్మన్ కరపా అప్పారావు, పిఠాపురం ఈఓ చందక ధారబాబు, సూపరింటెండెంట్లు కేవీ రమణ, ఎల్వీ రమణ, ధర్మకర్తలు, ఉద్యోగులు, పలువురు పాటదారులు పాల్గొన్నారు. -
రూ.10కోట్లతో పీవీ రావు ఘాట్ నిర్మాణం
ముమ్మిడివరం: మాలమహనాడు వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ పీవీ రావు ఘాట్ నిర్మాణం కోసం రూ.10 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. అనాతవరంలో స్వర్గీయ పీవీరావు ఘాట్ స్థలం ఆవరణలో హైదరాబాద్ డీఎస్పీ మోకా సత్తిబాబు అధ్యక్షతన గురువారంలజరిగిన సమావేశంలో ఘాట్ నిర్మాణం, తదితర అంశాలపై సమీక్షించారు. ముఖ్య అతిథి, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు ఘాట్ నిర్మాణానికి పార్లమెంటు నిధుల నుంచి రూ.కోటి కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. తన కుటుంబ సభ్యులనుంచి రూ.10లక్షలు విరాళం ప్రకటించారు. అమలాపురం సమీపంలో నిర్మించే రైల్వేస్టేష¯Œ కు పీవీరావు పేరు పెట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెడితే బిల్లుకు వ్యతిరేకంగా 154 మంది సభ్యులు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నరన్నారు. ఘాట్ నిర్మాణానికి మరో ముఖ్య అతిథి, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబుఎస్డీఎఫ్ నిధులు రూ.25 లక్షలు, అమలాపురం ఎమ్మెల్యే ఎ. అనందరావు రూ.25లక్షలు, రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రూ. లక్ష విరాళంగా ప్రకటించారు. పోతుల నాగరాజు, పెయ్యల పరశురాముడు, వడ్డి నాగేశ్వరరావు, ఎంవీకే భీమారావు, గంగుమళ్ళ అన్నపూర్ణ, దంగేటి వరలక్ష్మి, పోతుల సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. -
రహదారుల అభివృద్ధికి రూ.13 వేల కోట్లు
మంత్రి శిద్దా రాఘవరావు ఆత్రేయపురం: (కొత్తపేట నియోజకవర్గ): రాష్ట్రంలో రూ.13 వేల కోట్లతో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర రోడ్డు భవనాలు, రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆత్రేయపురం మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆర్అండ్బి శాఖ ద్వారా చేపడుతున్న రూ.6 కోట్ల రహదారి నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన పనులు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ రూ.30 వేల కోట్లతో అనంతపురం నుంచి అమరావతి వెళ్లేందుకు రహదారి నిర్మాణం చేపడుతున్నామన్నారు. 8 గంటల సమయంలో ప్రయాణం అమరావతి చేరుకోవచ్చునని ఆయన వివరించారు. ప్రభుత్వం సంక్షేమం పథకాలు అందించడంతోపాటు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అబివృద్ధి చేసేందుకు కారిడార్‌ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. సముద్ర తీరం వెంబడి రహదార్లు నిర్మించి జాతీయ రహదారికి అనుసంధానంగా ఉత్పత్తులు జరిగే విధంగా చర్యలు చేపడుతున్నామని దీనికి సంబంధించి రూ.30 వేల కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. ట్రాన్స్‌పోర్టు శాఖ అ¯ŒSలై¯ŒS ద్వారా విస్తృత సేవలు అందింస్తుందన్నారు. డీలర్ వద్ద నుండే వాహనం కొనుగోలు చేసిన వెంటనే రిజిస్ట్రేష¯ŒS నిర్వహించే ప్రక్రియ నూతనంగా ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సి రెడ్డి సుబ్రహ్మణ్యం, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు, ఈఈ ఎ. శ్రీరామచంద్రరావు, అర్టీసీ ఆర్ఎమ్ చింతా రవికుమార్, డిఎమ్ షభ్నం తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీకి గత తొమ్మిది నెలల్లో రూ.600 కోట్లు నష్టం
మార్చి నెలాఖరుకు రూ.800 కోట్లుకు పెరిగే అవకాశం స్థలాలు లీజుకిద్దామన్నా ఎవరూ ముందుకు రావడం లేదు ఆర్టీసీ ఈడీ (అడ్మిన్) ఏ వేంకటేశ్వరరావు అన్నవరం (ప్రత్తిపాడు) : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత డిసెంబర్ నెలాఖరుతో ముగిసిన తొమ్మిది నెలలకుగాను రూ.600 కోట్లు నష్టం వచ్చిందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) ఎ.వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం ఆయన తూర్పు గోదావరి జిల్లాలోని రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఈ నష్టాలు ఇదే విధగా కొనసాగితే ఈ మార్చి నెలాఖరుకు రూ.800 కోట్లు వరకూ సంస్థ నష్టపోయే అవకాశం ఉందన్నారు. నష్టాలు అధిగమించడానికి తాము అనేక చర్యలు తీసుకుటున్నా అవి సత్ఫలితాలు ఇవ్వడం లేదన్నారు. లీజుకిద్దామన్నా ఎవరూ ముందుకు రావడం లేదు... ఆర్టీసీ స్థలాలు లీజుకిద్దామన్నా ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి రెండు వేల ఎకరాల ఖాళీ స్థలాలున్నాయన్నారు. వ్యాపార సముదాయాలు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు వీటిని లీజు కిచ్చేందుకుగాను మొదట పదేళ్లు లీజు పీరియడ్ నిర్ణయించామని తెలిపారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో దాన్ని 33 సంవత్సరాల నుంచి ప్రస్తుతం 43 సంవత్సరాలకు ఈ లీజు పీరియడ్ పెంచి టెండర్లు పిలిచినా స్పందన కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం 15 ఎకరాలు మాత్రమే లీజుకు ఇచ్చామని తెలిపారు. ఈయన వెంట తుని డిపో మేనేజర్ రామకృష్ణ, సూపర్వైజర్ శర్మ తదితరులున్నారు. -
’పెట్రో’ వాత
డీజిల్, పెట్రోల్ ధరల పెంపుతో జిల్లాపై నెలకు రూ.12.70 కోట్ల భారం ఏలూరు సిటీ : పెద్దనోట్ల రద్దుతో అష్టకష్టాలు పడుతున్న ప్రజలపై కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో మరో భారం మోపింది. నల్లధనాన్ని వెలికితీయటం ద్వారా పన్నులు, పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గిస్తుందనే అంచనాలకు తారుమారు చేస్తూ తాజా నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై లీటరుకు రూ.2.21, డీజిల్‌పై రూ.1.79 పెంచింది. ప్రస్తుతం జిల్లాలో పెట్రోల్ ధర లీటర్ రూ.71.86 ఉండగా, తాజా పెంపు రూ.2.21, పన్ను సుమారు రూ.40 పైసలు కలిపి లీటర్ ధర రూ.74.47 వరకు పెరిగింది. జిల్లాలో డీజిల్ లీటర్ ధర రూ.61.35 కాగా, తాజాగా పెరిగిన రూ.1.79, పన్ను సుమారు రూ.40 పైసలు కలిపి రూ.63.35 వరకు ఉంది. జిల్లా వాసులపై నెలకు రూ.12.70 కోట్ల భారం పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో జిల్లా వాసులపై నెలకు రూ.12.70 కోట్ల అదనపు భారం పడనుంది. జిల్లాలో పెట్రోల్‌పై పన్నులతో కలుపుకుని లీటరుకు రూ.2.61 అదనపు భారం పడుతోంది. జిల్లాలో రోజుకు 7 లక్షల లీటర్ల పెట్రోల్ వినియోగిస్తుండగా, ధర పెరగడంతో అదనంగా రూ.18.27 లక్షలు, నెలకు రూ.5.48 కోట్లు మేర అదనపు భారం పడనుందని అంచనా. జిల్లాలో రోజుకు 11 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నారు. పెరిగిన డీజిల్ ధర పన్నులతో కలుపుకుని రూ.2.19 కాగా, వినియోగదారులపై సుమారు రూ.24 లక్షలు, నెలకు రూ.7.22 కోట్లు మేర అదనపు భారం పడనుంది. జిల్లాలో ద్విచక్ర వాహనాలు సుమారు 5లక్షల వరకు ఉండగా, ట్రక్ ఆటోలు 26,415, కార్లు 32 వేలు ఉన్నాయి. జిల్లాలో హెచ్పీసీ పెట్రోల్ బంకులు 44, బీపీసీ బంకులు 47, ఐఓసీ 101, ఇతర కంపెనీలకు చెందిన బంకులు 16 వరకు ఉన్నాయి. బాలిక, నాయనమ్మ, హిందూ సంప్రదాయం టి.నరసాపురం : ఎవరైనా మరణిస్తే కుమారుడు తలకొరివి పెట్టడం హిందూ సంప్రదాయం. వారసులు ఎవరూ లేకపోవడంతో నాయనమ్ మృతదేహానికి మనుమరాలే అంత్యక్రియలు నిర్వహించిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం బందంచర్ల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన వీరంకి వెంకాయమ్మ (48) అనారోగ్యంతో గురువారం మృతి చెందింది. వెంకాయమ్మ భర్త గతంలోనే చనిపోయారు. ఈమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉండగా, కుమారుడు మధు 2002లో ప్రమాదంలో మృతిచెందాడు. అప్పటికి అతని భార్య రాధ గర్భిణి. తండ్రి మరణానంతరం జన్మించిన కుమార్తెకు హిమశ్రీగా నామకరణం చేశారు. హిమశ్రీ, ఆమె తల్లి రాధ బొర్రంపాలెంలో అమ్మమ్మ ఇంటివద్ద ఉంటున్నారు. హిమశ్రీ అదే గ్రామంలో 9వ తరగతి చదువుతోంది. బాలిక నాయనమ్మ వెంకాయమ్మ శుక్రవారం మరణించగా, వారసులెవరూ లేకపోవడంతో ఆమె మనుమరాలు హిమశ్రీ ముందుకొచ్చి అంత్యక్రియలు జరిపించింది. -
బాబా బాబా..బ్లాక్ బ్యాంక్
-
రెండు రోజుల్లోరూ.22,500 కోట్లు
రద్దయిన నోట్ల స్థానంలో కొత్త రూ.500, రూ.2,000 నోట్లు రాజమహేంద్రవరంలో నేటి నుంచి మార్పిడికి ఆర్బీఐ సన్నాహాలు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ప్రత్యేక కౌంటర్లు ఇప్పటికే బ్యాంకులకు చేరినరూ.7,500 కోట్ల కొత్త నోట్లు నేడు రానున్న మరో రూ.15,000 కోట్లు శని, ఆదివారాల్లోనూ పని చేయనున్న బ్యాంకులు సాక్షి, రాజమహేంద్రవరం : రద్దయిన రూ.వెయ్యి, రూ.ఐదువందల నోట్ల స్థానం లో కొత్తగా ముద్రించిన రూ.500, రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అవకాశం కల్పిస్తోంది. రాజమహేంద్రవరంలోని బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా రద్దయిన నోట్లను రూ.22,500 కోట్ల మేర కు కొత్త నోట్లుగా మార్చుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. గురువారం నుంచే ఇలా మార్చుకోవచ్చు. బ్యాంకింగ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటికే నగరంలోని ఆయా బ్యాంకులకు రూ.7,500 కోట్లను చేరవేసింది. గురువారం రెండు దఫాలుగా మరో రూ.15,000 కోట్లను చేరవేయనుంది. నోట్లను మార్పిడి చేసేందుకు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. తమ వద్ద రద్దయిన నోట్లున్న వారు రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేదా ఏదో ఒక గుర్తింపు కార్డును చూపి రద్దయిన నోట్లను మార్చుకోవచ్చు. ప్రజల సౌకర్యార్థం శని, ఆదివారాల్లో కూడా బ్యాంకులు పని చేయనున్నాయి. ఎలాంటి రుసుమూ లేకుండా ప్రజలు తమ వద్ద ఉన్న రద్దయిన నోట్లను కొత్త నోట్లుగా మార్చుకోవచ్చని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. రూ.10 వేల వరకు మాత్రమే మార్చుకునేందుకు అవకాశం ఉంది. మిగతా మొత్తాన్ని వారివారి ఖాతాల్లో జమ చేస్తారు. కౌంటర్ల వద్ద కాకుండా ప్రజలు తమ బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసుకోవడం ఉత్తమమని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రత్యేక కౌంటర్ల వివరాలు తెలుపుతూ బ్యాంకుల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా రద్దయిన రూ.500, రూ.1000 నోట్ల స్థానంలో కొత్త రూ.500, రూ.2,000 నోట్ల మార్పిడికి జరుగుతున్న సన్నాహాల గురించి విస్తృత ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు. ప్రస్తుతం దైనందిన అవసరాలకు కూడా కొనుగోళ్లు చేయలేక జనం పడుతున్న అవస్థలను సత్వరం తొలగించేందుకూ ప్రత్యామ్నాయం చూపాలని కోరుతున్నారు. -
రూ.75 వేల కోట్ల వ్యాపారమే లక్ష్యం
ఆంధ్రాబ్యాంకు సర్కిల్ జీఎం రంగనాథ్ రాయవరం : ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.75 వేల కోట్ల వ్యాపారం చేయడం లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ఆంధ్రాబ్యాంకు సర్కిల్(ఏపీ) జనరల్ మేనేజర్ కె.రంగనా«థ్ తెలిపారు. రాయవరం ఆంధ్రాబ్యాంకును సందర్శించిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఆంధ్రాబ్యాంకు విశాఖ సర్కిల్ పరిధిలో(13 జిల్లాలు) 750 బ్రాంచిల పరిధిలో రూ.64వేల కోట్ల వ్యాపారం చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు చేసిన వ్యాపారంలో రూ.36వేల కోట్లు డిపాజిట్లు సేకరించగా, రూ.28వేల కోట్లు రుణాలుగా ఇచ్చినట్లు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి వ్యాపార లక్ష్యాని అధిగమించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెలంతా ఫౌండేషన్ డే ఉత్సవాలు.. ఈ నెల 23న ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభిరామయ్య, 28న ఆంధ్రాబ్యాంకు 94వ వార్షికోత్సవం కావడంతో ఈ నెలంతా ఫౌండేషన్ డే ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు జీఎం రంగనాధ్ తెలిపారు. ఫౌండేషన్ డే పురస్కరించుకునిసర్కిల్ పరిధిలో సుమారు 15 బ్రాంచిలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాకినాడ జోన్ పరిధిలో మురముండ, జొన్నాడలో ఈ నెలాఖరులోగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో డీజీఎం పి.భాస్కరరావు, బ్యాంకు ఏజీఎం డి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రూ.5 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు
మెప్మా మిషన్ డైరెక్టర్ చినతాతయ్య కాకినాడ : పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో భాగంగా ఈ ఏడాది డ్వాక్రా సంఘాలకు రూ.5 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మెప్మా మిషన్ డైరెక్టర్ పి.చినతాతయ్య చెప్పారు. నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఆదివారం డ్వాక్రా సంఘాల సభ్యులతో ఆయన ముఖాముఖీ సమావేశం ఏర్పాటు చేశారు. సంఘాల పనితీరు, ఆర్థికంగా బలోపేతం తదితర అంశాలపై సభ్యులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 నాటికి రాష్ట్రంలోని 19 లక్షల మంది డ్వాక్రా సంఘాల సభ్యులు ప్రస్తుతం సంపాదిస్తున్న ఆదాయాన్ని రెండింతలు చేయాలన్నదే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. సుమారు రూ.8 వేల కోట్ల అదనపు ఆదాయం వారు పొందేలా ఈ ప్రణాళిక ఉంటుందన్నారు. ఇందుకు నాలుగు అంశాలను అమలు చేస్తూ సంఘాల పురోభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. సభ్యులు వృత్తి నైపుణ్యం, ఆర్థికావసరాలను గుర్తింపుపై దృషి ్టపెట్టామని సూచించారు. డ్వాక్రా సభ్యులు విద్యా పరంగా కూడా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు. వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి జిల్లాకు 50 మంది కమ్యూనిటీ వైద్యులుగా అభివృద్ధి చెందేలా శిక్షణ ఇస్తామన్నారు. వారందరినీ చంద్రన్న బీమా పథకంలో చేరుస్తున్నామన్నారు. కొంతమంది ఆర్పీలు అవినీతికి పాల్పడుతున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయని, వాటిని ఏ మాత్రం ఉపేక్షించబోమన్నారు. కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ వీటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాకినాడ పోర్టు ప్రాంతంలోని 45 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పిల్లి అనంతలక్ష్మి, కమిషనర్ ఆలీమ్‌బాషా, కార్పొరేషన్ కార్యదర్శి రమేష్, మెప్మా పీడీ మల్లిబాబు, డిప్యూటీ కమిషనర్ సన్యాసిరావు, టీపీఆర్వో భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. రుణాలు ఎందుకు రద్దు కాలేదంటే.. ఎన్నికల వేళ ‘తాతయ్య’ చెప్పిన కథ కాకినాడ : ‘డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ అమలు కాలేదని మీకందరికీ కోపంగా ఉందా...? చేయకపోవడానికి కారణాలు ఏమిటో మీకు తెలుసా? డ్వాక్రా మహిళలను మెప్మా మిషన్ డైరెక్టర్ చినతాతయ్య ప్రశ్నించారు. డ్వాక్రా సభ్యుల సమావేశంలో రుణమాఫీ విషయంలో విసిగిపోయిన మహిళలను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. కారణాలను ఆయన ఇలా చెప్పుకొచ్చారు. సీఎం డ్వాక్రా రుణాల రద్దుపై వేసిన కమిటీ సిఫార్సు మేరకు రూ.8,200 కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉంటుంది. ఈ రుణాన్ని మాఫీ చేస్తే సకాలంలో అప్పు తీర్చిన సభ్యులలో అసంతృప్తి చెందుతారని, సభ్యులందరికీ న్యాయం చేసేలా రూ.10 వేలు చొప్పున ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మొత్తాన్ని కార్ఫస్ ఫండ్‌గా బ్యాంకుల్లో వేశారు. కార్ఫస్ ఫండ్‌కు ఏడు రెట్లు అదనంగా బ్యాంకులు రుణాలు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే కార్పస్ ఫండ్ తీసుకునే అవకాశం లేక, బ్యాంకు రుణాలు రాక డ్వాక్రా సభ్యులు సతమతమవుతున్నట్టు గుర్తిం చారు. మొదట విడత రూ.మూడు వేలతోపాటు రెండో విడత ఇచ్చే మరో రూ.3 వేలను సభ్యులే వినియోగించుకునేలా ఉత్తర్వులు రానున్నా యన్నారు. ఈ విషయంపై ఎవరేమి చెప్పినా నమ్మవద్దని వారికి సలహా కూడా ఇచ్చారు. కార్పొరేషన్ ఎన్నికల కోసమా? కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డ్వాక్రా మహిళలు చేజారిపోకుండా ఉండేందుకే ఈ సమావేశం నిర్వహించినట్టు పలువురు డ్వాక్రా మహిళలు భావించారు. -
ధాన్యం కేంద్రాల్లో రూ.44 కోట్ల గోల్మాల్
ఏలూరు (మెట్రో): జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వచ్చిన రూ.44 కోట్లు లాభంలో గోల్మాల్ జరిగిందని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి ప్రజాధనాన్ని కాపాడతామని జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు చెప్పారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం ఎంపీడీవోల సమావేశంలో ధాన్యం కొనుగోలు తీరు, జాతీయ ఉపాధి హామీ పథకం, ఫామ్‌పాండ్స్ ఏర్పాటు, సంక్షేమ పథకాల ద్వారా పేదలకు రుణాల జారీ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, వైద్యారోగ్య శాఖ పనితీరుపై ఆయన సమీక్షించారు. కామవరపుకోట కేంద్రంలో రూ.25 లక్షలు లాభం వస్తే దీనిలో అదనపు ఖర్చుల కింద రూ.7.50 లక్షలు వినియోగించారని, లింగపాలెంలో రూ.33 లక్షలు లాభం వస్తే అదనపు ఖర్చులు కింద రూ.23 లక్షలు డ్రా చేశారన్నారు. జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలులో వచ్చిన లాభం గోల్మాల్ వ్యవహారంపై ప్రత్యేక దష్టి కేంద్రికరిస్తాననన్నారు. గ్రామాల్లో వైద్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆసుపత్రుల అభివద్ధికి నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవాలని, మౌలిక వసతుల కల్పనకు దాతల సహకారాన్ని తీసుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్ కె.కోటేశ్వరిని ఆదేశించారు. జెడ్పీ సీఈవో డీ.సత్యనారాయణ, డ్వామా పీడీ డీ.వెంకటరమణ, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసులు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సీహెచ్. అమరేశ్వరరావు పాల్గొన్నారు. -
రూ.1.98 కోట్లు నిరుపయోగమేనా..?!
అశ్వారావుపేట ఫ్యాక్టరీలో పూర్తికాని రెండో బాయిలర్ మళ్లీ పాతదే దిక్కు అశ్వారావుపేట: అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీ ఆధునీకరణ పేరుతో బాయిలర్ కొనుగోలుకు వెచ్చించిన 1.98 కోట్ల రూపాయలు వృథా అయినట్టేనన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీ ఆధునీకరణ, దమ్మపేట మండలం అప్పారావుపేటలో కొత్త ఫ్యాక్టరీ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాలపై ‘కొత్తది కదలదు.. పాతది నడవదు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. అందులో చెప్పినట్లుగానే అప్పారావుపేట ఫ్యాక్టరీ పూర్తికాలేదు. అశ్వారావుపేట ఫ్యాక్టరీలో రెండో బాయిలర్ వృథాగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రూ.18 కోట్లతో ఆధునీకరించిన అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని ఈ నెల 16న వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, స్పీకర్ మధుసూధనాచారి, ఆర్అండ్బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తదితరులు ప్రారంభిస్తారు. ఫ్యాక్టరీని ఆర్నెల్లుగా మూసివేసి చేస్తున్న మరమ్మతులు ఇంకా కొలిక్కి రాలేదు. ఫ్యాక్టరీలో గతంలో ఎనిమిది టన్నుల సామర్థ్యమున్న బాయిలర్ ఉండేది. దీని ద్వారా గంటకు 15 టన్నుల పామాయిల్ గెలలను ఉడికించేవారు. ఫ్యాక్టరీ సామర్థ్యానికి మించి గెలలు రావడంతో గతేడాది రైతులు, ఫ్యాక్టరీ యాజమాన్యానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. దమ్మపేట మండలం అప్పారావుపేటలో రూ.60కోట్లతో అధునాతన ఫ్యాక్టరీ నిర్మిస్తున్నందున అశ్వారావుపేట ఫ్యాక్టరీని ఆధునీకరించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ అధికారులు ఆధునీకరణ పనులు చేపట్టారు. రెండో బాయిలర్‌కు ఏమయింది.? ఫ్యాక్టరీలో రూ.1.98 కోట్లతో నిర్మించిన రెండో బాయిలర్ పాతదయింది బాయిలర్ మినహా మిగిలిన సామగ్రిని అనవసరంగా కొత్తవి కొనుగోలు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనేకమంది నిపుణులు ఈ బాయిలర్ పైనే ప్రయోగాలు చేశారు. అందుకే ఇది ఇప్పటివరకు పనులు ఓ కొలిక్కి రాలేదు. రెండో బాయిలర్‌తోపాటు మొదటి బాయిలర్‌ను కూడా వినియోగిస్తామని.. అవసరమైతే రెండు బాయిలర్లను ఏకకాలంలో వినియోగిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ రెండు బాయిలర్లను అనుసంధానించే పరికరం ఇప్పటికీ అమర్చకపోవడం, రెండో బాయిలర్ ఏర్పాటు పూర్తికాకపోవడంతో మొదటి బాయిలర్‌తోనే పరిశ్రమను నడిపించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. స్టీమ్ టర్బైన్ సంగతేంటో..! అశ్వారావుపేట ఫ్యాక్టరీలో¯ తెట్టు కుంబకోణంతో జైలుపాలైన అప్పటి మేనేజర్ చంద్రశేఖరరెడ్డి రూ.కోటి వెచ్చించి చైనా నుంచి స్టీమ్ టర్బైన్ను మూడేళ్ల క్రితం కొనుగోలు చేశారు. దానిని ఇప్పటివరకూ వాడలేదు. కమీషన్ల కోసమే దీనిని కొనుగోలు చేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ స్టీమ్ టర్బైన్‌కు బాయిలర్ నుంచి ఆవిరిని అందిస్తే.. ఫ్యాక్టరీ మొత్తం ఆగిపోతుంది. స్టీమ్ టర్బయిన్ నుంచి వెలువడే విద్యుత్ ఫ్యాక్టరీలో కనీసం ఒక్క యూనిట్‌ను కూడా నడపలేని నాసిరకమైనది. దీంతో ఇది నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం రెండు బాయిలర్లను అమర్చినా స్టీమ్ టర్బైన్ను వినియోగంలోకి తెచ్చే అవకాశాల్లేవు. పామాయిల్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం ఉదయమే అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ పునః ప్రారంభం ఈ నెల 16న సాయంత్రం మూడు గంటలకు కాకుండా ఉదయం 10 గంటలకే ఉంటుందని సీనియర్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఈ మార్పును రైతులు, అధికారులు, అతిథులు గమనించి సకాలంలో రావాలని కోరారు. -
రూ.1.98 కోట్లు నిరుపయోగమేనా..?!
అశ్వారావుపేట ఫ్యాక్టరీలో పూర్తికాని రెండో బాయిలర్ మళ్లీ పాతదే దిక్కు అశ్వారావుపేట: అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీ ఆధునీకరణ పేరుతో బాయిలర్ కొనుగోలుకు వెచ్చించిన 1.98 కోట్ల రూపాయలు వృథా అయినట్టేనన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీ ఆధునీకరణ, దమ్మపేట మండలం అప్పారావుపేటలో కొత్త ఫ్యాక్టరీ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాలపై ‘కొత్తది కదలదు.. పాతది నడవదు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. అందులో చెప్పినట్లుగానే అప్పారావుపేట ఫ్యాక్టరీ పూర్తికాలేదు. అశ్వారావుపేట ఫ్యాక్టరీలో రెండో బాయిలర్ వృథాగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రూ.18 కోట్లతో ఆధునీకరించిన అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని ఈ నెల 16న వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, స్పీకర్ మధుసూధనాచారి, ఆర్అండ్బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తదితరులు ప్రారంభిస్తారు. ఫ్యాక్టరీని ఆర్నెల్లుగా మూసివేసి చేస్తున్న మరమ్మతులు ఇంకా కొలిక్కి రాలేదు. ఫ్యాక్టరీలో గతంలో ఎనిమిది టన్నుల సామర్థ్యమున్న బాయిలర్ ఉండేది. దీని ద్వారా గంటకు 15 టన్నుల పామాయిల్ గెలలను ఉడికించేవారు. ఫ్యాక్టరీ సామర్థ్యానికి మించి గెలలు రావడంతో గతేడాది రైతులు, ఫ్యాక్టరీ యాజమాన్యానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. దమ్మపేట మండలం అప్పారావుపేటలో రూ.60కోట్లతో అధునాతన ఫ్యాక్టరీ నిర్మిస్తున్నందున అశ్వారావుపేట ఫ్యాక్టరీని ఆధునీకరించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ అధికారులు ఆధునీకరణ పనులు చేపట్టారు. రెండో బాయిలర్‌కు ఏమయింది.? ఫ్యాక్టరీలో రూ.1.98 కోట్లతో నిర్మించిన రెండో బాయిలర్ పాతదయింది బాయిలర్ మినహా మిగిలిన సామగ్రిని అనవసరంగా కొత్తవి కొనుగోలు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనేకమంది నిపుణులు ఈ బాయిలర్ పైనే ప్రయోగాలు చేశారు. అందుకే ఇది ఇప్పటివరకు పనులు ఓ కొలిక్కి రాలేదు. రెండో బాయిలర్‌తోపాటు మొదటి బాయిలర్‌ను కూడా వినియోగిస్తామని.. అవసరమైతే రెండు బాయిలర్లను ఏకకాలంలో వినియోగిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ రెండు బాయిలర్లను అనుసంధానించే పరికరం ఇప్పటికీ అమర్చకపోవడం, రెండో బాయిలర్ ఏర్పాటు పూర్తికాకపోవడంతో మొదటి బాయిలర్‌తోనే పరిశ్రమను నడిపించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. స్టీమ్ టర్బైన్ సంగతేంటో..! అశ్వారావుపేట ఫ్యాక్టరీలో¯ తెట్టు కుంబకోణంతో జైలుపాలైన అప్పటి మేనేజర్ చంద్రశేఖరరెడ్డి రూ.కోటి వెచ్చించి చైనా నుంచి స్టీమ్ టర్బైన్ను మూడేళ్ల క్రితం కొనుగోలు చేశారు. దానిని ఇప్పటివరకూ వాడలేదు. కమీషన్ల కోసమే దీనిని కొనుగోలు చేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ స్టీమ్ టర్బైన్‌కు బాయిలర్ నుంచి ఆవిరిని అందిస్తే.. ఫ్యాక్టరీ మొత్తం ఆగిపోతుంది. స్టీమ్ టర్బయిన్ నుంచి వెలువడే విద్యుత్ ఫ్యాక్టరీలో కనీసం ఒక్క యూనిట్‌ను కూడా నడపలేని నాసిరకమైనది. దీంతో ఇది నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం రెండు బాయిలర్లను అమర్చినా స్టీమ్ టర్బైన్ను వినియోగంలోకి తెచ్చే అవకాశాల్లేవు. పామాయిల్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం ఉదయమే అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ పునః ప్రారంభం ఈ నెల 16న సాయంత్రం మూడు గంటలకు కాకుండా ఉదయం 10 గంటలకే ఉంటుందని సీనియర్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఈ మార్పును రైతులు, అధికారులు, అతిథులు గమనించి సకాలంలో రావాలని కోరారు. -
3.43 కోట్ల మొక్కలు నాటాం
కలెక్టర్ లోకేష్‌కుమార్ ఖమ్మం జెడ్పీసెంటర్: హరితహరం కింద జిల్లాకు నిర్ధేశించిన 3.50 కోట్ల మొక్కల లక్ష్యానికిగాను ఇప్పటివరకు 3.43 కోట్లు నాటినట్టు కలెక్టర్ లోకేష్‌కుమార్ తెలిపారు. హరితహరంపై కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లాస్థాయి సమన్వయ సమావేశం గురువారం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. హరితహారం లక్ష్య సాధనలో అన్ని శాఖల అధికారులు బాధ్యతగా, అంకితభావంతో కృషి చేసి; రాష్ట్రంలో జిల్లాను ప్ర«థమ స్థానంలో నిలిపారంటూ అభినందించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అటవీ ప్రాంతంలో సుమారు కోటిన్నర మొక్కలను నాటించాలని అటవీశాఖ అధికారులను కోరారు. పొలం గట్లపై, పంట భూములలో ఎక్కువ మొక్కలు నాటించాలని డ్వామా పీడీని ఆదేశించారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు, వరంగల్ సామాజిక వన విభాగం అటవీ సంర„ý ణాధికారి రాజారావు, ఖమ్మం అటవీ సంరక్షణాధికారి నర్సయ్య, డీఎఫ్ఓలు సతీష్‌కుమార్, శార్వానన్, శాంతారామ్, డీఆర్డీఏ పీడీ మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
నయీం ఆస్తులలో ఆశ్చర్య పరిచే నిజాలు !
-
కోటిన్నర పరిహారం!
హిమాచల్ ప్రదేశ్ః మండి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఓ మహిళా డాక్టర్ కుటుంబానికి కారు యజమాని, బీమా సంస్థ సంయుక్తంగా కోటిన్నర రూపాయల వరకూ పరిహారం చెల్లించాలని హిమాచల్ ప్రదేశ్ లోని మండి అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు, మోటార్ వెహికిల్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ సూచించింది. 2012 లో మండినుంచి సిమ్లా ఓ ప్రైవేట్ కారులో ప్రయాణిస్తున్న డాక్టర్ రూబీ బింద్రా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా యాక్సిడెంట్ లో చనిపోయింది. రూబీ మరణంపై కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించడంతో విచారణ చేపట్టిన కోర్టు... కారు యజమాని, ఇన్సూరెన్స్ కంపెనీ కలసి బాధితులకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. వృత్తిరీత్యా వైద్యురాలైన 37ఏళ్ళ రూబీ బింద్రా సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసేది. విధులకు హాజరయ్యేందుకు ఆమె ప్రతిరోజూ మండి నుంచీ సిమ్లా కారులో ప్రయాణించేది. అదే నేపథ్యంలో 2012 అక్టోబర్ 22న తన పిల్లలతో కలసి సిమ్లా వెడుతున్న రూబీ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్..యజమాని అయిన ఖజన్ సింగ్ నిర్లక్ష్య డ్డ్రైవింగ్ తో యాక్సిడెంట్ కు గురైంది. ప్రమాదంలో డాక్టర్ రూబీ బింద్రా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ప్రమాదంపై రూబీ కుటుంబ సభ్యులు కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ రూబీ మైనర్ సంతానమైన కుమారుడు త్రిష్ శర్మ, కుమార్తె హనవ్ శర్మల తోపాటు భర్త అరవింద్ శర్మలకు 1.48 కోట్ల రూపాయల పరిహారాన్ని మండి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీతోపాటు, కారు యజమాని అందించాలని న్యాయమూర్తి మదన్ కుమార్ ఆదేశించారు. పిటిషన్ ఫైల్ చేసిన రోజు నుంచి 9 శాతం వడ్డీతో సహా పరిహారం చెల్లించాలని వివరించారు. 2012 లో మోటార్ వెహికిల్ యాక్ట్ 166 కింద డాక్టర్ రూబీ కుటుంబ సభ్యులు పరిహారంకోసం క్లైం పిటిషన్ దాఖలు చేశారు. అయితే డాక్టర్ రూబీ అప్పటికే రోగి అని, ప్రైవేట్ కారులో ప్రయాణిస్తున్న ఆమె మరణానికి ఇన్సూరెన్స్ కంపెనీ బాధ్యత వహించదని, ఎటువంటి పరిహారం చెల్లించేది లేదని నేషనల్ ఇన్పూరెన్స్ కంపెనీ తెలిపింది. కాగా కారులో ప్రయాణించిన వ్యక్తి రోగి కాదని, కారు కూడ బీమా చేసి ఉందని తెలుపుతూ అన్ని పత్రాలను ప్రత్యర్థులు కోర్టుకు సాక్ష్యాధారాలను సమర్పించారు. దీంతో విచారించిన కోర్టు కారులో ప్రయాణించిన డాక్టర్ యాక్సిడెంట్ లో చనిపోయే సమయానికి నెలకు 93.139 రూపాయల వేతనాన్ని పొందుతోందని, అనేక సాక్ష్యాధారాలతోపాటు, సుప్రీంకోర్టు తీర్పులను సైతం పరిశీలించి... జరిగిన నష్టానికి ఇన్సూరెన్స్ కంపెనీ బాధ్యత వహించాల్సిందేనని సూచించింది. ఇద్దరు పిల్లల్లో ఒక్కొక్కరికి 45 శాతం చొప్పున, భర్తకు 10 శాతం చొప్పున కోర్టు ఆర్డర్ జారీ చేసిన 45 రోజుల్లోపల పరిహారం చెల్లించాలని తెలిపింది. -
మధుమేహంలో మనది రెండోస్థానం!
భారత దేశంలో మధుమేహం వేగంగా వ్యాప్తి చెందుతోందని, గతేడాది ఏడు కోట్ల వరకూ కేసులు నమోదయ్యాయని ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ లెక్కలు చెప్తున్నాయి. ప్రపంచంలోనే మొదటి మూడు దేశాల్లో ఇండియా రెండో స్థానంలో ఉన్నట్లు నివేదికలు వివరిస్తున్నాయి. ఇండియాలో మధుమేహం సూపర్ ఫాస్ట్ గా పెరిగిపోతోందని ఐడీఎఫ్ లెక్కలను బట్టి తెలుస్తోంది. 20 నుంచి 70 ఏళ్ళ మధ్య వయసు కలిగిన వారు ఈ జాబితాలో ఉన్నట్లు అంచనాలు చెప్తున్నాయి. 2014 లో 6.68 కోట్ల మంది ఉండగా, 2015 నాటికి మరో 6.91 కోట్లు పెరిగినట్లు ఆరోగ్య మంత్రి జె పి నడ్డా రాజ్యసభలో వెల్లడించారు. భారతదేశం ప్రపంచంలోని అధిక డయాబెటిస్ కలిగిన మొదటి మూడు దేశాల్లో రెండోస్థానంలో ఉన్నట్లు వైద్య పత్రిక ది లాన్సెట్ నివేదికల ద్వారా తెలుస్తోంది. మధుమేహంలో రెండవ అత్యధిక స్థానంలో ఉండే చైనాను తాజాగా ఇండియా అధిగమించినట్లు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అధ్యయనాల ఆధారంగా తెలుస్తోందని.. నడ్డా తెలిపారు. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్.. డయాబెటిస్ అట్లాస్.. ఏడవ ఎడిషన్ ప్రకారం చైనా 109.6 మిలియన్ల మధుమేహ రోగులతో అత్యధిక స్థానంలో ఉంది. 61.1 మలియన్ ప్రజలతో భారత్ ఉండగా, అమెరికా మాత్రం 29.3 మిలియన్లుగా నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం క్యాన్నర్, డయాబెటిస్, కార్డియోవాస్క్యులర్ వ్యాధుల నింత్రణకు ప్రత్యేక కార్యక్రమాన్ని జిల్లా స్థాయి వరకూ అమలు చేసే ప్రయత్నంలో ఉన్నామని ఆరోగ్య మంత్రి తెలిపారు. ఆధునిక జీవన శైలిలో మార్పులు, రోగ నిర్థారణ, అధిక సౌకర్యాల నిర్వహణ వంటి వాటిపై దృష్టి సారించి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నంలో ఉన్నట్లు చెప్పారు. -
ప్రణాళిక వ్యయం రూ. 62వేల కోట్లు!
-
ఏపీలో భారీగా వరద నష్టం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికీ పలు గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకుని ఉన్నాయి. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీనిపై విపత్తుల నిర్వహణ శాఖ నష్ట వివరాలను వెల్లడించింది. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సహాయక చర్యలు చేపట్టామని తెలిపింది. వరదలకు చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. వరదలు, తుపానులు కారణంగా 3 వేల కోట్ల రూపాయలు నష్టం జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. నష్ట వివరాలు ఇలా ఉన్నాయి. 35 మంది మృతి 146 గ్రామాలు వర్ష ప్రభావానికి గురి 467 ఇళ్లు పూర్తిగా, 2029 ఇళ్లు పాక్షికంగా ధ్వంసం 613 జంతువులు మృతి 1860 కి.మీల రహదారుల ధ్వంసం 2 లక్షల హెక్టార్లకు పైగా వ్యవసాయ, ఉద్యానవన పంటలకు నష్టం. -
కోట్లకు పడగలెత్తిన సబ్‌రిజిస్ట్రార్
విశాఖపట్నం: సబ్‌రిజిస్ట్రార్ రామకృష్ణ దాస్ ఆస్తులపై మంగళవారం ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఏడు చోట్ల సోదాలు జరిపారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో భారీగా స్థిర, చరాస్తులున్నట్లు అధికారులు గుర్తించారు. విశాఖలోని అక్కయ్యపాలెంలో మూడు నెలల క్రితం ఓ వ్యక్తి వద్ద ఉంచి లంచం తీసుకుంటూ రామకృష్ణదాస్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. అప్పటి నుంచి అతని ఆస్తుల వివరాలు సేకరించి ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. విశాఖలోని రామకృష్ణదాస్ నివాసంతో పాటు అతని బంధువుల ఇళ్లలో సోదాలు చేశారు. రవీంద్రనగర్‌లో సొంతింట్లో నిర్వహించిన సోదాలో ఓ బ్యాంక్ లాకర్లో రూ.15 లక్షల నగదు, ఏటికొప్పాకలో 4 ఎకరాల స్థలం, దార్లపూడిలో 3.20 ఎకరాల వ్యవసాయ క్షేత్రం, శ్రీకాకుళంలో సుమారు 3 ఎకరాల భూమి పత్రాలు సోదాల్లో లభించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రామకృష్ణదాస్పై అక్రమ ఆస్తుల కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. -
కోట్లు కొల్లగొట్టిన మడోన్నా కాస్టూమ్స్
-
కేర్ సొసైటీ డెరైక్టర్ల అరెస్టు
పరారీలో ఐదుగురు సుమారు రూ.8 కోట్లకు కుచ్చు టోపీ డెరైక్టర్ల స్వప్రయోజనాలకు నిధుల వినియోగం విశాఖపట్నం, న్యూస్‌లైన్ : కోట్లాది రూపాయలు దిగమింగిన కేర్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి చెందిన ఇద్దరు డెరైక్టర్లను మహారాణిపేట జోన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాంతి, భద్రతల డీసీపీ ఎం. శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. సొసైటీ నిర్వహణలో లోటుపాట్లతో సుమారు రూ.8 కోట్లకు దివాళా తీసింది. దీంతో సొసైటీ సభ్యులు 400 మంది వరకు వీధిన పడ్డారు. మహారాణిపేట జోన్ పోలీసుల విచారణలో వెల్లడైన వివరాలు ఇలా ఉన్నాయి.. 15 ఏళ్ల క్రితం రామ్‌నగర్, రెడ్నం గార్డెన్స్‌లో ఎంఎస్ఎన్ రెడ్డి అధ్యక్షుడుగా, ఉపాధ్యక్షుడుగా పి.రామ్మోహనరావు, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా పి.మల్లికార్జునరావు, నాగమల్లేశ్వరరావు, సీహెచ్. విజయలక్ష్మి, ఎం. గీతాలక్ష్మి, ఆర్.చంద్ర కాంత్ డెరైక్టర్లుగా కేర్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటె డ్ పేరిట సంస్థను ప్రారంభించారు. డిపాజిట్లు ద్వారా సుమారు రూ.7కోట్లు వసూలు చేశారు. 2007లో సొసైటీ అధ్యక్షుడుగా వ్యవహరించిన సీహెచ్‌వీ సుబ్బారావు ఎటువంటి షూరిటీలు లేకుండా డెరైక్టర్లలో ఒకరైన పి.వి.నాగమల్లేశ్వరరావుకు రూ.1.5 కోట్లు రుణం మంజూరు చేశారు. అప్పటి నుంచి దఫదఫాలుగా రూ.3.5 కోట్ల వరకు స్వప్రయోజనాలకు వాడుకున్నాడు. సొసైటీ అతనిపై కో-ఆపరేటివ్ ట్రిబ్యునల్‌లో 2011లో కేసు వేసింది. సొసైటీ అధ్యక్షుడు సుబ్బారావు రూ.40 లక్షలు, అతని కుమారుడు ప్రసాద్‌కు, అకౌంటెంట్, కోశాధికారి అయిన ఆర్.సతీష్, అతని సోదరుడు ఆర్.చంద్రకాంత్, అతని స్నేహితుడు సోమా కనస్ట్రక్షన్స్ ప్రతినిధి ఎ.సతీష్‌లకు ఎటువంటి పత్రాలు లేకుండా రూ.95 లక్షలు రుణం ఇచ్చారు. కాలపరిమితి దాటిన డిపాజిట్లు చెల్లంపు చేయకపోవటంతో సొసైటీ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి సుమారు రూ.8 కోట్ల వరకు డిపాజిట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. సొసైటీ మెంబర్ గొంప అప్పారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన కోర్డు డెరైక్టర్ నాగమల్లేశ్వరరావుకు చెందిన రూ.2.41కోట్ల విలువ చేసే పూర్ణామార్కెట్ వద్ద వాణిజ్యసముదాయం స్వాధీనం చేసుకున్నారు. సొసైటీ మెంబర్లకు రూ.2కోట్ల వరకు మార్టుగేజ్ లోన్లు, లోన్లు ఇచ్చిన వారి ఆస్తులను గుర్తించారు. సంస్థకు చెందిన అన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే మిగిలిన డైరె క్టర్లతో పాటు వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని డీసీపీ శ్రీనివాసులు తెలిపారు. ప్రస్తుతం సంస్థ డెరైక్టరు నాగమల్లేశ్వరరావు, ఆర్.చంద్రకాంత్, అకౌంటెంట్ అండ్ క్యాషియర్ ఆర్.సతీష్, జానియర్ అసిస్టెంట్ ప్రసాద్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఈస్ట్ ఏసీపీ డి.ఎన్.మహేష్, మహారాణిపేట సిఐ ఆర్.మల్లికార్జునరావు, ఎస్ఐ ఎర్రంనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
బాధితులకు మందులేవీ !
ఎర్రగుంట్ల, న్యూస్‌లైన్ : ఎయిడ్స్ బాధితులకు ప్రభుత్వం సక్రమంగా మందులు పంపిణీ చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఎయిడ్స్ నిర్మూలనకు కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. అయితే బాధితులకు కనీసం మందులు కూడా సరఫరా చేయకపోవడంతో వారు దీనావస్థలో ఉన్నారు. ఎయిడ్స్ దినోత్సవం అంటూ ఘనంగా ర్యాలీలు చేయడం తప్ప బాధితులకు కావలసిన సౌకర్యాలకు, తోడ్పాటు అందివ్వడంలో ప్రభుత్వం పూర్తి విఫలమైందని స్వచ్ఛంద సంస్థలు, బాధితులు వాపోతున్నారు. నాలుగు నెలల నుంచి నెలకు సరిపడా ఏఆర్‌టీమందులను అందివ్వక పోవడంతో హెచ్ఐవీ బాధితులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎర్రగుంట్ల మండలంలో సుమారు 1600 మంది దాకా హెచ్ఐవీ బాధితులు ఉన్నట్లు గణాంకాలు ద్వారా తెలిసింది. ఒక్క ఎర్రగుంట్ల పట్టణంలోనే సుమారు 500 మంది దాక హెచ్ఐవీ బాధితులు ఉన్నారు. గతంలో ఎర్రగుంట్లలో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆస్పత్రిలో ఉండేది. దానిని ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి మార్చారు. దీంతో ఎర్రగుంట్లకు చెందిన బాధితులందరూ ప్రొద్దుటూరుకు పోయి ఏఆర్టీ మందులను తెచ్చుకుంటున్నారు. అయితే కొన్ని నెలల నుంచి ఏఆర్టీ మందులను కేవలం 15 రోజులకు సరిపడు మందులను మాత్రమే ఇస్తున్నారని బాధితులు వాపోతున్నారు. మిగిలిన 15 రోజులకు చెందిన మందులను మాత్రం బయట మార్కెట్లో డబ్బు పెట్టి కొనాల్సిన దుస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇది జిల్లా వ్యాప్తంగా సమస్యగా ఉందని కొందరు బాధితులు తెలిపారు.