రూ.10కోట్లతో పీవీ రావు ఘాట్ నిర్మాణం
ముమ్మిడివరం: మాలమహనాడు వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ పీవీ రావు ఘాట్ నిర్మాణం కోసం రూ.10 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. అనాతవరంలో స్వర్గీయ పీవీరావు ఘాట్ స్థలం ఆవరణలో హైదరాబాద్ డీఎస్పీ మోకా సత్తిబాబు అధ్యక్షతన గురువారంలజరిగిన సమావేశంలో ఘాట్ నిర్మాణం, తదితర అంశాలపై సమీక్షించారు. ముఖ్య అతిథి, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు ఘాట్ నిర్మాణానికి పార్లమెంటు నిధుల నుంచి రూ.కోటి కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. తన కుటుంబ సభ్యులనుంచి రూ.10లక్షలు విరాళం ప్రకటించారు. అమలాపురం సమీపంలో నిర్మించే రైల్వేస్టేష¯Œ కు పీవీరావు పేరు పెట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెడితే బిల్లుకు వ్యతిరేకంగా 154 మంది సభ్యులు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నరన్నారు. ఘాట్ నిర్మాణానికి మరో ముఖ్య అతిథి, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబుఎస్‌డీఎఫ్ నిధులు రూ.25 లక్షలు, అమలాపురం ఎమ్మెల్యే ఎ. అనందరావు రూ.25లక్షలు, రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రూ. లక్ష విరాళంగా ప్రకటించారు. పోతుల నాగరాజు, పెయ్యల పరశురాముడు, వడ్డి నాగేశ్వరరావు, ఎంవీకే భీమారావు, గంగుమళ్ళ అన్నపూర్ణ, దంగేటి వరలక్ష్మి, పోతుల సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.