చెన్నై: లోక్‌సభ ఎన్నికల వేళ ఆదాయపన్ను శాఖ అధికారులు రూ.200 కోట్ల హవాలా గుట్టు రట్టు చేశారు. మలేషియా నుంచి వచ్చిన హవాలా ట్రేడర్ వినోత్‌కుమార్ జోసెఫ్‌ను చెన్నై ఎయిర్‌పోర్టులో అడ్డుకున్న ఐటీ అధికారులు అతడి నుంచి రూ.200 కోట్ల హవాలాకు సంబంధించి విస్తుపోయే విషయాలను కనిపెట్టారు.
లోక్‌సభ ఎన్నికల వేళ తమిళనాడులోని ఓ ప్రముఖ పార్టీ కోసం రూ.200 కోట్ల హవాలా సొమ్మును దుబాయ్ నుంచి తీసుకురావడానికి ప్లాన్ చేసినట్లు వినోత్ వాట్సాప్ చాట్‌ల ద్వారా ఐటీ అధికారులు కనిపెట్టారు. వినోత్ లాప్‌టాప్, మొబైల్‌ఫోన్, ఐ పాడ్‌లను ఐటీ అధికారులు సీజ్ చేశారు.
అప్పు, సెల్వం, మోనికవిరోల, సురేశ్‌లు వినోత్ బృందంలో పనిచేస్తున్నట్లు బయటపడింది. ఈ హవాలా కేసు దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి అప్పగించనున్నారు. కాగా, తమిళనాడులో ఉన్న అన్ని లోక్‌సభ సీట్లకు ఏప్రిల్ 19న ఒకే దశలో పోలింగ్ జరగనుంది.
ఇదీ చదవండి.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత
Comments
Please login to add a commentAdd a comment